"నిజంగానే బర్త్ డే అని తెలీదు. లేకపోతే ముందే వెళ్ళమని చెప్పేవాన్ని యం.ఎం.డి.కి....అరే! ఇప్పుడెలా...." అంటూ ఆలోచనలో పడ్డాడు శ్రీచరణ్.
ఆమాత్రానికే సంతోషపడిపోయింది ప్రనూష మనసు.
"ఏ మాత్రం వీలున్నా పని ముగించుకుని రావడానికి ట్రై చేస్తాన్లే.....సరేనా.....?" "నిజంగా నిజం....?" అన్నాడు సిన్సియర్ గా.
"అయితే సూట్ కేస్ సర్దుతావు పద..." అంది సంతోషంగా.
* * *
అన్నీ ఇద్దరూ దగ్గరుండి సర్ధసాగారు.
"తనని కూడా రమ్మంటే, ఈయనగారి సొమ్మేం పోయిందో..." అనుకోసగైంది ప్రనూష మనస్సులో.
"తనని తీసుకెళ్ళమని అడగొచ్చుగా....ఊహూ....తన తనతో ఎందుకొస్తుంది." అనుకుంటున్నాడు శ్రీచరణ్.
మొత్తానికి అరగంటలో సర్దేశారు సూట్ కేస్ ని "వెళ్ళొస్తా ప్రనూ! జాగ్రత్త. ఒంటరిగా ఉంటావ్. అసలే అమాయకురాలివి..." అన్నాడు ఆఖరి మాట వత్తి పలుకుతూ.
"తమరే భయపడక్కర్లేదు నా గురించి" అంది బుంగమూతి పెడ్తూ.
"ఓహో! ఝాన్సీ రాణి చెల్లివి, కిరణ్ బేడీ (ఫ్రెండ్ వి నీకు భయమేంటి నా మొహం...అనవసరం నేను భయపడుతున్నాను గానీ."
"నిన్నూ...." చేతిలోని దువ్వెన విసిరేసింది.
"హు! ఇది కాబట్టి బతికిపోయావు. ఏ ఫ్లవర్ వాజో విసిరేస్తే చార్జ్ చేద్దును..."
మరోటి చేతికందింది విసరబోయింది. కానీ అప్పటికే బయటకి నడిచాడు గబగబా శ్రీచరణ్.
"శుక్రవారం రావడం మర్చిపోకు" అంది చేయి ఊపుతూ ప్రనూష.
* * *
ప్రనూషకి శ్రీచరణ్ కేంప్ కి వెళ్ళడంతో చెప్పలేనంత చిన్నబోయింది. ఇంట్లో ఉన్నంత సేపు ఏదో ఒకటి వెక్కిరించుకుంటానో, ఏడిపించుకుంటూనో ఉండేవాళ్ళం. "ప్చ్! యమ బోర్ కొడుతోంది" అనుకోసాగింది పదేపదే.
శుక్రవారం రానే వచ్చింది.
ఆరోజు ఉదయం ఐదుకే లేచింది. గబగబా తలంటుకుని శ్రీచరణ్ కోసం ఎదురు చూడసాగింది. కొత్త చీర ఉన్నా కట్టుకోలేదు. శ్రీచరణ్ వచ్చాక కట్టుకోవచ్చని.
అతనికిష్టం అని వడ, పాయసం చేసింది.
ఆఫీస్ టైం అయిపోతోంది గానీ అతనూ రానేలేదు.
జడ వేసుకుంటోంది ఆలోచిస్తూనే "ఎందుకని రాలేదు అవున్లే, తను కట్టుకున్న పెళ్ళామే గానీ, మనసుకు ఇష్టపడిన పెళ్ళాన్ని కాదు కదా! అందుకే వచ్చి వుండడు. అనుకోసాగింది.
అప్పుడే ఫోన్ మోగింది వెళ్ళి ఎత్తింది.
"సారీ ప్రనూ! రాలేకపోయాను. ఎన్ని వే మెనీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
* * *
"థాంక్స్ ..." అంది పొడిగా."
ఏంటి కోపమా?" "నాకేం కోపం లేదు...."
"నీ మాటల్లోనే తెలుస్తోంది. నీ బుంగమూతి ఆహా ఎంత ముద్దొస్తుందో, ఓసారి అద్దంలో చూసుకో..."
"అద్దం నిన్ననే పగిలిపోయింది."
"ఓ సారీ, ఏంటి ఇవాళ తవురి ప్రోగ్రాం కొత్త చీర కట్టుకున్నావా? లేక బర్త్ డే డ్రెస్ లో వున్నావా?" అన్నాడు కొంటెగా నవ్వుతూ ఫోన్ లో.
"ఛీ....ఛీ.....ఫోన్ లో కూడా వెధవ జోకులే..." అంది ముఖమంతా ఎర్రబడగా.
"టెలిఫోన్ డిపార్టు మెంటు వాళ్ళకి లేని సెన్సార్ నీ కెందుగ్గానీ....ఇంతకీ కొత్త చీర కట్టుకున్నావా, లేదా.....?"
"ఆ! మరే తమరుకొనిపెట్టి వెళ్ళారుగా ఇక్కడ. అదే కట్టుకుని మురిసిపోతున్నా..."
"రాక్షసి ఒక్కటి కూడా సరిగ్గా సమాధానం చెప్పవ్. తిక్కదానివి."
"ఏయ్! కనీసం బర్త్ డే రోజన్నా తిట్టకుండా వుండు..." అంది దబాయిస్తూ.
"సర్లే గానీ, ఇంకేంటి?"
"ఇంకేంటో నీకెందుకు చెప్పాలి నువ్వు రానప్పుడు అంతే...."
"ఒక్కసారి వెళ్ళి డోర్ తీసి చూడు...." అన్నాడు. "ఎందుకు?"
"చూడవోయ్.... నే చెప్తున్నా గా...?"
"హే.....! పో! ఎవరూ బిల్ కొట్టందే...?" అంది.
"పిచ్చిమొద్దూ! సరే ఇప్పుడు మోగుతుంది వెళ్ళి తియ్యి..."
అతని మాట పూర్తి కానే లేదు. కాలింగ్ బెల్ కంటిన్యూగా మోగసాగింది.
ఆశ్చర్యంగా వెళ్ళింది ఫోన్ పక్కన పెట్టి డోర్ తియ్యడానికి.
డోర్ తెరవగానే ఎదురుగా శ్రీచరణ్ నవ్వుతూ సెల్ ఫోన్ లో.
"చరణ్ నువ్వా..... ఇది నిజమా?" ఆశ్చర్యపోతూ అంది ప్రనూష.
"యస్..... నిజంగా నేనే...."
"మరి ఫోన్ లో....."
ఈ సెల్ ఫోన్ తో చేశాను. తమరు నేను రాలేదనుకొని అలిగి....కోప్పడి..."
"హే... సారీ....అయామ్ వెరీ సారీ. పుట్టిన రోజని రమ్మని చెప్పినా రాలేదనుకొని."
"అనుకొని....బాధపడ్డావ్....నువ్వు చెప్పాక రాకుండా ఉంటానా?"
"థాంక్యూ థాంక్స్ ఎలాట్.....రా! ముందు లోపలికి వెళ్తాం." అంది పక్కనున్న సూట్ కేస్ అందుకుంటూ.
"త్వరగా స్నానం చేసి వస్తాను. ఆకలి దంచేస్తోంది...." అన్నాడు.
"ఓ......కె......ఓ......కె. అన్నీ రెడీ నీదే ఆలస్యం...." అంది హుషారుగా ప్రనూష.
"అవునూ ఇంతకీ కొత్త చీర కట్టలేదేం?"
"ఏవిటో చరణ్! నువ్వు లేవు. వూ అమ్మ, నాన్న దగ్గర్నుండీ కూడా కనీసం ఫోన్ రాలేదు. అబ్బె ఎంత లోన్లీగా ఫీలయ్యానో తెలుసా?" గడగడా చెప్తూంటే ముచ్చటగా గుమ్మానికి చేతులానించి వింటున్నాడు శ్రీచరణ్.
ఏదో అనబోయాడు.
ఇంతలో ఫోన్ మోగింది.
వెళ్ళి తీసింది ప్రనూష ఆత్రంగా.
"హాయ్! అక్కా మెనీ హాపీ రిటర్న్ ఆఫ్ ది డే" అవతలి నుండి ప్రియ గొంతు.
ప్రనూష కళ్ళలో వెయ్యి కాంతులు.
ప్రియ, తల్లీ, తండ్రీ అందరూ పది నిమిషాలు మాట్లాడారు. అప్పుడు గానీ తృప్తి అనిపించలేదు ప్రనూషకు.
హమ్మయ్య! తనకెవరూ లేరనుకుంది. అందరూ వున్నారు. అనుకోగానే హామీగా అనిపించింది.
ఈలోగా శ్రీచరణ్ తలస్నానం ముగించి వచ్చాడు. సూట్ కేస్ తెరిచి గిఫ్ట్ ప్యాకెట్ తీశాడు.
అది అలానే పట్టుకుని వంటింట్లోగా వెళ్ళాడు. ప్రనూష టిఫిన్ రెడీ చేస్తోంది.
"ప్రనూ! ఈ శ్రీచరణ్ నీకివ్వగలిగిన చిన్నకానుక....."అన్నాడు మనస్పూర్తిగా.
"ఛ.....నేను ఊర్కే అన్నానులే ఏదైనా తీసుకురమ్మని...."
"మరే నేనూ ఊర్కే తెచ్చానులే..."
"ఇప్పుడీవన్నీ ఎందుకు?" అంది అందుకుంటూనే.
"తీస్కో..... మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడుంటావో, ఎలా ఉంటామో! అన్నాడు విషాదంగా మొహంపెట్టి.
