Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 44

   

                                                -: జ్ఞానహస్త లక్షణము :-

   శ్లో!!    అదౌపతాకౌధృత్వాతు అంసాదూర్థ్వముఖౌవహేత్ !
    భవేద్జానాభికరః కదితంసృత్తకోవిదైః !
    గ్రహేచహృదయే ధ్యానే, జ్ఞానహస్తోవిధీయతే !!

    తా: మొదట పతాకహస్తములను బట్టి భుజమూలముల కెదురుగనిక్కించిన యెడల జ్ఞానహస్త మగును. ఇది గ్రహము, హృదయము, ధ్యానము, వీనియందు వినియోగింపబడును.

                                                -: రేఖాహస్త లక్షణము :-

   శ్లో!!    అజ్గుష్టఃకుఞ్చితోభూయాన్మధ్యమ్కానామికాతధా !
    కుఞ్చితాస్యాత్కనిష్టాచ తర్జనీ ప్రసృతాయది !
    రేఖాభిధరకరస్స్కోయం ముద్రాయాంసమ్ప్రయుజ్యతే !!

    తా: అంగుష్టమును, మధ్యమ, అనామిక, కనిష్టిలను వంచి చూపుడు వ్రేలును  చాచినయెడ రేఖాహస్తమగును. ఇది ముద్రయందు వినియోగింపబడును.

                          -: వైష్ణవహస్త లక్షణము :-

   శ్లో!!    ఊర్ధ్వగౌత్రిపతాకౌచే వైష్ణవః కరఈరితః !
    విష్ణోరభినయే యోజ్య ఇతిభావ విథోవిధుః !!

    తా: త్రిపతాక హస్తములను యెగుమొగములు బట్టిన యెడ వైష్ణవహస్తమగును. ఇది మహావిష్ణువునందు చెల్లును.

                        -: బ్రహ్మోక్త శుకతుండ హస్త లక్షణము :-

   శ్లో!!    కపిత్థేజ్గుష్ఠతర్జన్యౌ సమానాగ్రౌ దృతౌయది !
    బ్రహ్మోక్త శుకతుణ్డస్స్యాద్గరుడార్థేనియుజ్యతే !!

    తా: కపిద్ధ హస్తముయొక్క  బొటనవ్రేలిని, చూపుడు వ్రేలిని సమాగ్రములుగ పట్టినయెడల బ్రహోక్త శుకతుండ హస్తమగును. ఇది గరుత్మంతుని యందు చెల్లును.

                                               -: ఖండచతుర హస్త లక్షణము :-

   శ్లో!!    చతురేతర్జనీత్యక్తా కనిష్టామిశ్రితాయది !
    నామ్న్కాయంఖణ్డచతురః కీర్తితోభరతాగమే !!

    తా: చతుదహస్తపు  చూపుడువ్రేలును  విడిచి, చిటికెనవ్రేలును చేర్చి పట్టినయెడల, ఖండచతుర హస్తమగును. ఇది రక్తపు మొదలైన ధ్రవ వస్తువులయందు  వినియోగించును.

                            -: అర్ధచతుర హస్తలక్షణము :-

   శ్లో!!    అస్మిన్కనిష్టికౌత్యక్తాయద్యర్థ చతురోభవేత్ !
    మధురాదిరసాస్వాదే వినియోగ్కోస్య కీర్తితః !!

    తా: ఖండచతుర హస్తమందు చిటికెనవ్రేళ్ళను విడిచినయెడల అర్ధచతుర హస్తమగును. ఇది మధురాది రసము లాస్వాదించుటయందు వినియోగింపబడును.

                                      -: లీనముద్రాహస్త లక్షణము :-

   శ్లో!!    ముధ్రాభ్యేతర్జనీ నమ్రా, లీనముద్రాకరో భవేత్ !!

    తా: ముద్రాహస్త  మందలి చూపుడువ్రేలును వంచి పట్టినయెడల లీనముద్రా హస్తమగును.

                            -: బ్రహ్మాది దేవతా హస్త లక్షణములు :-

   శ్లో!!    బ్రహ్మణ చతురోవామే హంసాస్యో దక్షణేకరే !!

    తా: ఎడమచాత చతుర హస్తమును, కుడిచేత హంసాశ్య హస్తమును, పట్టబడునెడ బ్రహ్మహస్తమగును. ఆది బ్రహ్మకు వర్తించును.

                            -: శమ్భుహస్త లక్షణము :-

   శ్లో!!    శమ్భోర్వామే మృగశిర స్త్రీపతాకశ్చ దక్షిణే !

    తా: ఎడమచేత, మృగశీర్ష హస్తమును, కుడిచేత త్రిపతాక హస్తమును పట్టినయెడ శంభుహస్తమగును. ఇది శంభునికి చెల్లును.

                            -: విష్ణుహస్త లక్షణము :-

   శ్లో!!    హస్తాభ్వాం త్రిపతాకాఖ్యాం విష్ణుహస్తః ప్రకీర్తితః !!

    తా: రెండు చేతులను త్రిపతాక హస్తములు బట్టినయెడ విష్ణుహస్త మగును. ఇది విష్ణువునకు చెల్లును.

                            -: సరస్వతి హస్త లక్షణము :-

   శ్లో!!    సూచీకృతే దక్షణ్కేర్ధ చంద్రేవామకరేతధా !
    సరస్వత్యాః కరః ప్రోక్తః భరతాగమవేదిభిః !!

    తా: కుడిచేతి సూచిహస్తమును, ఎడమచేతి అర్ధచంద్ర హస్తమును, పట్టినయెడల సరస్వతి హస్తమగును.

                             -: పార్వతి హస్తలక్షణము :-

   శ్లో!!    ఊర్ధ్వధః ప్రసృతావర్ధచంద్రాఖౌ వామదక్షిణే !
    అభాయోవరదశ్చైవపార్వత్యాః కరఈరితః !!

    తా: కుడి యెడమ చేతులను, క్రిందుమీదులుచేసి  అర్ధచంద్ర హస్తములుగా పట్టిన, అభయ వరద హస్తములగును. అవియే  పార్వతి హస్తములు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS