Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 46


    ప్లేన్ ఎక్కి, సీట్లో సెటిల్ అయ్యాక, అప్పుడు పక్కకి తిరిగి చూసింది సీత. వెంటనే ఆమె మొహంలో ఆశ్చర్యం కనబడింది. పక్కసీట్లో కూర్చుని ఉన్నడు మనోహర్.
    "హలోమనోహర్!" అంది పలకరింపుగా.
    విండోలోనుంచి నిస్తేజంగా బయటికి చూస్తున్న మనోహర్ చటుక్కున తిరిగిచూశాడు.
    "మీరా!"
    "మీరు నిన్ననే వెళ్ళిపోతానన్నారు హైదరాబాద్ కి. వెళ్ళలేదా?" అంది సీత.
    "లేదు. నిన్న డాడీకి బాగా టెంపరేచర్ వచ్చింది. ప్రయాణం కేన్సిల్ చేసుకోమన్నారు డాక్టర్లు."
    "నీకాలు ఎలా ఉంది మనోహర్?"
    "నాట్ వెరీ బాడ్!"
    "మీ డాడీ ఏరీ?"
    "అదిగో అక్కడ! విండో సీటు!"
    అటువైపు చూసింది సీత. అవతలివరుసలో కూర్చుని ఉన్నాడు బ్రహ్మాజీరావు.
    సమాధిలో ఉన్నట్లు ఉన్నాడు అతను. శూన్యంగా ఉన్నాయి అతని చూపులు అతన్ని చూస్తే జాలివేసింది సీతకు. కొద్దిరోజులక్రితం బిజినెస్ వృద్ది చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి. భార్యాకొడుకులతో ఎక్స్ పెన్సివ్ రెస్టో రెంట్ లో వేలకివేలువెదజల్లుతూ సెలబ్రేట్ చేసిన వ్యక్తి.
    ఇవాళ తన సర్వస్వం అనుకున్న భార్యని పోగొట్టుకుని, తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిని, తిరిగివెళ్ళి పోతున్నాడు.
    మనుషులని మరబొమ్మలని చేసి ఆడించగలదువిధి! వినువీధుల్లో విహరించే వాడిని వీధులు పట్టుకుతిరిగేవాడిగా మార్చగలదు ఈ వీధి!
    భార్యపోవడం ఒక షాక్ బ్రహ్మాజీరావుకి!
    అంతకుమించిన షాక్ ఏమిటంటే భార్య శవం కూడా దొరకకుండాపోవడం!
    వేడి భరించలేక ప్రమీల నలభై అంతస్తుల మేడమీదినుంచి దూకెయ్యడంతన కళ్ళారా చూశాడు బ్రహ్మాజీరావు.
    కానీ....
    అక్కడనుంచి దూకి కిందపడి చిన్నాభిన్నమైపోయి శవాలాలో అతని భార్యదిలేదు!
    అవి కాకపోతే శవాలు రెండొందల పాతికా దాకా ఉన్నాయి. అయితే అవి గుర్తుపట్టే స్థితిలో లేవు. నల్లగా మాడిపోయి ఉన్నాయి చాలాశవాలు. దేహంతగలబడి పోతున్నప్పుడు వంట్లోని ద్రవపదార్ధాలు అన్నీ ఇరిగిపోగా ముడుచుకుపోయి, పసిపిల్లల శవల్లా కనబడుతున్నాయి పెద్దవాళ్ళ శరీరాలు కూడా.
    వాటి అన్నిటినీ కలిపి సామూహికదహన సంస్కారాలు చేయించారు అధికారులు.
    వాటిలో ఉండి ఉండాలి ప్రమీల శవం!
    భార్యని పోగొట్టుకున్న బ్రహ్మాజీరావు, తల్లిని పోగొట్టుకున్న మనోహర్!
    జాలీ, అభిమానం ఒక్కసరిగా ముంచుకొచ్చాయి సీతకి.
    మనోహర్ చేతిని తనచేతిలోకి తీస్కుని ఆప్యాయంగా వత్తింది.
    ఆమె చేతిలో ఉన్న తన చేతిని చూశాడు మనోహర్ తర్వాత సంకోచంగా ఆమె మొహంలోకి చూశాడు.
    దయగా చిరునవ్వు నవ్వుతోంది సీత. చాలా అందమైన పలువరస ఆమెది. తదేకంగా చూస్తూ ఉండిపోయాడు మనోహర్.
    ప్లేన్ స్టార్ అయింది. సీట్ బెల్టులు బిగించుకోమని అనౌన్స్ చేసింది ఎయిర్ హోస్టెస్. సీత సీట్ బెల్టు కొద్దిగా జామ్ అయింది. బకిల్ పెట్టడానికి రావడంలేదు.
    ఆమెస్ట్రగుల్ అవుతుంటే చూశాడు మనోహర్.    
    "మే ఐ హెల్ప్ యూ" అన్నాడు మర్యాదగా.
    "ప్లీజ్!" అంది సీత.
    కొంచెం ముందుకు వంగి, సీట్ బెల్టుని అడ్జస్ట్ చెయ్యడం మొదలెట్టాడు మనోహర్.
    అతని జుట్టు ఆమె చుబుకానికి తగులుతోంది.
    అచ్చం తన తమ్ముడి జుట్టే! అభిమానంగా అతని వైపు చూసి, అతనికి అనుకూలంగా కొద్దిగా జరిగింది సీత.
    అప్పుడు, అప్రయత్నంగా సమున్నతమైన ఆమె వక్షం, అతని చెంపలని స్పృశించింది.
    ఉలిక్కిపడి, తల దూరంగా తీసేసుకున్నాడు మనోహర్.
    సరిగ్గా అదే క్షణంలో రన్ వే దాటి గాల్లోకి లేచింది విమానం. ఆ కదలికకు అప్రయత్నంగానే, అతని తల మళ్ళీ ఆమె వక్షాన్ని ఆనుకుంది.
    ఒక అరక్షణంపాటు అలాగే ఉండిపోయాడు మనోహర్.
    తర్వాత సర్దుకుని ఆమె సీట్ బెల్టు తాలూకు బకిల్ నొక్కేశాడు.
    అప్పుడు గమనించాడు బ్రహ్మాజీరావు సీతని. అతని కళ్ళలో ఆశ్చర్యం కనబడింది. పలకరింపుగా చిరునవ్వు నవ్వింది సీత.
    తర్వాత హైదరాబాద్ చేరేదాకా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు.
    హైదరాబాద్ చేరగానే ఎయిర్ పోర్టులో ఎదురు చూస్తోంది బ్రహ్మాజీకారు.
    "చెప్పండి! మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చెయ్యమంటారు?" అన్నాడు బ్రహ్మాజీ.
    "వద్దు! నేను టాక్సీలో వెళ్ళిపోతాను." అంది సీత. తను ఇప్పుడు అహల్య ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వీళ్ళు వస్తే ఏం బాగుంటుంది?
    ఎక్కువబలవంతం చెయ్యలేదు బ్రహ్మాజీరావు. మనోహర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయినట్లు కనబడ్డాడు.
    వాళ్ళు వెళ్ళిపోగానే, టాక్సీ ఎక్కింది సీత. ఇరవై నిమిషాల తర్వాత టాక్సీ అహల్య ఇంటి సందులోకి మళ్ళింది.
    అప్పుడు--
    హఠాత్తుగా ఒక వ్యక్తి చేతులు రెండూ ఊపుతూ టాక్సీకి అడ్డంగా పరిగెత్తుకొచ్చాడు.
    "ఆపేయ్! ఆపేయ్! డేంజర్! డేంజర్!" అని వెర్రికేకలు పెట్టాడు.
    సడెన్ బ్రేక్ వేశాడు డ్రయివర్.
    కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కారు మడ్ గార్డు ఆ వ్యక్తిని బలంగా తాకింది. అతను మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయాడు.
    కంగారుగా డోర్ తెరుచుకుని కిందికి దిగింది సీత. ఒక ఇరవై గజాల అవతల కొంతమంది మనుషులు మూగివున్నారు. ఎలెక్ట్రిక్ పోలునుంచి లైన్ వైర్సు కొన్ని తెగి కిందకు వేళ్ళాడుతున్నాయి.
    టాక్సీగనక వాటిని తాకితే షాక్ తగిలి ఉండేదే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS