Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 47


    
    అయితే దీనికి శివరావు ఒప్పుకోలేదు. "మనిషి మనసు మాంసం దగ్గిర తెలుస్తూందంటారు. అలాంటి  ఏసాలేం వద్దు------ పంక్షన్ మనది. గ్రాండ్ గా జరిగిపోవాల. మనం ఎలా చేసిందీ నలుగురూ చెప్పుకోవాల" అని అయన అమె ప్రపోజల్స్ ని కొట్టిపారేశాడు.


    పొట్టేలు మాంసం పొయ్యిమీదకి ఎక్కింది. మసాల ఘుమఘుమలు ఆ తోటంతా చుట్టుముడుతున్నాయి.


     మరి ఇంత జేసావ్- అది లేదా?" అంటూ కొంతమంది రామారావు దగ్గిర చేరారు.


    "తెప్పించుకోండి. కానీ లిమిట్ లో వుండండి. లేకుంటే మా మామ నామీద ఎగిరిపడతాడు" అని క్వార్టర్ బాటిల్ చొప్పున ఎంతమంది ఉన్నారో లెక్కవేసిచ్చాడు. వాళ్ళంతా ఒకర్ని టౌన్ కి పంపించారు. మందు బాటిల్స్ తెమ్మని. ఒకరిద్దరు, తామే స్వయంగా వెళ్ళారు మధుపాన సేవకి.


    ఒకవైపు వంటపనులు చేస్తూనే, మానస దారివైపు చూస్తోంది. సురేష్ ఏమైనా వస్తున్నాడేమోనని. కానీ అతని జాడ లేదు. మధ్య మధ్యలో వెళ్ళి బాబు దగ్గిర తన నిరసననంతా తెలియజేస్తోందామె.


    " ఏం మనిషీ? ఏమిటంత రాచకార్యాలు ? ఛీ!ఛీ! ఇలాంటి వ్యక్తిని ప్రేమించడం నాదీ బుద్దితక్కువ"


    " భోజనంవేళకి తప్పకుండా వస్తాడులేమ్మా" వాడు అమెలో ఆశ చావకుండా చెబుతున్నాడు.


    దేవుడి మొక్కులు, బందువుల చదివింపులు తదితర కార్యక్రమాలన్నీ అయ్యేసరికి ఒంటిగంటయ్యింది.


    అప్పటికి అందరూ మందు ముగించారు. వాళ్ళు మాత్రం విందు కోసం అవురావురుమంటున్నారు.


    మందు వాసనా, మటన్ వాసనతో, ఆ ప్రాంతమంతా దేవుడికి మొక్కినట్టులేదు. వనభోజనానికి వచ్చినట్టుంది.


    భోజనాలైపోయాయి. బండ్లలో వచ్చినవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందరికి వడ్డించి అడవాళ్ళు తినేటప్పటికి మూడైపోయింది. అందరూ అలసిపోవడంతో ఎక్కడివాళ్ళక్కడ నడుంవాల్చారు. ఆరుగంటలకి చల్లబడింది. బండ్లు కట్టారు.


    పంక్షన్ ఎలా జరిగిందో అన్నదానిమీద మాటలు జరుగుతుంటే మానస మాత్రం సురేష్ వర్మ మీద తన ప్రేమనంతా చెబుతోంది బాబు దగ్గర.


    ఆరున్నరకు బండ్లు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాయి.


    సినిమా వాల్ పోస్టర్ చూడగానే సుమిత్ర సినిమాకు వెళితే బావుండన్నది. దాంతో మానస వంతపాడింది. కొందరు వెళ్ళాలన్నారు. ఇంకొందరు ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. దాంతో ఒక బండ్లో ఇంటికి వెళ్ళాలనుకున్నవాళ్లు వెళ్ళిపోవచ్చన్నారు. మిగిలిన వాళ్ళకోసం బాబు బండిని ఉండిపొమ్మన్నారు. మగాళ్ళలో బాబూ, రామారావు ఇద్దరే వున్నారు. మిగిలిన వాళ్ళు నలుగురు స్త్రీలు నలుగురు పిల్లలూ ఉన్నారు.


    అందరికి రామారావే టికెట్లు తీశాడు.


    మొత్తంమీద వీళ్ళు వెళ్ళేసరికి లోపల లైట్లు లేవు. న్యూస్ రీల్ జరుగుతోంది. గేట్ మేన్ టార్చ్ లైట్ వేసి కుర్చీలు చూపించాడు. వెళ్ళి కూర్చున్నారు.


    తన పక్కన బాబు వున్నట్టు గుర్తించింది మానస.


    " మీ ఓనర్ సినిమాకు వచ్చాడేమో చూడరా" అంది మానస చిన్నగా వాడి చెవిలో.


    అలాగేనమ్మా- ఇంట్రెవల్ లో చూద్దాం" వాడు చిన్నగా నవ్వుతూ అన్నాడు.


    అందరూ సినిమా చూడడంలో పడిపోయారు. అది కామెడి సినిమా జనమంతా ఎంజాయ్ చేస్తున్నారు.


    ఓసారి బాబుకి మరీ నవ్వొస్తే మనిషంతా కదిలాడు. అలా కదలడంతో అతని చెయి అమె తొడమీద పడింది. అతను గుర్తించలేదు గాని అమె గుర్తించింది.


    కరెక్టుగా ఆరోజు బస్తా పడుతూ చేయి తగిలినప్పుడూ గుండె ఎలా ఝల్లుమందో అలాగే అయింది. శరీరమంతా ఏదో తెలియని మధురమైన సుఖం. పారి మనసుని ఒక్కసారిగా కుదిపేసింది. నవ్వాక తిరిగి వెంటనే అతను చెయ్యి తీసుకున్నాడుగాని అమె మాత్రం ఆ తరువాత సినిమా చూడలేకపోయింది. మరోమారు అతని చెయిపడితే బావుండననిపించింది.


    ఈసారి చేయివేయలేదుగానీ ఏదో కామెడి సీన్ లో " భలే వుందమ్మా సినిమా" అంటూ అమె మీదకి వంగి చెప్పాడు. అతను అలా అమె మీదకి వంగినప్పుడు ఆ మేల్ నెస్ ని అమె ఫీలయింది.


    మగవాడి స్పర్శకి ఓ అడపిల్ల రియాక్షన్ అంతే, ఇందులో మనసుపడడం, ప్రేమించడం, అబిమానించడం లాంటివి ఏవీలేవు. స్పర్శకు స్పర్శ అంతే.


    అమెకి అతనికి మరికొంత సాన్నిహిత్యంగా జరగాలనిపించింది. అయినా అలా జరగడానికి ధైర్యం చాలడంలేదు. ఏదో తెలియని భయం. జంకు వెనక్కి లాగుతున్నాయి. కానీ శరీరం మాత్రం అమె మనసుమాటని వినడంలేదు. అది పులిలాంటిది మరి.


    దానికి అకలివేస్తే అది చిన్న జింకపిల్లయినా, కుందేటి పిల్లయినా అనవసరం. మీదపడి కొరికి తినేస్తుంది. శరీరం కూడా అంతే. దానికి అవసరమొస్తే ఇంకేది చూడదు. మరో శరీరం కోసం తపిస్తుంది.


    అమె కుర్చీలో సర్దుకున్నట్టు కదిలి మెల్లగా అతని పక్కకి జరిగింది. ఇప్పుడు అతని భుజం తగిలీ తగలనట్టు అమెకి తగులుతోంది. అక్కడ పుట్టిన తరంగాలు మత్తుగా శరీరమంతా వ్యాపిస్తున్నాయి.


    అమె ఈసారి మరింత ధైర్యంచేసి ఓ పక్కకి తిరిగి కూర్చుంది. ఈసారి అమె ఎద అతనివైపుకు తిరిగింది. అతను  ఏమాత్రం కదిలినా అతని శరీరం అమె ఎదను వక్షాన్ని అదుముతుంది. దానికోసం అమె మొత్తం శరీరం ఎదురుచూస్తోంది. మరో కామెడీ సీన్ నడుస్తోంది. ఇప్పుడు అతను వెనక్కి వాలి బిగ్గరగా నవ్వుతాడనీ, ఆ సమయంలో అతని భుజమంతా తన ఎదకి తగులుతుందనీ మనసులో అనుకుంది అమె.


    కానీ అమె అంచనా తప్పయింది. అతను ముందుకు జరిగి నవ్వుతున్నాడు. మొత్తం శరీరం ఏడ్వడమంటే ఏమిటో అప్పుడు తెలిసింది అమెకి. ఈసారి మరింత జరిగింది. అతని పొజిషన్ లో మార్పులేదు.


    తనే మారి కాస్తంత జరిగింది. ఇప్పుడు అమె ఎడమ ఎద అతనికి తగులుతోంది. నాతికి కుంజిమరాసి చెలరేగినట్టు ఏదో మత్తు రేగుతోంది అమెలో. తన ఇరవై ఆరేళ్ళ వయసులో ఎప్పుడూ అనుభవించనిది. శరీరంలోని కణాలన్నీ ఒక దగ్గర చేరిపోయి, ఆ సుఖాన్ని అనుభవిస్తోన్నట్టు అన్పిస్తోంది. ఆ సుఖం ఇంకాస్త కావాలని శరీరం మూలుగుతున్నట్టు తోస్తోంది.


    అమె తన ఎదను అటే పెట్టుకొని వుంది. అతని భుజం మరికాస్తంత ఒత్తుకుంటోంది. ఈసారి అడ్డు తగులుతున్న పైటను సరిచేసుకుంటున్నట్టు కదుపుతూ, ఎడమవైపుకి పడకుండా సర్దుకుంది.


    జాకెట్టు మాత్రం వున్న ఎద ఎడమభాగం ఇప్పుడు అతనికి అనుకూలంగా తగులుతోంది.. నరాలను నిప్పంటుకున్నట్లు ఏదో సుఖం శరీరాన్ని వెడెక్కిస్తోంది. రక్తమంతా చిక్కనైనట్టు తెలియరాని అనుభూతి. ఇంకా ఏదో కావాలన్న ఆరాటం అమెలో మొదలైంది. అదేమిటో అమె శరీరానికే తెలుసునన్నట్టు అవి వింత వింత ప్రకంపనాలకు లోనవుతోంది.


    అతను నవ్వుతూ పక్కకు జరిగాడు. ఇప్పుడు అతని భుజం అమె ఎత్తుకు తగిలి లోపలకంటూ గుచ్చుకుపోయింది. ఒక్కసారిగా తనమీద మల్లెపూలవాసన కురిసినట్టు, మంచుకొండ చిట్లి తను కూడా ఎప్పుడూ పరిశీలించి చూసుకొని తన అవయవాల్లోకి శరీర మూలల్లోకి పడినట్టు, సముద్రమంత అవేశాన్ని కౌగిట్లో బంధించినట్టు అమె ఎద ఒక్కసారిగా పొంగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS