Previous Page Next Page 
మమత పేజి 5

 

                                  3


    సరిగ్గా నాలుగు రోజులక్రితం 'మంచి రోజు లోచ్చాయి' అనుకుంటూ రఘుపతిగారింట్లో అడుగు పెట్టారు.
    'ఏం చెడ్డరోజు లోచ్చాయి!' అనుకుంటూ నీరసంగా స్కూలు నుంచి యింటికి నడిచి వచ్చి మంచం మీద కూలబడ్డాడు స్వామి. రెండు పూటలలోనే రఘుపతి గారింట్లో తిండి తినడం మాని వేయడం మంచిదే అనిపించింది.
    మళ్ళీ గడియారం గుర్తుకు వచ్చింది. తలుచుకున్న కొద్ది మనస్సున కవికలై పోతున్నది.'ఏవిటయ్యా అలా వున్నావూ?' అని అడిగింది శారదమ్మ గారు. తలనొప్పిగా వుందనిసమాధానం చెప్పాడు. శోంటి గంధం అరగదీసి ఉగ్గు గిన్నెలో పంపింది. శారదమ్మ గారు పావనితో. ఎంత వద్దని చెప్పినా పావని వినిపించుకోలేదు. 'మగ మహారాజులు! మరీ అంత మొహమాతమైతే యెలా బ్రతుకుతా రండి? కావలసింది జబర్దస్తీగా తన్ని లాక్కోవాలంటారు మగాడన్నాక. రాసుకోండి' అంటూ బలవంత పెట్టింది పావని. చేయ గలిగింది లేక కణతల నిండా పట్టించాడు ఘాటైన శోంఠీ గంధం దిట్టంగా. మంట ప్రారంభమైంది. మనిషి జీవితంలో సగం బాధలు స్వయంగా కొని తెచ్చుకునేవి. తన బాధ ఒకరితో చెప్పుకునే అవకాశం కూడా కనిపించలేదు. అయిన ఆత్మీయులతో చెప్పుకుంటే , మన మనస్సుకు అంతో రవ్వంతో విముక్తి లభించవచ్చు. కాని ఎవరితో చెప్పుకోవాలి? అసలు తనకు గడియారం ఉన్న సంగతే నమ్మని వాళ్ళుండవచ్చు. 'ఆదరించి యింట్లో పెట్టుకుని , కన్నబిడ్డలా చూస్తుకుంటున్న కుటుంబాన్ని అల్లరి పెడుతున్నాడు-- అంటూ పెద్దలందరూ కలిసి తనకు చివాట్లు పెట్టవచ్చు.
    మరొకసారి కాలుకాలిన పిల్లిలా యింట్లోనూ బయటా  తిరిగి చూశాడు. సీతమ్మ వారికోసం అన్వేషిస్తున్న ఆంజనేయుడు ఆకులూ గూడ చీల్చి చూశాట్ట. అంత పిచ్చిగా వెతికాడు స్వామి గూడా ఉలిక్కిపదినట్లు మంచం మీంచి లేచి దొడ్లో బావి లోకి కూడా తొంగి చూశాడు. గదిలో బల్ల మీదనే పెట్టినట్లు తనకు బాగా గుర్తు. ఏ పరిస్థితుల్లోనూ అది రెక్కలు కట్టుకొని యెగిరి బావిలో పడే అవకాశం లేదని తనకు తెలుసు. మనస్సు అలా పరిగెత్తించింది.
    ఆ క్రితం రాత్రి భోజన మయ్యాక ఓ గంటసేపు విక్రమొర్వశీయం చదువుకుని ఆవులిస్తూ చివరిసారి టైం చూసుకున్నాడు. తనకు బాగా గుర్తు ఎవరి పని యిది? ఆలోచించిన కొద్ది బుర్ర పాడై పోతున్నదే గాని , సమాధానం మాత్రం దొరకడం లేదు.
    సగం సగం నిద్తలో తెల్లవారింది.
    "చూశావుటయ్యా! ఎవడినీ నమ్మలేకుండా వున్నాం. ఈ రోజుల్లో దొంగవెధవలూ, దొంగ బుద్దులున్నూ ' అంటూ వచ్చి తన గదిలో మంచం మీద కూర్చున్నారు రఘుపతి గారు.
    "ఏమయింది రఘుపతిగారూ!' అన్నాడు గడియారం తీసిన దొంగను అయన పట్టుకున్నారనే ఆశతో.
    మనిషిని మనిషి నమ్మేరోజు అంటావా యివి?'
    "కా--దం-డీ'
    "మంచిది బాబూ! అ రహస్యం పెందరాళే గ్రహించావు. నిన్న పనిగట్టుకుని- అడ్డమైన గడపలూ తొక్కి-- వసుదేవుడు గాడిద కాళ్ళట్టు కున్నట్టు-- ఈ అడ్డగాడిద లందరినీ కాళ్ళు పట్టుకు బ్రతిమిలాడి మరి ఆహ్వానించానా? మీటింగు కు వస్తానని ప్రతి కుంకా వాగ్దానం చేశాడు గదా? ఏడు దాటి గంటయింది తుపాకీ గుండు వేస్తె- ఒక్కడు కనిపిస్తున్నాడేమో చూడు- నాకు తెలియకడుగుతా ఇదంతా నా యింట్లో పెళ్ళిటయ్యా? కాటికి కాళ్ళు చాచిన వాణ్ణి నాకేం గావాలి చెప్పు, గ్రామ క్షేమం గాక? వింటున్నావా?'

 

                           
    రఘుపతి గారి ముఖంలోకి దీనంగా చూశాడు స్వామి. కాటికి కాళ్ళు చాచిన మనిషిలా కనిపించలేదాయన.
    'ఇంతకూ ఈ దొంగ తనం సంగతి నీకు తెలుసునటయ్యా' సూటిగా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించారు రఘుపతి గారు.
    గడియారం మాదిరి కొట్టుకుంది స్వామి గుండె.
    'ఏ దొంగ తనమండి?' ఆశగా అడిగాడు.
    'ఊరి సోమ్మయ్యా. ఊరికోసం లక్షలు తగలేసినవాణ్ణి చేతులు ముడుచు కిలా కూర్చున్నానా, నిన్న గాక మొన్న తలెత్తిన ఏభ్రాసుగాడు -- ఆ కోనేటిరావు - లంచాలు పెట్టి పదిమంది నీ కట్టుకుని - బాంకు ప్రెసిడెంటై- అలా వేలకు వేలు అత్తగారి సొమ్ములా ఫలహారం చేస్తాట్టయ్యా?-- దిక్కుమాలిన వెధవలు.....'
    "ఎవర్నండోయ్ తిడుతున్నారు నన్ను కాదు గదా>; అంటూ చుట్ట కాల్చుకుంటూ మత్తుగా మందంగా నడుస్తూ రంగం మీదకు ప్రవేశించాడు మున్సుబు.
    వస్తూనే ఏదో ప్రాణి ఒండ్ర పెట్టి నంత సుకుమారంగా ఆవులిస్తూ మంచం మీద కూలబడ్డాడు. ఆ భారీ శరీరం బరువుకు ప్రాణం లేని మంచం కూడా పిటపిట మంటూ గజగజలాడింది.
    'మున్సుబూ నీకు తెలుసు గదా?'
    'తెలుసండీ' -- మత్తుగానే అన్నాడు మరోసారి అవలించిన మున్సుబు.
    'ఈ ఊరి కోసం నేను ఎంత తగలబెట్టా నంటావ్?'
    సమాధానంగా నవ్వులాంటి శబ్దం వచ్చింది మున్సుబు గొంతులోంచి. స్వామి లేవబోయాడు స్నానానికి. 'కూర్చో బాబూ ! ఈ దారుణం నువ్వు కూడా వినాలి' అన్నారు రఘుపతి గారు.
    కిక్కురుమనలేక కూర్చున్నాడు స్వామి.
    'నిజం చెప్పు మున్సుబూ '-- తీవ్రంగా నిగ్గదీశాడు రఘుపతి గారు.
    'నిజం చచ్చిపోయింది రఘుపతి గారు' అంటూ ఆరిపోయిన చుట్ట అరడజను అగ్గిపుల్లల సహాయంతో అంటించాడు.
    'మనం గాజులు తోడిగించుకున్నట్లే నా అంట?'
    యింకా అనుమాన మెందుకండి ? మీటింగన్నారు?'
    'బోడి వెధవలు అందరూమోసం చేశారు. ఒకడి లెక్క ఏమిటి? మన ముగ్గురితోనే జరిపిస్తా మీటింగు, తలుచుకున్నా ఆగుతుందా ఏమిటి? మున్సుబూ ! ఆ కోనేటిరావు కోపరేటివ్ బాంకు ప్రెసిడెంటయింది సర్కారు సొమ్ముతో తనపార్టీ గాడిదల్ని మేపటానికా అంట? రేపు మనిద్దరం హైదరాబాద్ వెళ్ళి అ రిజిష్టారు ని పట్టుకుని, అతగాడి ప్రెసిడెంట్ గిరి ఊడగొట్టేమార్గం ఆలోచించాలి. ఏమంటావ్?'
    'మంచిదే నండి'- రవ్వంత గురక పెడుతూనే అన్నాడు మున్సుబు.
    'మన బంధువుల్లో రిజిష్టారు కు కావలసిన వాళ్ళెవరైనా ఉన్నారా మున్సుబూ.'
    మున్సుబు గురక ఎక్కువయింది.
    రఘుపతి గారికి కోపంతో వళ్ళు మండిపోయింది. స్వామి కేసి తిరిగి ' చూడవయ్యా ! ఊరికి తలకాయ లాంటి వాడు ఈ మున్సుబు వరస చూస్తె యిలా వుంది. తెల్లవార్లూ అడ్డమైన సన్నాసుల్నీ చేర్చి -- చీట్లడడ్డం- పగలల్లా యిలా కునికి పాట్లు పడుతూ సగం చచ్చిన మనిషిలా ఆపసోపాలు పడుతూ -- నేను ఒక్కడిని ఎంత తల బ్రద్దలు కొట్టుకు చస్తే మాత్రం ఏం జరుగుతుంది?' అన్నాడు దిగులుగా.
    'జోకరు ముక్క-' అంటూ గావు కేకపెట్టి త్రుళ్ళి పడి లేచాడు మున్సుబు. ఆ యోగ సమాధి నుంచి, నిజానికి అక్కడ జోకరు ముక్కనే పదార్దమే లేదు. కాలుస్తున్న చుట్ట క్రమంగా వెనక్కు తగ్గి మీసాన్ని ముద్దెట్టు కుంటూ వో చిన్న చురకంటీంచింది.
    చుట్ట పీకను 'ఛీ' అంటూ నేలకేసి కొట్టి 'రఘుపతిగారు' తమరు నష్యానికి తెప్పించిన లంకాకుంటే నాలుగు కాడలిలా పారెద్దురూ. శాయిగాడు- నాకంటే నిద్రమొహం - తెమ్మని పంపిస్తే యింతవరకూ అయిపూ అంతూ లేడు. యింటికొచ్చి వుండాలి. యీపాటికి ' అంటూ నిలబడి చెప్పులు తొడుక్కుంటూన్నాడు మున్సుబు.
    'అసలు నేచేప్పేది తలకేక్కిందా మున్సుబూ ?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS