౨౭
శ్రీ మాస్టరుగారు
అప్పుడు శ్రీ వారి జీవితచరిత్రము తెలిసి కొనఁ గోరి యక్కడి వారి నడిగితిని. పూర్వ మెప్పుడో శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలమునఁ గాఁబోలు తెలుఁగు దేశమున నుండి తంజావూరి రాజ్యసంరక్షణకై విచ్చేసిన వారిలో వీరి పూర్వులు ముఖ్యుల నియు, కుంభకోణము, భగవద్ఘట్టమునఁ జాల యిండ్లు వీరి పూర్వులవే యనియు, వీరి పూర్వు లొకరు కావేరితీరమున కుంభకోణము ననే భక్తి పురి యను నగ్రహరము వెలయించిరనియు, వీరు బాల్యముణ చాల ఐశ్వర్య వంతు లనియు, నప్పటికీ జాలినంత సంపత్తి కలవారే అనియు, ఇంటి పేరు కంచుపాటివా రనియు, శ్రీ వెంకా స్వామిగా రని శ్రీ వారినామ ధేయ మనియుఁ దెలిసికొంటిని. అప్పుడు వారికి సంస్కృతము తెలియనా యని యడిగితిని. సాంఖ్య యోగ వేదాంతాది శాస్త్రములు సంస్కృతమునేమ్ కలవు యాసంస్కృతము రాక యాయా శాస్త్ర విషయములు తెలియఁ గా దన్న తలఁపుతో నే వాట్లడుగుట. వారికి సంస్కృతము రా దనియు చిన్న నాఁడాయాశాస్తాంశ ముల నాంగ్ల భాషతోఁ జదివి వాని సారార్ధ మెల్ల గ్రహించి రనియు, సంప్రదాయముతో శాస్త్రములఁ జదివిన వారి కంటె నెంతో యపూర్వార్ధము లెఱుఁగుదురనియు, నతిలోకానుభూతి లెన్నో యనుభవించి రనియు, శాస్త్ర పండితులతోడి వారినిగా వీరిని దలఁపరాదనియు, క్రమముగా నెల్ల విషయములు నీకే తెలియఁగల వనియు నక్కడివారు చెప్పిరి.
ఇంగ్లీషుభాషతో నుప దేశార్ధము లుండు టేమి? పవిత్రమయిన సంస్కృతము కలదు గదా! అది రాక యిట్లు చేయుటా? శ్రీవారు మహనీయులగుట దర్శన మాత్రము చేతనే యెఱుక కందుచున్నది. నిజమే కాని వారికి మిసలుండు టేమి? ప్రాచీన మహనీయులు సాంప్రదా యమునకు విరుద్ధము గదా! యని నాలో నేవేవో కొంత సేపు చీకాకులు కూడ కలిగినవి. కొంత సేపటికి వాని కన్నింటికిని సమాదానములును తోఁ చినవి. తర్వాత గోన్నాళ్ళకు విచారింపఁగా నా సమాధానములను శ్రీ వారే పలుతూరులు చెప్పుచుండి నట్లు తెలియ వచ్చెను__
' యన్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్
లోచానాభ్యం విహీనస్య దర్పణః కిం కరిష్యతి,
అన్నట్లు స్వయం ప్రజ్ఞ కలవారే శాస్త్రనిర్మాతలు. అట్టివారికి ప్రాచీన శాస్త్రదిపఠనము తమ ప్రజ్ఞకుఁ గల యపూర్వతను గుర్తించుట కుపయోగపడునుగాని ప్రజ్ఞోద్బోధము స్వయము సమకూడవలసినదే.ప్రాచీన శాస్త్రములు దానికి జనకములు కాఁజాలము.
" శాస్త్రాణాం విషయ స్తావ ద్యావ న్మందరశా జనాః
ప్రవృత్తే రస శాస్త్రే తున చ శాస్త్రం నచ క్రమః
" త మేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః
నానుధ్యాయా ద్బహూ౯ ఛబ్దా ౯ వాచో విగ్లాపనం హి తత్ "
"విహాయ శాస్త్రజాలాని యత్సత్యం త దుపాస్యతామ్ "
ఇత్యాది సూక్తులు స్ఫురణకు వచ్చి భాషలో నే మున్నది? విషయము గదా ప్రధాన మయినది! ఏ భాష యయిన నేమి? అందును జాతిమాత దేశాదికృత మయిన పరిచ్చేదము లేకుండ సర్వసమానముగా సాగవలసిన యిట్టి మహ త్తర యోగ పద్ధతికి- నేఁడుప్రపంచవ్యాపకముగా నున్న యాంగ్ల భాషయే సరిపడి యుండు నేమో! మఱియునుసంస్కృతమున కట్టి పూజ్యత మహార్షలు తమ యుద్బోధములునందే వెలయించు చేతను ఉపనిషత్తులును, వేదములును నందే యుండుట చేతను వచ్చినది- అట్టి వానిని నిపుడును వెలయింతురో యా భాషకుఁ గూడ నట్టి యోగ్యత కలదని యంగీకరింపక తప్పదు. నేఁ డెందరో మహనీయు లా భాష ద్వారమున ననే కాపూర్వ శాస్త్రా ర్ధములు వెలయించుచున్నారు. దీనిని పరిగణింపక త్రోసి పుచ్చుట సాధ్యము కాదు. కనుక శ్రీ వారి యోగో పదేశ భాషాదు లాంగ్లమున నుండుట కొఱఁత గాదు.
మఱియు వారి యాకృతి మహనీయతకు మిసము లుంచుకొనుట, మొగమున బొట్టు పెట్టు కొనకుండుట కొఱఁత పఱుపఁ జాలవు. శైవ వైష్ణ వాది మత భేదములను బాటించు వారు గాన వారు మొగమున తన్మత చిహ్నముల ధరింప కుండ వచ్చును. వారు నెలకొల్పినది మహా రాజ యోగముగాన దీనికి బోడితల కాషాయవస్త్రములు మొదలగునవి యుండ నక్కఱలేదు. మిసము లుండుట లేకపోవుటలో న్యునాధికత లుండవు. ఈ సమాధానములు తోఁ చి నా మనసులోని యప్పటి మకిలను దొలఁ గించినవి.
