Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 46

    జయంతి క్కెట్ తీసుకుని బావి దగ్గరకు వెళ్ళింది. చేద బావిలో వేసి బక్కెట్ నిండా నింపుకుని బక్కెట్టు పట్టుకుని పెరటి  వేపు వెళ్ళింది.

    గిరిజ బావి దగ్గరకు వచ్చి ముఖం కడుక్కుని లోపలికి వెళ్ళిపోయింది.

    వాతావరణం చాలా చల్లగా వుంది.

    డిసెంబరు నెల కావటంతో చలి బాగా వుంది.

    ఏడు గంటలవుతున్నా ఎండ రాలేదు.

    ఆకాశమంతా మబ్బులు పట్టి వున్నాయి.

    సురేంద్ర అప్పటికే చద్దన్నంలో పండుమిరపకాయ పచ్చడి బాగా కలుపుకుని పెద్దపెద్ద ముద్దలు చేసుకుతింటున్నాడు. ఈ రోజు పొలంలో కలుపు మొక్కల్ని తియించాలి. అందుకే పెందలాడే పొలంకు వెళ్ళటానికి సిద్దపడుతున్నాడు. ప్లేటు నిండా అన్నం పెట్టుకుని ఒట్టి పచ్చడితోనే తింటున్నాడు.

    "అదేంటి బావా! రాత్రి కూరలు వున్నాయి, ఒట్టి పచ్చడితోనే తింటావెంటి?" అంది గిరిజ.

    "నాకు ఈ చద్దన్నంలో ఇలా పచ్చడి కలుపుకుని తినటమే ఇష్టం గిరిజ...." అన్నాడు.

    "సరేలే! పెరుగుతో కాస్త తిను. అన్నం పెడతాను. ఒట్టి పచ్చడి మెతుకులుతో తింటే కడుపుమంట వస్తుంది" అంది గిరిజ.

    "ఎవరిమీద?" అన్నాడు సురేంద్ర అన్నం కలుపుకుంటూ.

    "ఆ మాటలకు గిరిజ చురుక్కున చూసింది.

    "ఎవరి మిదేంటి?" అంది వెంటనే.

    "అదే కడుపుమంట" అన్నాడు నవ్వుతూ.

    "నికేవరి మీదుంటుంది నా మదే....నీ ముద్దుల మరదలు నీతో మాట్లాడటంలేదుగా....దానికి కారణం నేనేనని తెలుసుగా" అంది గిరిజ మాటలు సాగదిస్తూ

    "మాట్లాడినా తంటానే, మాట్లాడక పోయినా తంటానా. ఎట్లానే నీతో ఏగేది...." అన్నాడు సురేంద్ర.

    ఇదిగో ఇట్లా" అంటూ నెత్తి మీద మొట్టికాయ వేసింది గిరిజ నవ్వుతూ.

    "సరే సర్లే! కాస్త అన్నం పెట్టి పెరుగు వెయ్యి....ఇప్పటికే ఆలస్యమయిపోతోంది." అన్నాడు.

    "బావా! నేను కూడా వచ్చేదా పొలంకు" అంది గిరిజ.

    "నువ్వా ఎందుకే......ఏముందక్కడ?" అన్నాడు సీరియస్ గా.

    ఏమో ఎందుకుంటుంది, నువ్వుంటవుగా?!" అంది నవ్వుతూ.

    "అబ్బో, అమ్మాయిగారి మధ్య మొగుడ్ని వదలటంలేదే! ఇది ప్రేమో....అనుమానమో..." అన్నాడు.

    తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు.

    "రెండూ కాదు" అంది గిరిజ నవ్వుతూ.

    "మరి" అన్నాడు సురేంద్ర పెరుగు ముద్ద నోట్లో పెట్టుకోబోయి అమెవేపు చూస్తూ.

    "వ్యామోహం" అంది సిగ్గుపడుతూ.

    "ఎందుకో" అన్నాడు సీరియస్ గా ముద్ద నోట్లో పెట్టుకుని.

    "నెల తప్పటానికి....నాకో బాబునిస్తే ఇక వాడితో నేను కాలక్షేపం చేసుకుంటాను" అంది సిగ్గుపడుతూ.

    "పోనిలే! వాడ్ని నాకిచ్చి కాశి పోతానంటావనుకున్నాను" అన్నాడు నవ్వుతూ.

    "ఏం అంత కోరికగా వుందా నన్ను వదిలించుకొవలని" అంది సీరియస్ గా.

    "అబ్బ కాదులేవే.....ఏదో సరదాకి అన్నాన్లే....అన్నాడు మంచి నీళ్ళ చెంబు చేత్తో ఎత్తి పట్టుకుని.

    "మరేంటి నేను వచ్చేదా పొలంకి" అంది గిరిజ.

    "అక్కడ కుదరదు కదా అందరూ వుంటారు" అన్నాడు సురేంద్ర.

    "దేనికి, కుదరటం ఏంటి?" అంది గిరిజ ఆశ్చర్యంగా.

    "అదే నీకు బాబునిచ్చే కార్యక్రమం చేయటానికి" అన్నాడు చేయి కడుక్కోవటానికి పెరటి వేపు వెళుతూ.

    గిరిజకు కొన్ని క్షణాలు అతనేమన్నాడో అర్ధంకాలేదు. క్రమంగా అర్ధమయింది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబారింది. అంతలో సురేంద్ర లోపలికి వచ్చాడు. దండం పైన వున్న కండువా తీసి చేతులు తుడుచుకుని భుజం పైన వేసుకున్నాడు.

    "మరిక నేను వెళ్ళొస్తా...." అన్నాడు గిరిజను చూసి నవ్వుతూ.

    గిరిజ ఏమి మాట్లాడలేదు.

    "సాయంత్రం తొరగా వస్తాలే....పొలంలో బాగోదు" అన్నాడు ఆమె బుగ్గపై చిటిక వేస్తూ.

    "నిన్నూ" అంటూ ఆమె సురేంద్ర చెవి పట్టి గట్టిగా మెలితిప్పింది.

    "అబ్బో--వదలవే నేప్పెడుతోంది" అన్నాడు.

    గిరిజ నవ్వుతూ అతని చెవి వదిలింది.

    సురేంద్ర బయటకొచ్చి గొడ్ల సావిట్లో వున్న ఎడ్లను ఉడదిసి వాటిని బయటకు తెచ్చి బండికి కట్టాడు. చూరులో వున్న చండ్రాకోలు తీసికొని బండి జాలిలో వేశాడు.

    "మావయ్యా! నేను పొలం ఎల్తున్నా....ఈరోజు కలుపు మొక్కలు తియిస్తాను....నువ్వు రానవసరంలేదులే. నీ ప్రాణం బాగోలేదుగా పడుకో" అన్నాడు రామశేషు దగ్గరకు వెళ్ళి.

    "మంచిదిరా జాగ్రత్త. కలుపు బాగా తీయించు" అన్నాడు.

    "అలాగలాగే" అంటూ బండిని తీసుకుని వెళ్ళిపోయాడు సురేంద్ర.

                                             *    *    *    *

    "హలో జయంతిగారూ బావున్నారా?' అంటూ పలకరించాడు మహేంద్ర.

    జయంతి అతన్ని వెంటనే గుర్తుపట్టలేకపోయింది. కొన్ని క్షణాల అనంతరం ఆమెకు గుర్తొచ్చింది, నవ్వి


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS