Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 48

    వివేకమును సత్యమును ధర్మమును గుర్తించుకొనుచు నంత రాత్మ నారాధించుచు లోలోఁ జోచ్చుకొలఁదిని నీకు వలసిన యుద్బోధములు లభింపఁ గలవు. అట్టి యుద్బోధము లను నీవు నీలో నెక్కడ నుండి యెట్లు పదయు చుంటివో క్రమక్రమముగా ప్రసరించుచున్నది. అది లేక నీ వేమి గాని పడయఁ జాలవు. ముందు నీ కారోగ్యమే. తర్వాత నే యోగ సాధన ఫలము దొరకఁ గలదు. గాఢముగా విశ్వసించితి వేని, నీకు యోగ ఫలము లభింపఁగల దని నే ననుట లేదు. నీ కా విశ్వాసమును గొల్ప వలసిన వాఁ డను. నేనే. నీవు పరమార్దకుతూహలిగా నుండినఁ జాలును. యోగ సాధనము నాకలి గొన్న రిత్తక డుపుతో నుండి చేయరాదు. ఏదే నాహారము గొన్న పిదపనే చేయ వలెను. మద్రాసులో నీ యోగ మాగ్గమున నడచుచున్న మిత్రులు పలువు రున్నారు. తఱచుగా వారిని గలసికొను చుండుము. వీలు కలిగినప్పు డిక్కడికి వచ్చు చుండుము. ప్రధానముగా డిసెంబరు తుది వారమునను, మే తుది వారమునను, ఇక్కడ గోష్ఠి జరగును. అప్పుడు తప్పక రమ్ము' అనిరి. నా కనుల వెంట ధారలుగా నీరు కారెను. ఈ శ్లోకము రచించితిని.
 
       ' దుర్వ్యాధిఖి న్నే శరణం ప్రపన్నే
              మయి ప్రసాదా దయి మాస్మ భైషీః
              త్రాతా హ మస్మీతి దదా వభీతిం
              య స్తం గురుం మ స్తకతో నమామి'

    ఇట్టి సంభాషణతో నై దాఱు నిమిషములు గడచెను.

               ఆదినములలోవారుముఖ్యమయినతత్వార్ధములనుసహస్రారము, పిట్యూటరీ, అక్కడి దివ్య శక్తులు, వాని ప్రసారము మొదలగు వానిని గూర్చి  శిష్యులు బోధించుట, దివ్యదృష్టితో వానిని ముఖ్య శిష్యులు పరికించుట ట్లను గ్రహించుట, ఇంక నందలి విషయవి శేషములను మాతృ శ్రీ ద్వారా తా మపూర్వముగా సేకరించుట జరగుచుండెను. కాన నా కంతకంటె నధికముగా, ప్రత్యేకముగా వారితో సంభాషింప ననువుపడ దయ్యెను.

                                            ౨౬
 
                                                 చేకూడుట

    మరల సంజ వేళ కక్కడి వారు శిష్యులు పలువురు విచ్చేసిరి. భగవద్ఘట్ట మను పేరి కావేరీతీరఘట్టముననే శ్రీ వారి సన్నీ వేశమున కెదురుగా వెలయుచున్న యోగ శాలలో ఎల్లరును గూడి యోగసాధన చేయుట జరగుచుండెను. చాలగా వాచి యున్న నా  చేయి నాఁటి సంజ ప్రార్ధనమున నెంతో చక్క బడెను. వాపు తీపు తగ్గెను. నాలో లోలోపల నెక్కడో చిఱువెల్గు గోచరించు న్నట్టును స్వప్న ప్రాయముగా లీలగాఁ గొంత గోచరింపఁ దొడగెను. శరీరము బ్యాటరీ పెట్టి నరముల నెల్ల నూగించి వేసినట్టు గొప్ప యూపు కలిగెను.చేతులు వాని యంతట నవియే లేచి నమస్కరించె  ను. కాని కుడిచేత నింకను బాధ గోచరించుచుండెను. టక్కు  టక్కు మని జబ్బు యెముక యదురు తెలియుచుండెను.

    శరీరము నింత తీవ్రసం వలన మేమిటి? ఇది యెక్కడ నుండి యారంభమై జరగుచున్నది? ఇంతదాఁక నెన్ని శ్లోకములో, ఎన్ని మంత్రములో, ఎన్ని ధ్యానములో, ఎన్ని క్షేత్రములో, ఎన్ని దేవతాదర్శనములో, ఎందఱ యాశ్రాయ ములో జరపితిని గాని యిట్టి విశేష మెక్కడ గాని యెప్పుడు గాని జరగుట  యెఱుఁగ నైతినే! ఒకతూరి ప్రార్ధన మాత్రము చేనింత జరగుట యేమిది? అస్తినాస్తి విచికిత్సా స్పదముగా నున్న పరతత్వము అస్తి యని స్పష్టముగా ననుభవింప నగు చున్నట్లున్నదే? దీని లోఁ తేదో  తెలిసికొనవలెను. గదా! త్రోవ దొరకినది గదా! నా ప్రార్ధనమును  లోన నెవరో వినుచున్నట్టు_సమాధానము చెప్పుచున్నట్టు_అనుగ్రహించు చున్నట్టు అగుచున్న దేమి వింత? నా జబ్బు నాకు చాలా ఉపకారమే చేసెనా యేమి! ఇక నా జబ్బు కుదిరినట్టే తోఁచు చున్నదే! ఏమి యానందము! ఏమియు లేకున్నచో నాచేయి యింత వాచుటేమి? నావశము తప్పి చేతులు లేచి నమస్కరించు టేమి? చే కూడుట యేమి? 'చేకూడుట' అన్నపదము కల్పించినవా రెవరు? ఈ రెండు చేతులు లేచి కలసి నమస్కరించుటను సూచించునదిగా నేర్పడినదా యేమి చేకూడు, కైకూడు పదకల్పనము? నే నారోగ్యవంతుఁడ నగుచో  మా వారెంత సంతోషింతురు! మావారి నందఱను నిందుఁ జేర్పఁ గల్లుదునా యేమి? ఇత్యాది  భావము లాధ్యానసమయమున మెఱపులు మెఱసినట్లు  నాలోఁ జెలరేగ సాగెను. ఆనాఁటిస్థితి నా కొక జన్మ మబ్బిన ట్టుండెను. ధ్యానావసాన సమయమున నాయుత్సాహ మక్కడి మిత్రులకుఁ దెలిపితిని. అక్కడివారు వారి వారి యనుభూతి విశేషములఁ గొన్నింటిఁ జెప్పిరి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS