"లోపలికి రా...అక్కడే నిలబడిపోయావేం?" గేటుకి అడ్డు తోలుగుతూ అంది.
చిట్టబ్బాయి లోపలికి రాలేదు. ప్తెగా ఓసారి ఆకాశంవ్తెపు చూశాడు. ఆ తరువాత చేతులు రెండూ బారజాపి ఆకాశం వ్తెపు చూస్తూ, తన చుట్టూ, తన చుట్టూ తాను తిరగాడు.
"ఏంటది?" అంది చిన్నమ్మాయి వింతగా చూస్తూ.
తిరగడం ఆపి ఆమె వంక చూశాడు చిట్టబ్బాయి.
"వాతావరణం చాల బాగుంది కదూ?...హిహి?" ప్రయత్నించి నావ్వుతూ అన్నాడు.
చిన్నమ్మాయి మొహం చిట్లించింది. ఓసారి తను కూడా ఆకాశం వంక చూసి మొహం చిట్లించింది.
"వాతావరణం బాగుందా?....ఎవరన్నారు??"
"నేనే అంటున్నా..." చిట్టబ్బాయి మళ్ళి చేతులు రెండూ చాపి ఆకాశం వంక చూస్తూ తిరుగుతూ "వాతావరణం చాలా బాగుంది!" అన్నాడు.
"ఊర్కే అలా తిరక్క...కళ్ళు తిరిగి నేలమీద పడ్తావ్!" విసుగు ప్రదర్శిస్తూ అంది. అయినా ఇంతగా ఉక్క పోస్తుంటే వాతావరణం బాగుందని అమ్తావేం?"
చిట్టబ్బాయి తిరగడం ఆపి చిన్నమ్మాయి వంక చూశాడు.
"ఏం కాదు...వాతావరణం నిజంగానే బాగుంది...." మొండిగా అన్నాడు.
"అయితే ఏమంటావ్?" అడిగింది చిన్నమ్మాయి.
"ఇలాంటి వాతావారణలో ఎక్కడిక్తెనా బయటికివెళ్ళి తిరిగితేనో? హిహిహి ఎలా ఉంది నా ఐడియా?హి?" అన్నాడు మెలికలు తిరుగుతూ చిట్టబ్బాయి.
చిన్నమ్మాయి చటుక్కున చిత్తబ్బ్యి చెవిని అంది పుచ్చుకుని గేటు లోపలికి లాక్కెళ్ళింది.
"ఏయ్ రజని... చెవి వదులు నొప్పెడుతుంది..." అన్నాడు చిట్టబ్బాయ్ బుద్దిగా ఆమె వెంట వస్తూ.
"ఈ వేళ మా ఇంటికి వస్తానని అన్నావా లేదా?" చెవిని వదిలిపెట్టకుండా అడిగింది."
"అన్నను..." ఒప్పుకున్నాడు. "అన్నట్టే వచ్చానుగా!"
"ఇంటికి రావటం అంటే గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోవడం కాదు... ఇంట్లోకి రావాలి!!"
"చెవి వదులు. నొప్పి!" కళ్ళు మూస్కుంటూ అన్నాడు.
"ఇంకా ఏమని చెప్పావు నిన్న నాతో?"
"అదేగా...ఇంటికి వస్తానని అన్నాను..."
"అదికాదు!... ఇంకా ఏం చెప్పావ్?" అతని చెవిని మరింతగా మేలిపెద్తూ అంది చిన్నమ్మాయ్.
"మీ నాన్నగారితో మాట్లాడతానని అన్నాను" మెల్లగా గొణిగాడు చిట్టబ్బాయి.
అతని చెవిని వదిలిపెట్టింది చిన్నమ్మాయి.
"హమ్మయ్య!... గుర్తుంది కదా? పద లోపలికి వెళ్దాం..." చిట్టబ్బాయి చేయిపట్టుకుని ముందుకు లాగింది.
"ఈ వేళ బయటికి ఎక్కడిక్తెనా వెళ్దాం రజ్జూ" మెల్లగా సణిగాడు చిట్టబ్బాయి.
"మా నాన్నగారితో మాట్లాడవా?"
"ఈ వేళ వద్దు.."
"ఏం...ఎందుకని?" రెట్టించి అడిగింది చిన్నమ్మాయి.
చిట్టబ్బాయి ఇబ్బందిగా నవ్వాడు.
"నాకు భయమేస్తుంది" మెల్లగా అన్నాడు.
"పోనీ ఈవేళ ఇందిరాపార్కుకి వెళ్దామా?" అడిగింది చిన్నమ్మాయి.
"ఓ వెళ్దాం" సంతోషంగా అన్నాడు చిట్టబ్బాయి.
"ఓ వెళ్దాం...సిగ్గులేకపోతే సరి.. అంత భయపడ్తే ఎలా?.. ఈ వేళ పార్కుకి వెళ్ళి కాలక్షేపం చేసేస్తాం. బాగానే ఉంది...రేప్తేనా మా నాన్నగారితో చెప్పాల్సిందే గదా..." సీరియస్ గా అంది చిన్నమ్మాయి.
"అంతేనంటావా రజ్జూ..."
""కాదంటావా? పద లోపలికి వెళ్దాం.
"ఎవరమ్మాయ్ వచ్చారు?..." అంటూ అప్పడే లోపలి నుండి వరండాలోకి వచ్చి చిట్టబ్బయిని చూశాడు రంగనాయకులు "హొరి నువ్వటోయ్... ఇక్కడే నిలబడ్డారేం మాయాదరి సంత... లోపలికి రండి..." అన్నాడు ఆయన నవ్వుతో....
"లోపలికి కం బాబుగారూ ... లోపలికి కం" అన్నాడు అప్పడే బయటికి వచ్చిన భీమయ్య కూడా.
"ని ఇంగ్లీషు సంతకెళ్లా... తెలుగులో మాట్లాడరా బాబూ...లేకపోతే అతనికి అర్ధం కాదు" భిమయ్యతో అన్నాడు రంగనాయకులు.
భీమయ్య సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు.
"నేనింగ్లిషులో మాట్లాడితే మా ఆడదానికిష్టం బాబూ, ఆ ఇసయం తమకి తెల్సుకదు బాబు?"
"నీ ఆడది ఇక్కడ లేదుగాని, నువ్వు తెలుగులోనే మాట్లాడు మాయదారి సంత"
"ఎస్ బాబూ" బుర్రకాయ ఊపాడు భీమయ్య.
"లోపలికి పోదాం పదండి" అంటూ రంగనాయకులు గుమ్మంవ్తెపు అడుగులు వేశాడు. చిట్టబ్బాయి చిన్నమ్మాయి భీమయ్య అతన్ని అనుసరించారు.
అందరూ హల్లో కూర్చున్నారు.
అవునుగాని... మీ ప్రెండ్ రాలేదేంటోయ్ -?" చిట్టబ్బయిని అడిగాడు రంగనాయకులు.
"అబ్బే...అదేం కాదండి. నేను పొరబాట్న అట్లా అన్నాను... ఈ మధ్య మా కన్నారావుగాడు చాలా బిజీగా ఉంటున్నాడు... అందుకే మీ ఇంటికి రావడం లేదు.."
తడబడుతూ అన్నాడు చిట్టబ్బాయి.
"బిజియా? అన్నట్టూ నువ్వు బిజీ అంటే గుర్తుకొచ్చింది. మీ వాడు వట్టి జులాయిలా ఉన్నాడే!..."
అబ్బెబ్బే మీరు పొరబాటు పడ్తున్నరండి వాడు అలాంటివాడు కాదు..." అన్నాడు చిట్టబ్బాయ్..
"అలాంటివాడు కాదని అంటావేం? నిన్న నేను కళ్ళారా చూస్తేనూ మాయదారి సంత!"
"ఏం చూశారు?" ఆతృతగా అడిగాడు.
"ఓ అమ్మాయిని వేంటేస్కుని రొడ్ల మీద చక్కర్లు కొడ్తున్నాడు...బిజీ అంటే అదేనా? దరిద్రం సంత?"
చిట్టబ్బాయ్ కంగారుపడిపోయాడు.
"ఓ...అదా? ఆ విషయం గురించి నిన్న నాకు చెప్పాడండి వాడు. నిన్నేమో, వాడు రోడ్డు మీద నడుస్తుంటే ఒకమ్మాయి వాడి వెంట పది ఎడిపించిందట. విడసలె అమ్మయాకుడు కదా? అందుకే అమ్మాయిలకి కూడా అలుసన్న మాట!! మీరేమో దూరం నుండి చూసి వాళ్ళిద్దరూ కల్సి వెళ్తున్నారని అనుకున్నారు! అవునా? హిహి.." ఆన్నాడు చిట్టబ్బాయి గబగబా.
చిట్టబ్బాయి కంగారు చూసి చిన్నమ్మాయి ఫక్కున నవ్వింది.
"అదేంటండి, లేడిసు అబ్బాయిల్ని ఫాలోయింగేవిటండి? ఇసిత్రంగా" హిహి అన్నాడు భీమయ్య.
"మాయదారి సంత...నాకు హరికథలు చెప్పకు... మీ ప్రెండు ఆ అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తుంటేనూ...?" అన్నాడు రంగనాయకులు.
"ఏమోనండి మరి! అలా చెయ్యి పట్టుకుని నడవకపోతే ఏమ్తెనా చేస్తానని ఆ అమ్మాయి మావాడిని బెదిరించిందేమోనండి. అసలే మావాడు అమాయకుడు కదా మరి?!!" బుర్ర గోక్కుంటూ అన్నాడు ఫక్కున నవ్వింది.
చిట్టబ్బాయి అవస్ధ చూసిన చిన్నమ్మాయ్ ఫక్కున నవ్వింది.
అంతలో ట్రేలో కాఫీ కప్పులతో చాముండేశ్వరి హాల్లోకి వచ్చింది. ఆమె కొంగు పట్టుకుని పండు కూడా వచ్చాడు. భీమయ్య గబగబా వెళ్ళి ఆమె చేతిలోని ట్రేని అందుకున్నాడు.
