Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 45

    కన్నారావు ,చిట్టబ్బాయ్ ఇద్దరూ సోఫాలో పక్కపక్కన  కూర్చున్నారు. వాళ్ళ ఎదురుగ రంగనాయకులు చాముండేశ్వరి కూర్చున్నారు. ఓ పక్కగా భీమయ్య చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

    చిట్టబ్బాయి మనసులో పికుతూనే వుంది, లోపలి నుండి చిన్నమ్మాయి రాదేం? అని.

    "అన్నట్టు మీ పండుగాడు  ఎక్కడా కనిపించడం లేదేం?" అన్నాడు చిట్టబ్బాయి రంగానాయకుల్తో.. చిన్నమ్మాయి గురించి ఆడగాలేక.

    "వాడూ, చిన్నమ్మాయి బయటికి వెళ్ళారు. చిన్నమ్మాయి స్నేహితురాలి పుట్టిన రోజట ఈవేళ. అది పొద్దున్నే పండుని తీస్కుని నా కారేస్కుని వెళ్ళిపోయింది" చావుకబురు చల్లగా చెప్పాడు రంగనాయకులు.

    చిట్టబ్బయికి  నీరసం వచ్చింది.

    "చిన్నమ్మాయి ఫ్రెండు పుట్టినరోజు ఈవేళే కావాలా? పోనీ పుట్టిన రోజు ఈ వెళే  అయితే అయ్యింది - భోజనానికి చిన్నమ్మాయి ఉన్న రోజు ఇన్త్వేట్ చెయ్యొచ్చుగా!"  అని మనసులోనే విసుక్కున్నాడు చిట్టబ్బాయి.

    రంగనాయకులు  చిట్టబ్బాయి, కన్నారావుల్ని వాళ్ళ ఆఫీసు గురించి, ఉద్యోగాల గురించి అవి ఇవి అడిగాడు. తన బిజినెస్ ల గురించి కూడా వాళ్ళకి చెప్పాడు.

    "ఇంక భోజనాలకి లేవండి" అంది చాముండేశ్వరి ఎనిమిది గంటలు దాటుతుండగా.

    "లేవండి బాబూ. కాళ్ళు చేతులూ వాషింగ్స్  చేస్కుని డ్తెనింగ్ రూంకి రండి బాబూ" అన్నాడు భీమయ్య.

    అందరూ భోజనాలకి లేచారు.

    చిట్టబ్బయికి భోజనం ఏమాత్రం చేయబుద్దికాలేదు....అన్నాన్ని వెళ్ళాతో కెలుకుతూ మోతుకుల్ని ఎరుకుంటున్నట్టు తిన్నాడు.

    చిట్టబ్బాయి, కన్నారావులు రంగనాయకులు ఇంట్లోంచి బయటపడే సరికి రాత్రి తొమ్మిది గంటల్తెంది. చిన్నమ్మాయి అంతదాకా ఇంటికి  రాలేదు.

 
                                                                       13

    "మీరు నిన్న యింట్లో ఉండి ఉంటే బాగుండేది!..." గడ్డిపికుతూ అన్నాడు చిట్టబ్బాయి.

    అప్పటికి అలా ఓ పదిసార్లు అయినా అని ఉంటాడు.

    "ఎదురుగుండా ఉన్నప్పుడు మాట్లాడకుండా యింట్లో లేనని సాదిస్తారేం? నా స్నేహితురాలి పుట్టినరోజుకి  వెళ్ళకుండా ఉండలేను కదా? అయినా మీ ప్రాబ్లెం ఎంతో అర్ధం కావడం లేదు మా నాన్నగారు  మిమ్మల్ని భోజనానికి పిలిచినప్పడే రావాలా? మామూలుగా పలకరించడానికి రాకూడదా?

    "రాకూడదని  కాదుగాని మీవాళ్ళు ఏమనుకుంటారోనని" నసిగా మరికాస్త గడ్డిపికి పక్కన వేశాడు.

    "కన్నకొడుకు ప్రాణాలు రక్షించిన వాడు యింటికి వస్తే సంతోషిస్తారుగాని ఎందుకు బాధపడ్తారు?... ఇంక గడ్డి పీకడం ఆపండి... పార్కులోని  తోటమాలి చూశాడంటే కాస్సేపయ్యాక మీరు చెట్లు కూడా పికేస్తారేమోనని అనుమానం వచ్చి మన ఇద్దర్ని బయటికి గేంటుతాడు" నవ్వుతూ అంది చిన్నమ్మాయ్ .

    చిట్టాబ్బాయ్ సిగ్గుపడ్డాడు.

    రెండు క్షణాల తరువాత మళ్ళి అన్నాడు.

    "ప్చ్...నిన్న మీరు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది...మేము యింటికి వెళ్ళేవరకూ మిరోస్తారని ఎదురు చూశాను. అయినా మీరు ఉండరని తెలిస్తే మీ నాన్నగారికి చెప్పి ఉండేవాడిని ఈవేళ వద్దండి ఇంకోసారేప్పడ్తేనా  వస్తా అని..."

    చిన్నమ్మాయ్ నిట్టూర్చింది.

    "ఊ...మళ్ళి మొదలుబెట్టారు?... ఇంటికి వెళ్ళేదాకా ఇలా సాధిస్తూనే ఉంటారా లేకపోతే ఏమ్తెనా మాట్లాడతారా?... ఇందుకేనా పార్కుకి రమ్మని నాకు ఫోన్ చేశారు? ప్తేగా పండుని వెంట తిసుకురావోద్దని... ఏమ్తెనా చెప్పండి..." అంది చిన్నమ్మాయ్...

    చిట్టబ్బాయ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఇలా ఉన్నాడు.

    "పార్కులో వాతావరణం బాగుంది కదండి...చల్లగా...హాయిగా"

    "ఈ విషయం మొన్న వచ్చినప్పడే చెప్పారు" అంది చిన్నమ్మాయ్.

    "అంటే ఈ వేళ కూడా చల్లగా హాయిగా ఉంది కదా అని..." నసిగాడు చిట్టబ్బాయి.

    "సర్లె...ఇంకా?" అంది చిన్నమ్మాయ్.

    "పచ్చిక పచ్చగా,ఆకాశం నీలంగా ఉంది కదండి!"

    చిన్నమ్మాయ్ కళ్ళు చిట్టించి అతన్ని చూసింది.

    "కొంగలు తెల్లగా, కాకులు నల్లగా లేవా?" అంది.

    చిట్టబ్బాయి ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు.

    "అరె!...మీరు కూడా అచ్చు మా కన్నారావులాగే అడిగారే!!"

    "మీరిలా మాట్లాడితే ఎవర్తెనా అలానే అడుగుతారు... మనం ఇంక యింటికి పోదామా?" పచ్చికలోంచి లేవడానికి సిద్దపడ్తూ అడిగింది చిన్నమ్మాయ్.

    "ఏవండి ప్లీజ్...ఇంకాస్సేపు కూర్చుందామండి" అన్నాడు చిట్టబ్బాయి.

    "మరి ఏమ్తెనా చెప్పండి"

    చిట్టబ్బాయి తలవంచుకుని కాస్సేపు మౌనంగా కూర్చున్నాడు.

    "ఊ...మాట్లడండి!" అంది చిన్నమ్మాయి.

    చిట్టబ్బాయి మెల్లగా  తల ఎత్తి ఆమె వంక చూశాడు.

    "నాకు...అంటే...నేను...అదే...నాకు..మరి..."

    "చెప్పండి..."

    "మీరంటే చాలా యిష్టం" ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు.

    వెంటనే చిన్నమ్మాయి చేయి గాల్లోకి లేచింది. అది రివ్వున చిట్టబ్బాయి వ్తెపుకి  వచ్చి అతని చెంపని "ఠాప్" మని  తాకింది.

    చిన్నమ్మాయి తన చెంపమీద కొడ్తుందని ఊహించని  చిట్టబ్బాయి నివ్వెరపోయాడు.... తరువాత బాధతో కుచించుకుపోయాడు.

    ఆ క్షణంలో అతనికి కన్నారావు మీద పికల్దాక  కోపం వచ్చింది. "ఆ అమ్మాయికి ని మనసులోని  మాట చెప్పెయ్... ఆలస్యం చేయకు" అంటూ కంగారు పెట్టేశాడు. తను అనవసరంగా కంగారుపడి చెంపదెబ్బ తిన్నాడు.

     అసలు ముందు స్నేహం చేయాలి!... ఆ స్నేహం డెవలప్ కావాలి!! ఆ తరువాత చెప్పాలి నిన్ను ల్తేక్ చేస్తున్నాననో లవ్ చేస్తున్నాననో ... అంతే గాని కలిసిన రెండోసారే చెప్పేస్తే ఎలా?

    చిట్టబ్బాయి చెంప రుద్దుకున్నాడు.

    "సారి అండి - ఆయామ్  వెరి వెరి సారి...." అన్నాడు చిన్నమ్మాయితో గొణుగుతూ.

    "అదేంటి? నాకెందుకు సారి చెప్తారు...పాపం! చెంప రుద్దుకుంటున్నారు. గట్టిగా తగిలిందో ఏంటో... నేనే మీకు సారి చెప్పాలి!' అంది చిన్నమ్మాయి.

    "గట్టిగా ఏమి తగ్గల్లెడులేండి.  మీరు మంచివాళ్ళు కాబట్టి మెల్లగా కొట్టారు. అదే వేరే ఎవర్తెనా అయితే ఇంకా గట్టిగా గూబపగిలేలా కొట్టేవారు" మెల్లగా అన్నాడు చితబ్బాయి.

    చిన్నమ్మాయి అతని వంక ఆశ్చర్యంగా చూసింది.

    "అదేంటి?..అంత గట్టిగా  ఎందుకు కొడ్తారు?"

    "ఎందుకు కొట్టరు? ఎదో కాస్త అభిమానించింది కదా అని ఒకమ్మాయిని పార్కుకి తిస్కోచ్చి మీరంటే యిష్టం. మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటూ పిచ్చివాగుడు వాగితే కొట్టరు?" అన్నాడు అమాయకంగా చిట్టబ్బాయి.

    "మీరు కేవలం మీరంటే యిష్టం అని అన్నారుగాని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనలేదుగా?..."

    "అలా అని ఉంటే ఇంకా గట్టిగా కొట్టి ఉండేవారేమో!"

    చిన్నమ్మాయి ఫక్కున నవ్వింది.

    ఆమె  అలా నవ్వుతుంటే  ఎంతో అయోమయంగా ఆనిపించింది చిట్టబ్బయికి.

    "అయితే నేను గట్టిగా కొట్టానండి?... సారినండి...." నవ్వు ఆగిన తరువాత బాధాగా చూస్తూ అంది చిన్నమ్మాయి.

    "ఆబ్బే, లేదులెండి. అయినా శరీరానికి తగిలే దెబ్బ కాదులెండి మనసుకి తగిలే దెబ్బ, మెల్లగా కొట్టినా మనసుకి తగిలేది తగుల్తుంది" బాధగా అన్నాడు చిట్టబ్బాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS