Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 5

   
    'ఏమిటోయ్ ప్రసాద రావ్ ....జీవితం అంటే పూర్తిగా విసుగెత్తి పోతోందోయ్ ప్రపంచంలో ఉన్న చెడు అంతా మా ఇంట్లోనే తిష్ట వేసుకు కూర్చున్నట్లుందోయ్'
    అన్నయ్య ఆశ్చర్యపోతూ వింటూ కూచున్నాడుట.
    "ఇదిగో ఇప్పుడిలా వెళ్ళింది చూశావా, అది మా రెండోది. దానికి విపరీతమైన సినిమా పిచ్చి. ఊళ్ళోకి కొత్త సినిమా వస్తే చాలు పంపించే దాకా మా ప్రాణాలు తోడెస్తుంది. దీని కోసమేనా ఏ పల్లెటూరే నా పారిపోదామని పిస్తోందోయ్! ఇంక మా ఆవిడుందా , ఉత్తి మూలుగు మనిషి కదా! పూర్వం మనవాళ్ళు ఏడాదికి సరిపడే కండులూ పెసలూ అవీ జగత్త పెట్టుకునే వారు చూశావూ , అలాగ నిద్రపట్టడానికి ఒక మందూ, తెలివి రావడానికి ఓ మందూ , అరగడానికి ఒక మందూ , అజీర్తి తగ్గడానికి ఒక మందూ వేడికి ఒక మందూ, చలవ కి ఒక మందూ ఈ పద్దతిలో ఏమన్నా లేకపోయినా మా ఇంట్లో చిన్నరకం మందుల షాపు ఒకటి తప్పదనుకో.... ఒక వీడూ ఎవడు మా ఆఖరువాడు .వీడికి మొన్న హఫియర్లలో లెక్కల్లో ఎనిమి దోచ్చాయి. ఎంతకనుకున్నావ్ నూటికీ. ఏమయినా జ్ఞానముందా? మళ్ళీ ఆ ప్రైవేటు మేష్టారి ఎదాన్ని నెలా అయేసరికి  పదిహేను కరకులు పోస్తాను. కొంచెం జ్ఞాన మొచ్చాకేవా ఎవరి బుద్ది వాళ్ళ కుండాలా? అన్నిటినీ నే నెంతకని భరించేది చెప్పు? పీక నులిమేసినా సరే వాడు పొద్దుట ఎనిమిదీ అయితే గాని కళ్ళు తెరవడు. కళ్ళు తెరిచినా , తుపాకీ వేసినా ఒక గంట అటూ ఇటూ దొర్లితే గాని లేవడు. వీళ్ళు చాలక మా అమ్మొక టుందిలే కనపడితే చాలు 'భద్రాచలం తీసికెళ్ళేవు కాదు భాస్కర్రాముడు ' అనుకుంటూ. ఆవిడ గోల వింటుంటే అలా ఆయుర్దాయం హరించుకు పోతున్నట్టు నాకనిపిస్తుంది. ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోడానికి నామోషి కదా! ఆఖరికి ఈ కుక్క క్కూడా నేనంటే లోకువే. వారం వారం సేరు మాంసం తెప్పించి దీన్ని మేపేది నేనే. మళ్ళీ ఈ వెధవ పీనుగ నన్ను చూసి మొరుగుతుందోయ్! ఏం చెప్పను దురవస్థ! ఇంక మా పెద్దమ్మాయి అల్లుడూ ఉన్నారా....'
    అన్నయ్య లేచి 'శలవిప్పించండి' అన్నాడుట.
    'అదేమిటోయ్ ప్రసాద రావ్ ఆఖరికి నీకూ నామీద కోసమేనా? నీకు నేనేం అపకారం చేశావోయ్ కూచోవోయ్'
    'అయ్యో, ఎంత మాట సార్, కొంచెం తొందర పనుందీ, మళ్ళీ ఒస్తాగా!' అన్నయ్య బ్రతుకు జీవిడా అని ఇవతల పడ్డాదుట. నాతొ అన్నాడు తరువాత.
    "పెద్ద జీరమూ, పెద్ద బంగళా, పెద్ద కారూ, పెద్ద కుటుంబమూ ఉన్న ఆ పెద్దమనిషి పెద్ద విచారానికి పెద్ద కారణం ఏమిటో? వెతకడం వెర్రి. ఏం చేతంటావా సుఖ సంతాపాలు! ఆకారణాలు. రోజూ గనక అయన రమ్మంటే అప్పుడే రాజీనామా ఇచ్చి వద్దును. క్షయ రోగి దగ్గుతో కొన్ని కోట్ల సూక్ష్మ జీవుల్ని గాలిలోకి సరఫరా చేసినట్టు నిరాశావాది తన నిస్పృహ నంతటినీ లోకానికి అందించి సమాజాన్ని రోగాపూరితం చేస్తాడు. చల్లని గాలినీ చల్లని జాబిలిని అందరూ వాంచిస్తారు. గాని పడకొట్టే వడగాలినీ, చితక్కొట్టే చలిగాలినీ ఎవరూ కోరరు గదా!'
    అందుకనే
    'సంతాపం కరిగిందా నీవద్దే ఉంచు.
    సంతోషం నీకొస్తే పదిమందికి పంచు.'
    అనే సిద్దాంతం అన్నయ్యది. వారి జాతి ప్రక్షాళంలా, పారిజాత ప్రమానంలా వాడి జీవితం వెళ్ళి పోడానికి కారణం అదే. పన్నీరు బుడ్డి పక్కనున్న గంధపు గిన్నెలా వాడితో వదిన బతుకు సుందరమూ శుభప్రదమూ అయి ఉంది.
    కాని వాళ్ళ కున్న ధైర్యం నాకెక్కడిది? వాళ్ళ మంచితనం తలచుకుంటే మరింతగా నాకు దుఃఖం ముంచుకోస్తోంది. కడివెడు దుఃఖాన్ని కడుపులో దాచుకుని , చిరుదరహాస చంద్రికలు వేదజల్లడానికి నాకున్న శక్తి ఏపాటిది!
    రైలు నడుస్తోంది. పుస్తకంలో లీనమైనట్టు కనిపించినా తలెత్తి అప్పుడప్పుడు అయన నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆ కళ్ళల్లో జాలీ, సానుభూతి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అంత కన్న కోత తగినది ఏముంది!
    'పరమ పవిత్రమైన మీ అనురాగ బంధం చూస్తుంటే నా జన్మ తరించి నట్టవుతోంది మంజూ! ఇలాంటివి నా ఊహ కందనివి. మీ వదిన వచ్చిన తరువాత కూడా మీ సంబంధం మరింత పటిష్ట మవడం నాకు బహు ముచ్చటగా ఉంది. నన్ను కూడా మీ పార్టీలో....'
    'చాల్లెండి . ఊరుకోండి. మీరు లేని పార్టీ నాకేముంది?'
    'అలా అనకు. నేనొక చీమలాంటి వాణ్ణి. కాని పరిస్థితుల్ని బట్టి ఒక చీమ వేగం ఒక రైలు వేగం కంటే కూడా ఎక్కువవడానికి అవకాశం ఉంది. అది దహహాన భాగ్యాన్ని బట్టి ఉంటుంది.'
    'మీరు చెప్పిన సహవాస భాగ్యం మాట మీకే తెలియాలి గాని వేగంలో చీమ శలభానికీ ధూమశకటానికి పోలికేమిటి చెప్పండి? అందులో చీమ వేగం ఎక్కువగా ఉండడం ఒకటా?'
    'ఏమో మరి.... చిన్నచీమ ఒకటి గంగాస్నానం చేద్దామని పూజా పుష్పాలతో దూరి ఎవరో పూజ చేస్తే ఆ పుష్పాలతో పాటు శివుడి శిరస్సున పడి పక్క నున్న గంగలో మునిగి ఫలం దక్కించుకొందిట.'
    'మాట మారుస్తారెండుకు, చీమ వేగం సంగతి చెప్పండి.
    'చెప్పనోయ్యి మరి, ఈ రైలునే తీసుకుందాం. ఇది గంటకి ముప్పై - మైళ్ళ వేగంతో వేడుతూండనుకుందాం. రైలు వెళ్ళే దిక్కున గంటకు మూడు మైళ్ళ వేగంతో నువ్వు ఈ చివరి నుండి ఆ చివరికి ఈకంపార్టు మెంటులో నడిచే వనుకో, అప్పుడు నీ వేగం  ఎంత ?"
    'అవును అదే దిక్కున కాబట్టి అప్పుడు నా వేగం ముప్పై - మూడు మైళ్ళ అవుతుంది. అయితే?'
    'అంతవరకు ఎరుగుదువు గద - అయితే సరే -అలా నువ్వు నడుస్తున్నప్పుడు ఏ చెవి దగ్గర్నుంచి బుగ్గ మీదుగా ముక్కు మీదుగా చీమ చిన్నది ఒకటి గంటకి ఒక మైలు వేగంతో - అనుకుందాం మాట వరసకి నడుస్తూంధనుకో. అదే దిక్కున కాబట్టి దాని వేగం ముప్పై ప్లస్ మూడు ప్లస్ ఒకటి - గంటకు ముప్పై నాలుగు మైళ్ళ వేగం కాలేదా? అంటే రైలు వేగం కన్న ఎక్కువ కాదా? అనగా చిన్న చీమ ఆగడం, పెద్ద రైలు సాగడం కన్న త్వరగా కాదా? ఏయ్ వింటున్నావా రెండో ఝామా?' అయన నాచేతి మీద గిల్లేరు.
    'వినక పొడమేమిటి బాబోయ్! చిన్న చీమ వేగం మాట నాకు తెలీదు గాని కుట్టడం మాత్రం ఎర్రతేలుని మించి ఉంది!'
    మా నవ్వు రైలు హూరులో కలిసి పోయింది.

                                  3
    నేను వంట గదిలోకి వెళ్ళబోతుంటే అయన గుమ్మంలోనే అడ్డుకున్నారు.
    "చూడు మంజూ, నెల్లాళ్ళకి సరిపడే హోటలు టిక్కెట్లు కొనేశాను. క్యారియరు కుర్రాణ్ణి కూడా కుదిర్చాను. ప్రస్తుతానికి నువ్వు చెయ్యవలసిన పనేమీటంటే నేను అడిగినన్ని సార్లు పానకాలస్వామికి పోసినట్టు కాఫీ నీళ్ళు పొయ్యడమే.'
    "భలే బాగుందండీ మీతో. అ కాస్త పనితో మీ రోచ్చేదాకా నాకేం తోస్తుందండి బాబూ! అక్కడ వదిలిందనుకుంటే మళ్ళీ ఈ చెర నాకిక్కడ ప్రత్యక్షమయిందా? మా అన్నయ్య మీకేం నూరి పోశాడెం?'
    నేను పూర్తిగా చెప్పకుండానే ఒక్కసారి లాంబ్రెట్టా సీటు మీదకి ఉరుకుతూ దాన్ని స్టార్టు చేశారు. పది నిముషాలు దాటకుండా రెండు పెద్ద పెద్ద ప్యాకేట్లూ తెచ్చి అక్కడ పడేశారు.
    'ముఖ సౌందర్యాన్ని పెంపొందించే సాధనాలివి. బజారులో అన్నిటికన్నఖరీదైన స్నోలూ, పౌడర్లు , సెంట్లు , సబ్బులూ , క్రీములూ , హేరాయిల్స్ ఏమేం అయితే ఉన్నాయో అన్నీ ఉన్నాయి అందులో. ఒక్కొక్కటి జాగర్తగా విప్పు. అందులో లిటరేచరు ఉంది జాగర్తగా చదువుకో. ఇన్ని రకాల కాస్మెటిక్స్ ఉండగా, ఇంత చక్కని ముఖం ఉండగా, ఇంట్లో ఇంత పెద్ద డ్రెస్సింగ్ మిర్రరు ఉండగా, కాలక్షేపాని కేం లోటని? రోజు కోకలా తయారూ , నాలుగనకుండగా మనం హాజరూ. నాలుగు వీధులూ షికారూ. ఇద్దరం లాంబ్రెట్టా ఎక్కి ప్రతీ అందమైన ప్రదేశమూ మనదే అనిపించుకుని, మనల్ని చూసిన ప్రతి వ్యక్తీ కన్ను కుట్టేలా తిరుగుతూ....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS