Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 48

                              45. మెడ దగ్గర ఏర్పడే 'టి.బి' గడ్డలు   
   
    మంగమ్మకి మెడ దగ్గర "గ్లాండ్సు" ఏర్పడి, చేతితో నొక్కితే చింతపక్కల్లా తగులుతున్నాయి. కూతురు మగమ్మకి ఇలా వుండటం, అకస్మాత్తుగా ఒకరోజున రంగమ్మ గమనించింది. ఇంకేముంది! ఆమె గుండె అదిరిపోయింది. వెంటనే రంగమ్మ పదేళ్ళ మంగమ్మని వెంట బెట్టుకుని ఆసుపత్రికి పరుగేత్తింది."డాక్టర్" మా అమ్మాయికి టి.బి గడ్డలు మెడ దగ్గర లేచాయి. వెంటనే తగ్గిపోయెందుకు మందు ఇవ్వండి" అంటూ ఆదుర్దాగా అడిగింది.

    డాక్టరు అంతా పరీక్షచేసి అవి తి.బి గ్లాండ్సుకావని నిర్ధారణ చేసి చెప్పాడు తెలుసుకోలేక పోయాడని భావించి, "దాకత్రుగారూ మీరు అవి టి.బి గడ్డలు కావంటారేమిటి? నాకు ఇలాగే మెడ దగ్గర టి.బి గడ్డలు లేచి మూడు నెలలు వరసుగా ఇంజక్షన్లు చేయించుకుని సంవత్సరన్నర మందులు మిమ్గాను. మీరు కాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను" అంటూ పాత రాగి అయిన రంగమ్మ కొత్త డాక్టరు దగ్గర ఎకరుపు పెట్టింది.

    డాక్టరు ఆమెను సమాధాన పరుస్తూ "చూడు రంగంమ్మా. మీ అమ్మాయికి తలనిండాపేలు ఉన్నాయి దురదపేట్టితల అంతా గోక్కోవడంతో, మెడ దగ్గర ఈ కాయలు లేచాయి" అంటూ విషయం తేల్చి చెప్పాడు. తలలో పేలు ఉండటానికి, మెడ దగ్గర గడ్డలు ఏర్పడటానికి సంభంధం ఏమిటో తెలియక రంగమ్మ ప్రశ్నార్ధకంగా మోహం పెట్టింది.

    తలలో పేలు ఉంటే, వాటి నిర్మూలనకు తగిన శ్రద్ధ వహించకపోతే రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అందులో రంగమ్మ కూతురు మంగమ్మకి వచ్చిన పరిస్థితి ఒకటి. రకరకాల దుష్పరిణామాలుతెచ్చే తలలోని ఈ పెను దాదాపు పావు అంగుళం పొడవు ఉంటుంది. వీటిల్లో అడవీ, మోగావీ, రెండూ ఉంటాయి. అడ పెలకంటేమగపేలు సైజు చిన్నవిగా ఉంటాయి. అంటేకాదు సంఖ్యలో కూడా తక్కువే పేలకు గట్టినోరు ఉంటుంది ఛాతీసన్నగా ఉంటుంది కని పొట్ట మాత్రం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా మూడువెనక భాగం పెలకి మంచి స్థావరం. పేలు  పెట్టేగుడ్లు తలకు సంభందించిన చర్మం మీద కాకుండా వెంట్రుకలకి అంటుకుని ఉంటాయి. పెళ సంఖ్యనుబట్టి, అవి పెట్టే గుడ్లనుబట్టి ఇవి వేమ్త్రుకుల మోడలలోను వాటి పొడుగునా సిమెంటులాగా గట్టిగా అంటిపెట్టుకుని తుట్టలుతుట్టలుగా ఉంటాయి.

    కొద్ది గుడ్లే అయితే అక్కడక్కడ కొన్ని వెంట్రుకలకిగుడ్లు అంటుకుని ఉంటయి. ఎక్కువ గ్రుడ్లు పెట్టబడినపుడు అన్ని వెంట్రుకలకు సిమెంటులా అంటుకు పోతాయి. గుడ్ల నుంచి బయటకి వచ్చిన పేలు తల మీద శ్వేచ్చా విహారం చేస్తూ వాటికున్న గట్టి నోరుతపో తలమీద ఆహారం కోసం గీరుతాయి. దానితో తలమీద దురద ప్రారంభం అవుతుంది. దురద పుట్టినపుడు అతిగా గోర్లతో గోక్కుంటే అ శతలంలో బాక్టీరియా క్రిములు చేరి చీము పొక్కులు వేస్తె అంతగా దుష్పరిణామాలు ఉండవు. లేకపోతే పెలవల్ల తలకి చీము పొక్కులు తయారవడం, అవి ఎగ్జిమాలాగా మారడం, తల నీచు రావడం మామూలే.

    తలలో పేలు వున్నప్పుడు గోకడంతో కొద్దో_ గొప్పో చీము పొక్కులు తయారవుతాయి. మెడ దగ్గర గ్లాండ్లు వాచి వాటి సైజు పెరుగుతాయి. చాలామంది తలలో పెళవల్ల ఇలా మెడదగ్గర గ్లాండ్లు వచ్చాయని గుర్తించక అవి తి.బి గ్లాండ్లు అని భయపడటం కూడా సహజమే! పాదం దగ్గర చిన్న చీముపొక్కు లేస్తే గజ్జల్లో బిళ్ళలు తయారైనట్లు, తలలో పేలుచేసే ఆగడంవల్ల మెడదగ్గర గళండ్లు వాస్తాయి. కొందరికి తలలో చీము పొక్కులు కనబడకపోయినా పేలు కొరకటంవల్ల, ఆ దురదకుగొల్లతో గోకడంవల్ల నిదానంగా గ్లాండ్లు నొప్పి లేకుండా తయారవుతాయి.

    ముఖ్యంగా మురికివాడల్లో ఉండే పెద్దవాళ్ళలలోను పేలు ఎక్కువ ఉంది వాటివల్ల అనేక దుర్లక్షణాలు కలుగుతాయి. పెళగుడ్లతో వెంట్రుకల మేడలులోను, వాటి పొడవునా తెల్లగాపట్టిన తుట్టాలని "ఈపు" అంటారు. అవే చివరకి పేలులాగ మారతాయి. ఇలా ఈపు ఎక్కువుగా ఉన్నప్పుడు పొడుగు జుట్టు కత్తిరించి వేయడం, తలకి తరచూ స్నానం చేయించడం, తలలో చీముపొక్కులు లేస్తే యాంటి బయాటిక్స్ వాడటం, పేలు పోవడానికి మందులు వాడటం అవసరం. ఇంట్లో ఒకరికి పేలు ఉంటే తెలికిగా రెండవ వారికి అవి సంక్రమిస్తాయి. పేలు ఉన్నవరు పడుకున్న దిండుమీద ఇంకొకరు పడుకుంటే దానిమీద అంటుకున్న గుడ్లవల్ల రెండవ వారికి పేలుపడతాయి. అలాగే దగ్గరదగ్గరే పడుకున్నా పేలు ఒకరినుంచి మరొకరికి చేరుకుంటాయి.

    పేలు తలలోనే కాదు. ఒంటిమీద, కనిబావుమ్మలమీద, చంకల్లోను,జననేంద్రియాల దగ్గర వెంట్రుకలలోను కూడా ఉండవచ్చు శరీరంమీద, ఇతర చోట్ల పేలు స్థావరం ఏర్పరచుకున్నప్పుడు అక్కడ దురద అనిపించడం, గోకితే చారలు పడి అక్కడ చీముపడుతూ ఉంటుంది. అయితే ఇలా శరీరానికి పేలుపట్టడం అనేది మురికిగా ఉండేవారిలోనే ఎక్కువ.

    శుభ్రం పాటించేవారిలోపేలు ఉండటం అరుదు. అయినా చాలా మండి స్రీలలో కొద్దో గొప్పో పేలు ఉంటూనే వుంటాయి. కాని వాటిని పోగోట్టుకోవడంతెలియక బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి పేలు పోగొట్టుకోవడంపెద్ద సమస్యకాదు. గామా బెంజీన్ హెక్సా క్లోరైడ్ కు సంభందించిన మందు తలకు రాసి ఇరవయినాలుగు గంటలు నుంచి తరువాతస్నానం చేస్తే పేలు, వాటి గుడ్లు నిర్ములించబడతాయి. ఈ మందుకు సంభంధించినవి సైబాల్ లోషన్స్ బజారులో దొరుకుతాయి,. ఇవి రాయడం వల్ల తలకిగాని, వెంట్రుకలకిగాని ఎత్తి హానికలగదు. మామూలుగా గజ్జికి వాడే స్కాబాలసీడ్, ఎస్కాబియాల్ లోషన్లుకూడా పేలు ఉన్నప్పుడు తలకి రాసుకుని ఒకరోజు ఉండి స్నానం చేస్తే పెళ సమస్య తొలగిపోతుంది. అలాగే ౫ శాతం డి.డి.టి ద్రవంకూడా పెలనినిర్మూలిస్తుంది.               

                                    *****
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS