Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 5

 

    'పిల్లలన్న తరువాత పాట్లు తప్పవు మరి! అన్నాడు కొంత విరక్తి ని , కొంత వోదార్పు నూ తన కంఠస్వరం లో ద్వనింపజేస్తూ కాంతారావు.
    "ఏం పిల్లలో! పాడు పిల్లలు . మన పాలిట పిశాచాల్లా ఉన్నారు వీళ్ళు! బెనారసు పట్టు చీరతో పాటు నాశనమైన మరో రెండు చీరలను తీసి అవతల పెడ్తూ నిట్టూర్చింది కళ్యాణి. ఈ చీర లింక పనికి రావు. డ్రై క్లీనింగు కొవ్వవలసిందే!' అంది స్వగతంగా కళ్యాణి . ఆమెకు కళ్ళ నీళ్ళోక్కటే తక్కువ.
    కాంతారావు కి కూడా జరిగిన దానికి బాధగానే ఉంది కాని, అంత బాధలోనూ అతనికి సంతోషాన్ని కలిగించిన విషయమేమంటే అతని తాలుకూ బట్టలన్నీ ఆ పిల్లవాళ్ళ ఘాతుక కృత్యాలకి గురి కాలేదు.
    భర్త సంతోషాన్ని చూసి అసూయ పడింది కళ్యాణి.
    'ఏ భాధ లోచ్చినా ముందు ఆడవాళ్ళ కే వస్తయ్!" అనుకుంది కసిగా.
    మొత్తానికి సామాను సర్దటం ఆయిందనిపించే సరికి అలసట వచ్చేసింది యిద్దరికీ.
    వేడి వేడి టీ త్రాగి ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. తరువాత టూత్ పేస్టు, బ్రష్హు , షేవింగ్ స్తేట్టు , ఫాస్కు, వాటర్ బాటిల్ , కెమెరా మొదలైన చిన్న వస్తువులన్నిటినీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కోటోక్కటి అమర్చుకున్నారు.
    కళ్యాణి టాయ్ లేట్ సెట్టు తో ఒక్కటన్నా పొల్లు పోకుండా అన్నీ ఒక్కసారే సర్దేసుకోవడం గమనించేడు కాంతారావు. ఆడదానికి అరవ ప్రాణం .....ఎలా మర్చి పోతుంది?' అనుకున్నాడు.
    అజంతా స్టైలు లో తను పెట్టుకోబోయే కొప్పు లోకి కావలసిన వెండి పిన్నులను కూడా మర్చిపోకుండా పెట్టిలో నుండి బయటకు తీసింది కళ్యాణి. మళ్ళీ ఏం 'మర్చిపోయేనో' నని అన్నిటిని ఒకటికి నాలుగు సార్లు తనిఖీ చేసి చూసుకుని తృప్తి పడింది. అప్పటికి పిల్లలిద్దరూ నిద్ర లేచేరు. వాళ్ళకు పాలు పట్టి స్నానం చేయించింది కళ్యాణి.
    ప్రయాణానికి ఎంతో వ్యవధి లేదు. రెండు గంటలు మాత్రమే ఉంది. సమయం దగ్గరకు వస్తున్న కొలదీ కళ్యాణి లో ఆనందం, ఆరాటం ఎక్కువయి నాయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాళ్ళూ, చేతులూ వణికి పోతున్నాయ్. వ=వివాహమైన తోలి రాత్రి కూడా తనలో అంత ఆందోళన కలగలేదనుకుంది కళ్యాణి.
    పిల్లలకు బట్టలు వేసి ఆలు మగలిద్దరూ టిఫిను తిన్నారు. టీ త్రాగిన తరువాత సామానంతటి ని ఒకసారి చూసుకున్నారు. ఏవేమీ మర్చి పోయిందీను, ఎన్ని సార్లు చూసుకున్నా ఏదో ఒకటి మర్చిపోయిన వస్తువు తెలుస్తూనే వుంది. ఎప్పటి కప్పుడు 'అన్నీ ఉన్నాయ్!' అని సంతృప్తి పడటం, తరువాత చేసిన తనిఖీ లో ఏదో ఒకటి లోపించడం జరిగేది. 'ఇలా రోజుల తరబడి సర్దుకుంటూపోయినా చివరికి ఏదో ముఖ్యమైన వస్తువును మర్చిపోతూనే ఉంటాం మనం! అనుకుని యిద్దరూ నవ్వుకున్నారు.
    పదోసారి అంతా 'పూర్తయింది' అని వాళ్ళనుకునేసరికి నాలుగయింది. మరో అరగంట లో బయలుదేరితే  కాని ట్రైను అందుకోలేరు.
    తీరా కళ్యాణి హడావిడి పడుతూ కొప్పు పెట్టుకునేసరికి అదితోందరలో కుదరనే లేదు. విప్పి మళ్ళీ వేసుకుంది. ఈసారి మరింత అధ్వాన్నంగా వచ్చింది. అప్పటికే ఆమె శరీరమంతా చెమటతో తడిసి పోయింది. ముఖానికి రాసుకున్న పౌడరు కారిపోయింది. కాటుక కళ్ళ కిందికి వెడల్పు గా విస్తరించింది. చెమట తో తడిసిన బొట్టు చెదిరి పోయి ముక్కు మీదకు కారింది.
    అద్దంలో తన అవతారాన్ని చూసుకుంటున్న కళ్యాణి కి చచ్చే ఏడుపొచ్చింది.ముఖాన్ని తడి గుడ్డతో తుడుచుకుని  మళ్ళీ పౌడరు , కాటుక, బొట్టు అన్నీ అమర్చుకుంది. కొప్పుతో కుస్తీ పట్టే వోపిక, తీరిక లేక మాములుగా జడ వేసుకుంది.
    తన అలంకరణ ను  ఆఖరు సారిగా చూసుకున్న కళ్యాణి హృదయమంతా అసంతృప్తి తో నిండిపోయింది. ఇంటిలో ఉన్నప్పుడు ఎటు సింగారాలు చేసుకునేందుకు సమయం వుండదు. కనీసం ఈ పది హీను రోజుల ప్రేమ యాత్ర లో నైనా నీటుగా అందంగా తయారవుదామనుకున్న కల్యాణి ఆశ నిరాశే అయింది.
    తాము బయలుదేరే రోజు ఏ చీర కట్టుకోవాలి ఏవిధంగా అలంకరించు కోవాలి  అన్న విషయాన్ని గురించి వారం రోజులు ముందు నుండే తీవ్రంగా ఆలోచిస్తూ వచ్చింది కళ్యాణి.
    నెత్తి మీద అరడుగు ఎత్తున కొప్పు పెట్టుకుని తెల్లని బెనారసు పట్టు చీర కట్టుకుని చెవులకు ముత్యాల దిద్దులు పెట్టుకుని, చీర మీదుగా వేలాడేటట్టు పగడాల దండ వేసుకుని తాంబూలం తో రాగ రంజితమైన పెదవుల మీద దరహాసం చిందిస్తూ పాప నెత్తుకుని ఠీవి గా అడుగులో అడుగు వేసుకుంటూ భర్త పక్కనే నడిచి వెళ్తున్నట్టు తానూ హించుకున్న ఊహ చిత్రం కాస్తా చెదిరి పోయింది ప్పుడు. అందమైన ముడి స్థానం లో కొత్తిమీర కట్ట లాంటి జడ ఉన్నప్పుడు బెనారసు పట్టుచీర బాబిగాడి పుణ్యమా అంటూ పాడై పోయినందు వల్ల మామూలు వాయిల్ చీర కట్టుకుంది కళ్యాణి. ఆ చీర మీదకు ముత్యాల దిద్దులు మాచ్ అవని మాములుగా రింగులు పెట్టుకుంది. పగడాల దండ వేసుకోవటానికి విరక్తి పుట్టి , ఆమె వేసుకునే లేదు. ఇకే తాంబూలం వేసుకునే తీరికేది?
    అతి సామాన్యంగా ఉన్న తన అలంకారణ ని చూసి నిట్టూర్చింది కళ్యాణి . 'ఇది జీవితం! ఎంత ప్రప్తాముంటే అంతటి తోనే సంతోషపడటం ఉత్తమం.' అనుకుంది  విరక్తి గా.

                                      3

    తీరా కాంతారావు టాక్సీ పిలుచుకు రావటానికి అటు వెళ్ళగానే పిల్లలిద్దరూ నేల మీద పడి పొర్లి యిస్త్రీ బట్టలను మాపుకున్నారు. అ సమయంలో కళ్యాణి కి కోపం, ఏడుపు, విరక్తి అన్నీ కలిగినాయ్. వాళ్ళను తిట్టటానికి కానీ కొట్టటానికి కాని సరిపడ వోపిక లేదు ఆమెకు. ఆ బట్టలు తీసి , వళ్ళు కడిగి మరో జత బట్టలు తొడిగింది కళ్యాణి.
    వేసవి కాలం అవటం వల్ల ఏ చిన్న పని చేసినా వళ్ళంతా చెమటలు పోసేస్తోంది. కాంతారావు టాక్సీ తెచ్చేసరికి కళ్యాణి చేచెమటలు కారుతున్న ముఖంతో పిల్లలతో కుస్తీ పడుతోంది.
    కాంతారావు తొందర పెడ్తున్నాడు-- టైమయి పోతోందని. చెదిరిపోయిన తన అలంకరణ ని సరిదిద్దు కోవటానికి సమయమే దొరకలేదు కళ్యాణి కి. కళ్ళ లో నుండి ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతాన అపెసుకుంది కళ్యాణి. మనసంతా ఏమిటో - ఒక్కసారిగా వెలితై పోయినట్ల నిపించింది ఆమెకు. కాంతారావు హడావుడి గా సామానంతటినీ టాక్సీ లో పడేస్తుంటే ఆ లోపల కళ్యాణి పోరుగింటావిడతో తాము వెళ్తూన్నామనీ, పది రోజుల దాకా రామనీ, ఉత్తరాలేమైనా వస్తే దగ్గర ఉంచుకోమని చెప్పింది. కాంతారావు బాబిగాడిని, కల్యాణి పాపను ఎత్తుకుని టాక్సీలో కూర్చున్నారు.
    అప్పటికి ప్రాణాలు కుదుట పడ్డాయ్. రివ్వున సాగిపోతోంది టాక్సీ. టాక్సీ ముందుకు సాగుతున్న కొలది చెమట తో తడిసిన శరీరాలకు హాయిని ఆందోళనతో సతమతమయిపోయిన మనసులకు ఊరట ను కలిగిస్తోంది చల్లగా వీస్తున్న గాలి.
    కాంతారావు కళ్యాణి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అతనికి మనసులో ఎంతో సంతోషంగా వుంది. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్త పరచాలో తెలియక 'మొత్తానికి మనం ప్రేమ యాత్ర ప్రారంభించేం!" అన్నాడు నవ్వుతూ.
    కళ్యాణి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో ఉండవలసినంత వెలుగు లేకపోవడం గమనించిన కాంతారావు కంగారు పడ్డాడు. 'కళ్యాణీ ! ఏమయింది? ఎందుకలా వున్నావు? ఒంట్లో బాగాలేదా? పాపం సామాన్లన్నీ పొద్దుటి నుండి సర్దు కోవటం వల్ల అలసి పోయినట్లు న్నావు కదూ?" అన్నాడు ప్రేమగా.
    భర్త అలా అడిగేసరికి కళ్యాణి మనసులో ఉన్న దిగులంతా కన్నీటి రూపంలో వెలికి వచ్చింది. మంచి కాని, చెడు కానీ తన మనసులో ఏ ఆలోచన ఉన్నా దానిని భర్త కి చెప్పేస్తే కాని తృప్తి కలగదు కళ్యాణికి. తను యీ రోజు ఎలా అలంకరించుకోవాలీ అన్న విషయాన్ని గురించి ఎంతలా ఆలోచించిందీ , తన ఆశలు ఎలా చెదురై పోయిందీ అన్నీ ఏకరువు పెట్టింది. 'నా ముఖం చాలా అసహ్యంగా ఉంది కదూ?" అంటూ ఏడుపు కంఠం తో అడిగింది.
    కాంతారావు కి నవ్వాగింది కాదు. ఆమె ధోరణి చూసి.
    "ఎంత పిచ్చిదానివి కళ్యాణి నువ్వు!" అంటూ విరగబడి నవ్వేడు.
    కళ్యాణికి నిజంగానే కోపం వచ్చింది అతని నవ్వును చూస్తె.
    ఎందుకలా నవ్వుతారు? ఔన్లె. మీకు నవ్వులాట గానే ఉంటుంది. నా స్థితిని చూస్తె. ఖర్మ గాకపోతే ఏమిటిది? ఛీ ఛీ! ఈ పాడు పిల్లల మూలాన్నే కదా యిరవై ఏళ్ళకే ముసలితనం వచ్చేసింది నాకు. నా వయసు వాళ్ళంతా ఎంత చక్కగా చదువుకుంటూ ఎగిరి గంతులేస్తుంటే నేనేమో కనీసం బయటకు వచ్చేటప్పుడు ఫ్రెష్ గా అలంకరించుకునేందుకు కూడా నోచుకోలేదు' అంది రోషంగా -- దానికంతటి కీ కారణం అతనేనన్నట్లు ధ్వనిస్తూ.'
    ఒక్కసారిగా నవ్వపేశాడు కాంతారావు. 'నువ్వు నిజంగానే పిచ్చి దానివి కళ్యాణి! లేకపోతె ఇలాంటి ఆలోచనలే చెయ్యవు ఏదో విసుగు లో ఉండి అంటున్నావు కాని, నిజంగా నీకు పిల్లలంత బరువుగా , నీ ఆనందానికి ఆటంకంగా కనిపిస్తున్నారా?వాళ్ళ వల్ల మాతృమూర్తి వైన నీకు, మీవల్ల యింటికీ ఎంత నిండు తనం వస్తుందో నీకు మాత్రం తెలియదూ?' అన్నాడు.
    గతుక్కుమంది కళ్యాణి . తన ఒళ్ళో కూర్చున్న పాపని అప్రయత్నం గానే గుండెకు హత్తుకుంది. 'వీళ్ళు...యీ పిల్లలే లేకపోతె ఒక్క క్షణమైనా బ్రతకగలనా నేను?' అనుకుంది. 'ఈ పిల్లలే నాకు అలంకారాలు. వేరే అలంకరణ లెందుకు?" అనుకుంది నిండు మనసుతో.
    కాంతారావు ఆమె భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరేడు. 'నువ్వు ఆడంబరంగా అలంకరించుకోనంత మాత్రాన నీ అనడాని కేదో లోపమొచ్చింది అని బాధపడకు కళ్యాణి! అలంకరణ లు కేవలం సహజ సౌందర్యానికి ప్రస్పుట పరచే సాధనాలు మాత్రమే! లేని సౌందర్యాన్ని అవి తెచ్చి పెట్టలేవు. నా మటుకు నాకు నిజం చెప్పాలంటే యీ క్షణం లోనే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు కనుక లేనిపోని అలంకరణ లు చేసుకుంటే వాటి ప్రభావం ముందు నీ సహజ సౌందర్యం మరుగున పడిపోయేది. ఈ వాయిల్ చీరలో సాదా రింగులతో నీ అందం కొట్టవచ్చినట్టు కనపడుతోంది' అన్నాడు.
    కళ్యాణి కి అంతకంటే ఎక్కువ మాటలు అవసరం లేదు. తన అరచేతి దగ్గరగా ఉన్న భర్త చేతిని మృదువుగా నొక్కింది.
    టాక్సీ రైలు స్టేషను దగ్గర ఆగింది.
    టికెట్టు ముందుగానే కొనుక్కుని ఉండటం వల్ల ఎక్కువ ప్రయాస పడకుండానే వెళ్ళి ట్రైన్ లో కూర్చున్నారు. మొదటిసారిగా రైలు ఎక్కిన పిల్లలు ఆనందానికి మితి లేకపోయింది.
    వచ్చీ రాని మాటలతో బాబిగాడు ప్లాట్ ఫారం మీది జనాన్ని, షాపులను చూపిస్తూ పాపతో ఉత్సాహంగా ఏమేమో చెప్పుకు పోతున్నాడు. పాప కూడా తన నల్లని విశాల నయనాలను మరింత పెద్దవి చేసి , అన్న చూపిస్తున్న వైపే చూస్తూ, అవ్యక్తమైన ఆనందంతో తేలిపోతోంది.
    పిల్లలిద్దరి సంతోషాన్ని చూసి భార్యాభర్తలు ఒకరి ముఖలోకి ఒకరు సంతృప్తిగా చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు.
    కాంతారావు రెండు కోకాకోలాలు తెప్పించేడు. అలవాటైన ఆ ఘాటు రుచిని చూసి వులుకు వులుకున నవ్వుకుంటూ పిల్లలు కూడా చప్పరించేరు. కోకాకోలా కుర్రవాడు సీసాలు అందిస్తుండగానే అందులోని 'స్ట్రా' లను పిల్లలిద్దరూ చేరోకటి తీసుకుని నోట్లో పెట్టేసుకుని నలిపి పారవేసేరు.

                   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS