Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 50


    పిలిచినవాళ్ళందరూ వచ్చారు. చాలా ప్రజంటేషన్స్ తెచ్చారు. శ్రీశ్రీగారు  తీసుకోవడానికి నిరాకరించారు. తెచ్చినవాళ్ళందరూ వాటిని ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళారు.
    ఆవిడలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆమె ఇల్లు కట్టడంతో పాటు, గృహ ప్రవేశం నాటికి ఒంటినిండా నగలు కూడా బాగా చేయించుకున్నారు.
    నలుగురిలోనూ ఆవిడ అరుస్తారని భయపడి శ్రీశ్రీగారు పీటల మీద కూర్చున్నారేమోగానీ, ముళ్ళమీద కూర్చున్నట్టే కూర్చున్నారు. అదికూడా అయిదు నిముషాలే.
    తరువాత "ఈ తతంగాలేవో నువ్వె చూసుకో" అని ఆవిడతో చెప్పి, పందిట్లోకి వచ్చేశారు.
    నేను సమయం చూసుకొని, భార్యాభర్తలిద్దరూ పీటలమీద వున్న ఆ అయిదు నిముషాల్లోనే వెండితో చేయించిన మహాలక్ష్మీ పీఠం, రెండు దీపపు సమ్మెలు, హారతిపళ్ళెం, గంటతోపాటు మొత్తం పూజ సెట్ ఓ పెద్ద ట్రేలో పెట్టి, శ్రీశ్రీ దంపతులకి పట్టువస్త్రాలతో పాటూ ఇచ్చాను. ఆవిడ అందుకోలేదు.
    ఆయన చేతికిచ్చాను.
    ఆరోజంతా ఆవిడ నాతో మాట్లాడలేదు.
    వచ్చిన వాళ్ళు ఆవిడని కూడా పలకరిస్తున్నారు. నేనూ అందర్నీ పలకరిస్తున్నాను. నేను మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే "నీ పని నువ్వు చూసుకో" అన్నారావిడ.
    నిజంగానే ఆ మాటతో నాకు వొళ్ళు మండింది. కానీ ఏం చేస్తాను? ఆయనకోసం వచ్చాను. ఈ ఫంక్షన్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం ఏముంటుంది? ఓర్చినమ్మకి తేటనీరు అని ఊరుకున్నాను.
    నేనెంత తగ్గినా ఆవిడ మాత్రం రెచ్చిపోతూనే వున్నారు. పందిట్లో పరిహాసాల పాలవుతామని, అందుకవకాశం ఇవ్వకుండా మసలుకున్నాను.
    ఏది ఎలాగున్నా గృహప్రవేశం చక్కగా జరిగింది.
    ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. పదిమంది ఆర్టిస్టులు మాత్రం మిగిలారు.
    "ఇక నేనూ వస్తానండి" అని బయలుదేరుతూ వుంటే, శ్రీశ్రీగారు నా దగ్గరకొచ్చి "సరోజా! ఆర్టిస్టులందర్నీ వెళ్ళనియ్యి నిన్ను కారులో నేనొచ్చి దింపుతాన"న్నారు.
    ఆయనతో ఏంచెప్పాలన్నా చాలామంది వున్నారు. అందరిలో రగడ అసహ్యంగా వుంటుందని, వాళ్ళందర్నీ కూడా సాగనంపేదాకా వున్నాను. రాత్రి పదిగంటలైంది. కంపెనీకార్లు మాత్రం రెండు వున్నాయి.
    అందులో నన్ను పంపమని ఆవిడా, నా కారులో నేనే దింపివస్తానని ఈయనా పేచీల్లో పడ్డారు.
    నాకు చాలా బాధ కలిగింది. నా మనసులో ఏమీలేదు. అనవసరంగా ఆవిడే లేనిపోని అనుమానాలతో గొడవ చేస్తున్నారు. ఆవిడ బాధపడడమే కాకుండా ఎదుటివారిని కూడా బాధపెడుతున్నారు.
    నా విషయంలో వాళ్ళిద్దరూ పోట్లాడుకోవడం నాకు ధర్మ సంకటమయిపోయింది. పోనీ శ్రీశ్రీగారయినా ఆవిడ్ని అనుసరించిపోతే బాగుండును. నా కోసం కట్టుకున్న భార్యమాటను కూడా కాదనడానికి గల కారణం ఏమిటా అనిపించింది.
    కానీ శ్రీశ్రీగారిని అనుమానించడానికి లేదు. దేవుడే వచ్చి వారి గురించి చెప్పినా నేను నమ్మడానికి సిద్దంగా లేని స్థితిలో వున్నాను.
    మరి రోజూ ఇలా ఇంట్లో గొడవలయితే ఎలా? దానికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ వుంటే నాకు మతిపోవడం ప్రారంభించింది. వాళ్ళింకా దెబ్బలాడుకుంటూనే వున్నారు.
    నేను డ్రైవర్ సుబ్బారావుతో చెప్పి శర్వాణి కంపెనీ కారులో ఇంటికి వెళ్ళిపోయాను.
    
                                                          *    *    *
    
    మర్నాడు పొద్దున్నే డ్రయివర్ సుబ్బారావు వచ్చాడు.
    "ఏమిటి సంగతి సుబ్బారావు?" అని అడిగాను.
    "అమ్మగారు మీకీ సంచి ఇవ్వమన్నారమ్మా-" అని ఇచ్చి వెళ్ళిపోయాడు.
    "ఏమిటి పంపి వుంటారబ్బా" అనుకోని.
    మళ్ళీ నాలో నేనే "ఆ....ఏముంటుందిలే గృహప్రవేశం అయింది కదా? బూందీ, లడ్లూ వగైరాలు పంపించి  వుంటారులే" అనుకున్నాను.
    "నిన్న పందిట్లో వున్నంతసేపూ నిన్ను చూసి, దుమధుమ లాడిపోయింది. ఈ రోజు ఎక్కడలేని అధిమానం ఊడబొడుచుకొచ్చింది" అని మా అమ్మ ప్రారంభిన్చింది. "పోనీలే అమ్మా! ఒక విధంగా ఆవిడ కరెక్టే. పిల్లల్లేరు. పెంచుకున్న పిల్ల. అదో పెద్ద లోపం అదీ చాలక అందరూ ఈ అదృష్టం అంతా నాదని అంటున్న మాటలకి అవిడకి బాధ కలిగింది. లేకుంటే ఆవిడ చాలా మంచిదేనమ్మా! ముందే చెప్పానుగా. ఎన్ని అన్నా ఆవిడంటే నాకెందుకో విపరీతమైన ఇష్టం. ఏం చెయ్యను?" అన్నాను.
    "వెళ్ళి పూసుకో. వారి దగ్గర పని ప్ర్రారంభించిన నాటినుండి నీ వెంట వుంటూనే వున్నాను. అనుమానానికయినా అర్ధం పర్ధం ఉండొద్దూ? ఈ అవమానం నీకు కాదు మాకు. అరవై ఏళ్ళకి అగ్ని గండం అన్నట్లు మనకెందుకీ అవస్థలూ అపనిందలూను" అని అంది అమ్మ.
    "ఏ ఆడది మాత్రం తన జీవితంలో మరో స్త్రీ ప్రవేశిస్తుందంటే సహిస్తుంది చెప్పమ్మా? ఆవిడ బాధ ఆవిడది" అన్నాను.
    "అయితే మాత్రం? మనకటువంటి ఉద్దేశం ఏ కోశానైనా వుందటే? వుంటే నీ వెనిక తోక చుక్కలా నేనెందుకు పద్తహానే" అంది.
    "అక్కడే ఆవిడ పొరపాటు పడుతున్నారమ్మా! ఆవిడ అనుమానం ఆవిడది. దానికి మనమేం చేస్తాం?" అంటూ సంచీ తీసి లోపల ఏముందో చూద్దామని చెయ్యిపెట్టి చూసేసరికి నా ముఖంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు.
    నేను బహుమతిగా ఇచ్చిన వెండి సింహాసనం, ప్రమిదలు వగైరా పూజసామాన్ల సెట్ అంతా, పట్టుచీర, జాకెట్టుతో సహా పంపించేశారావిడ.
    ఒక్కక్షణం బాధపడ్డా, తర్వాత సర్దుకొని వాటిని కళ్ళకద్దుకున్నాను.
    అమ్మని పిలిచి, "ఇవన్నీ తీసుకెళ్ళి పూజగదిలో పెట్టమ్మా! నట్టింట్లో సొమ్ము నా ఇంట్లోకే వచ్చిందంటూ ఏదో కథ చెపుతూ వుంటావే. అది కథ కానీ, ఇది మాత్రం నిజం మన సొమ్ము మనింటికే వచ్చింది. మనం స్వంతానికంటే తెగించి చచ్చినా కొనుక్కోం. ఆవిడ కోసం కొన్నవాటిని  నిరాకరించి, మనకి తిరిగి ఇచ్చేసింది. మనకిదే మిగులు" అని అమ్మ చేతికిచ్చాను.
    ఆ రోజునుండి ఆవిడ పట్ల నా మనస్సు విరగడం ప్ర్రారంభించింది. ఆవిడకి నేనేం ద్రోహం చేశాను? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
    నేను నా ఆలోచనల్లో వుంటూండగానే, పదకొండు గంటల ప్రాంతంలో శ్రీశ్రీగారు వచ్చారు.
    
                            *    *    *
    
                                  తలచింది తారుమారు
    
    శ్రీశ్రీగారిని ఆ సమయంలో చూసి ఆశ్చర్యపోయాను. "ఈరోజు కంపెనీకి వెళ్ళొద్దు. రెస్టు తీసుకుందామని అనుకున్నాముగా" అన్నాను "అంటే - ఎందుకొచ్చారని అడుగుతున్నావా? నిన్ను చూసి వెళదామనే వచ్చానన్నారు.
    ఇద్దరం కలిసి కాఫీ తాగాము.
    "ఇంటినుండి ఇదే రావడమా?" అనడిగాను.
    "అవును".
    "ఇంతవరకూ ఏం చేశారు?".
    "హాయిగా నిద్రపోయి లేచాను. కాఫీ తాగి తిన్నగా నీ దగ్గరకే వస్తున్నాను"
    "ఆవ్దిఅకి తెలుసా?".
    "తెలియాల్సిన అవసరం ఏముంది సరోజా! నీ దగ్గరకి రాలేదని చెప్పినా ఆవిడ నమ్మదు. ఇందులో దొంగతనం ఏముంది? ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. మన పనులు మనవి. ఆవిడ పనులు ఆవిడవి" అన్నారు. నాకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "నా పరిస్థితినీ, నన్నూ అర్ధం చేసుకున్నారు. నాకంతే చాలండి" అంటూ వారి కాళ్ళకి దండం పెట్టాను. చటుక్కున రెండు కాళ్ళూ వెనక్కి లాక్కున్నారు.
    శ్రీశ్రీగారి దగ్గర పనికొచ్చిన తర్వాత వారి కళ్ళకి దండంపెట్టడం అదే మొదటిసారి.
    వెంటనే వారు నోట్లో వున్న సిగరెట్ తీసి, "చూడు సరోజా! ఈ కాళ్ళ దండాలు, సాష్టాంగాలు అంటే నాకు అసహ్యం. ఇప్పుడు చేశావు కానీ ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చెయ్యకు. నువ్వు చాలా ధైర్యవంతురాలివనుకుంటూంటే మరీ ఇంత పిరికి పందవై పోతున్నావేమిటి?" అన్నారు.
    "మీకు డబ్బు రావడం ఆనందంగా వున్నా, ఆవిడకీ నాకూ మధ్య అంతః కలహాలు కూడా అపెరిగిపోతున్నందుకు చాలా బాధగా వుందండీ. నేనెంత సిన్సియర్ గా వున్నా కనీసం ఆవిడ అర్ధం చేసుకోడానికయినా ప్రయత్నించడం లేదు.
    మీ కుటుంబం మీద నాకేవిధమైన దురభిప్రాయమూ లేదు. అవిడెందుకు అపార్ధం చేసుకుంటున్నారో అర్ధం కాలేదు" అన్నాను.
    "ఎందుకలా బాధపడతావు సరోజా! తన జీవితంలో పాలు పంచుకోవడానికి నువ్వెక్కడ వస్తావో అని భయపడుతోంది అసలు ఆవిడంటూ ఒకర్తి వుందన్న విషయం మరచిపో. నీ సంగతీ, నీ పని సంగతీ ఆలోచించ"న్నారు.
    "అది కాదండీ, శుభమా అంటూ లక్ష్మీ పీఠంతోపాటు, పూజసామాన్లు సెట్ కొని యిస్తే - అవన్నీ నాకు తిరిగి పంపించేశారండీ" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS