-: బుధహస్త లక్షణము :-
తా: ఎడమచేత అడ్డముగ ముష్టి హస్తమును, కుడిచేత పతాకహస్తమును పట్టిన బుధహస్తమగును.
-: బృహస్పతి హస్త లక్షణము :-
తా: రెండు చేతులతో శిఖర హస్తమును యజ్ఞసూత్ర ప్రదర్శనము వలే పట్టిన బృహస్పతి హస్తమగును. ఇది ఋషులయందు, బ్రాహ్మణుల యందు చెల్లును.
-: శుక్రహస్త లక్షణము :-
తా: ఎడమచేయి పైకి, కుడిచేయి క్రిందికి, ముష్టి హస్తములు బట్టినచో శుక్రహస్తమగును.
-: శనైశ్చర హస్త లక్షణము :-
తా: ఎడమచేత శిఖర హస్తము, కుడిచేత త్రిశూల హస్తము బట్టిన శనైశ్చర హస్తమగును.
-: రాహు హస్త లక్షణము :-
తా: ఎడమచేయితో సర్పశీర్ష హస్తమును, కుడి కరముతో సూచీ హస్తము బట్టిన రాహుహస్తమగును.
-: కేతు హస్త లక్షణము :-
తా: ఎడమ కరముతో సూచీహస్తమును, కుడి కరముతో అర్ధపతాక హస్తమును బట్టిన కేతు హస్తమగును.
-: దశావతార హస్త లక్షణములు :-
-: మత్స్యావతార హస్త లక్షణము :-
తా: మత్స్యహస్తమును చూపి, రెండుచేతులతో త్రిపతాక హస్తములు భుజ శిరస్సులకు సమానముగ బట్టినచో మత్స్యావతార హస్తము వచ్చును. ఇది మత్స్యావతారమునకు వినియోగించును. చేప, మత్స్యావతార ప్రదర్శన, మున్నగు వాటికి వర్తించును.
-: కూర్మావతార హస్తలక్షణము :-
తా: కూర్మ హస్తమును చూపి భుజశిరస్సులకు సమముగా త్రిపతాకములు బట్టిన కూర్మావతార హస్తమగును.
-: వరహావతార హస్త లక్షణము :-
తా: వరాహ హస్తమును చూపి, పిరుదులయందు డోలా హస్తము పట్టిన, వరాహావతార హస్తము వచ్చును.
-: నృసింహావతార హస్త లక్షణము :-
తా: ఎడమచేత సింహముఖ హస్తమును, కుడిచేత త్రిపతాకమును బట్టిన నారసింహావతారమగును.
-: వామనావతార హస్త లక్షణము :-
తా: ఎడమ, కుడి, కరములు పైకి క్రిందకు ముష్టిహస్తములు బట్టిన వామనావతారమగును.
-: పరశురామ హస్త లక్షణము :-
తా: వామకరమును నడుమునందుంచి, దక్షిణ కరముచేత అర్ధపతాకముబట్టిన, పరశురామావతార హస్తము వచ్చును.
-: రఘురామావతార హస్త లక్షణము :-
తా: దక్షిణ కరముతో కపిద్ధ హస్తమును, వామ కరముతో శిఖర హస్తమును బట్టిన రామచంద్రావతార హస్తము వచ్చును. ఇది రామచంద్రుని వర్తించును.
-: బలరామావతార హస్త లక్షణము :-
తా: దక్షణ కరమందు పతాకమును, వామకరముందు ముష్టి హస్తమును బట్టిన బలరామావతార హస్తమగును.
-: బుధ్ధావతార హస్తలక్షణము :-
శ్లో!! సమస్థానస్థితోడోలాహస్తా వుభయపార్శ్వయోః
సంచాలయన్ బుద్ధరూపం భరతజ్ఞః ప్రదర్శయేత్.
తా: సమస్థానమున నిల్చి డోలా హస్తములు రెండు ప్రక్కలకు ఊపుచు పట్టిన బుద్ధావతారమగును. (గాక రెండు హంసాశ్య హస్తములు గాని, జ్ఞానముద్రలు గాని ఒకచేతిపైన నొకటి యుంచి నాభి స్థానమెదురుగపట్టి నేత్రములు మూసుకొనిన బుధ్ధావతారమగును.)
-: కల్క్యావతార లక్షణము :-
తా: దక్షణ కరముతో పతాక్ హస్తమును, వామకరముతో త్రిపతాక హస్తమును బట్టినం కల్క్యవతారమగును.
