Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 45


    
    కార్నర్ టేబుల్ దగ్గర యాంగ్లియిటీగా వెయిట్ చేస్తున్నాడు ఆ రెస్టారెంట్ లో శ్రీచరణ్.
    ఉదయమే శశికళ తన టేబుల్ దగ్గరికి వచ్చి "నిన్న మీరు చేసిన మ్యారేజ్ ప్రపోజల్ గురించి ఆలోచించాను. నాకు 'నో' అనడానికి పెద్దగా కారణాలు కనిపించలేదు. సాయంత్రం తాజ్ లో కలుసుకుందామా? నేను ఇంటికి వెళ్ళి ప్రెషస్ అయి సిక్స్ థర్టీ వరకొచ్చేస్తా..." అంది. ఇప్పుడు ఆలోచనలో పడ్డం శ్రీచరణ్ వంతయింది. తనకు పెళ్ళయిన విషయం గానీ, తనకూ, ప్రనూషకూ మధ్య ఉన్న అగ్రిమెంట్ విషయం కాని తెలియదు శశికళకు.
    డిటెయిల్డ్ గా చెప్పాలి.
    ఓసారి ఎలా చెప్పాలో....రిహార్సల్స్ చేసుకున్నాడు మనస్సులోనే.
    అప్పుడే ఎదురుగా చుడీదార్ లో (ప్రెషస్ అయి వస్తూ కనిపించింది శశికళ.
    
                                                             * * *
    
    "అదీ జరిగింది. నాకూ...ప్రనూషకూ డైవోర్స్ వచ్చేస్తాయి. డైవర్స్ వచ్చిన వెంటనే మనం పెళ్ళి చేసుకుందాం....ఇప్పుడు నిర్ణయం నీ ఛాయిస్ కు వదిలేస్తున్నాను"  డిటెల్డ్ గా చెప్పి ఆమె నిర్ణయం కోసం ఆగాడు.
    పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదుస్ శశికళ.
    "బహుశా ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏదో వుంటుందని ఎక్స్ స్పేక్ట్ చేశాను. నాకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం...పేదరికం వాసన కూడా భరించలేవు. నేను కోరుకున్న లగ్జరీస్ అన్ని లేకపోయినా, మనం మినిమమ్ లగ్జరీస్ బ్రతకొచ్చు. అందుకే ఈ ప్రపోజల్ కు ఒప్పుకుంటున్నాను. మీ ఆవిడ నుంచి డైవోర్స్ తీసుకోగానే మనం పెళ్ళి చేసుకుందాం. ఈలోగా డబ్బు సంపాదించే మార్గం ఆలోచించు బాసూ....ఎంతసేపూ ఈ గానుగెద్దు జీవితమేనా?" అంది.
    "అవునవును..." అని శశికళ వైపు చూశాడు. శశికళ అతనికో పజిల్ లా అనిపించింది.
    తనింత చెప్పినా...ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు.
    "బాసూ...ఇవ్వాళ్టి నుంచి నువ్వు కాబోయే "హబ్బీవే కాబట్టి...శాంపిల్ గా సంగీత్ కు వెళ్ళి ఓరొమాంటిక్ ఇంగ్లీష్ పిక్చర్ చూసి, ఆ తర్వాత ప్యారడైజ్ లో చికెట్ సిక్స్ టీ ఫైవ్ టేస్టు చేద్దాం" అంది.
    ఆమె చేయి అందుకుని "అలాగే అన్నాడు శ్రీచరణ్.
    అతనీలో కొత్త ఉత్సాహం.
    అప్పటికే ఆమెతో అతనెన్నో ఊహించుకున్నాడు. తన స్కూటర్ వెనకన తన నడుం చుట్టూ చేతులు వేసినట్లు...రకరకాల మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నట్టు, తన పైత్యాన్నంతా కలలుగా ఊహించేసుకుని....ఆ ఊహల్లో బ్రతకడం మొదలెట్టాడు ఆ క్షణం నుంచే.
    అతను తన బలహీనతకు బానిసయ్యే ప్రయత్నంలో వున్నాడు. దాని పర్యవసానం తెలియకుండానే.
    
                                                              * * *
    
    ఈరోజే శర్మ దంపతులు వెళ్తున్నారు.
    "అదేంటి నాన్నా....అప్పుడే వెళ్తున్నారు. మరో రెండ్రోజులు వుండి వెళ్ళకూడదా?" అంది ప్రనూష ఊరెళ్తామని చెప్పిన తండ్రితో.
    "లేదమ్మా....ఇప్పటికే చాలారోజులున్నాం....నాకు చాలా సంతోషంగా వుంది మీ అన్యోన్య దాంపత్యం చూస్తుంటే..." శర్మ కళ్ళలలో సన్నటి కన్నీటి మెరుపు.
    చిన్న కలవరపాటు ప్రపూషల్లో.
    శ్రీచరణ్ కూడా ఫీలయ్యాడు.
    "అదేంటి మామయ్య....ఓ రెండ్రోజులు వుండండి..." అన్నాడు మనస్పూర్తిగా శ్రీచరణ్.
    "యింకా రెండ్రోజులుండి మరింత ఆనందాన్ని అనుభవించి, తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు బాబు..." అన్నాడు శర్మ.
    శ్రీచరణ్ అయోమయంలో పడిపోయాడు. ఆయన మాటలకు అర్ధమేమిటి?
    "వస్తాం బాబూ....సత్యవతీ...పద. ప్రియా"....ఎక్కడున్నావమ్మా.."
    "ఒక్క నిమిషం కూర్చోండి మణయ్య. అత్తయ్యా మీరు కూడా" అని ప్రనూషని గదిలోకి పిలిచాడు శ్రీచరణ్.
    "ఏంటి ఇప్పుడు.....!" విసుగ్గా అంది. అసలే తల్లీ తండ్రి వెళ్ళిపోతున్నారన్న దిగులో వుంది. అలా అందరి ముందూ తనని ఈ టైములో ఇలా పిలవడం ఏంటి? అనుకుంది.
    అలమారు తెరిచి రెండు చీర ప్యాకెట్స్, ఓ ప్యాంట్, షర్ట్ పీస్ అందించాడు.
    "వెళ్ళి మీ అమ్మ, నాన్నలకు, ప్రియకు బొట్టుపెట్టి ఇవ్వు" అన్నాడు.
    "చరణ్..." ఆశ్చర్యంగా అంది. ఇంకా అపనమ్మకం ప్రనూష కళ్ళలో.
    "వెళ్ళు టైమవుతోంది. వెళ్ళిచ్చిరా!" అన్నాడు.
    "మీకు....మీకెలా థాంక్స్ చెప్పాలో.... నాకు కనీసం కొనాలీ అన్న ఆలోచన కూడా రాలేదు....ఛీ) .... ఛీ...."
    "తర్వాత తీరిగ్గా అన్నీ ఆలోచిద్దువు గానీ....ముందు వెళ్ళు" అన్నాడు. బొట్టుపెట్టి అందరికీ బట్టలు పెట్టింది.
    శ్రీచరణ్ వెళ్ళి ఆటోను పిలుచుకొచ్చాడు.
    ఆటోలో వాళ్ళు ఎక్కగానే ఆటో ముందుకు కదిలింది.
    ఆటో సందు మలుపు తిరిగినా ఇంకా చెయ్యి చూపుతూనే వుంది ప్రనూష.
    "మీకు మరోసారి థాంక్స్ అంత ఖరీదైన బట్టలు తెచ్చినందుకు..."
    "ఇందాక చెప్పావుగా థాంక్స్..." అన్నాడు అదేం పెద్ద విశేషం కాదన్నట్టు పేపర్ చదువుతూ.
    "అయినా మనస్ఫూర్తిగా..." వాక్యం పూర్తిచెయ్యలేకపోయింది. కళ్ళల్లో నీళ్ళు.
    అన్ని బాగానే వుంటాయ్ శ్రీచరణ్ లో. ఓ మంచి భర్త కుండవలసిన క్వాలిటీస్ అన్ని వున్నాయి.
    అయినా అతన్ని తన భర్తగా స్వీకరించలేకపోతోంది. ఎందుకని తన సాగరా? పిచ్చితనమా?....
    ఏదీ ఆలోచించుకోలేక పోతోంది.
    మౌనంగా అక్కడ్నుంచి కదిలింది.
    శ్రీచరణ్ నిట్టూరుస్తూ పేపర్ టీపాయ్ మీద పడేశాడు.
    
                                                             * * *
    
    ఇల్లంతా బోసిపోయినట్టుంది. పైగా ఆ రోజు ఆదివారం.
    అప్పటివరకూ అమ్మ, నన్న చెల్లెలితో హడావిడిగా వున్న ఆ ఇల్లు ఒకేసారి శ్మశాన నిశ్శబ్దంగా మారింది. మంచాలు వేరయ్యాయి.
    పడగ్గదులూ వేరయ్యాయి.
    వేరు వంటలూ మొదలయ్యాయి.
    ఒక్కసారిగా ప్రనూషకు ఏడు పొచ్చేసింది.
    తను ఒంటరిదన్న ఫీలింగ్ కలిగింది.
    ఎంత సందడిగా వుండేది. ఎంత హడావిడిగా వుండేది. శ్రీచరణ్ కూడా ఎంతో హడావిడి చేసేవాడు.
    అమ్మ నాన్న ముందు అలా నటించిన, ఎందుకో ఆ నటనే బావుందనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS