నా ఊహ కరెక్టే అయింది. అతని చిరునామా సంపాదించడం చాలా సులువైంది. అతను సామాన్యుడు కాడు? పేరు ప్రతిష్టలున్న ఒక కోటీశ్వరుడుని ఏకైక పుత్రుడు. వివరాలు వింటూనే ఆశ్చర్యపడ్డాను.
అతనా హోటల్ వాళ్ళకు బాగా సుపరిచితుడు. సాధారణంగా అతనేప్పుడా ఊరు వచ్చినా ఆ హోటల్లో నే బస చేస్తాడట.
ఒక కోటీశ్వరుని కొడుకు, ఒక లాకెట్ కోసం ఎందుకింతగా ప్రయత్నిస్తాడు? ఆ లాకెట్ లో ఉన్న మర్మమేమిటి? క్రమంగా చిక్కులేక్కువే అవుతున్నా యనిపించింది నాకు.
వీర్రాజు దగ్గరకు వెళ్ళి బాగా ఆలోచించాను. అతను కూడా ఈ విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. చాలాసేపు ఆలోచించాక , "నాకు ఒక్క టనిపిస్తుంది. గొప్ప వాళ్ళకు కొన్ని ఫాన్సీ లుంటాయి. ఉదాహరణకు స్టాంపు కలక్షన్ సంగతి తీసుకోండి. కొంతామంది ఉపAయోగించిన మామూలు స్టాంపు కోసం ఒకోసారి లక్షల కొద్ది డబ్బు గుమ్మరిస్తారు. ఎందుకంటె ఏం చెప్పలేము. అదో పిచ్చి - అతనికి నీ లాకెట్ నచ్చింది. దాన్ని తన స్వంతం చేసుకువాలనుకున్నాడు. ఐతే నువ్వు అది డబ్బు కివ్వవనీ , దానికీ నీకూ సెంటిమెంటల అటాచ్ మెంట్ ఉన్నదని గ్రహించి వుంటాడు. అందుకే దానికింత ప్లాను, అంత డబ్బూ వృధా చేశాడు." అన్నాడు.
` వీర్రాజు చెప్పినది అంత కచ్చితంగా లేకపోయినా నిజముండక పోదని పించింది. ఐతే ఇప్పుడెం చేయాలి? అతని దగ్గర పదిహేను వేలు తీసుకున్నాక మళ్ళీ లాకెట్ అడగడానికి మనసొప్పడం లేదు. డబ్బు ఎంత సెంటిమెంటల్ అటాచ్ మెంట్స్ యినా పోగొడుతుంది. ఎలాగూ నీళ్ళు వదులుకున్నా నా లాకెట్ కి. అటువంటిది మరో పదిహేను వేలు కూడా తెచ్చి పెట్టింది.
అయితే అతను కేవలం వెర్రివాడై ఈ లాకెట్ కోసం ఇంత ఖర్చు పెట్టాడా?" ఈ విషయాన్నే లాగైనా పరిశోధించాలనిపించింది.
అతను కోటీశ్వరుడి కొడుకని అప్పట్లో నాకు తెలియదు. వీర్రాజుకి నిద్ర మాత్రలిచ్చే పని పురమాయించడానికి నెల రోజుల ముందు అతనితో పరిచయమయింది. ఆ నెల రోజుల్లోనూ అతని పరిజ్ఞానం మీదా, సామర్ధ్యం మీదా నాకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఐతే అతను తన గురించి నాకే వివరాలూ ఇవ్వలేదు. అప్పట్లో నేను సంపాదించడానికి ప్రయత్నించనూ లేదు. అందుకే ఇప్పటివరకూ నా స్మృతీ పదంలో అతను అతను గానే నిలిచిపోయాడు. ఇప్పుడు తెలిసింది, అతని పేరు విశ్వం అని.
నేను హైదరాబాద్ లోని విశ్వం ఇల్లు చూశాను. అది చాలా పెద్ద భవంతి. ఆ భవంతిలో ఎందరో నౌకర్లున్నారు. వాళ్ళలో ఒక ముసలాడితో పరిచయం చేసుకున్నాను. వాడు విశ్వాన్ని చిన్నతనం నుంచి ఎరిగి ఉంటాడనీ, వాడి వల్ల అతని అలవాట్లు తెలుసుకోవచ్చు ననీ నేను భావించాను.
"మీ విశ్వం అయ్యగారి అలవాట్లన్నీ నీకు బాగా తెలుసు ననుకుంటాను?" అన్నాను.
"తెలియదండీ , అయన నీ ఇంట్లో అడుగుపెట్టి ఇంకా రెండేళ్ళు పూర్తీ కాలేదండీ."
"దెబ్బ తిన్నాను --"అంటే?"అన్నాను.
"అదే మా కేవ్వరికి కూడా అర్ధం కాలేదండి. ఒకరోజు ఈయన మా ఇంటికి వచ్చారండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించమని పెద్దయ్య గారిని ప్రాధేయ పడ్డారండి. పెద్దయ్యగారు సరేనని ఒక అడ్రసిచ్చి అక్కడికి వెళ్ళమన్నారండి. అవసరమైతే - అక్కడ ఓ రెండు మూడు వందలు ఇచ్చుకోమన్నా రండి. దానికీయన ముఖం ముడుచుకు, నా మేడలో లాకెట్ తప్ప ఏమీ లేదు. ఇది మీ దగ్గరుంచుకుని, అందాక కొంత డబ్బిస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత తీర్చేస్తా నన్నారండి. పెద్దయ్య గా రా లాకెట్ చూస్తూనే అదోలాగై పోయారండి. విశ్వంగా రెక్కువగా ఇంటి పట్టున వుండరం...."
వాడు ఇంకా ఏదో చెప్పబోతుండగా వారించి, "ఈ ఇంట్లో ఎన్నాళ్ళు గా పని చేస్తున్నావు?" అనడిగాను.
"పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నా నండి" అన్నాడు వినయంగా.
"మీ అయ్యగారికి జ్యోతిషం పిచ్చి వుందా?" అన్నాను.
"పెద్దయ్యగారికి చాలా పిచ్చి లెండి. ఊళ్ళోకి ఏ జ్యోతిష్కుడు వచ్చినా వదలరండి" అన్నాడు.
ఆ ముసలాడికి వంద రూపాయలిచ్చి అక్కణ్ణించి బయట పడ్డాను. హైదరాబాద్ కు తన మకాం తరలించ వలసిందిగా వీర్రాజు కుత్తరం రాశాను.
ఈ లాకేట్లో ఏదో మర్మముంది. అది చూడగానే ఆ కోటీశ్వరుడెందుకలా అయిపోయాడు? ఉద్యోగానికి దారి చూపిస్తానన్నవాడు విశ్వాన్ని కొడుకుగా ఎందుకు చేసుకున్నాడు? ఆకోతీశ్వరుడిలా ప్రవర్తిస్తాడనివిశ్వానికి ముందుగానే తెలిసి వుండాలి. అందుకే నా దగ్గర నుంచి లాకెట్ సంపాదించి అయన దగ్గరకు వెళ్ళి తెలివిగా ఆయనకు చూపించాడు.
ఆ లాకెట్ కూ ఈ కోటీశ్వరుడికీ ఎదో సంబంధముంది. అయితే ఆ లాకెట్ నా దగ్గరెందుకుంది? నా దగ్గరున్న ఈలాకేట్ కోటీశ్వరుడి కేలా తెలుసు? నా లాకెట్ తనను ఒక కోటీశ్వరుడి ఆస్తికి వారసుణ్ణి చేస్తుందని విశ్వాని కేలా తెలుసు?
ఇందులో చాలా పెద్ద రహస్యం ఇమిడి ఉంది.
3
"మీరు ఒక వస్తువు చూసి - ఒక మనిషిని చేరదీసారు. కానీ ఆ వస్తువుకు స్వంత దారుడు అతను కాదు. అతను వేరే వున్నాడు" అన్నాడు వీర్రాజు.
నాగభూషణం ముఖకవళికలు మారాయి. అయన ముఖంలో అనుమానం తొంగి చూసింది. "ఎవరు మీరు? నిజంగా జ్యోతిష్కులేనా?' అన్నాడు.
"కావడానికి జ్యోతిష్కుడినే కాని మీ విషయంలో నిజం నేను జ్యోతిషం ద్వారా తెలుసుకోలేదు" అన్నాడు వీర్రాజు.
'అయితే లాకెట్ సంగతి మీకు తెలుసా? లాకెట్ స్వంత దారుడిని చూపించగలరా?
'ఆహా! అతను మీ ఎదురుగానే వున్నాడు?"
నాగభూషణం నన్ను చూశాడు. అయన కళ్ళు నన్ను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నాయి. "మీరు చెప్పేది నిజమా?" అన్నాడాయన మళ్ళీ.
"మిమ్మల్ని మరో విధంగా కలుసుకోవడం పడదనే ఈ విధంగా కలుసుకోవలసి వచ్చింది. మీరు వింటానంటే ఆ లాకెట్ కధంతా వివరంగా చెబుతాను." అంటూ వీర్రాజు ఆయనకు వివరాలన్నీ చెప్పాడు. అంతా విని నాగభూషణం భారంగా నిట్టూర్చాడు. మౌనంగా కొద్ది క్షణాల సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత నన్ను దగ్గరకు రమ్మని సంజ్న చేశాడు. వెళ్ళాను. "నీకు చెప్పుకోదగ్గ పెద్ద పుట్టుమచ్చ లేమైనా ఉన్నాయా?' అన్నాడు.
"ఆ కుడి వైపు తోడ దగ్గరచిటికేన వ్రేలంత నల్లని మచ్చ వుంది?" అన్నాను.
"ఎడమ వైపు చెవిలో " అన్నాడాయన ఆత్రుతగా.
"ఉంది కానీ అది చాలా చిన్న మచ్చ."
'అలాగా అయితే నువ్వోకసారి నాతోరా"అన్నాడాయన. నేను మౌనంగా ఆయన్ను అనుసరించాను.
దారిలో అయన కారొక సెలూన్ దగ్గర ఆగింది. "శుభ్రంగా క్షరం చేయించుకునిరా. ఆ గెడ్డం మీసాలు తీసేసేయ్"అన్నాడు. మరో అరగంటలో నేను ఎప్పటి చిరంజీవి నై అయన కార్లో ఎక్కాను. కారు శరవేగంతో వెడుతోంది. "ఇప్పుడు మన మెక్కడికి వేడుతున్నామో తెలుసా?"
"తెలియదు?"
"జీవితంలో నేనొక పాపం చేశాను. నాకొక అందమైన భార్య ఉండేది. ఆమె అందాన్ని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. అయితే ఆమెను వివాహం చేసుకున్నాక ఆమె పై తీరని అనుమానం కలిగింది. మాకొక బిడ్డ కలిగాడు. వాడు నా బిడ్డడు కాదని నాకు బాగా అనుమానం కలిగింది. నాలో ఈ అనుమానం రేకెత్తించి దానికి ప్రాణం పోసినవాడు నా ఆఫీసు వ్యవహారాలు చూసే ఒక సామాన్య గుమస్తా. వాడు అదివరలో నా భార్యను ప్రేమించి వున్నాడు. తన కందకుండా పోయిన ఆమె జీవితం నాశనం చేయాలని పగబట్టి సఫలీక్రుతుడయ్యాడు.
అభిమానవతి అయిన నా భార్య ఇల్లు వదిలి వెళ్ళి పోయింది. ఈ ఊళ్ళో ఆత్మహత్య చేసుకుంటే నాకు అనుమానమని ఏదో దూర వూరు వెళ్ళి అక్కడ ఒక ఇంటి గుమ్మం ముందు పిల్లాడిని వదిలిపెట్టి అక్కణ్ణించి మరో ఊరు వెళ్ళి నదిలోకి దూకింది.
అయితే ఆమె చావలేదు. ఎవరో ఆమెను రక్షించడమే కాక గుర్తుపట్టి జాగ్రత్తగా నా దగ్గరకు చేర్చారు. అప్పటికి నేను నా పొరపాటును గ్రహించి వున్నాను. అయితే తర్వాత ఇంతవరకూ మాకు బిడ్డలు కలుగలేదు. ఎంత ప్రయత్నించినా మా పిల్లవాడి ఆచూకీ తెలియలేదు. మెడలో లాకెట్ మొలతాడుకు తాయేత్తు ప కుడి తొడలో , ఎడమ చెవిలో పుట్టుమచ్చ లు వాడి గుర్తు. అన్నిటికీ మించి వాడిని బాగా నా పోలికలన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
అయితే సుమారు రెండేళ్ళ క్రితం అనుమాన పరిస్థితిలో ఒకడు లాకెట్ తో నా ఇంట్లో ప్రవేశించాడు. నాకు కావలసిన పుట్టు మచ్చల గుర్తులు వాడి దగ్గర లభించలేదు. అయితే వాడి ద్వారా నా కొడుకు ఆచూకీ తెలిసే అవకాశాలున్నాయనిపించింది. అందుకే వాడిని ఇంట్లో చేరదీశాను. నా అనుమానాలు బయటకు రానివ్వలేదు. కానీ వాడిని చూడగానే నా భార్య ఆరోగ్యం దెబ్బతింది. ఇంతకాలం తనకొడుకు తప్పక బ్రతికి ఉంటాడని ఆమె ఆశిస్తోంది. వాడా ఆశలను వమ్ము చేశాడు. ఇప్పుడు మనం హాస్పిటల్ కు వెడుతున్నాం. అక్కడ మీ అమ్మ వుంది" అన్నాడాయన.
"నా అమ్మ" అస్పష్టంగా గోనుక్కున్నాను. అయిదేళ్ళ క్రితం మరణించిన అమ్మ నా అమ్మ కాదు. ఏనాటి కైనా నా ఐడెంటిటీ తెలియకపోడనే ఉద్దేశ్యంతోనే ఆమె నా లాకెట్ గురించీ, తాయెత్తు గురించీ హెచ్చరిస్తూ ఉండేదన్నమాట. కానీ ఆ అమ్మ ఎంత మంచిది. అమ్మ అనగానే ఆమె నాకు గుర్తు కోస్తుందే!
* * * *
ఈ లాకెట్ వగైరా వివరాల గురించి చాలా కాలంగా తన తండ్రి ప్రయత్నిస్తున్నాడని, చనిపోయే ముందు వివరాలు తనకు చెప్పి ప్రయత్నించమన్నాడనీ, తను ప్రయత్నించి విజయం సాదించాననీ విశ్వం నిజం ఒప్పుకున్నాడు. ఈనిజం చెప్పినందు కతనికి లక్ష రూపాయల నగదు ముట్టింది. తన బిడ్డను తనకు చేర్చినందుకు ప్రతి ఫలంగా నాగభూషణం అతని తప్పుల్ని క్షమించేశారు.
ఒక అమ్మ పొతే నాకింకో అమ్మ దొరికింది. అమ్మ నా చెల్లెలినీ చూసి మరింత సంతోష పడింది. "ఇన్నాళ్ళూ నా బాబుని పెంచడమే కాకుండా, నాకు ఆడపిల్లలు లేని లోటు కూడా తీర్చింది మీ అమ్మ" అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంది.
సునీత ఎప్పటికీ నా చెల్లెలే -- మాది ఒకనాటి అనుబంధం కాదు. ఇరవై ఏళ్ళ మమతానుబంధం.
***
