౨౫
దివ్యబోధ
ఆ నాఁటిరాత్రి మెయిలులో నేను తిరిగి మద్రాసు వచ్చి వేయవలసి యున్నది. కాన నా విషయమును గూర్చిశ్రీ వారితో సంభాషించుటకు నాదను కోరితిని. నా యభ్యర్ధనమును మహా దేవయ్యగారు శ్రీ వారికి నివేదించిరి. భోజనా నంతరము సంభాషింప శ్రీవా రనుమతించిరి. అప్పుడు వారు యోగ విషయములను గూర్చి వారి యర్ధాంగి ద్వారా యేవేవో యపూర్వాంశ ములను సేకరించుచుండిరి. భోజనా నంతరమున నేఁ జేర నరిగి సాష్టాంగనమస్కారము చేసి యిట్లు విన్నవించుకొంటిని.' మూఁడెండ్లనుండి యమ బాధ పడుచున్నాను, నిద్రలేదు, శాంతి లేదు, ఆకలి, జిర్ణించుకొను శక్తి సరిగా లేవు. ఇక్కడికి రాక తలఁపునకు ననఁ గా నా యోఱుకకు దెలియకుండ నే సరిగా భోజనము చేయగల్గితిని. మి యోగమాహాత్మ్యమును శ్రీ నరసింహము గారి ద్వారా విన్నంతనే నాలో నేదో దివ్య సౌఖ్య సౌధమునకు బాట గోచరించు చున్నట్ల యినది. ప్రశాంతము గా రాఁ గలిగితిని. రైలులో కొంత నిద్ర పట్టినది. ఇక్కడికి వచ్చికడచిన రాత్రి సుఖముగానిద్రించితిని. నూనె తిరుగ బోత, ఆవాలు, సాంబారు, రసము, పల్చనిమజ్జిగ యివి నా కింతకు ముందు కడుపులో మంటలు గొల్పెడివి. ఇప్పు డవి వికటింప లేదు. మిరు నిర్భయముగా అందఱతో పాటు భుగింప వచ్చు ననఁ గా నట్లు చేసితిని. పూర్వము తీవ్రమయున మందులు పుచ్చుకొంటిని. తదాది కడుపు ఉడికి పోవుచున్న ట్టుండును. నేఁ డది లేదు.' శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం' అని గాన నే నిక్కడ మి సేవకుఁడనుగానే యుండఁ గోరుచు న్నాను. ఇక్కడ నుండి యే జీవిక నేదేని సమకూర్చు కొందును. అనుగ్రహింపు' డంటిని.
వారు నీ కిప్పుడు ' జీత మెంత?' అని యడిగిరి. ఏఁ బది రూపాయ లంటిని.' దీనితో నీవు నీ కుటుంబమును పోషించు కోవచ్చును. ఉన్న జీవికను మానుకొని యిక్కడ నుండ నేల?
బండి నడచుచుండఁ గానే రిపేరు సాగవలెను. బండి ఊడఁ దీసి చేయునో బండి వాని జీవిక చెడును. అట్టిది నా యోగ మార్గము. సాగుచున్న ప్రవృతికి భంగము కలుగరాదు. ఇది నివృత్తి మార్గము కాదు. రాజయోగ మార్గము. గార్హస్ధ్యము ఉండ వలెను. సన్న్యాసి కారాదు. సౌఖ్య ముండవలెను. ఆహారాదులు సరిగా ససిగా కయికొను చుండవలెను.
ఇట్టిచో నీవు యుద్యోగమున నండు టావశ్యకము. నీ యుద్యోగము నీ జీవిక కే కాక లోకమునకుఁ గూడ నుపకారకము. ఆరోగ్యవంతుఁ డవై నీ యుద్యోగమున నుండి తిన్నగా సాగించుకొనుచుండుము. నీ విక్కడ నుండఁగోరుట నా సన్నిధి లాభము కొఱకే గదా! నేను సదా నీలో నుందును. నీకు వలసిన సహాయము నీలో నుండి జరపుచునే యుందును. ఇక్కడ నీ కే తీరున శరీరము సంస్కారము జరగుట గుర్తుకు వచ్చెనో, ఆ తిరుననే యెక్కడ నున్నను అనుభూతి గుర్తుకు రాగఁ లదు. ఉదయము జరపిన యోగ సాధనము శరీరము సాయంకాలము దాఁ క పని చేయుచునే యుండును. ఎప్పుడెప్పు డెం తెంత జరగవలెనో అంతంత జరుగును.
నీలోని సంస్కారము జరపునది ప్రజ్ఞా కలిత మయిన చైతన్యము గాని జడశక్తి కాదు. అది యెలక్టిసిటీ వలె పని చేయునది గాదు. ఎలక్టిసిటీ హద్దు దాటి అక్రమముగా నుపయోగించుకోఁ గోరి నను అది యట్లు పని చేయదు. ఎంత చేయ వలెనో అంతే చేయును. కావలె నన్నను నీ వావశ్యకత కెక్కువగా కనులు మూసికొని యుండఁ జాలవు. లోపల నావశ్యకమయిన పని జరగుచుండఁ గా కనులు తెఱవను జాలవు. ఏ దేని యాకస్మికముగాకార్యాంతరముకలుగుటో, ఎవరేని వచ్చి పలుకరించుటో జరిగినను అప్పుడు విక్షేపము జరగు నని వెఱవ నక్కఱ లేదు.' ఇట్లు తొందర కలిగినది. దాని ననుభవింప వలసి యున్నది.' అని ప్రార్ధనాపూర్వకముగా నంత రాత్మకు విన్న వించుకొని యా కార్యము ముగించు కొన వచ్చును. అది ముగిసినంత నే జరగా వలసిన యోగ సాధన జరగఁ గలదు. ప్రయాణములో, రైలులో,బండిలో, నడకలో ఇంకే మేని వ్యవహారములలో వర్తిల్ల వలసి వచ్చినప్పుడు సరియ యిన వేళ తప్పిపోకుండఒక క్షణ మాత్రము మనసున స్మరించినఁ జాలును. కార్యంతరములు తీఱి విశ్రాంతి దొరకి నప్పుడు జరగవలసిన సాధన మెల్ల జరగఁ గలదు.
