శీతల్ వాటిని చూస్తూనే తేలికగా గుర్తించింది. ఆనాడు తనని స్పృహ తప్పించి రాజుల అంతఃపురంలాంటి దాంట్లో బందీగా చేసి, రెండు మూడు రోజులు ఏడిపించడం, ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఇదంతా కల అని తేల్చి పారేయడం, తను గత్యంతరం లేక నమ్మినట్టు నటించడం...అన్నీ గుర్తుకొచ్చాయి.
కళ్ళముందు ఇంత చక్కగా సాక్ష్యం కనపడుతుంటే ఇంక వేరే సాక్ష్యాధారాలు దేనికి?
ఈ నాటకం వెనుక కథ ఏమిటన్నదే ఇహ తను తెలుసుకోవాలి. ఇక్కడ వుంటే ఏ క్షణాన అయినా ప్రమాదమే కాబట్టి పారిపోయేటందుకు ఉపాయం చూడాలి.
శీతల్ ఆ ప్రయత్నంలో కొత్త ఆలోచనలు చేసింది.
చాటుగా వాళ్ళ మాటలు వినటం వక మార్గం.
పూర్తిగా బయట పడాలంటే తేలిక మార్గం ఏది?
ఈ రెండు మాటల మీదనే వుండదల్చుకుంది శీతల్.
ప్రస్తుతానికి శీతల్ నిర్ణయం సరి అయినది. అంత కన్నా గత్యంతరం లేనిది.
ముందు ముందు ఏం జరగనున్నదో ఎవరికీ తెలియదు శీతల్ కి తెలియదు. వేచి చూడటం ఒక్కటే మిగిలింది.
28
వాళ్ళ నిఘా తక్కువ అయింది.
శీతల్ (పరి)శోధన ఎక్కువయింది.
ఆ రోజు.
రాత్రి పన్నెండు గంటలప్పుడు.
శీతల్ లేచి తన గదిలోంచి బైటపడి లోకేశ్వరరావు బెడ్ రూమ్ దగ్గరకు వెళ్ళి చాటుగా చూసింది. ఆయన రూమ్ లో లేడు. అటునుంచి అటే నడిచి కుందన్ బెడ్ రూమ్ దగ్గరకు వెళ్ళింది.
బెడ్ రూమ్ లో లోకేశ్వరరావు కుందన్ వున్నారు ఇరువురు కాస్త గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.
శీతల్ కి మంచి అవకాశం చిక్కింది.
లోపలి నుంచి వారిరువురి మాటలు చక్కగా ఈ విధంగా ఆమెకు వినవస్తున్నాయి.
కుందన్ ఎప్పుడు తండ్రిని నాన్నగారు అంటూ గౌరవంతో వినమ్రంగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అలా గాక డాడీ అని సంబోధిస్తున్నాడు. కరుకుగా మాట్లాడుతున్నాడు. మిత భాషి అనుకున్న వాడు కాస్త కామా పులిష్టాపులు లేకుండా గడ గడ వాగుతున్నాడు.
"కుందూ! నీకింకా లోకానుభవం తక్కువ" లోకేశ్వరరావు అన్నాడు.
"షిట్! నీవింకా ఏ యుగంలో వున్నావు డాడీ! అనుభవాలంటూ కూర్చుంటే పనులు కావు. ఇది రాకెట్ యుగం కంప్యూటర్ బ్రయిన్ తో ఏ పనైనా చేయాలి. మనిషి కన్నా ఆయుధాన్ని నమ్మాలి వక్కసారి పెత్తనం కానివ్వండి. మెరుపు వేగంతో ఛమక్ మనిపిస్తాను. హాజీ మస్తాన్. సట్ సర్ లాల్. ఛార్లెస్ వగైరా ఘనులని మించి...
"ఈ ఆవేశమే కూడదు కుందూ! మనం ఏ పనులు చేసినా ఎందరితో తిరిగినా మనకంటూ ఓ సంసారం వంశవృక్షం వుండాలి. మన పూర్వీకులు ఏ చోళ రాజ్యం లోనో చోర చక్రవర్తులు అయి వుంటారు. వంశం గురించి తెలిస్తే మహాగ్రంధమే రాయిద్దును. వంశవృక్షము గ్రంధం రాయించాలనే అయిడియా నా నుంచే మొదలయాయి. నా ఆశని నీవు నిరాశ పరచరాదు. ముఖ్యంగా ఇది గుర్తుంచుకో."
"గుర్తుంచుకున్నాను కాబట్టే నీవు చెప్పినట్లు విన్నాను డాడీ! లేకపోతే ఎప్పుడో దాన్ని రేప్ చేసి పారేసేవాడిని."
"ఆ...ఆ... రేప్ చేయటం తేలికే. ఆడదాన్ని మల్లెపువ్వులా చూడమని నేననను నీ యిష్టానుసారమే అనుభవించు ఆపై విసిరి అవతల పారెయ్యి. నీవు కోరిన ఆడపిల్లనల్లా తీసుకువచ్చి నీకు అప్పగించే ఏర్పాటు చేశాను. ప్రతి పిల్లని నీకోరికతో కొరికి రక్కి వక్క రాత్రికే చావుకి దగ్గరగా తీసుకెళుతుంటివి. వాళ్ళని సాంతం చంపి పూడ్చి పెట్టలేక అటు అమ్మటం. ఇదో కొత్త పనైంది నాకు...
"డాడీ! నా అలవాటు అది. మీరు ఊ అంటే ఆ శీతల్ ని కూడా వక్క రాత్రిలో పీకి పాకం పడతాను. ఈ నాటకం ఆడలేక చస్తున్నాను. నా భార్యగా శీతల్ కాకపోతే దాని అమ్మమ్మ వస్తుంది.
"కుందూ! నీ కెన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా! నీకు ఓ భార్య మీ యిద్దరికీ సంతానం వుండాలి. లేకపోతే మన ఆస్తికి వారసులెవరుంటారు? ఆ గోవర్ధనం గాడి మీద నా పగ తీరాలంటే వాడి కూతురునే నీవు పెళ్ళాడాలి."
"పగ తీరాలంటే పెళ్ళాడాలా డాడీ! వాడిని తీసుకుని వచ్చి ఇక్కడే కట్టి పారేసి వాడి ముందే శీతల్ ని రేప్ చేసి పారేస్తే సరిపోలేదా! దాని పని చిరిగినా విస్తరాకు అయిన మరుక్షణం వాడి పని పిచ్చి కుక్కలాగా అవుతుంది."
"ఊహూ నేను వాడినన్న మాట చేతల్లో చూపించి సరే వెధవాయ్! నీకూతురు నా కోడలు అయిందిరా! అది తెలియజేయాలి. అందుకే యిన్ని నాటకాలు."
"ఏ నాటకాలో ఏమిటో మధ్యలో నేను నాటకం ఆడలేక చస్తున్నాను. మాట బైట పడకూడదు అన్నావని మితభాషిగా వున్నాను. నిరాడంబరంగా కనపడమని చెప్పటం వల్ల సింపుల్ గా దిక్కుమాలిన ఈ దుస్తులు ధరించాను. పెళ్ళి మాట ఎత్తవద్దనటం వల్ల...అన్ని మాటలు విఫలం ఎందుకులే అని ఈ వక్క మాట ఎత్తాను. తనకసలు పెళ్ళి తలపే లేదుటా ఇప్పుడు తెలిసింది కదా డాడీ! ఆ పిల్ల గుణం మీరు శీతల్ గురించి ఏదేదో అనుకుంటున్నారు గాని మీరనుకుంటున్నట్లు ఆమె గారు నోట్లో వేలు పెడితే కోరకలేని కూన మాత్రం కాదు. అమాయకంగా నటిస్తున్నదని నహా అనుమానం"
