Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 49

 

    "ఏం బాబూ బాగున్నావా?" పలకరించింది చాముండేశ్వరి.

    "బాగున్నానండి..." అన్నాడు చిట్టబ్బాయి.

    భీమయ్య అందరికి కాఫీలు అందించడు.

    కాఫీ తాగడం అయ్యాక రంగనాయకులు చిత్తబ్బాయిని అడిగాడు "ఇంకా ఎవిటోయ్ విశేషాలు?"

    "అబ్బే!కొత్తగా విశేషాలేమి లేవండి" అన్నాడు చిట్టబ్బాయ్.

    "అదేమిటి ఏమి లేవంటావ్?...మా నాన్నగారితో ఏవిటో చెప్పాలని అన్నావుగా?" అంది చిట్టబ్బాయ్  వంక చురుకుగా చూస్తూ చిన్నమ్మాయ్.

    "ఊర్కే అన్న. ఏమి లేదు హిహి..."  అన్నాడు జేబులోంచి రుమాలు తిసి మొహం తుడుచుకుంటూ చిట్టబ్బాయి.

    "ఆయన ఊర్కే అలా అంటున్నారు నాన్నా... ఆయనకీ అసలే మొహా మాతం ఎక్కువ..." చిట్టబ్బాయ్ వంక కోపంగా చూస్తూ అంది చిన్నమ్మాయ్.

    "మొహమాటం ఎందుకు బాబూ చెప్పు..."అంది చాముండేశ్వారి.

    "చెప్పవోయ్...ఆడపిల్లలా సిగ్గుపడ్తావెం మాయదారి సంత" అన్నాడు రంగనాయకులు.

    "టెల్ బాబుగారు టెల్?" అన్నాడు భీమయ్య.

    "చెప్పండి...." గట్టిగా అంది చిన్నమ్మాయి.

    "మాయదారి సంత నోట్లోంచి మాట రాదేంటోయ్."

    "చెప్పు బాబూ..."

    "టేల్లండి బాబుగారూ..."

    చిట్టబ్బాయ్ రంగనాయకులు,  చాముండేశ్వరి వంక బెరుకుగా చూశాడు. రెండు క్షణాలు తటాపటాయించి గుండె చిక్కబట్టుకుని గొంతు పెగుల్చుకున్నాడు.

    "మరేమో మీ అమ్మాయి ఉంది కదండి. మరేమో నేను ఉన్నాను కదండి అంటే నేనూ చిన్నమ్మాయి అన్నమాట!!! అయితే ఏమ్తెంధంటే ముందు అదో ఇదిగా అదిగా..."
    చిన్నమ్మాయ తలకాయ పట్టుకుంది.

    "ఎటండి బాబు ఆ ప్తెత్తె కారి టాకంగూ హిహిహి" అన్నాడు భీమయ్య.

         "చెప్పేదేదో సరిగ్గా చెప్పవోయ్ ఎంటా నాన్చుడు దిక్కుమాలిన సంత.." కళ్ళు చిట్లించి చూస్తూ అన్నాడు రంగనాయకులు.

    "అదేనండి చిన్నమ్మాయి ఉంది కదండి.  అప్పడేమొనండి నేనేమో మరి..." అరిచేతుల్లో  పట్టిన చెమటని పంట్లాంకి  తుడుచుకుంటూ నసగాసాగాడు చిట్టబ్బాయ్.

    "అంకుల్! నా కోసం ఏం తేచ్చావంకుల్?" మధ్యలో అడ్డుతగుల్తూ అన్నాడు పండు.

    "అరెరె! నీకోసం ఏమి తేలేదే. పదపద... మనిద్దరం ఏమ్తెనా కొనుక్కోచ్చు కుందాం" సోఫాలోంచి చటుక్కున లేచాడు చిట్టబ్బాయ్.

    "హయ్...హయ్..." అంటూ గంతులేసి చిట్టబ్బాయి చేయిపట్టకున్నాడు పండు.

    చిన్నమ్మాయి చటుక్కున లేచి పండు  చేయి పట్టుకుని తనవ్తెపుకి  లాక్కుంది. "నిక్కావల్సినవి నేను కొనిపెడ్తాగాని అంకుల్ ని వదిలి పెట్టు. అంకుల్ కి నాన్నగారితో మాట్లాడే పనుంది" అంది.

    చిట్టబ్బాయి  బిక్కమొహం వేశాడు. అతని కాళ్ళు క్షణం  పాటు గడగడా వణికెయ్. గుండె లాబ్ డబ్...లాబ్ డబ్ అని కొట్టుకోడానికి బదులు బుడుంగ్ బుడుంగ్ అని కొట్టుకోసాగింది.

    "కూర్చోవోయ్ ఎంతసేపలా నిల్చుంటావ్ మాయదారి సంత?" అన్నాడు రంగనాయకులు.

    "అబ్బాయిగారికి సిట్టింగుకి కూడా మొహమాటామే సీత బాబుగారూ సిట్" నవ్వూతూ అన్నాడు భీమయ్య.

    చిట్టబ్బాయి మెల్లగా సోఫాలో కూర్చుంటూ గుండెలమీద చేతులేసుకున్నాడు.

    "ఏంటి బాబు... గుండెల్లో నొప్పా?" కంగారుగా అడిగింది చాముండేశ్వరి.

    "కాదండి. నా గుండె బుడుంగ్ బుడుంగ్ అని శబ్ద్జం చేస్తుంటేనూ" అన్నాడు చిట్టబ్బాయి వెర్రి మొఖం వేస్కుని.

    "అరెరె...అలాగ్తెతే డాక్టరు  దగ్గరికి వెళ్ళకూడదా బాబూ? ఎప్పటి నుండి  ని గుండెకాయ ఇలా బుడుంగ్ బుడుంగ్ అని శబ్దం చేస్తుంది...?"

    "ఇప్పడే అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత అవసరం ఏమిలేదండి. మీ ఇంటి నుండి వెళ్ళగానే తగ్గిపోతుంది..."

    "భలేవాడివే! ఆరోగ్యన్నిలా అశ్రద్ధ చేస్తావేం దరిద్రం సంత?... వెంటనే డాక్టర్ని  కన్సల్టు చెయ్ అలా బుడుంగ్ బుడుంగ్ అని ఎందుకంటుందో?" అన్నాడు రంగనాయకులు.

    "అబ్బే అక్కర్లేదండి బాబుగారూ. ఇదివరకోపాలి నా గుండెకాయి కూడా అట్టాగే సౌండింగ్ సేసిందండి. నా పెళ్ళి కాకముందు దాన్తో 'ఒసే నువ్వంటే నాకిట్టవే...' అని చెప్పేముందు నా గుండెకాయ కూడా అట్టాగే బరువుగా బుడుంగ్ బుడుంగ్ అని శబ్దం చేసిందండి. మరి అబ్బాయిగారి మనసులో ఎటుందో ఏమో గుండెకాయ అట్టా సౌండింగ్ చెయ్యడానికి?" అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చిట్టబ్బాయి వంక చూస్తూ భీమయ్య.

    చిట్టబ్బాయి సిగ్గుతో తల వోంచుకున్నాడు.

    "అలా సిగ్గుపడ్తే ఎలానోయ్...నీ మనులో ఏవుందో చెప్పూ మాయదారి సంత!!!" అన్నాడు రంగనాయకులు.

    చిట్టబ్బాయి చిన్నమ్మాయి వంక చూశాడు. చిన్నమ్మాయి చిట్టబ్బాయ్ కి చెప్పమన్నట్టు స్తెగా చేసింది.

    చిట్టబ్బాయి  ఓసారి గొంతు సవరించుకున్నాడు. తరువాత జేబులోంచి రుమాలు తిసి మొహం తుడుచుకున్నాడు. ఆ తరువాత రెండు చేతుల్తో గుండెకాయని తడుముకున్నాడు.

    అందరూ ఆతృతగా చూస్తున్నారు  అతనేం చెప్తాడోనని.

    "మరేమో మీ చినమ్మాయి ఉంది కదండి. మరేమో నేను కూడా ఉన్నాను.  చిన్నమ్మఎమో చాలా మంచిదండి. మరేమో చిన్నమ్మాయి కూడా నేను మంచివాడ్ననే అనుకుంటుంది. అందుకనే  చిన్నమ్మాయికి  నేనంటే మంచివాడ్ననే అనుకుంటుంది. అందుకనే చిన్నమ్మయికి  నేనంటే ఇష్టమండి..."బిక్కమొహం వేస్కుని చెప్పసాగాడు.

    "మీరంటే నాక్కూడా ల్తెకింగేనండి హిహి" వెంటనే ఆన్నాడు భీమయ్య.

    "అంకులంటే నాక్కూడా ఇష్టమే..." అన్నాడు పండు జేబులోంచి బఠానీలో, శనగలో తిసి నోట్లో వేస్కుంటూ.

    చాముండేశ్వరి రంగనాయకులువ్తెపు తిరిగి అంది "కుర్రాడు బుద్దిమంతుడు  కదండి"

    రంగనాయకులు అవునన్నట్టు తల ఊపుతూ  అన్నాడు "నాక్కూడా నువ్వంటే ఇష్టమేనోయ్..."

    "నాక్కూడా బాబూ" చాముందేశ్వతి వంతపాడింది.

    అందరూ అలా అంటుంటే చిట్టబ్బాయి సిగ్గుతో మెలికలు తిరిగిపోసాగాడు.

    వాళ్ళందర్నీ చూస్తుంటే చిన్నమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది.

    "అబ్బబ్బ! ఆయనేదో చెప్తుంటే ఏమిటి చెప్పనివ్వకుండా మీరంతా అడ్డుతగుల్తారు ?" అంటూ విసుక్కుంది.

    "సర్లె...సర్లె... ఆ... నువ్వు చెప్పవోయ్...." అన్నాడు రంగనాయకులు చిట్టబ్బాయి వంక చూస్తూ.

    "మరేమో మీ అమ్మాయుంది కదండి... నేనేమో మీ అమ్మాయికి ప్రెండునండి.. ఫ్రెండంటే ఫ్రేండని  కాదు గాని...అదోరకమ్తెన ల్తెకింగ్ అంటే అందర్నీ ల్తేక్ చేస్తామే అలా కాదండి...అసలు ల్తేకింగంటే  నా ఉద్దేశంలో..."

    చిన్నమ్మాయి రెండు చేతుల్తో తల పట్టుకుంది.

    "చల్లేవోయ్  దిక్కుమాలిన సంత! నీకు ఏ విషయమూ సరిగ్గా చెప్పడం రాదనుకుంటూ నువ్వు ఏం చెప్పదల్చుకున్నవో ఇంటికెళ్ళి బాగా గుర్తు చేస్కుని దాన్ని బట్టి పట్టి  రేపొచ్చి చెప్పు సరేనా?" అన్నాడు రంగనాయకులు.

    "ఆ అబ్బాయినంటున్నారుగాని ఇందాకట్నుండి నోరు మెదపకుండా  కూర్చున్నరేం? ఆ అబ్బాయిని ఏంటో అడుగుతానని అన్నారుగా?" అంది వ్హర్తని మోచేత్తో పొడుస్తూ చాముండేశ్వరి.

    "అదేనోయ్ మా అమ్మాయి గురించి ని అభిప్రాయం ఏంటి?"  కళ్ళేగుర వేస్తూ చిట్టబ్బాయ్ ని అడిగాడు రంగనాయకులు.

    "మీ అమ్మాయి చాలా మంచిదండి..."

    "నికిష్టమేనంటావ్"

    "అవునండి..."సిగ్గుపద్తూ తల వంచుకుని అన్నాడు.

    "మా అమ్మాయిని నికిచ్చి వివాహం చేయాలనీ మా ఉద్దేశ్యమోయ్ ని అభిప్రాయం ఏంటి?"  చటుక్కున అడిగాడు రంగనాయకులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS