Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 47

 

    "సత్తిపండు...." అంటూ సత్తిపండుని వాటేసుకున్నాడు శ్రీచంద్ర.


    "గురూ.....నన్నెవరో కౌగలించుకున్నారు" అన్నాడు సత్తిపండు.


    "నేనేరా పండు......నా కోసం నీ పోట్టిలాగు, చొక్కా, కళ్ళజోడు త్యాగం చేస్తానన్నావు కదూ.....అది చాలురా......అన్నాడు శ్రీచంద్ర.


    "అదేంటి గురూ! నువ్వు చస్తే , నేనూ నీతో పాటు చస్తా" అన్నాడు శ్రీచంద్ర.


    "చాలురా సత్తిపండూ....ఏంటోరా నా జీవితం అలా అర్ధంతరంగా ముగుస్తుందనుకోలేదు ప్చ్....ఒరే పండూ.....సమీరకు చెప్పురా.....ఎవర్నైనా చూసి పెళ్ళి చేసుకోమని చెప్పు. మా నాన్నని వుర్కే బూతులు తిట్టోద్దని చెప్పరా.....పాపం మా ముసల్ది సెక్స్....సెక్స్....నవలడిగిందిరా.....అదేలాగైనా లైబ్రరిలో సంపాదించి ఇవ్వు.....మా అమ్మని అడిగానని చెప్పరా......ఇదిగోరా.....నా చొక్కా తీసుకో....నా ప్యాంటుతో నువ్వు రెండు పొట్టిలాగులు కుట్టించుకోరా...."


    "గురూ!" అంటూ శ్రీచంద్రని వాటేసుకున్నాడు సత్తిపండు.


    "కలికాలం......మగాడూ, మగాడూ, కౌగలించేసుకుంటున్నాడు" ఎవరో అనేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూశారు.


    తను చుట్టూ జనం వున్నారు.


    సిగ్గుతో అక్కడినుంచి వెళ్ళిపోయారిద్దరూ.


    "ఒరే పండూ! నేను ఈ హుస్సేన్ సాగర్ లో దూకి చస్తాన్రా" అన్నాడు శ్రీచంద్ర టాంక్ బండ్ దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి.


    "నీకు ఈత రాదు కదా గురూ!"


    "ఒరే పండూ! నేను చావడానికి దూకుతున్నారా. ఈతకొట్టడానికి కాదు."


    "సారీ గురూ. నా మెదడు గుండెకాయలోకి జారిపోయింది."


    "ఇంకా నయం గుండెకాయ కిడ్ని లోకి జారిపోలేదా" అని ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు.


    "ఒరే పండూ! డాక్టర్ ఎమన్నాడ్రా?"


    "నీ గుండె దగ్గరున్న మూడు కిడ్నీలు చెడిపోయాయని , నువ్వేక్కువరోజులు బ్రతకవని చెప్పాడు."


    "యాహూ...." అని అరిచాడు.


    "అదేంటి గురూ! నీ చావు వార్త నీకు సంతోషాన్ని కలిగిస్తోందా? ఏంటో చావు భయం. నీకు మతి అస్థిమితంగా వున్నట్టుంది."


    ఫట్ మని ఒక్కటిచ్చాడు సత్తిపండు తలమీద శ్రీచంద్ర.


    "గురూ! ఎవడో దొంగ దెబ్బ తలమీద కొట్టాడు" అన్నాడు సత్తిపండు.


    "ఏడ్చావు , నేనే ఒక్కటి పీకాను" అన్నాడు.


    "అదేంటి గురూ!" ఉక్రోషంగా అన్నాడు.


    "అవునురోయ్! కిడ్నీలు ఎక్కడుంటాయ్ రా, ఎన్నుంటాయ్ రా?"


    "ఏమో గురూ! ఓ అరడజను వుంటాయా?" అనుమానంగా అడిగి శ్రీచంద్ర సీరియస్ రియాక్షన్ చూసి ఆగిపోయాడు.


    "పదరా పండూ. ఆ డాక్టర్ ఇవ్వాళ అయిపోయాడ్రా" అంటూ ముందుకు నడిచాడు శ్రీచంద్ర ఓ స్థిర నిశ్చయంతో.


    
                                                               * * *


    సీలింగ్ ప్యాన్ కు తలకిందులుగా వేలాడదిసారు డాక్టర్ పరధ్యానాన్ని శ్రీచంద్ర, సత్తిపండు కలిసి.


    "ఏరా! డా ట్రూ నాకు మూడు కిడ్నీలున్నాయా? అవి గుండె దగ్గరున్నాయా? అవి చెడిపోయాయా? నీయబ్బ.....నీకు డాక్టర్ పట్టా ఇచ్చిందేవర్రా. నన్ను భయపెట్టి చంపావు కదరా.......అయిపోయావ్రా" అంటూ "సత్తిపండు" అని కేకేశాడు.


    "గురూ....ఫ్యాన్ స్విచ్ వేసేయానా?"


    "వేయ్ .....పుల్ స్పీడ్?"


    స్విచ్చాన్ చేయాగానే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తిరిగింది. దాంతో పాటు దానికి వేలాదదిసిన డాక్టర్ కూడా తిరిగితిన్నాడు.


    "ఓర్నాయనోయ! నా కిడ్నీలు కిందపడేలా ఉన్నాయి" అంటూ అరిచాడు డాక్టర్.


    స్వచ్చ్ ఫ్ చేసి డాక్టర్ ని అడిగాడు శ్రీచంద్ర.


    "ఇంకెప్పుడైనా ఇలా తప్పుడు రిపోర్టు ఇస్తావా? అయినా నీకు నేనేం అన్యాయం చేసాన్రా......హమ్మ.....హమ్మ,,,,,ఏదో మొండి ముండావాడిని కాబట్టి దైర్యంగా వున్నా. అదే మా పోట్టిలాగు అయితే ఈపాటికి టపా కట్టేసేవాడే. ఎందుకలా చెప్పావ్రా?"


    "సార్! క్షమించండి. ఎవరో ఓ లావుపాటి వ్యక్తీ వచ్చి "మీకు ఏదో రోగం వుందని వెంటనే చచ్చిపోతారని చెప్పమన్నారు. క్యాన్సర్ జబ్బుందంటే రొటీన్ గా వుంటుందని కిడ్నీలు చెడిపోయాయని చెప్పాను. మూడు కిడ్నీలు వుంటాయని పొరపాటుపడ్డాను. అవి కూడా గుండె కింద వుంటాయని అనుకున్నాను" అన్నాడు డాక్టర్.


    "నీ తెలివి తక్కువతనమే నన్ను బ్రతికించింది. కాబట్టి నువ్వు బ్రతికోపోయావు" అంటూ బయటకు నడిచాడు.


    
                                                                 * * *


    "ఒరే పండూ! నా గురించి అలా చెప్పమని చెప్పింది ఎవరై వుంటారంటావ్?"


    "ఆ....నేనే" కోపంగా ఓ గొంతు వినపడింది. ఇద్దరూ ఉలిక్కిపడి తల తిప్పిచూసారు.


    "సమ్మీ.....నువ్వా?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీచంద్ర.


    "నేనే"

    "నువ్వలా చెప్తావా డాక్టర్ తో" మరింత ఆశ్చర్యంగా అడిగాడు శ్రీచంద్ర.


    "దాక్టరేంటిట? నేను చెప్పడమేమిటి?"


    "మరెందుకు .....ఆ నేనే" అని అన్నావు?"


    "ఓస్ అదా....ఒరే పండు నా గురించి అలా చెప్పమని చెప్పిందేవరై వుంటారంటావ్? అని అడిగితే విషయం అర్ధంగాకపోయినా "ఆ నేనే.....అంటే పోలా....అని అందుకే అలా చెప్పను. ఇంతకీ డాక్టర్ చెప్పడమేంటి? ఏం చెప్పాడెంటి? నీకు 'ఆ ప్రాబ్లం' వుందని చెప్పాడా కొంపదీసి. అలా అయితే నా కొంప కొల్లేరే" అంది బాధతో కూడిన ఎక్స్ ప్రేషనిస్తూ.


    "ఛ....ఛ... నికెప్పుడు ఆ యావే.....ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే....."


    "ఆ....ఏడుస్తుంటే వెరి ఇంట్రేస్టింగ్"


    కోపంగా ఓసారి సమీర వైపు చూసి 'చుట్టకు నిప్పు కావాలని మరొకడు అడిగాడట' అంటూ పూర్తిచేసాడు.


    "ఓస్ అంతేనా....నా నరాలు జివ్వుమనేలా ఇంకేమైనా చెబుతావనుకున్నా. లాభం లేదురా చందూ" అంది ఓ నిట్టూర్పు విడుస్తూ.


    "తెలిసింది కదా. నన్ను ఇలా వదిలేయకూడదు" రెండు చేతులూ జోడించి అన్నాడు శ్రీచంద్ర.


    "పోట్టిలాగు సత్తిపండు నీ గురువుకి ఇవ్వాళేమైంది?"


    "మరేం లేదు వదినా" అంటూ చెప్పబోయిన సత్తిపండును చెప్పొద్దని వారించాడు శ్రీచంద్ర.


    "ఏంటో నువ్వు నాకర్ధం కావురా చందూ. మా యూనిట్లో తబలా కృష్ణ, అని అసిస్టెంట్ డైరెక్టరున్నాడు. చూడ్డానికి బానే వుంటాడు. కాకపోతే కాస్త నసకేసు."


    "ఇదంతా నాకెందుకు చెబుతున్నావు?" అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.


    "మరేం లేదురా. మొన్నోరోజు నన్ను చూసి నవ్వాడు. నవ్వే కదాని నేనూ నవ్వాను. తర్వాత ఓ కన్ను తెరచి మూసాడు. అదే కన్ను గిటడం అంటారు చూడు అదన్నమాట. పోనీ కన్నె కదా అని నేను కొట్టాను కన్ను. మొన్న రుక్మిణి కళ్యాణం మొత్తం ఓపిగ్గా చదివి వినిపించాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS