"బోడి లెక్చరర్ ఉద్యోగానికి అంత టెక్కు ఎందుకో?"
విష్ణు మరేం మాట్టాడకుండా గుమ్మం దాటాడు.
అంతే.......
చివాలున అతని దారికి అడ్డు వచ్చింది నందిని.
'అంటే ఏంటి నీ ఉద్దేశం......నా మానాన నేను మాట్టాడుతూనే వున్నాను.....అసలు నా మాటలేవీ వినిపించనట్టు అలా వెళ్ళిపోతావెంటి?"
"ఇక చెప్పడానికేముందని నేను ఆగాలి?" అంతే స్పీడుగా జవాబుచ్చిడు.
"నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు.'
"ఎందుకని?"
"కారణాలు అడక్కు....నాకు ఇష్టం లేదు.....అంతే"
"నీ ఇష్టంతో నాకు పనిలేదు. నా ఉద్యోగం నా ఇష్టం."
"గో టూ హెల్...........ఎంతయినా మొగుడిని కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నువ్వేమీ ఉద్యోగం చేసి ఇక్కడ ఎవరినీ పొషించనవసరం లేదు. నువ్వు తెచ్చే జీతం నా ఒక్కరోజు ఖర్చుకు సరిపోదు. నీ ముష్టి సంపాదనతో ఇక నన్నేం పోషించగలవు. అందుకే చెబుతున్నాను వద్దని."
"నీకు తాళి కట్టినందుకు సిగ్గుపడుతున్నాను నందినీ......"
"ఓహో.......ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్న మాట నీకు......"
'పిచ్చిపిచ్చిగా మాట్టాడకు....కనీసం భర్తకు ఇవ్వవలసిన కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు నువ్వు. నీ దృష్టిలో మొగుడంటే చులకన, పెంపుడు కుక్క కన్నా హీనంగా చూసే నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించే వాళ్ళ విలువ. నీ బాబు సంపాదించి కుప్పపోసి నిన్ను మహరాణిలా ఖర్చు పెట్టమని నిన్ను పట్టించుకోవడం మానేశాడు.
"అందుకే నువ్వు బరి తెగించావు. నీ పాపిష్టి డబ్బు ఎవడికి కావాలి? నీతో ఉంటున్న ఖర్మ కొద్దీ నా తిండి తిప్పల కోసం అయినా నేను ఉద్యోగం చేయక తప్పదు. నా సంపాదనే నేను ఖర్చు పెట్టుకుంటాను తప్ప నీ డబ్బు రూపాయి కూడా నేను తాకను.'
"ఆ మొండి తనమే నా ముందు చూపవద్దంతున్నాను మిస్టర్..."
"నందిని .....నువ్వు నాచేత తాళి కట్టించుకున్నంత మాత్రాన, నా మీద సర్వ హక్కులూ నీకు వచ్చేశాయని భ్రమపడకు. నీకు ఇష్టం వున్నా లేకపోయినా నేను ఉద్యోగం చేసి తీరతాను.'
"నీ అక్కలకు ఐదు లక్షలు ఇచ్చి నిన్ను మొగుడిగా కొనుక్కున్నాను. నేను డబ్బు పెట్టి కొనుకున్న దానిపై నాకు హక్కు లేదంటే ఎలా? ఈ ఇంట్లో మాత్రం నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా క్షమించేది లేదు..."
'అందుకే ........ఆ ఉపకారం నీ తండ్రి చేశాడనే కృతజ్ఞత వలనే నీవు ఎన్ని మాటలు అంటున్నా కట్టుబడి నాకు నేనుగా బలిపశువుగా నీ ముందు నిలిచానే తప్ప మరొకరయినట్టయితే తల వంచేవాడినేకాదు....బహుశా నేను ఉద్యోగం చేయడం నీకు నామోషి కావచ్చు. పరువు తక్కువైపోవచ్చు....అయినా నా వ్యక్తిత్వాన్ని నేను వదులుకోలేను. నా సంపాదనలోనే నేను పిడికెడు అన్నం తినాలి తప్ప స్వార్ధంతో కూడబెట్టిన నీ పాపిష్టి సొమ్ము పెట్టె అన్నం నాకు సహించదు.....'
విసురుగా చెప్పిన విష్ణు ..........ఆమె సమాధానం వినడానికి కూడా నిలవకుండా వెళ్ళిపోయాడు.
* * * *
"మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం సరే..మీరు కాలేజిలో అడుగుపెట్టిన రోజు నుంచీ మిమ్మల్నే నా కళల రాకుమారుడిలా ఊహించుకున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు తోలి చూపులోనే మీ పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకున్నాను. నాకు తెలియకుండానే మీరంటే ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది. ఒక్కరోజు మిమ్మల్ని చూడనిదే వుండలేకపోయేదాన్ని. ప్రేమ అంటే అదేనని అప్పుడు తెలిసింది నాకు. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న సత్యాన్ని ఇప్పుడు మీ ముందు బయట పెడుతున్నాను, నాకు మీ అనుభూతి కావాలి...
మీ ఆదరణ కావాలి.......మీ సన్నిహితం కావాలి.....మీ ప్రేమ కావాలి......అందుకే సిగ్గు విడిచి చెబుతున్నాను ఐ లవ్ యూ......"
స్టాపిట్ ఐసే.........స్టాపిట్.......యూనో......యూ ఆర్ అమీ స్టూడెంట్"
"తెలుసు , కానీ నా మనసులో మీరు స్థానం ఏర్పరచుకున్న రోజున మీరేమిటో తెలియకుండానే నామానసు నిండా మీ రూపాన్నే ముద్రించుకున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమించాలి. ....నాకు కావలసింది ఇదే....ప్లీజ్" ఆమె దీనంగా అభ్యర్ధిస్తున్నది.
"నీ అంతట నువ్వు నీ మనసులో ఏదేదో ఊహించుకుని నన్ను ప్రేమిస్తున్నాననడం విడ్డురంగా వున్నది.'
"అవును.....మీకు విడ్డురంగానే వుంటుంది. ఎందుకంటే మీరంటే నాకు పిచ్చి ప్రేమ, మీరు లేనిదే నేను జీవించలేను. మీ మనసులో నాకు చోటు లేదని తెలిస్తే నాకు ఈ చదువూ వద్దు. ఈ జీవితమూ వద్దు. నాకు కావలసింది మీ మనసులో చోటు మాత్రమే. మీ నుంచి అనురాగంతో లాలిత్యాన్ని మాత్రం కోరుకుంటున్నాను తప్ప నేనేమీ కోరరాని కోరికను కోరడం లేదు కదా........మీ ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. మీరు కాదంటే నేను మీకే కాదు. ఎవరికీ కనిపించనంత దూరంగా , అసలు ఈ లోకాన్నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతాను."
కిరణ్మయి గొంతు గాద్గిదికం అయి...కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
'వ......ద్దు.........వద్దు పిచ్చిపిల్లా......అంతపని చేయవద్దు.'
"ఐయాం సారీ.....కిరణ్మయి నేను నిన్ను ప్రేమించలేను...అసలు నేను ఎప్పుడూ నిన్నా దృష్టిలో చూడలేదు........"
"మాస్టారు అయితే మీరు నన్ను చూడడం ఇదే ఆఖరుసారి. కిరణ్మయి అనే అల్పాయుష్కురాలు మిమ్మల్ని ప్రేమించిన నేరానికి తనకు తానే బలై పోయిందని మీ డైరీలో నా చివరి మాటగా రాసుకోండి" అంటూ విసురుగా లేచింది.
ఖంగారుగా ఆమె చేయి పట్టి ఆపాడు విష్ణు.
ఆ అదటుకు తూలి ఒడిలో పడింది కిరణ్మయి.
