47. మనుషులకు దోమలు ఇచ్చే 'బహుమతి'
జడనిండా మల్లెపూలు పెట్టుకుని, పట్టుచీర సొంపుగా కట్టుకుని పెళ్ళి చూపులు చూడటానికి వచ్చిన వారిముందు పుత్తడి బొమ్మలా తలవంచుకుని కూర్చుంది. తనను చూడటానికి వచ్చిన అబ్బాయిని ఓరగాచూసి బగానే వున్నాడని మురిసిపోయింది. అబ్బాయికూడా తాను మరీ ఇదిగా చూస్తె తక్కినవరు ఏమనుకుంటారోనని ఆగి ఆగి దొంగచూపులు చూస్తున్నాడు. ఇంతలో జలజ తల్లి ట్రేలో చల్లని పానీయాలతో పెళ్ళివారి ముందుకు వచ్చింది. ఆవిడ ఎంతో జాగ్రత్తాగానే నడుస్తూ వచ్చింది. కాని,ఒక్కసారిగా కధంతా యాంటీకలయిమల్క్సుకి మళ్ళింది. ఆమె నడుస్తూ వుంటే ఏనుగు నడుస్తూ వచ్చినట్లు అనిపించింది. నిజానికి ఆవిడ మామూలుగానే ఉండి. కాని ఆమె కళ్ళు మాత్రం ఏనుగు కళ్ళను ఎరుపు తెచ్చుకున్నట్లు వున్నాయి. ఇంతలోనే పక్కనేవున్న టేబుల్ ఫ్యాన్ మరో తంతా తెచ్చిపెట్టింది. రివ్వున వీచిన గాలికి జలజ పైటచెంగుపైకి ఎగిరింది. ఎగిరిన పైటను జలజ వెంటనే సర్దుకోబోతుండగా మరోసారిఫ్యాన్ గాలి రివ్వున వీచింది. దాంతోజలజ పాదాలను ముచ్చటగా కప్పివుంచిన పట్టుచీరే క్షణకాలంపాటుకొంచెం పైకి లేచింది. అంతవరకూ అమ్మాయి ముఖం చంద్రబింబంలావుందని మురిసిపోయిన వారికి ఆమె పాదాలు మాత్రం పనసకాయల్లా ఉబ్బి కనబడటంతోఅదిరిపోయారు. వెళ్ళిన తరువాత ఏ విషయమూ ఉత్తరం రాస్తామని చెప్పిన ఆ పెళ్ళివారినుండి ఆనాటికిఈనాటికి జాబేలేదు. జలజకుగాని, వాళ్ళమ్మకిగాని పదాలు వచ్చి మామూలుకంటెపెద్ద విగా ఏనుగుకాళ్ళుమాదిరిగా కనబడటానికి కారణం_ ఫైలేరియా వ్యాధి దీనినే బోదకాలు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి రావడానికి ఉచ్చి రెరియ బాన్ క్రాప్టయిఅనే క్రిములు కారణం. ఈ క్రిములు కూలేక్స్ జాతికి చెందిన దోమలు మనుష్యులను కుట్టడంతో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ వ్యాధి క్రిములు నిదానంగా ప్రయాణించి లింఫ్గ్లాండ్ లలోకి, లింఫ్ నాళాల్లోకి చేరుతాయి. ఇలా వాటిల్లోకిచేరిన క్రిములు 8నుంచి 12మాసాల్లో పూర్తిగా ఎదిగి దాదాపు 10సెంటీమీటర్ల పొడవు అవుతాయి. దాంతో లింఫ్ గ్లాండ్లు, లింఫ్ నాళాలు వాస్తాయి. శరీరంలో ఏ భాగంలో నయినా ఈ క్రిములు స్థావరం ఏర్పరచుకోవచ్చు. ముఖ్యంగా గజ్జల దగ్గర, పొట్టికడుపు దగ్గరవుండేలింఫ్ గ్లాండ్లులలోను, లింఫ్ నాళాల్లోను ఇవి ఎక్కువుగా చేరుతాయి.
ఈ వ్యాధి క్రిమి శరీరంలో దాదాపు సంవత్సరాలపాటు ఎదిగిన తరువాత సంతానోత్పత్తిచేస్తుంది. ఈ పిల్లల్లను"మైక్రోఫైలేరియా" అని అంటారు. ఇవి లింఫ్ నాళాల్లోంచినిదానంగా రక్తంలోకి చేరుతాయ్. ఇవి పెద్దవిగా తయరవ్వాలంతే ఆ వ్యక్తి శరీరంలోనేఉండడంవల్ల ఉపయోగం వుండడు. కూలేక్స్ జాతికి చెందిన దోమ కడుపులోకి చేరిన వ్యాధి క్రిములు రెండు మూడు వారాల్లో రకరకాల అవతారాలు ఎత్తుతాయి. అప్పుడు మరో వ్యక్తిని దోమ కాటువేయగా ఆ వ్యక్తి శరీరంలో ఈ క్రిములు వ్యాధి కలగాజేస్తాయి.
ఫైలేరియా వ్యాధి యువతీయువకుల్లోనూ, నదివయస్కుల్లోనూ ఎక్కువ. చిన్నపిల్లల్లోనూ, ముసలివారిలోను ఉండకపోదు. ఫైలేరియావల్ల చలిజ్వరం, లింఫ్ గ్లాండ్లువాయడం, నొప్పిచేయడం, నరాలు ఉబినట్లయివాయడం, బద అనిపించడం సహజమే క్రిములు చేరడంలో ఆ నాళాలు, వాటి చుట్టూప్రక్కలే వుండే టిన్యూలు కూడా వ్యాధి గ్రస్తమై వాచిపోతాయి. ఇలా మొదట్లో ఒంటిమీద అక్కడక్కడ వాపులు వచ్చిపోతూ గ్లాండ్లు, నాళాలువచ్చి తగ్గిపోయినా కొంతకలానికి లింఫ్నాళాలు పూర్తిగా దెబ్బతిని పోతాయి. లేదా ఫైలేరియా కీ సంభందించిన క్రింద భాగమూ సరైన లింఫ్ ప్రసారంలేక ఉబ్బుతుంది. ప్రక్కనే మరి కొన్ని లింఫ్ నాళాలుఉండినీరును పైకి తీసుకుని వెళ్ళడానికివేరే అవకాశం ఉంటే త్వరలోనే వాపు తగ్గిపోతుంది. లేకపోతే శాశ్వితంగా ఆ వాపు అలా నిలిచిపోతుంది.
