Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 44

    కన్నారావు చిరునవ్వు నవ్వి చిట్టిబ్బాయ్  భుజం తట్టాడు.

    "అద్గది... అలారా దారికి .. మరి అంత కచ్చితంగా ఆమె నిన్ను ల్తేక్ చేస్తుంది. అని నీకు  అనిపించినప్పుడు ఆమెతో అలాగేనా మాట్లాడం?"

    "ఎలా మాట్లాడాను?"

    "అదే...కొంగలు తెల్లగా ఉన్నాయ్ కదండి.. కాకులు నల్లగా ఉన్నాయ్ కదండి ఎంచక్కా అని!"

    "నేనేం అలా అన్లేదు. పార్కులో వాతావారణం బాగుందన్నాను"

    "పచ్చిక పచ్చగా, ఆకాశం నీలంగా కూడా ఉందన్నావ్!!"

    "అన్నాను... అయితే ఏమంటావ్?" కాస్త విసుక్కుంటూ అన్నాడు చిట్టబ్బాయి.

    "నిన్ను ల్తేక్ చేసే అమ్మాయిని పార్కుకి తిస్కెళ్ళి చెప్పాల్సిన మాటలు అవేనా?

    "పోనీ నువ్వు చెప్పరాదూ? ఏం చెప్పాలో!" అన్నాడు చిట్టబ్బాయి.

    "చిన్నమ్మాయ్!... మ్తే డార్లింగ్! అయ్ లవ్వూ అనాలి!!"

    "అమ్మో!" అన్నాడు చిట్టబాయి గుండెల మీద చేయ్యేస్కుంటూ.

    "నిది వన్ వె ట్రాఫిక్ లవ్ కాదని అన్నావ్...చిన్నమ్మాయి నిన్ను ల్తేక్ చేస్తుందని అన్నావ్...మరి ఆమెతో ని ప్రేమ గురించి చెప్పడానికి ఎందుకు భయపడ్తావ్?"

    "నాకెందుకు భయం...నాకేం భయంలేదు"

    "అయితే ఇప్పడే చిన్నమ్మాయికి ఫోన్ చేసి చెప్పు!" అన్నాడు కన్నారావు.

    "ఇప్పుడా?... ఇంత రాత్రా?" ఇబ్బంది గా  తాత్రేంటి పగలేంతి?... పద చిన్నమ్మాయికి ఫోన్ చేద్దాం."

    చిట్టబ్బాయి ఆలోచనల్లో పడ్డాడు.

    "ఏంటి ఆలోచిస్తున్నావ్? ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో జాప్యం చేస్తే లాభంలేదు" అన్నాడు కన్నారావు.

    "అంటే ఇందాకేకదా మేమిద్దరం కలిసి పార్కుకి వెళ్ళాం?"

    "ఇద్దరూ కాదు...ముగ్గురు! పండుగాడు కూడా మీ వెంట వచ్చాడు" తప్పని సరిదిద్దాడు కన్నారావు నవ్వూతూ.

    "అదేలే... ఇందాకే వెళ్ళాం కదా! ఇప్పుడు హాన్ హేస్తే బాగుంటుందా? ఇందాకే ఎందుకు చెప్పలేదని అనుకోదూ?"

    "ఇలా ప్రతి విషయానికి మొగమాటపడ్తూ కూర్చుంటే అయినట్టే, లే...ఫోన్ చేద్దువుగాని" చిట్టబ్బాయి చేతిపత్తి లాగుతూ గుమ్మంవ్తెపు అడుగులు వేశాడు కన్నారావు.

    ఇద్దరు విజయనగర్ కాలనీలో ఒక షాపులోకి దూరారు.

    చిట్టబ్బాయి  ఫోన్ నెంబర్ డయల్ చేశాడు. అవతల ఫోన్ రింగవుతున్న శబ్దం వినిపించింది. కొన్ని క్షానాలవాత ఫోనేత్తారు.

    "హలో... ఎవరూ మాయదారి సంత!"

    రంగనాయకులు గొంతు వినిపించేసరికి చిట్టబ్బాయి కంగారుపడ్డాడు.

    మౌత్ పిస్ కి చేయి అడ్డు పెట్టి కన్నారావువ్తెపు తిరిగాడు. "ఫోన్ రంగనాయకులు ఎత్తాడు, పెట్టేయనా?"

    "ఎందుకని... ఆయనతోనే మాట్లాడు. కాబోయే మామగార్ని మంచి చేస్కోవద్దూ?" సలహా ఇచ్చాడు కన్నారావు.

    "హలో ఎవరండి.. ఎవరంటే పలకరిం మాయదారి సంత!!"

    అవతల్నుండి రంగనాయకులు అరుస్తున్నాడు.

    "హలో! నేనండి చిన్నబ్బాయ్!!" అన్నాడు చిట్టబ్బాయ్ వినయంగా.

    "చిన్నబ్బాయ్ అంటే?"

    "అదేనండి...మొన్న రాత్రి మీ పండుని తీసుకొచ్చి మీ యింట్లో అప్పజేప్పాం కదండి..."

    "ఓ... నువ్వా బాబూ... ఏమిటి మళ్ళి మా యింటికే రాలేదు.... మాయదారి సంత... అంత బిజీనా?"

    "అబ్బే... బిజీ ఏం కాదండి!" మొహమాటంగా అన్నాడు చిట్టబ్బాయి.

    "ఆరోజు అంత రాత్రిపూట వచ్చారు కాబట్టి మీకు మర్యాదలేం చేయలేక పోయాం. మీరిద్దరూ మాయింటికి రావాలిబాబూ..ఇప్పుడు రండి. అందరం కలిసి భోంచేద్దాం"

    "ఇప్పుడా ... వద్దండి ఇంకోసారి వస్తాం"

    "మరి అంత మొహమాటమ్తేతే ఎలా మాయదారి సంత!"

    "అబ్బే మొహమాటం కాదండి... మా భోజనాలు అయిపోయాయి"

    చిట్టబ్బాయి ఇంకోసారి వస్తానని చెప్పాడు. రంగనాయకులు ఆ మర్నేడే డిన్నర్ కి రమ్మని ఇన్త్వేట్  చేశాడు. చిట్టబ్బాయి సరే అని ఫోన్ పెట్టేశాడు.

    "ఏ వంటాడు" అడిగాడు కన్నారావు.

    చిట్టబ్బాయి చెప్పాడు.


                                                                             12

    ఆ మర్నాడు రాత్రి ఏడుగంటల ప్రాంతంలో చిట్టబ్బాయి, కన్నరావులు చిన్నమ్మాయి ఇంటికి వెళ్ళారు.

    "రండి బాబుగారూ...రండి. మీకోసం బాబుగారూ ఇందాకట్నుండి వేయిటింగులు చేస్తున్నారు" వరండాలో నిల్చున్న భీమన్న ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు.

    పోర్టికోలో కారు లేదు. కారు లేకపోయేసరికి రంగనాయకులు ఇంట్లో లేడని అనుకున్నారు వాళ్ళిద్దరూ.  కాని అతను యింట్లోనే ఉన్నాడన్నమాట!!

    "ఆయనొక్కరే ఎదురు చూస్తున్నారా?" అన్నాడు చిట్టబ్బాయి ఎదో జోక్ వేసినట్టుగా నవ్వుతూ.

    అలా అంటే భీమయ్య చిన్నమ్మాయిగారు కూడా ఎదురు  చేస్తున్నారు బాబూ.. అంటాడని అతని ఆశ.

    "అందరూ వెయిటింగ్ చేస్తున్నారుబాబూ.. రండి బాబూ రండి" అన్నాడు భీమయ్య.

    'చిన్నమ్మాయి తప్ప మిగతావాళ్ళంతా వెయిట్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత' అని  మనసులోనే అనుకున్నాడు చిట్టబ్బాయి.
       
    ఇద్దరు హాల్లోకి అడుగుపెట్టారు.

    అక్కడే కూర్చుని వున్నా రంగనాయకులు లేచినిలబడి ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు.

    "మాయాదారి సంత... ఇంతలస్యంగా వచ్చారేం? నేను సాయంత్రం ఆరునుండి ఎదురుచూస్తున్నా" నవ్వుతూ చేయిచాపి ఇద్దరికీ షేక్ హమ్ద్ ఇస్తూ అన్నాడు రంగనాయకులు.

    "మేము ఆఫీసు నుండి యింటికొచ్చేసరికి సాయంత్రం ఆరు అవుతుంది కదండి... మొహం కడుక్కుని కాస్త రిలాక్స్ అయ్యేసరికి  ఈ టైమ్ అయ్యింది" చెప్పాడు కన్నారావు.

    చిట్టబ్బాయి కళ్ళు  చిన్నమ్మాయి కోసం  గాలిస్తున్నాయి. గుమ్మం వెనకనుండేమ్తెన తొంగి చూస్తుందేమో అని గది గుమ్మాలు పరిశీలిస్తున్నాడు.

    ఉహు... చిన్నమ్మాయి కనిపించలేదు అతనికి. బహుశా లోపలి గదిలో తనకి ఇంప్రేసివ్  గా కనిపించడంకోసం బాగా తయరవుతుందేమో!

    ఇంతలో కన్నారావు చిట్టబ్బాయి డొక్కలో మోచేత్తో పొడిచాడు.

    ఓసారి మూలిగి  కన్నారావు వంక సీరియస్ గా  చూశాడు  చిట్టబ్బాయి.

    "ఆవిడ నిన్నే అడుగుతున్నారు?... ఏ లోకంలో ఉన్నావ్?" అన్నాడు ఆ పక్కకి చూపిస్తూ.

    చిట్టబ్బాయి కన్నారావు చూపించిన దిక్కుకి చూశాడు. చాముండేశ్వరి చిట్టబ్బాయి వంక చూసి నవ్వింది.

    "బాగున్నావా బాబూ?" అడిగింది ఆమె.

    "బాగున్నానండి" అన్నాడు చిట్టబ్బాయి.

    "మా చిన్నమ్మాయి ని గురించి చాలా చెప్పింది బాబూ..."

    చిట్టబ్బాయి మెలికలు తిరిగాడు.

    "వాళ్ళని కూర్చోనిస్తావా, అలానే నిలబెట్టి మాట్లడ్తావా మా, వీళ్ళవ్తెపు  తిరిగి "కూర్చోండి బాబూ"రంగనాయకులు సోఫా వంక చూపిస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS