Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 45

                                  42.  మూత్రకోశాల్లో రాళ్ళుఎలా ఏర్పడతాయి?

    అనందరావుకి అకస్మాత్తుగా కడుపులో నొప్పి వచ్చింది. నొప్పి భరింఛలేక మెలికలు తిరిగిపోతున్నాడు. ఒకరోజు మూత్రవిసర్జన చేస్తూ వుంటే గోధుమగింజంత రాయి బయటపడింది. ఆ తర్వాత నొప్పి మళ్ళీ రాలేదు. ఆ చిన్న రాయిని డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళి, "డాక్టర్, మనం తినే అన్నంలో ఇసుక ఉంటే శరీరంలో రాళ్ళూ తయారవుతయా?" అని అడిగాడు.

    ఆనందరావులో మాదిరిగానే కొంతమందికి శారేరంలోని వివిధ భాగాల్లో రాళ్ళు తయరవుతాయి. అలా రాళ్ళుతాయారవాదానికీ, మనం తీసుకునే ఆహారంతోపాటు మట్టిగడ్డలు వెళ్ళడానికి సంభందం లేదు. మూత్ర పిందాల మూత్రనాల్లాలోను, మూత్రకోశాలలోను రాళ్ళు తయారైనపుడు ఒక్కొక్కసరి అవి మూత్ర విసర్జనతోపటు బయటపడుతూ ఉంటాయి. ఇలా రాళ్ళు పడినప్పుడు కొందరికి సంవత్సరాల తరబడి ఎటువంటి బాధఉండదు. మరికొందరికి అమితంగా కడుపులో నొప్పిరావడం, మూత్రంతోపాటు రక్తం పడటం, మూత్రవిసర్జన సమయంలో మంట అనిపించడం సహజం, బాధ ఉండటం, అనేది మూత్ర పీడాలలోను, మూత్రనాళ్ళాల్లోనూ ఏర్పడే రాళ్ళమీద, స్థలాన్నిబట్టి ఉంటుంది.

    మూత్రపిందాల్లో ముఖ్యంగా కలిశ్యం ఆక్సలేటు, కాలిశ్యం ఫస్పేటుతో తయారైన రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఏర్పడటానికి అనేక కారాణాలు ఉన్నాయి. పారాథైరాయిడ్ గ్రంధి ఎక్కువుగా పనిచేసినప్పుడు మన శరీరంలో ఉండే కాల్షియం ఎక్కువ మావుత్డులలో మూత్రం లోకి ప్రవేశిస్తుంది. ఇలా అధికంగా ప్రవేశించిన కాల్షియం మూత్రపిండా లలోను, మూత్రవహికలోను గడ్డకట్టి రాళ్లులామారుతుంది. ఆహారంలో విటమిన్ "ఎ" లోపంవుంటేమూత్ర వహికల్లోని టిన్యూలు అనారోగ్యంగా తయారై, ఆ స్థలంలో కాల్షియం అక్సలేటు, కాల్షియం ఫాస్పేటు వంటివి పేరుకునిపోయి రాళ్ళు తాయారవుతాయి.

    అలాగే మూత్రపిండాలు, ,మూత్రకోశవ్యాధులు దీర్ఘాకాలంగా ఉన్నవారిలో అక్కడ ఉన్న బాక్టీరియా క్రిములు రాళ్ళు తాయారవడానికి దోహదం చేస్తాయి. మూత్రపిండాలు, మూత్రవహికల్లోని ఇతర లోపాలు కూడా రాళ్ళూ ఏరడటానికి కారాణాలు. కొందరిలో మూత్రంతోపాటువడ్లగింజలు, పెసర బద్దలు పరిమనంలో రాళ్ళు సునాయాసంగా విసర్జింపబడితే మరికొందరికి వెలగాపండంత పరిమాణంలోకూడా రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్ళు వెలగ పాండులాగా నున్నగానూ, పనసకాయలా గరుకుగానూ వేరువేరుగా ఉంటాయి.

    రాళ్ళు తయారవడం 30_50 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువ. చిన్నపిల్లల్లోకూడా రాళ్ళు తయారవడంలేకపోలేదు. అలాగే స్రీలలోకంటె పురుషుల్లో ఎక్కువ. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడినపుడు ప్రక్కటేముకుల క్రింద, దీనికి సమానంగా నడుము వెనక నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ నొప్పి చాలా ఎక్కువుగా వచ్చి, పొత్తికడుపు దగ్గరకీ, జననేంద్రయాలదగ్గరకీ, తొడల దగ్గరకి ప్రయానిస్తుంది. మూత్రవాహికలో రాళ్ళు ఏర్పడినపుడు కూడా  కడుపు మేలిపేట్టినట్లు తీవ్రంగా నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాలలో మూత్రంలో రక్తం కనబడుతుంది.

    కాల్షియం ఫాస్పేటు రాళ్ళకంటె, కాల్షియం ఆక్సలేటు రాళ్ళు ఎక్కువ బాధ కలిగిస్తాయి. కొన్ని కేసుల్లో మూత్రకోశవ్యాధులు రాళ్ళు తయారవ టానికి కారణం అయి, మరికొన్ని కేసుల్లో వాటిలోని రాళ్ళు మూత్రకోష వ్యాధులను కలుగజేస్తాయి. అందుకనే తరచు మూత్రవిసర్జనలో మంట, మూత్రంలో రక్తం, కడుపులో నొప్పి వచ్చేవరు ఏమైనా రాళ్ళు ఏర్పడుతున్నాయేమో ఎక్సరే ద్వారా నిర్ధారణ చేసుకోవాలి.

    కాల్షియం అక్స్లేటుకు సంభందించిన రాళ్ళే కాకుండా యూరిక్ యాసిడ్ రాళ్ళు, సిస్టేన్ రాళ్ళు, క్వాన్ధిన్ రాళ్ళు కూడా ఉంటాయి. ఏర్పడిన రాళ్ళను బట్టి, తిరిగి అవి ఏర్పడకుండా ఆహారంలో ఆ పదార్ధాలు ఎక్కువ త్రగి, ఎవా ఫావుర్ధాన్ లాంటి బిళ్ళలు వాడితే మూత్రంలో పటు విసర్జింపబడతాయి. పెద్దరాళ్ళుఅయితే ఆపరేషను చేసి తీసివేయవలసిందే.

    ఇలా రాళ్ళు ఏర్పడటం కేవలం మూత్రపిండాల్లోను, మూత్రవహికలలోనే కాకుండా లివర్ దగ్గర ఉండే పసరుతిత్తులోను, పాన్ కరియాటిక్ గ్రంధిలోను, పరాటిడ్, ప్రోస్టేలో గ్రంధుల్లోనూ ఏర్పడతాయి. ఇలా రాళ్ళు ఏర్పడిన చాలా కేసుల్లో సరైన కారణం తెలియకపోయినా, కొన్ని కేసుల్లో మనం తీసుకునే ఆహారంలోని కొన్ని పదార్ధాలు రాళ్ళు ఏర్పడటానికి కారణం అని నిర్ధారణ అయింది. అందువల్ల శరీరంలో వివిధ భాగాల్లో ఏర్పడిన రాళ్ళు రసాయనిక స్థితినిబట్టి, ఆకారాన్నిబట్టిఎటువంటి ఆహార పదార్ధాలను మనివెయవలసిండీ డాక్టర్లు నిర్ణయిస్తారు.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS