"లేదు కుందూ! శీతల్ విషయంలో పొరపడుతున్నావు. గారాబంగా ధనికవర్గంలో పెరిగిన అమ్మాయిలు రెండు రకాలుగా వుంటారు మంచివాళ్ళు, అమాయకులు, తెలివిగలవాళ్ళు పెంకి రకాలు. శీతల్ తెలివిగల అమాయకురాలు."
"షిట్ మీ మాటలు వక్కటీ నాకర్ధం కావటం లేదు డాడీ! తెలివిగల అమాయకురాలేమిటి? పరస్పర విరుద్దమైన మాట."
"అక్కడే వుంది కుందూ! నీకూ నాకు భేదం శీతల్ ని నేను ఇక్కడికి ఎత్తుకు వచ్చిం తరువాత చాలా రకాలుగా పరీక్ష చేశాను. వాళ్ళింటికి ఫోన్ చేస్తుందేమోనని ఫోన్ అందుబాటులో వుంచాను. ఫోను చేయలేదు! ఇంటికి పారిపోతుందేమోనని చూశాను. పారి పోలేదు. ఏదైనా విషయం వస్తే తట్టుకుంటుందా లేదా అని రాజాంతహ్ పురము. రాక్షసులు లాంటి నీగ్రో బానిసలు. వాళ్ళ కోపింజారి భాషతో శీతల్ తల వేడెక్కేలా చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ప్రస్తుతానికి ఇంటిమీద ధ్యాసలేదు కాబట్టి పారిపోదు. గారాబంగా పెరగటం వల్ల ప్రపంచజ్ఞానం తక్కువ. అవసరమొస్తే ధైర్యస్తురాలే పెళ్ళి విషయంలో కూడా పిరికే అనుకుంటాను"
"మీరలా అనుకుంటు వుండండి నే యిక్కడ వేడెక్కి చస్తాను. వక్కసారి రేప్ చేసి పారేస్తే కుక్కిన పేనులాపడి వుంటుంది. నోరు మూసుకుని మెడవంచి తాళి కట్టించుకుంటుంది. అయిదు నిమిషాలలో అయిపోయే పనికి ఆరు నెలలు ఆగటం ఉహు నాకేం నచ్చలేదు. ఏ పిల్లనైనా అలా చూస్తే ఇలా కాటేయటం నా సహజ లక్షణం అలాంటి నేను ఓపికగా నిరీక్షించటం నేను భరించలేకుండా వున్నాను. ఏ క్షణాన అయినా...
"కుందూ!"
"లాభం లేదు డాడీ! నా మనసు నా అధీనంలోలేదు చెప్పాను ఆపై మీ యిష్టం"
"మనం మనసు పడ్డ ఆడదాన్ని వదలము. అలా అని కాబోయే భార్యని కూడా రేప్ చేస్తానంటే ఎలా! నే రేపులు కాదు కాని ఆ సమయంలో సాంతం చచ్చిన పిల్లలని పారేయలేక సగం చచ్చిన వాళ్ళని వ్యభిచార కొంపలకి అమ్మ లేక మధ్యలో నా ప్రాణం పోతున్నది. శీతల్ వక్కదాని విషయంలోనే నేను కాస్త గుర్రాన్ని కంట్రోలు చేయమన్నది?"
"ఆరు నెలలు కాదు కదా ఆరేళ్ళు ఆగినా ఆ అమ్మడు నన్ను పెళ్ళాడను అంటే?"
"అప్పుడు ఫుల్ హక్కులు నీకిస్తాను."
"తగలడ్డట్టే వుంది. అప్పటికి నేను ముసలాడిని అవుతాను."
"ప్రతి దానికి నీ పంతమే నెగ్గలంటావు. సరే కాని ఒక్క వారం ఆగు. పెళ్ళి ప్రస్తావన తెచ్చి చూస్తాను. కాదంటే...
నౌకరొకడు గదిలోకి రావటంతో లోకేశ్వరరావు మధ్యలోనే మాటలాపు చేసి ఏంటి విషయం?" అన్నాడు చిరాకుగా.
నౌకరు ఏదో కాగితం అందించి "సీరియస్ మేటర్ వెంటనే చదివి ఏం చేయాలో చెపితే అలా చేద్దామని...!" వినయంగా అన్నాడు.
లోకేశ్వరరావు కాగితంలో రాసున్నది చదువుతూ వుండిపోయాడు.
తండ్రి కొడుకు మాటలని చాటుగా పొంచి వింటున్న శీతల్ చాటు నుంచి వింటున్నది. సరీగా అయిదు నిమిషాల క్రితం శీతల్ ని కాపలా కాసే ఓ నౌకరు (గుండా) అది చూడటం జరిగింది.
వెంటనే శీతల్ ని పట్టుకోవాలా?
శీతల్ అవతలికి వెళ్ళి తరువాత బాస్ కి యీ విషయం చెప్పాలా!
"వెంటనే ఎందుకు చెప్పలేదు. శీతల్ మా రహస్యాలు చూసి మాటలు విని ప్రమాదం కాదా" అని బాస్ కేకలు వేయవచ్చు. ఈ విషయం వెంటనే బాస్ కి చెప్పటం మంచిది. అనుకున్న నౌకరు వేషంలో వున్న గుండా చాలా ముందు చూపుతో ఈ విషయం కాగితం మీద రాసి వెంటనే వెళ్ళి లోకేశ్వరరావుకి అందించాడు.
అది లోకేశ్వరరావు చదువుతుంటే శీతల్ మరో విధంగా అనుకుంది. తనకి మరో రహస్యం తెలియబోతున్నది అని...అవతల తన ప్రాణం మీదకే వచ్చిందని ఊహా మాత్రం కూడా అనుకోలేదు.
లోకేశ్వరరావు అది చదువుతూనే నిర్ఘాంతపోయాడు. కుందన్ ఓ పక్క "ఏం డాడీ!" అన్నా వినిపించుకోలేదు. "ఒక్కక్షణం ఆగు," అని చెప్పి నౌకరు చెవిలో ఏదో చెప్పి పంపాడు.
"వెంటనే నీవు ఇంకొకడు వెళ్ళి శీతల్ ని అక్కడే పట్టి బంధించండి. నేను వస్తాను." ఇది లోకేశ్వరరావు నౌకరు చెవిలో చెప్పి పంపింది.
ఇదేమి తెలియని శీతల్ చెవి యొగ్గి అక్కడే నుంచుంది.
"ఏమిటి డాడీ! ఏం జరిగింది?" నౌకరు వెళ్ళిం తరువాత కుందన్ అడిగాడు.
"పెద్ద బంగారు చేప సరాసరి వచ్చి గాలానికి తగులుతుంది. ఈ శుభవార్త ఇప్పుడే తెలిసింది."
"బంగారు చేపా? నాకేం అర్ధం కావటం లేదు డాడీ!"
