Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 47

                              44. మలబద్దకాన్నిపోగోట్టటంఎలా?
   
    రెండు రోజుల తరువాత సుఖ విరోచనం అవడంతో రామయ్యకి హాయిగా ఉన్నట్టుఅనిపించింది. అయినా రేపటి గురించి బెంగా మాత్రం పోలేదు. మళ్ళీ రేపు విరోచనం అవుతుండో, అవదోఎలాగా అనే దిగులు ప్రారంభం అయింది. రిటైరు అయిపోయిన అనంతరామయ్య, రోజులో సగంసమయాన్ని ఆ ఆలోచానలతోనే గడిపేస్తున్నాడు.

    అనంతరామయ్యకే కాదు, చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్యే. కొందరికి రెండు మూడు రాజులకిగాని విరోచనం కాకపోతే, మరికొందరికి ఎనిమా చేసుకుంటేనో, మాత్ర మింగితెనో తప్ప విరోచనంకాదు. ఎవరికో కొందరికి నాలుగైదు రోజులుకిగాని విరేచనం కాకపోతే సమస్యగా పరిణమించిందని భావించవచ్చు. కాని ఏదో ఒక రోజు విరేచనం అవలేదని ఆలోచిస్తూ బాధ పడిపోయేవారూ లేకపోలేదు. ఇలాంటివరు ఒక రోజు విరేచనం కాకపోయినా ఆకలి అవనట్లు, తలనొప్పి వచ్చినట్లు కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు, బుర్ర తిప్పుతున్నట్లు అనిపించి అందోళన చెందుతూ ఉంటారు. వారు ఎ రోజు కారోజు విరోచనం కాకపోతే అందంతా రక్తంలోకి చేరి రక్తం విషంగా మారుతుందని భావిస్తారు.

    ఇటువంటి వ్యక్తులు ఒకటి_ రెండు రోజులు విరోచనం అవ్వకపోయేసరికి ఎనిమా చేసుకునో, మాత్రవేసుకునో విరేచనం అయిందనిపిస్తారు. దాంటో తలనొప్పితగ్గి, కడుపుబ్బరంపోయి హాయిగా ఉన్నట్లు అనండుసతారు. వైద్యశాస్రరీత్యా మూడు, నలుగు రోజులపాటువిరోచనం కాకపోయినా, ఏమీ అనరావుగ్యం కలగదు. కాని మలబద్ధకం ఉన్నవాళ్ళూ భావించే బాధలన్నీ విరోచనం కాలేదని అతిగా ఆలోచించి కానప్పుడు కొద్దిగా తలనొప్పి అనిపించవచ్చు, లేదా కడుపులో కాస్త బాధ అనిపించవచ్చు. అంటేకాని. ఇంతకు మించి ఎటువంటి శారీరిక రిగ్మతులు కలగవు.

    మలబద్ధకం రావడానికి కడుపులో పేగులు సక్రమంగా కదలకపోవడం ఒక కారణం కాగా, మన అలవాట్లను అదుపులో ఉంచకపోవటం, ఆహార నియామలను సక్రమంగా పాటించక పోవడం మరొక కారణం. అరుదుగా కొందరిలో థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేయకపోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. సాధారణంగా జ్వరం వచ్చిన తరువాత ఒకటి_రెండు రోజుల పటు విరేచనం అవదు. దీనికి కారణం జ్వరం వచ్చినపుడు ఆహారం తీసుకొనక పోవడమే. అలాగే కడుపు నిండా తగిన భోజనం చేయనివారుకికూడా రోజూ సరిగ్గా విరేచనం కాదు.యగినంత ఆహారం తీసుకుంటే తప్ప. తగినంత మలం ప్రయనిమ్చాతానికి అనుకూ;లత ఉండదు. మలంతావుపెగులు నిండినపుడే పెద్ద పెగులోని కండరాలు పనిచేస్తాయి.

    ఆహారంతో పాటు తగినంతఎక్కువ నీరు తాగడం కూడా అవసరం. నీరు పేగుల మెడ ఒత్తిడి కలిగించి, విరోచనం అయ్యేటట్లు చేస్తుంది. సెల్యులోజ్ ఎక్కువ శాతంలో ఉండే, దంపుడు, బియ్యం, తిరగలి బియ్యం, ఆకుకూరలు, ఇవిగాక అరటిపళ్ళు ఇతర రకాల ఫలాలు పెద్దపేగును కాడిలేటట్లుచేసి, సక్రమంగా రోజూ విరేచనం అయ్యేటట్లు చేస్తాయి. నాజ్జూగ్గాతాయారవుతామని ఆహారం చాలా తక్కువుగా స్వీకరించే యువకులలో రోజూ విరేచనం కాకపోవడానికి కారణం, తగినంత ఆహారం తీసుకోకపోవడమే!

    విరేచనం అవడానికి పేగు కదలికతో పాటు పొట్టకు సంభందించిన కండరాలు, మలద్వారం దగ్గర వుందే కండరాలు కూడా ముఖ్యపాత్ర ధరిస్తాయి. విరేచనం అయ్యే సమయంలో, ఇవి కూడా బలంగా పెగుని నొక్కి మలన్నిబయతకు నెట్టివేయడానికి కృషి చేస్తాయి. బలహీనంగా, అనారోగ్యంగా ఉండే వారిలో పొట్టకు సంభందించిన కండరాలు, ఇతర కండరాలు శక్తిమంటంగా పనిచేయలేకపోతాయి. దాంటో వారిలో మలబద్దకన్ని నివారించటంలోపొట్ట కండరాల కసరత్తు ప్రధానపాత్ర వహిస్తాయి.

    మలబద్దకం సమస్య రాకుండా ఉండాలంటే మొదటి నుంచీ అలవాట్ల విషయంలో జాగ్రత్త పడాలి. ఉదయం లేవగానే ముందు మలవిసర్జన జరిగేటట్లు ప్రేగులకి కూడా అలవాటు చేయాలి. అలవాటు అనేది మనకే కాదు, మన శరీరంలోని బగాలకి కూడా మెదడునుంచి "రిప్లర్సు యాక్షన్" ద్వారా ఏర్పడుతుంది. ఏవ్యక్తి అయినా తనకి వీలున్న సమయంలోనే మలవిసర్జన చేయవచ్చని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో పూనుకుంటే ప్రేగులు సమ్మె చేసి, అతనిలో సహకరిండం మానివేస్తాయి. చివరికి అవి బద్దకానికి అలవాటు పడి మలబద్దకాన్ని కలిగిస్తాయి.

    మలవిసర్జనకి రోజూ ఒకటి_రెండు సార్లు నియమిత సమయాన్ని కేటాయించి నట్లే మలవిసర్జన ప్రదేశంకూడాఎటువంటి దుర్వాసన లేకుండా ఉండాలి. మలవిసర్జన సమయంలో తొందారపాటులేకుండా వుండాలి. కొందరు సిగరెట్లు తాగితే తప్ప విరేచనం కాదని అనుకుంటారు. అది వారి మానసికస్థితి తప్ప త్రాగాదానికీ, కాఫీ త్రాగాదానికీ, దీనికీ సంభందం లేదు.

    చాలా సందర్భాలలో మలబద్ధకం రావడానికి ఎటువంటి కారణం కనబడదు. కేవలం తగినంత ఆహారం తీసుకోకపోవడం, మంచినీళ్ళు తగినంత తాగాకపోవడం, నియమిత సమయాన్ని పాటించక పోవడమే కారణాలు ఎక్కడో కొందరికి మల విసర్జన పెగుకి సంభందించిన లోపాలు వుంటాయి, వాటిని అటువంటప్పుడు సరిదిద్దవలసి వుంటుంది. దంపుడు, విసురుడు బియ్యం తినడం, ఆకుకూరలు రోజూ వాడడం పళ్ళరసం తీసుకోవడం చేస్తే, మలబద్ధకం సమస్య చాలవరకు తీరిపోతుంది.    

                                                                      ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS