అలాంటి కామాక్షి షాకింగ్ న్యూస్.....అతని బావ మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం....
అందరూ ఓదారుస్తున్నారు.
ఓదార్చడం సులువైన పనే....అయితే ఆ ఓదార్పు ఎదుటి వ్యక్తికి అసలైన ఉపశమనం కలిగించడమే కష్టం.
కామాక్షి ఇప్పుడా విషమ స్థితిలో వుంది బావ కోసం ఆశగా బ్రతికే ఆ అమ్మాయి.
రేపట్నుంచీ ఏ ఆశతో బ్రతకాలి? అని ఆమె ముందున్న అయోమయంగా శ్లేష ప్రశ్న.
ప్రసూనాంబ భారంగా నిట్టూర్చింది.
కామాక్షిలా ఆశలు, కోరికలు అందరికీ వుంటాయి. అయితే అవి తీరే అవకాశం, సందర్భమూ కొందరికే ఉంటుంది. మనం కోరుకున్న వ్యక్తి మనకు అద్న్హుబాతులో లేనప్పుడు, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి, మనం అందుబాటులో వుండాలి. ఇది నా అనుభవం మీద ఈ ప్రపంచంలో అవకాశవాదులు ఎంతమంది ఉంటారో...? అత్యాశతో తను జీవితాలు చెల్లాచెదురు చేసుకునేవాళ్ళు అంతమందే ఉంటారు. జీవితంతో రాజీపడ్డం నేర్చుకున్నప్పుడు ఏ సమస్య మనల్ని ఏమీ చేయలేదు" అంది ఓదారుస్తూ ప్రసూనాంబ.
కామాక్షి ఆ షాక్ లో నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది.
అంతకన్నా కామాక్షి విషయంలో షాక్ తిన్నది ప్రనూష, ప్రేమలో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా?
కామాక్షికి వాళ్ళ బావ రాసిన ఉత్తరాలు కొన్ని చదివింది. కామాక్షి బలవంతమ్మీద ప్రనూష అప్పట్లో.
ఎంతో ప్రేమను కురిపించి ఉత్తరాలు రాసేవాడు. నువ్వు లేకుండా బ్రతకలేవు అనేవాడు. ఎప్పుడెప్పుడు అమెరికా నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి నీ ముందు వాలాలా? అన్న ఫీలింగ్ కలుగుతోందని రాసేవాడు.
అలాంటి వ్యక్తి ఈ రోజు?
ప్రేమంటే ఇంత చులకనా?
రేపు ప్రభాత్ ప్రేమకూడా?
అసలు తనకు పెళ్ళి అయిందని తెలిస్తే...?
ఇన్ని సందిగ్దాల మధ్య నలిగిపోయి ప్రనూషకు చెప్పలేనంత హెడేక్ అనిపించింది.
బ్యాగ్లో నుండి టాబ్లెట్ తీసి వేసుకుని మంచి నీళ్ళు తాగింది.
* * *
"ఏంటీ....ఎంత వరకూ వచ్చింది నీ అన్వేషణ?" ప్రనూష గదిలోకి తొంగి చూసి అడిగాడు శ్రీచరణ్.
"ఊ....వైజాగ్ వరకూ వచ్చింది. నీకేమైనా అభ్యంతరమా?" అంది.
"ఇంకేం.....అక్కడ ఓ మెంటల్ ఆసుపత్రి ఉంది. అందులో జాయిన్ అయితే సరి...." రిటార్ట్ ఇచ్చాడు శ్రీచరణ్.
"యూ..." అంటూ పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ విసిరేసింది కోపంగా ప్రనూష.
ఆ హ్యాండ్ బ్యాగ్ శ్రీచరణ్ కు తగిలి కిందపడింది. అందులో వున్న మేకప్ సామాను, చిల్లర కిందపడ్డాయి.
"హమ్మో....చిల్లర మాలక్ష్మీ....మేకప్ సామాను మాలక్ష్మీ...." అంటూ కిందకి వంగి, నేలమీద పడ్డ ఓ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు.
అది ప్రభాత్ ఫోటో".
"ఈ కొండముచ్చు ఎవరు?" అడిగాడు ఫోటోను పరిశీలనగా చూస్తూ శ్రీచరణ్.
ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎంతకాదన్నా, శ్రీచరణ్ తన భర్త, తాము విడిపోబోతున్నా, పరాయి మగాడి ఫోటో తన బ్యాగులో...
వెంటనే సర్దుకుని.... "నీకెందుకు?" అంది.
"నాకెందుగానీ.....మొన్నెప్పుడో 'జు'లో ఓ కొండముచ్చు తప్పిపోయిందంటేనూ...."
"అది కొండముచ్చు కాదు. గ్లామర్ హీరో ఫోటో" అంది. ఎక్కువ నవ్వాడు.
"ఈ ఫేసా? మాన్ ఫేక్చరింగ్ డిఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూంటే...బహుళ నీకు పైటుందేమో...వాటే బ్యాడ్ సెలక్షన్ అయినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లా వుంటారు. బెస్ట్రాఫ్. ఛ...ఛ...బ్యాడాఫ్ లక్...." అన్నాడు.
"అబ్బో నీ సెలక్షన్ అద్దిరిపోతుంది కాబోలు..."
"మరే నీలా పట్టు చీరలూ...బామ్మటైపు రవికెలూ వేసుకోదు."
"అవునవును....ఆకులు చుట్టుకుని.....గొట్టం ప్యాంటు వేసుకుంటుంది కాబోలు..."
"మరే...... ఆ ఫోటోలోని కొండముచ్చు చూడు.....మహేష్ ఆనంద్ కు తక్కువ, రామిరెడ్డికి ఎక్కువ...."
"మరే....నీక్కాబోయే ఆవిడ ఎలా వుంటుందో? హెలెవ్ కు తక్కువ, జ్యోతిలక్ష్మికి ఎక్కువా?"
"ఛీ.....ఛీ.....నీతో మాట్లాడ్డం నాదే బుద్ది తక్కువ "థాంక్స్....ఓ జీవిత సత్యం తెలుసుకున్నావు...."
వెల్ కమ్..." అని ఓసారి ప్రభాత్ ఫోటోని చూపి "వా....క్. డోకొస్తోంది" అన్నాడు.
కోపంగా లేచింది. శ్రీచరణ్ తన గదిలోకి పరుగెత్తాడు జరగబోయే డామేజీ ఊహించి.
* * *
ఓనాల్రోజుల తర్వాత శ్రీచరణ్ ఆఫీసు పనిమీద చెన్నయ్ వెళ్ళవలసి వచ్చింది.
"ఏయ్ ప్రనూ....నేనర్జంటుగా టూర్ వెళ్ళాలి గానీ, ఫ్లయిట్ సెవన్ కే. సూట్ కేస్ సర్దిపెట్టు..." అన్నాడు ఆఫీసు నుండి రావడం తోనే.
"ఏయ్...ఒళ్లెలా ఉంది? నేనెందుకు సర్దాలీ....?" అంది.
"ఏయ్ మొద్దు ఎంత కాదన్నా, నువ్వు నా భార్యవే. కనీసం ఇలాంటి పన్లన్నా చెయ్యవే..." అన్నాడు గడ్డం పట్టుకుని బ్రతిమిలాడ్తూ.
"అక్కడ కాదు పట్టుకుని బ్రతిమాలాల్సింది?" "మరి ఇంకెక్కడ పట్టుకోవాలి...?" కన్నుకోడుతూ అన్నాడు.
శ్రీచరణ్ "ఛీ....ఛీ....ఇలా డబుల్ మీనింగ్ డైలాగులంటే నేనసలు సర్ధను గాక సర్ధను...."
"మా బుజ్జి...... మా చిట్టివి కదూ....." బ్రతిమిలాడాడు గడ్డం పట్టుకుని. "మరి నే చెప్పింది చెయ్యాలి" అంది కండిషన్ పెడుతూ.
"నువ్వు చెప్పాలేగానీ, నేనుదేనికైనా రెడీ...." అన్నాడు మళ్ళీ కన్నుకొట్టి కాలర్ పైకెత్తి.
"మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగ్స్.....ఛీ...." అంది ప్రనూష.
"అదేం కాదులేగానీ, చెప్పు.....ఏం చెయ్యాలీ?" అన్నాడు గంభీరంగా ఈసారి.
"చెన్నయ్ నుండి వచ్చేప్పుడు ఓ మంచి గిఫ్ట్ ఏదైనా తీసుకురా?" అంది.
"ఓ.....కె......ఓ.....కే......ఏం కావాలి?" నిజంగా సిన్సియర్ గానే అడిగాడు. ఈసారి
"నీ ఇష్టం. నాకేదిష్టమో తెల్సుకుని తే.....అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావటం....?
"వారం రోజులు...." ఫైల్స్ చూసుకుంటూ అన్నాడు.
"అయితే నా బర్త్ డేకు ఉండవా నువ్వు?" లెక్కలేసుకుంటూ అంది.
ఫైల్స్ పక్కన పడేసి...." ఎప్పుడు బర్త్ డే....?" అన్నాడు.
"వచ్చే శుక్రవారమే...... ఆ రోజుకి వచ్చెయ్యకూడదూ పోనీ?" అంది అప్రయత్నంగా.
