43. మొలలు ముదిరి రక్తం పోతుంటే ఏం చేయాలి?
"డాక్టర్లు, నాకు బాగా వేడి చేసినట్లుంది. విరోచాననికివెళ్ళినప్పుడు రక్తం చిమ్ముతోంది. చలవ చేయడానికి మంచి మందు రాసి ఇవ్వండి" అడిగాడు అదెయ్య.
అదేయ్యలాగానే కొంతమందికి విరోచానానికి వెళ్ళినప్పుడు పంపులాగా రక్తం చిమ్మితే, మరికొందరికి. బోట్లుబొట్లుగా రక్తం పడుతుంది. ఇలా జరిగినప్పుడు కొందరు వేడిచేసిందని సరిపెట్టుకుని చలవచేయడానికి పెరుగు, పళ్ళు తింటే, మరికొందరు రక్తం చూసి బెంబేలు పాడుతుంటారు. వాస్తావానికి విరేచానానికి వెళ్ళినప్పుడు మలద్వారం గుండా రక్తం కారడం, మొలలు (ఫైలు) ఉండడంవల్లనే. అంతేగాని వేడిచేయడం వల్ల రక్తంపడుతొందని భావించడం అర్ధంలేని మాట. విరోచనం అయినప్పుడు రక్తం పడటం,మొలలు ఉన్నవారిలోనూ, యానల్ ఫిషర్ ఉన్నవారిలోనూ సహజం, కేవలం మొలలే అయితే మలవిసర్జన సమయంలో ఎటువంటి నొప్పి అనిపించకుండా రక్తం బోట్లుబొట్లుగా పడుతుంది. అలా కాకుండా మలద్వారం దగ్గర గీసుకుని పోయినట్లు యానల్ ఫిషర్ ఏర్పడితేమల విసర్జన సమయంలో రక్తం పడటమే కాకుండా బాధకూడా వుంటుంది.
మొలలు అంటే పుళ్ళూకాదు, కణుతులూ కాదు. మల విసర్జన పేగు లోపల దిగువున వుందే రక్తనాళాలుమాత్రమె. కొన్ని కారణాలవల్ల ఈ రక్తనాళాలురక్తంతో బుడగల మాదిరిగా ఉబ్బిపోతాయి. మొలలు వచ్చినవారికీ ఇటువంటివి మూడు తాయారవుటాయి. ఇవి మల విసర్జన సమయంలో ఒత్తిడికి లోని చిల్లుపడి రక్తాన్ని చిమ్ముతాయి.
కొందరిలో రక్తనాళంగోడలు పలచగా వుండబట్టి రక్తంతో ఉబ్బిమొలలు తయారైతే, స్రీలలో ముఖ్యంగా గర్భవాటిగా వున్నప్పుడు మొలలు కనబడి కాన్పు అయిన తరువాత లేకుండా పోతాయి, దీనికి కారణం గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండం మలవిసర్జన ప్రేగుకి సంభందించిన రక్తనాళాల మీద ఒత్తిడి కలిగించడమే. ఇలా ఒత్తిడి కలగడంవల్ల రక్తనాళ్ళల్లోని రక్తం తేలికగా పైకి ప్రయాణంచక, కొంత మిగిలిపోతూ ఉంటుంది. ఇలాంటి కారణం వల్లనే స్రీలలోగర్భ సంచికి కణుతులు ఏర్పడినప్పుడూ, అ స్థలంలో ఇతర కణుతులు ఏర్పడినపుడు మొలలు
తయారవుతాయి.
మొలలు మొదటి దశలో కనబడకుండా మల విసర్జన ప్రేగు లోపల ఎక్కడో ఉంటాయి. ఇటువంటి వారిలో విరోచనం సమయంలో రక్తం బోట్లు పడటం తప్ప, ఇతరత్రా ఎటువంటి లక్షణాలు కనబడవు, వీటిని మొలలు ముక్కగానే మలద్వారం బయటకు పొడుచుకుని వచ్చి చేతివెళ్ళకుమెత్తని బోడిపి మాదిరిగా అగుపిస్తాయి. తరువాత కొద్దిసేపటికి లోపలి వెళ్ళిపోతాయి. ఇది రెండవ దశకు చెందిన మేళాలు.
మొలలు మూడవదశకి చేరిన తరువాత అవి మల విసర్జనతో సంభంధం లేకుండానే ఎప్పుడూ మలద్వారానికి బయటకి వచ్చేసి ఉంటాయి. ఇలా బయటకి వచ్చేసిన తరువాత ఆపరేషను చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, అవి మాటిమాటికీ చిట్లి రక్తంకారడం, చీముపట్టడం, వాసన ఉంటూ మొలలు మరీ పెద్దవిగా తయారైన తరువాత మలవిసర్జన కూడా ఇబ్బంది అవుతుంది.
మొలలు ఉండి తరచూరక్తం పోతూ వుంటే ఆ వ్యక్తిలో రక్త హీనత ఏర్పడుతుంది. అందువల్ల మొలలు వుంది రక్తంపోతూవుంటే, వెంటనే చికిత్స పొందాలి. మొదటి దశలో ఉన్న మొలలకి శస్రచికిత్స అనవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆహారంలో ఆకూకూరలు, పళ్ళూ తీసుకుంటూ. మలం గట్టిపడకుండా విరోచనం అయ్యేట్లుచూసుకోవాలి. లిక్విడ్ ఫరాఫిన్ వాడితే తెలికిగా మలవిసర్జన అయి మొలలు చిత్లవు. మొలలురెండవదశ మూడవదశకి చేరితే శస్రచికిత్స చేయించుకుంటే శాశ్వితంగా మొలలతోఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మొలలు ఉన్నప్పుడు వేడి చేసిందని అఫోహా పడక డాక్టరుకి చూపించి తగిన చికిత్స పొందడం మంచిది.
****
