Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 47

    "ఊర్కే అంటున్నారు కదూ?"

    "లేదు. నిజంగానే అంటున్నా"

    "నాకు ఈతరాదే! ఎలా?" బిక్కమొహం వేసి అడిగాడు.

    "ఎలా అంటే నేనేం చెప్పను? నీళ్ళలో దూకమంటే దూకుతా అని మీరేగా అన్నారు?" అతని కళ్ళలోకి  చురుకుగా చూస్తూ అడిగింది ఆమె.

    కన్నారావు ఇబ్బందిగా నవ్వాడు.

    "అంటే, నాకు దూకడానికి అభ్యంతరం ఏమి లేదుగాని మళ్ళి నేను చచ్చిపోతే మీరు జీవితాంతం బాధపడ్తారు కదా అని ఆలోచిస్తున్నా" అన్నాడు.

    "నేనెందుకు బాధపడ్తానూ?.... మీరు నాకేమవుతారని..."

    "అయితే అస్సలు బాధ పడరా?"

    "మీ కేదో సర్ధపుట్టి దూకుతుంతే మధ్యన  నాకెందుకు బాధ?"

    కన్నారావు ఆముదం తాగిన మొహం పెట్టాడు.

    ఆమె పక్కున నవ్వింది.

    "పోన్లెండి...మీరేం దూకనక్కర్లేదు...ఇంకేప్పడూ అలా చెయ్యలేని పనులు చేస్తానని డబ్బా కొట్టకండి..." అంది నవ్వాపుకుంటూ.

    కన్నారావు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

    "అంటే దూకలేనని కాదుగాని...మీరు అనవసరంగా బాధపడ్తరేమోనని.... అందుకని గాని లేకపోతే..." అంటూ మెల్లగా చెప్పసాగాడు.

    "అదిగో...మళ్ళి డబ్బా కొట్టాలని ప్రయత్నిస్తున్నారు... ఇలాగ్తెతే మళ్ళి దూకమంటా..." బెదిరిస్తూ అంది ఆమె.

    కన్నారావు గత్యంతరం లేక ఓ వెర్రి నవ్వు నవ్వి ఊర్కున్నాడు.

    "నేనింక వెళ్తానండి.." అడుగులు ముందుకు వేస్తూ అంది అమ్మాయి.

    "అయితే మీ పేరు చెప్పరా?" ఆమెని అనిసరిస్తూ అడిగాడు కన్నారావు.

    "ఊహు! నా కండిషనుందిగా?... నా చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్తేనే మీకు నా పేరు చెప్తాను."

          "పోన్లే... ఈసారి నా లక్ ఎలా ఉందో ట్రై చేస్కుంటా...మీ చిక్కు ప్రశ్న ఏంటో చెప్పండి...సర్తెన జవాబు చెప్పడానికి  ట్రై చేస్తా"

    ఆ అమ్మాయి గొంతు సవరించుకుంది.

    "ఒక వ్యక్తి తూర్పు నుండి పడమర దిక్కుకి వెళ్ళి అక్కాడ నిల్చుని బుర్ర గోక్కుని అక్కడి నుండి దక్షిణం దిక్కుకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించి, అక్కడి నుండి ఉత్తరం  దిక్కుకి వెళ్ళి జేబులో చెయ్యి పెట్టుకుని రెండు నిముషాలు  నిల్చుని మళ్ళి తూర్పు  దిక్కుకి  వెళ్ళి మెడని అటూ ఇటూ ఆడించి చిరునవ్వు నవ్వాడు... ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు?"

    కన్నారావు ఆమె వేసిన చిక్కు ప్రశ్న వింటూనే చిరునవ్వు నవ్వి "ఏది మళ్ళి ఓ సారి చెప్పండి!" అన్నాడు ఫోజుకోడ్తూ.

    ఆమె ప్రశ్నని మరోసారి చెప్పింది.

    "ఓస్ ఇంతేనా?" అన్నాడు కన్నారావు.

    "అలా తేలిగ్గా తిసిపారేయ్యకండి.... దీనికి సమాధానం చెప్పండి చూద్దాం.." చాలెంజ్ చేస్తూ అంది ఆ అమ్మాయి.

    "మరి సమాధానం చెప్తే మీపేరు తప్పకుండా చెప్తారుగా?"

    "మీరు కరెక్టు ఆన్సర్ చెప్పినప్పుడు కదా?... మీరు జావాబు చెప్తే నేను తప్పకుండా నా పేరు చెప్తాను..."

    "ప్రామిస్?"

    "ప్రామిస్!..."

    "అయితే చెప్తా వినండి...ఎవరిష్ట మొచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తారు. దానికి ఖచ్చితమ్తెన  కారణం ఉండాలా?... ఇదే మీ ప్రశ్నకి సమాధానం..." నవ్వాడు కన్నారావు.

    ఆ అమ్మాయి ఆశ్చర్యంగా కన్నారావు వంక చూసింది.

    "అంత కరెక్టుగా సమాధానం ఎలా చెప్పగలిగారు?" అంటూ అడిగింది.

    "ఎలాగోలా చెప్పాను... మీరు మాత్రం మీ మాటను నిలబెట్టుకోండి... మీరు చెప్పండి" అన్నాడు కన్నారావు.

    "చెప్పవలసిందేనా?"

    "మాట నిలబెట్టుకోరా?" అడిగాడు.

    "నా పేరూ ...నా పేరూ..." ఊరించింది.

    "ఊ...త్వరగా చెప్పండి...ప్లీజ్" కంగారు పెట్టాడు కన్నారావు.

    కన్నారావు సంతోషంతో గట్టిగా కేకేపెట్టాడు.

    అతను అరిచిన  ఆ అరుపుకి ట్యాంక్ బంద్ మీద వేయించిన చేప ముక్కలు తింటున్న  కొందరు ముళ్ళతో సహా మింగేసి, చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుని బేర్ మన్నారు.
ఒక స్కూటరిస్తు కంగారుపది  బ్యాలెన్స్ అవుటయ్యి ఎదురుగా వస్తున్న ఒక ఆటోని  గుద్దేశాడు. ఒక డబుల్ డెక్ బస్సు సడెన్ బ్రేకుతో ఆగిండి. డ్రైవర్ కంగారుగా బయటికి తొంగిచూసి విష్యం ఏమి అర్ధంకాక బుర్ర గోక్కుని  బస్సుని ముందుకు పరిగెత్తించాడు.

    "ఏం బాబూ?...మీ వాళ్లేవర్తెనా ఇక్కడ నుండి నీళ్ళలోకి తొంగిచూస్తూ.

    "అబ్బే...లేదండి...." అన్నాడు కన్నారావు ఇబ్బందిగా చూస్తూ.

    "మరెందుకు అంత గట్టిగా అరిచారు?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఆ వ్యక్తి.

    "అంటే మరేమో! కాస్త  సంతోషం కలిగి" సిగ్గుపద్తూ అన్నాడు కన్నారావు .

    ఆ వ్యక్తి కన్నరావుని. కాంతామణిని మార్చి మార్చి  చూశాడు.

    "అంత సంతోషంగా ఉంటే  మనుషులు లేని ఏ మారుమూల ప్రదేశంకో వెళ్ళాలి గాని... ఇలా అందరూ తిరిచోట నడిరోడ్లో  అలా అరిస్తే ఎలా?.. ప్రమాదం కదూ?"

    కన్నరావుని మందలించి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.

    ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా నిల్చుని వున్నారు. కన్నారావు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.

    "నా పేరేమో కన్నారావు...మీ పేరు కాంతామణి,  కన్నారావు...కాంతామణి. ఇద్దరి పేర్లూ ఎంత చక్కగా మ్యాచ్ అయ్యయో కదండి..."అన్నాడు కన్నారావు.

           "అదలా ఉంచండి..., నా ప్రశ్నకి మీరు కరెక్టు సమాధానం ఎలా చెప్పారో చెప్పరూ?" అడిగింది కాంతామణి.

    కన్నారావు నావ్వాడు.

    "ఈ ప్రశ్నని మీరు ఇదివరకే నాకు వేశారు. అప్పుడు నేను సమాధానం చెప్పకపోతే జావాబు మిరే చెప్పారు. మీరు మర్చిపోయి మళ్ళి ఆ ప్రశ్నని ఇప్పుడు వేశారు..."

    "అన్యాయం..." అంటూ అరిచింది కాంతామణి.

               *                           *                         *

    రోజులు చాలా జాలిగా గడిచిపోతున్నాయి  చిట్టబ్బాయి కన్నరావులకి. ఇద్దారూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో సినిమాలకి, పార్కులకి, రెస్తారేంట్లకి  ఝాం అంటూ తిరిగేస్తున్నారు.

    ఆ రోజు సాయంత్రం ఆరుగంటల్తెంది.

    చిన్నమ్మాయి వరండాలోకి వచ్చి రోడ్డుకి ఆ చివరదాకా చూసింది.

    "ఛి...ఇంక రాలేదు" అనుకుంది.

    అరగంట నుంచి ఆమె ఇంట్లోకి వరండాలోకి బోలెడన్ని సార్లు తిరిగింది. ఆ రోజు చిట్టబ్బాయి ఇంటికి వచ్చి  తండ్రితో తనని ప్రేమిస్తున్నట్టు  చెప్పి పెళ్ళాడటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్తానని చెప్పాడు.

    అందుకే చిన్నమ్మాయికి ఆ ఆతృత!

    లోపలికి వెళ్ళబోతూ రోడ్డు వంక చూసిన చిన్నమ్మాయి కళ్ళు మెరిసాయి.

    విధి మొదట్లో వస్తూ కనిపించాడు చిట్టబ్బాయి.

    చిన్నమ్మాయి విధి గేటు దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళింది. గేటు మీద ఆనుకుని  చిత్తబ్బాయిని చూస్తూ సంతోషంగా చేయి ఊపింది. చిట్టబ్బాయి కూడా చెయ్యి ఊపాడు.

    చిట్టబ్బాయి మెల్లగా కాళ్ళు ఈడుస్తూ గేటు దగ్గరికి వచ్చాడు.

    "ఎంతా పెళ్ళి నడకలు?... కాస్త త్వరగా నడవలేవూ? ఇందాకట్నుంచి  ఎంతగా ఎదురుచూస్తున్నానో తెల్సా!" చిరుకోపంతో అంది చిన్నమ్మాయి.

    చిట్టబ్బాయి ఏమి అనకుండా ఓ చిరునవ్వు  నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS