Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 49

                 46 . దోమలు కుట్టడంవల్ల ఇస్మోఫీలియా వస్తుందా ?
   
    "డాక్టర్, నాకు టి.బి వచ్చినట్లు ఉండి. ఈ దగ్గుతో చచ్చిపోతుద్నాను  నన్నెలా అయినా రక్షించాలి" అంటూ దీనంగా అర్ధించాడు అర్జున రావు "టి.బి. వచ్చిందా! ఎంతకాలం నుండి దగ్గు వస్తోంది!" అని అడిగాడు డాక్టరు.

    "మరీ ఎంతకాలం నుంచి కాదులేండి ఓ వారం పదిరోజుల నుంచే! ఒక్కొక్కసారి ఈ దగ్గుతోపాటు ఆయాసంగా కూడా ఉంటోంది.  అప్పుడు ఛాతీలోబరువుగా అనిపిస్తోంది. ఈ లక్షణం గుండెజబ్బుకు సంభందించిన దేమైనని న భయం" అంటూ తన అవస్థవివరించాడు_ అర్జునరావు.

    ఈ లోగా డాక్టరు ఏదో అనబోయాడు. కాని "డాక్టర్! దగ్గుతో పాటు గొంతుకాలో పిల్లికూతల్లాగా వస్తున్నాయి. ఇది. టి.బి. కాదేమో, ఒకవేల ఉబ్బసం కావచ్చు. ఏమిటో డాక్టరుగారూ, అన్నీ అనుమానాలే, అన్నీ భయాలే " అంటూ వరసగా ఏకరువు పెట్టాడతను.

    అర్జునరావును డాక్టరు పరీక్షచేసి చూశాడు. అతనికి టి.బి. లేదు. గుండెజబ్బూలేదు ఆయసమూ గొంతుకలో గురగుర అనిపించడానికి ఉబ్బసం కారణం కానేకాదు మరేమిటి?

    అదే_"ఈసినోఫీలియా" దీనినే విద్యాభాషలో "ట్రాపికల్ పాల మోనరీ ఈసినోఫీలియా"  అంటారు. చాలా మండి ఉబ్బసాన్ని కూడా ఈసినోఫీలియాగా భావిస్తారు. అర్జునరావులాంటివాళ్ళు ఎడతెరపిలేకుండా వచ్చే దగ్గును దానితోపాటు ఉండే కాస్తజ్వారాన్ని , ఆకలి తగ్గిపోవడాన్నీ టి.బి. లక్షణాలుగా భ్రమ పడతారు.

    ఈసినోఫీలియా ద్రావడానికి ముఖ్యంగా శరీరంలోకి దోమకాటుద్వారా ప్రవేశించిన ఫైలేరియా క్రిములే కారణం మరి కొందరికి విషయంలో జీర్ణకోశంలో ఉండే ఏలికపాములు కారణమవుతాయి ముఖ్యంగా చిన్న పిల్లల కడుపులో ఈ పాములు ఎక్కువుగా ఉంటూ ఉంటాయి. కొన్ని కేసుల విషయంలో ఫలానా కారణం అని స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కూడా!

    ఈసినోఫీలియా వచ్చినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వ్యాధి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కొందరికి దగ్గు, ఛాతీలో నొప్పి మాత్రమే ఉండి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ దగ్గు పగలుకంటె రాత్రి పూట మరీ తీవ్రంగా వస్తూ ఉంటుంది. దగ్గి_దగ్గి చివరికి అలసట అనిపించి శరీరమంతాచెమట పట్టేస్తుంది.

    ఈసినోఫీలియా ఉన్నవారిలో కొందరికి ఉబ్బసపు రోగుల మాదిరిగానే కొద్దిరోజులు పాటు దగ్గు, ఆయాసం, గొంతుకతో గురగుర ఉంటాయి. మరికొందరిలో ఆయాసంతోపాటు ఛాతీబిగపట్టేసి, ఊపిరి సలపనట్లు బాధ కలుగుతుంది. ఇలంటి పరిస్థితిని చూసి తమకు ఉబ్బసం వచ్చిందని బాధ పడేవారూ లేకపోలేదు.

    ఈసినోఫీలియా ఉన్న కొందరిలో అకస్మాత్తుగా ఒళ్ళంతా పైత్యం దద్దుర్లులా మరికొందరికి తల బరువుగా, తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. దగ్గు, ఆయాసం అంతగా లేకుండా తలనొప్పె ఎక్కువ అనిపించి కొందరు తమ తలనావుపికి కళ్ళజోడు పెట్టుకోవలసి వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు.

    చాలా కేసుల్లో ఇంత దగ్గుఉన్నా, ఆయాసం ఉన్నా ఛాతికీ ఎక్సరే ఫోటోతీసి చూస్తె అందులో ఎటువంటి తేడా కనబడదు. కొద్దిమందివిషయంలో మాత్రం ఎక్సరే తీసినపుడు మచ్చల లాంటివి కనబడతాయి.

    దగ్గు వస్తున్నా, ఆయాసం అనిపిస్తున్నా, తరచూ తలనొప్పిగా ఉంటున్నా ఛాతీలోనొక్కినట్లు అనిపిస్తున్నా పైత్యం దాడ్డుర్లుగా వస్తున్నా ఇంకా ఇతర లక్షణాలు ఉన్నా అది ఈసినోఫీలియావల్ల అయినదీ కానిదీ తెలుసుకోవడం చాలాటెలిక. దీనిని సూక్షమైన రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేసి చెప్పవచ్చు. ఈసినోఫీలియా ఉన్నప్పుడు రక్తంలో ఈసినోఫీలియా కణాలు 25నుంచి80శాతానికి పైగా ఉంటాయి. అలాగే తెల్లరక్తకణాల సంఖ్య రక్తంలో బాగా పెరుగుతుంది. మామూలుగా రక్తంలో తెల్లరక్తకణాలుప్రతీ క్యూబీక్ మీల్లీ మిటర్ కీ 8000నుంచి 12000ఉంటాయి. ఈసినోఫీలియా వచ్చినప్పుడు 15,000నుంచి 40,000 వరకు పేరుగుతాయి. కొందరిలో లక్షవరకు పెరగవచ్చు అలాగే ఈసినిఫీయా వచ్చినప్పుడు 40_80శాతం దాకా ఉంటాయి. ఇంతకంటే ఎక్కువశతం కూడా ఉండవచ్చు.

    రక్తపరీక్ష ఈసినోఫీలియా అని నిర్ధారించినపుడు హేట్రాజాన్ టాబ్లెట్లు, కార్డిజూన్, యాంటి హిస్టమన్ టాబ్లెట్లు సలహాపై కోర్సుగా వాడినట్లయితే వ్యాధి లక్షణాలన్నీ త్వరగా తగ్గిపోతాయి. కడుపులో పాములు ఉన్నాయని అనుమానం ఉంటే విరేచనం పరీక్షచేసి చూడడం, పాములు పడిపోవడానికి మందులు వాడడం అవసరం.

                                      ****
   
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS