-: లక్ష్మీహస్త లక్షణము :-
శ్లో!! అంసోపకంఠేహస్తాభ్యాం త్థాభ్యాంశ్రియంకరః !!
తా: బాహుమూలమందు రెండు కపిద్ధ హస్తములు పట్టినయెడల లక్ష్మీ హస్తమగును.
-: వినాయక హస్త లక్షణము :-
శ్లో!! పురోగాభ్యాం కపిత్దాభ్యాం విఘ్నరాట్కరః !!
తా: ఎదురుగా రెండు కపిద్ధ హస్తములు పట్టినయెడల విఘ్నేశ్వర హస్తమగును.
-: షణ్ముఖ హస్త లక్షణము :-
శ్లో!! వామేకరే త్రిశూలంచ శిఖరందక్షణంకరే !
ఊర్ధ్వంగతే షణ్ముఖస్యకర ఇత్యుచ్యతేబుధైః !!
తా: ఎడమచేతియందు త్రిశూల హస్తమును, కుడిచేతియందు శిఖర హస్తమును ఎత్తుగా బట్టినయెడల షణ్ముఖహస్తమగును.
-: మన్మధహస్త లక్షణము :-
శ్లో!! వామేకరేతు శిఖరం దక్షణే కకకాముఖః !
మన్మధస్యకరః ప్రోక్తోనాట్యశాస్త్ర విశారదైః !!
తా: ఎడమ చేతియందు శిఖరహస్తమును, కుడిచేతియందు కటకాముఖహస్తమును పట్టినయెడల మన్మధహస్తము వచ్చును.
-: ఇంద్రహస్త లక్షణము :-
శ్లో!! త్రిపతాకౌస్వస్తికౌచే దింద్రహస్తః ప్రకీర్తితః !!
తా: రెండు త్రిపతాక హస్తముల మణికట్టులను చేర్చిపట్టిన ఇంద్ర హస్తమగును.
-: అగ్ని హస్త లక్షణము :-
శ్లో!! త్రిపతాకో దక్షణేతువామే లాంగూలహస్తకః !
అగ్నిహస్తస్య విజ్ఞేయో నాట్యశాస్త్ర విశారదైః !!
తా: కుడిచేతియందు త్రిపతాక హస్తమును, ఎడమ చేతియందు లాంగూల హస్తమును బట్టినచో అగ్నిహస్తమగుచున్నది. ఇది అగ్నిదేవునికి వినియోగించును.
-: యమహస్త లక్షణము :-
శ్లో!! వామేపాశః దక్షణేతు సూచీయమకర స్మృతః !!
తా: ఎడమకరమందు పాశహస్తమును, దక్షణకరమందు సూచీహస్తమును పట్టిన యమునికి చెల్లును.
-: నైఋతీ హస్త లక్షణము :-
శ్లో!! ఖట్వాచ సకటశ్చైవ కీర్తితోనైరుతేః కరః !!
తా: ఖట్వాహస్తమును, శకట హస్తమును బట్టినయెడల నైరు హస్తమగును.
-: వరుణహస్త లక్షణము :-
శ్లో!! పతాకో దక్షణేవామే శిఖరం వారుణః కరః !!
తా: కుడిచేతియందు పతాక హస్తమును, ఎడమకరమునందు శిఖర హస్తమును బట్టిన వరుణహస్త మగును.
-: వాయుహస్త లక్షణము :-
శ్లో!! అరాళో దక్షణే వామే హస్తేచ్కార్ధ పతాకకః !
ధృతౌచేద్వాయుదేవస్య హస్త ఇత్యభిధీయతే !!
తా: కుడిచేత అరాళహస్తము, ఎడమచేత అర్ధపతాక హస్తమును బట్టినచో వాయుహస్తమగును.
-: కుభేరహస్త లక్షణము :-
శ్లో!! వామేపద్మం దక్షణేతుగదా యక్షపతేః కరః !!
తా: ఎడమ చేతియందు పద్మహస్తమును, కుడిచేత గదాహస్తమును పట్టిన కుబేరహస్త మగును.
-: నవగ్రహ హస్త లక్షణములు :-
-: సూర్యహస్త లక్షణము :-
తా: భుజశిరస్సుల సమీపములందు, రెండుచేతులచే సోలపద్మ, కపిద్ధ హస్తములు పట్టిన సూర్యహస్త మగును.
-: చంద్రహస్త లక్షణము :-
తా: ఎడమచేతితో సోలపద్మమును, కుడిచేతితో పతాకమును బట్టిన చంద్రహస్త మగును.
-:అజ్గారక హస్త లక్షణము :-
తా: ఎడమచేత సూచీహస్తములు, కుడిచేత ముష్టిహస్తము బట్టిన అంగారకహస్తము వచ్చును.
