ఇప్పుడు కూడా అతనికి స్పృహ కలగలేదు. అతను సినిమా చూడడంలో పూర్తిగా లీనమైపోయాడు.
అమె కళ్ళకి ఏమీ కనిపించడంలేదు. హీరో హీరోయిన్ లు అరుచుకుంటున్నా, విలన్ల గ్యాంగ్ ని హీరో మట్టి కరిపిస్తున్నా ఏమీ వినిపించడం లేదు. తన శరీరాన్ని, లొంగదీసుకుంటున్న అతని స్పర్శను అమె మనస్సు అనుభవిస్తోంది.
శరీరం, మనసూ రెండూ కలిపి అంతగా ఎంజాయ్ చేసే మధురమైన క్షణం అంతకుముందెప్పుడూ అనుభవించిన గుర్తు కూడా లేదామెకు.
అమెకు మొత్తం తన ఎదనంతా అతనిలో గుచ్చెయ్యాలన్న వత్తిడి శరీరాన్ని అతి తీయగా తోస్తోంది. అతని ఛాతిలో తన శరీరాన్ని చుట్టెయ్యాలనిపిస్తోంది.
అతని బలమైన చేతుల్లో తన అవయవాలు పొడుంకింద చిట్లిపోతే ఎంతో బావుండనిపిస్తోంది. అతని దేహం వత్తిడికింద తన అందం చితికిపోతే అనుభవించాలనుకుంది మానస.
తన సౌందర్యం అంతా అతని వెచ్చటి శ్వాస కింద అవిరైపోతే ఆ ఆశ్చర్యాన్ని రుచిచూడలనుంది. అతని బలానికి తన వయసు చిదిమిపోతే ఆ విచిత్రాన్ని ఫీలవ్వాలనుంది. అమె ఈసారి అన్నీ మరిచిపోయి నవ్వుతున్నట్టు మెల్లిగా పక్కకి కదిలి బలంగా తన వక్షాన్ని అదిమింది.
ఒక్కసారిగా శరీరమంతా సుఖానికి చీలిరేణువుల్లా గాల్లో సాగిపోతున్నట్లనిపించింది. ఏదో అయిపోయినట్టు అమె మొత్తంగా ఎగిరిపడింది. తిరిగి మామూలుగా కూర్చుంది. అప్పుడే ఇంట్రెవెల్ లైట్లు వెలిగాయి.
ఎవరెవరు ఎక్కడ కూర్చుందీ అప్పుడు గమనించుకున్నారు. అందరూ, బాబు అయితే వాళ్ళపక్కన వాళ్ళతో సమానంగా కూర్చోవడం ఎంత తప్పో వెలుగులో తెలుస్తోంది. తప్పుచేశానన్న భావన కలిగింది. అందుకే అందరివైపు చూస్తూ జీవంలేని వెర్రి నవ్వొకటి నవ్వాడు. అప్పటికే సీటు మార్చేద్దామని చూశాడుగాని, మరెక్కడా ఖాళీ వున్నట్లు అన్పించడంలేదు.
చీకట్లో అయితే కూర్చోవడం ఇబ్బందిగా అనిపించదని తనకుతనే సర్దిచెప్పుకుని సినిమా మొదలయ్యాక రావచ్చని బయటికి నడిచాడు. ఇంట్రెవెల్ లో పిల్లలంతా ఏదో తినిబండరాలు కావాలని ఏడిస్తే వాళ్ళందర్ని రామారావు బయటికి తీసుకెళ్ళాడు.
కాంచనమాల చివరలో కూర్చునుంది. అమె పక్కన సుమిత్ర. ఆ తరువాత పిల్లలు. వెనక వరుసలో మరికొంతమంది పిల్లలూ, రామారావూ కూర్చున్నారని మానస కనిపెట్టింది. తనకి అర్చెంటుగా సీటు మారిపోవాలనిపించింది మానసకి. అంత సుఖంతో శరీరం తృప్తిపడడం లేదు. ఇంకా ఏదో కావాలన్న ఆరాటం, అవేశం శరీరాన్ని ముద్దలా నలిపేస్తున్నాయి.
సుఖాన్ని ఓపలేని మనసు ఇంకా కావాలన్న కోరికతో ఉండలు చుట్టుకుపోతోంది. ఆ వత్తిడినుంచి బయటపడాలంటే సీటు మారాలి. కానీ షడన్ గా సీటు మారితే కూడా అనుమానం రావచ్చు. అందుకే తెలివిగా కాంచనమాల పక్కనున్న సుమిత్ర దగ్గరికి వచ్చి - " నా ముందు ఎవరో తాగుబోతు వున్నట్టున్నాడు. ఒకటే వాసన. కళ్ళు తిరుగుతున్నాయి" అంటూ కూర్చుంది.
" సరేలే... ఎవర్నైనా పిల్లోడ్ని పంపుతా" అంది సుమిత్ర.
ఇంట్రవెల్ అయిపోయి సినిమా మొదలైంది. సీటు మారినా మానస మాత్రం సినిమాలో లీనం కాలేకపోతోంది. అమెకి సురేష్ వర్మ గుర్తొచ్చాడు.
" బావా ! ఈ వయసు అల్లరిని భరించలేకపోతున్నాను . నీలో ఐక్యం అయిపోవాలన్న గాఢమయిన కోరికతో ఈ శరీరం, నువ్వు కావాలన్న ఆరాటంతో మనసూ నగిలిపోయేలా వున్నాయి మరి. మనం పెళ్ళి చేసుకుందాం బావా" అని అతన్ని అర్ధించాలనిపిస్తోంది. అమెకి తెలియకుండానే అమె కళ్ళల్లో నీళ్ళు వూరాయి.
ఇక అమె ఆ భావాలనుంచి తేరుకోలేకపోయింది.
సినిమా అయిపోయింది. బండి కదిలింది.
బాబు వెనక కూర్చోకూడదనుకుంటూనే అక్కడే కూర్చోవలసివచ్చింది. దానికి కారణం వున్న జనంకంటే మరో ఇద్దరు ఎక్కువయ్యారు. వాళ్ళిద్దరూ బంధువులు అవుతారు. సినిమాకొచ్చారు. తాము బండ్లో వస్తామంటే కాదనలేకపోయాడు రామారావు బండి కదిలింది.
ఈసారి అమె ప్రమేయం ఏమీ లేకుండానే బాబు వీపు అమె భుజానికి తగులుతోంది. అమె మనసు దానిని ఎంజాయ్ చేయకపోయినా శరీరం మాత్రం అతను తనకి తగిలినప్పుడంతా మదురంగా మూలుగుతూ వుంది.
ఎప్పుడూ గలగలాదూకే జలపాతంలా వుండే మానస అలా ఘనీభవించినట్టు అయిపోవడాన్ని కాంచనమాల ఒక్కర్తే గుర్తించింది. అతని వీపు తగిలినప్పుడంతా అమె శరీరం గగుర్పొడడం కాంచనమాల కని పెట్టింది.
* * *
"ఏవండి మహానుభావా! లేవండి...లేవండి." కాంచనమాల తట్టిలేపడంతో మెలకువ వచ్చింది గోపాల్రావుకి.
కళ్ళు విప్పి చూసాడు.
తను కలగంటున్నాడో , మేల్కొని వున్నాడో క్షణం సేపు అర్ధం కాలేదు. తనని నిద్రలేపింది తన భార్య కాంచనమాలో లేక గంధర్వకన్యో అంతుబట్టటం లేదు. అమె అంత అందంగా, అంత అద్భుతంగా వుంది మరి.
అంత తెల్లవారిపూట అమె అంతగా ఎందుకు తయారయిందో తెలియడం లేదు గోపాల్రావుకి. ఏమిటి కథ అన్నట్టు అమె వంక చూశాడు.
"ఇదుగోనండి కాఫీ. లేచి త్వరగా రెడీ కండి. మనమంతా కలిసి వెంకటగిరి వెళ్ళాలి" అంటూ చేతిలో వున్న కాఫీగ్లాసు అతనికి అందించింది.
"వెంకటగిరికా ఎందుకు?" అడిగాడతను.
"బంగారం కొనడానికి. రాత్రి మా శేఖర. రత్నామాల మనింటికి వచ్చారు కదా" అన్నదామె.
అప్పటికి గుర్తొచ్చింది గోపాల్రావుకి. రాత్రి అలస్యంగా వచ్చాడు తను. అప్పుడే హడావుడంతా తగ్గి, ఎవరికి వారు నిద్రపోవడానికి గదుల్లోకి వెళ్ళారు.
"రత్న, శేఖర్ వచ్చారు. సాయంకాలం నుంచీ ఒకటేపని మీరే వడ్డించుకుని తినండి- నేవెళ్ళి పడుకుంటాను" అని కాంచనమాల కూడా వెళ్ళిపోవడంతో ఇక చేసేదేమీలేక వడ్డించుకుని తినడం గుర్తొచ్చింది.
ఇక అంత రాత్రిపూట ఏం పలకరించడమని గెస్ట్ లను చూడకుండానే వచ్చేశాడు. అదొక్కటేకాదు- శేఖర్ అంటే పెద్ద ఇష్టం కూడా లేదు. అయితే ఇందులో అతని తప్పేంలేదని కాంచనమాలవల్లే తనకి అతనిమీద ద్వేషం ఏర్పడిందని గోపాల్రావుకి తెలుసు.
రత్నమాల కాంచనమాల చెల్లెలు, రత్నమాల పెళ్ళి చూపులకి కాంచనమాల కూడా పుట్టింటికి వెళ్ళింది.
పెళ్ళిచూపుల్లో ఒకరికొకరు నచ్చారు . అన్నీ మాట్లాడుకుని ఓ,కె చేసుకున్నారు. కాంచనమాల తిరిగి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి గోపాల్రావు దగ్గర తన చెల్లెల్ని చేసుకునేవాడు ఎంత గొప్పవాడో చెప్పింది.
"శేఖర్ ఎంత బావుండాడనుకున్నారు? ఆబ్బో- చూస్తూ వుంటే అందరికన్నా నా దిష్టే ఎక్కువ పడినట్లనిపించింది. ఎంత చలాకీగా ఉన్నాడనుకున్నారు.జింక పిల్లయినా అతనితో పోటిపడితే వెనక్కి తగ్గాల్సిందే!
మొత్తమీద అతనిలో నాకు బాగా నచ్చింది ఏమిటో తెలుసా? అతని వయసే. ఇరవై రెండో, ఇరవై మూడో వుంటాయనుకుంటాను" మురిసిపోతూ అందామె.
