Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 46

    దినంగా ఉన్న అతని మొహాన్ని చూస్తే చిన్నమ్మాయికి మళ్ళి నవ్వొచ్చి కిలకిలా నవ్వింది.

    "అయితే నేను మీరు అలా అన్నందుకు కొట్టానని అనుకుంటున్నారా?" అడిగింది చిన్నమ్మాయి నవ్వాపుకుంటూ.

    "కాదా?.."ఆశగా చూస్తూ ప్రశ్నంచాడు చిట్టబ్బాయి.

    చిన్నమ్మాయి తల అడ్డంగా ఊపింది.

    "మీ చెంప మీద ఈగంత ఉన్న దోమ వాలి ఊర్కే కుట్టేస్తోంది. దాన్ని చంపుదామని మెల్లగా కొడ్డామని అనుకున్న కాని పొరబాటున గట్టిగా తగిలినట్టుంది..."

    "అబ్బే... గట్టిగా ఏం తగ్లేదుగాని, అయితే మీరు  అందుకా చెంపమీద కొట్టింది..." సంతోషంగా అడిగాడు.

    "అవును...సరేగాని ఇందాక నాతో ఏమన్నారు?"

    "మీరంటే యిష్టమని అన్నాను" ఈసారి ద్తేర్యంగా చెప్పాడు చిట్టబ్బాయి.

    "ఎంతిష్టం?" అడిగింది చిన్నమ్మాయి.

    "చాలా యిష్టం"

    "మీ కిష్టమ్తేతే సరిపోయిందా?... నా యిష్టాయిష్టాలతో మీకు సంబంధం లేదా?.." చురుకుగా చూస్తూ అడిగింది చిన్నమ్మాయ్.

    చిట్టబ్బాయ్ తెల్లబోయాడు.

    "అలా చూస్తారేం?... నాకిష్టమో కాదో అడగండి"

    "నేనంటే మీ కిష్టమేనా?" మెల్లగా అడిగాడు చిట్టబ్బాయి ఏమంటుందోనని లోలోపలే భయపడ్తూ.

    "చాల యిష్టం!...ఐలప్యూ...అంది చిన్నమ్మాయ్ చిట్టబ్బాయి కళ్ళలోకి చూస్తూ.

    అంతే! చిట్టబ్బాయి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

    "యాహూ..." అని గట్టిగా అరిచాడు.

    అతను అరిచిన అరుపుకి పార్కులోని పక్షులన్నీ భయంతో గోల గోలగా అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ చెట్ల మీద నుండి ఆకాశంలోకి ఎగిరాయ్.

      "అదేమిటి అలా అరిచారు?" కళ్ళు  పెద్దవి చేసి చూస్తూ అడిగింది చిన్నమ్మాయ్.

    చిట్టబ్బాయి సిగ్గుపడ్డాడు. అతను తనని తాను తిట్టుకున్నాడు.

    ఎంత సంతోషం కలిగితే మాత్రం అలా అరవాలా? సంతోషాన్ని మనసు లోనే దాచుకోవాలిగాని...

    "అంటే , ఎందుకరిచానంటే ?మీరంటే నాక్కూడా యిష్టం... అందుకని... ఐలవ్వూ చిన్నమ్మాయ్ గారూ..." భావావేశంతో అన్నాడు చిట్టబ్బాయి.

    చిన్నమ్మాయ్ కిలాకిలా నవ్వింది.

    "చిన్నమ్మాయ్ గారా?...అదేం పిలవడం పనివాడు పిలిచినట్టు? ఏది. మళ్ళి అనండి!" నవ్వాపుకోడానికి ప్రయత్నిస్తూ అంది చిన్నమ్మాయి.

    "ఐలవ్వూ చిన్నమ్మాయ్.. అన్నాడు ఈసారి.
]
    మళ్ళి నవ్వింది.

    "చిన్నమ్మాయ్  యేంటి? మా నాన్నగారు పిలుస్తున్నట్టు! ఈసారి నన్ను చిన్నమ్మాయ్  అని పిలిస్తే ఏంటి బాబాయ్ అంటాను తెల్సిందా?"

    చిట్టబ్బాయి తెల్లమొహం వేశాడు.

    "మరి ఏమని పిలవాలి?" అని అడిగాడు కొన్ని క్షణాల తర్వాత.

    "నా పెరుందిగా?"

    "రాజనిగారూ..."అన్నాడు చిట్టబ్బాయి.

    "నా పేరు రాజనిగారూ  కాదు రజని!"

    "రజని..."

    "చిట్టబ్బాయ్-"

    "రాజ్జూ..."

    "చిట్టి"

    ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్కుంటూ ప్రేమగా పీల్చుకున్నారు ఇద్దరూ.

 

                                  *                  *              *

    "ఎవండేవండి! ప్లీజ్ అండి" అన్నాడు బ్రతిమాలడ్తూ కన్నారావు.

    "ఊహు! నేను చెప్పనుగాక చెప్పను" అంది ఆ అమ్మాయి చకచకా ముందుకు నడుస్తూ.

    "ప్లీజ్! నన్ను ఎడిచింపక  చెప్పండి" ఆ అమ్మాయి వెనకాలే నడుస్తూ అన్నాడు కన్నారావు.

    "ఎందుకు చెప్పాలి?" అతని వంక చూడకుండానే ముందుకు అడుగులు వేస్తూ ప్రశ్నించింది ఆ అమ్మాయి.

    వాళ్ళిద్దరూ ట్యాంక్ బండ్ మీద నడుస్తున్నారు... ఆ అమ్మాయి ముందు ఆమె వెనకాల కన్నారావు.

    ఊర్కేనండి...మరి నేను నా పేరు చెప్పానుగా. మీపేరు కూడా చెప్పండి... ప్లీజ్, ఈ ఒక్కసారి చెప్పండి... మళ్లి మిమ్మల్ని ఎప్పడూ అడగనుగా?..."

    "అయితే నేనొక చిక్కు ప్రశ్న వేస్తాను. దానికి జావాబు చెప్తే చెప్తాను..." ఆగి వెనక్కి తిరిగి అంది ఆ ఆమ్మాయి.

    "అబ్బా... మళ్ళి చిక్కు ప్రశ్న!" కన్నారావు నెత్తి పట్టుకున్నాడు  "మీ చిక్కు ప్రశ్నకి  నేనెలాగూ జవాబు చెప్పలేను... మీరేమో పేరు చెప్పకుండా వెళ్ళి పోతారు. ఎందుకు చెప్పండి నన్నిలా ఏడిపిస్తారు?" దినంగా అడిగాడు కన్నారావు.

    "నేనా?...మిమ్మల్ని ఎడిపిస్తున్నానా? బాగానే ఉంది...మిరే వెంటపడి పేరు చెప్పమని నన్ను  వేధిస్తూ ఏడిపిస్తున్నారు."

    ఊర్కే బ్రతిమలాడ్తే లాభం లేదని ఆ అమ్మాయిని  కన్విన్స్ చేయడానికి పూనుకున్నాడు కన్నారావు.

    "అది కాదండి.. మీ పేరు చెప్పినంత మాత్రాన మీకు వచ్చే  నష్టం ఏమి లేదు కదండి?...నేను మీ పేరే అడుగుతున్నానుగాని అడ్రసేం అడగడం లేదు కదండి?"

    "అయితే మాత్రం నా పేరు మీకు చెప్పాలనేం ఉంది? అసలు ఎందుకు చెప్పాలండి-ఆ ?" రెట్టిస్తూ అడిగింది ఆ ఆమ్మాయి.

    "ఎందుకంటే  మీరంటే యిష్టం కనుక..." మెల్లగా అన్నాడు కన్నారావు మనసులో బెరుకుగా ఫీలవుతూ.

     "ఎంతిష్టం?" కొంటెగా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.

    ఆ అమ్మాయి అలా కొంటెగా చూస్తూ అడిగేసరికి కన్నారావు ద్తెర్యం వచ్చింది.

    "చాలా యిష్టం అండి. మీరు నిప్పుల్లో దూకమన్నా దుకుతా... నీళ్ళలో దూకమన్నా దూకుతా."

    "ఇక్కడినుండి ఈ నీళ్ళలో దూకమన్నా దూకుతా... నీళ్ళలో దూకమన్నా దూకుతా."

    "ఇక్కడి నుండి ఈ నీళ్ళలో దూకమన్నా దూకుతారా?" ట్యాంకు బండ్ కింద ఉన్న హుస్సేన్  సాగర్ వ్తెపు చూపిస్తూ అడిగింది ఆ అమ్మాయి.

    "ఓ.."హుషారుగా అన్నాడు కన్నారావు.

    "అయితే దూకండి!" ఠకిమని అంది ఆ అమ్మాయి.

    "ఆ?" అన్నాడు కన్నారావు ఆ అమ్మాయి అన్నది తను సరిగా నిన్నాడో లేదో అర్ధంకాక.

    "దూకమంటున్నాను!"

    "మీరు భలేగా జోక్ చేస్తారండి. హిహి..."

    "నేనేం జోక్ చేయడం లేదు.  నిజంగానే అంటున్నాను!" సీరియస్ గా  కన్నారావు వంక చూస్తూ అంది ఆ అమ్మాయి.

    కన్నారావు బిక్కచచ్చిపోయాడు.

    "నిజంగానే అంటున్నారా?"

    "అవును - నిజంగానే అంటున్నాను"

    కన్నారావు ట్యాంక్ బండ్ మీది నుండి  కిందికి నిళ్ళ వంక చూశాడు.

    "అమ్మో! చాలా ఎత్తుగా ఉంది కదండి?" అన్నాడు భయంగా.

    "అవును!" అంది ఆ ఆమ్మాయి బిగబట్టి నవ్వుని ఆపుకుంటూ.

    "ఇక్కడినుండి కిందికి దూకుతే చచ్చిపోతారా?"

    "అనుకుంటా మరి! ఇదివరకు ఇక్కడి నుండి చాలా మంది దూకి ఆత్మహత్యలు  చేస్కున్నారుగా?"

    కన్నారావు మళ్ళి కిదింకి తొంగి చూశాడు.

    పది క్షణాలు  ఆగి అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS