"ఆ సీరియల్ ని దైరేకర్ గారూ అలా ఎందుకు సాగదిస్తూన్నారంటే అయన చిన్నతనం నుండి రబ్బరు ఫ్యాక్టరిలో పనిచేసేవారు కాబట్టి సాగడం, సాగదీయడం అయన నేచర్. సో సాగుతున్నంత కాలం సాగనివ్వండి."
"మరో లెటర్ అండి. విజయవాడ నుండి చినపాప అడుగుతోంది. నాకు టీవిలో యాంకరింగ్ చేయాలని వుంది. ఎలా? నా కోరిక తీరుస్తారా? అంటూ"
రవి అన్సర్ చెప్పబోయాడు.
సమీర వారిస్తూ 'రవీ! అన్ని ప్రశ్నలకు మీరేనేంటి పెద్ద ఆన్సర్లు చెప్పేది. అక్కడికి నాకేదో రానట్టు. ఈసారి సమాధానం నేను చెప్తాను" అంది కోపంగా సమీర.
"సరే దానిదేముంది? చెప్పండి" అన్నాడు రవి ఉక్రోషంగా.
"చినపాపగారు! మీరూ యాంకరింగ్ చేయాలనుకుంటే వెంటనే మీవి రెండు ఫోటోలు, పంపండి. అంతే కాదు ప్రతిదానికి అవసరం వున్నా లేకపోయినా నవ్వడం, ఎవరేమన్నా పట్టించుకోకపోవడం, తెలుగు బాగా మాట్లాడడం, కాస్తంత సమయస్పూర్తి, సెన్సాఫ్ హ్యుమర్ ఉంటె మీరు యాంకరింగ్ చెయ్యొచ్చునండి" హుషారుగా చెప్పేసింది సమీర.
"నా ముఖంలా ఉంది ఆ అన్సర్" అన్నాడు రవి కోపంగా.
"కరెక్ట్ అలా తరచూ చెప్తున్నా మళ్ళీ అదే ప్రశ్నను రిపీట్ గా అడిగే వాళ్ళకి అలాగే చెప్పాలి. నీకు తెలిదు. నువ్వూరుకో" అంది సమీర.
"కమ్ అప్ వాళ్ళ బ్రేక్ ఇప్పుడు" అరిచాడు డైరక్టర్ గట్టిగా.
* * *
ఛాంపియన్ బాటిల్స్ ఐదు తెచ్చిచ్చాడు భువన కజిన్ బ్రదర్ నందకోశోర్. అతను వైజాగ్ నేవల్ బేస్ లో పనిచేస్తున్నాడు. కేంటిన్ లో అన్నీ చీఫ్ గా దొరుకుతాయి. భువన మిక్సి, ఫ్రిజ్, కుక్కర్ అన్నీ తమ్ముడి కేంటిన్ నుండే ఫోన్ చేసి మరీ తెప్పించుకునేది వచ్చేటప్పుడు. నందకోషోర్ కి ఫోన్ చేసి నెలరోజుల క్రితమే చెప్పి పెట్టింది ఈసారి హైదరాబాద్ పనిమీద వచ్చేటప్పుడు ఛాంపియన్ బాటల్స్ ఐదు తీసుకురారా తమ్ముడూ అని. అతను ఆశ్చర్యంగా గుళ్ళో తీర్ధం తిసుకోవదానికే భయపడే బావ ఇప్పుడు ఏకంగా ఛాంపియన్ బాటల్స్ కి వెళ్ళిపోయాడా?" అన్నాడు.
"అది కాదురా తమ్ముడూ! ఇది వేరే పనికి గానీ నువ్వొచ్చేప్పుడు మర్చిపోకుండా తీసుకురా. నువ్విక్కడికి వచ్చాక అసలు విషయం చెప్తాలే!" అంది.
అతను నాల్రోజుల క్రితమే బాటిల్స్ తెచ్చిచ్చాడు.
ఆరోజు ఏకాదశి, శనివారం, ఇంతకన్నా మంచిరోజు లేదనుకుంది భువన.
తలారా స్నానం చేసింది. పట్టుచీర కట్టింది. దేవునికి సుప్రభాతం, అష్టోత్తరం చదివింది. ఐదు రకాల పళ్ళు నైవేద్యం పెట్టింది. కర్పూరంతో హరతించింది. ప్రదిక్షణలు చేసి లెంపలేసుకుని మొక్కుకుంది.
"భగవంతుడా! నాయీ వ్రతాన్ని సఫలం చేయి తండ్రి. వచ్చే జన్మలో నాకు మంచి మొగుడ్ని ప్రసాదించు స్వామి" అంటూ టెంకాయి కొట్టింది ఫట్ మని . కొబ్బరి చెక్కలకి కుంకుమ బొట్లు పెట్టి దేవుని పటానికి అటోటి ఇటోటి పెట్టింది.
అక్కడే వున్న ఐదు బాటిల్స్ మీద తీర్ధం నీళ్ళు చల్లి మూత ఓపెన్ చేసింది. పక్కనే ఉన్న పెద్దబెసిన్ లో బాటిల్స్ ని వంపింది. వంపుతూ అనుకుంది. 'నేనెంత పతివ్రతని, ఖరిదని కూడా లెక్క చేయకుండా ఐదు బాటిల్స్ తెప్పించాను. నిజంగా దేవుడు తన భక్తికి మెచ్చుక్కుని కళ్ళు తిరిగి పడిపోతాడెమో!" అనుకుంది.
"అమ్మా! నా బ్లూ కలర్ అద్దాల డ్రెస్ మీద చున్నీ ఏది? ఇక్కడ కనబడడం లేదు" సమీర అరిచింది.
"అక్కడే వుంటుంది చుసుకోమ్మా. నేను పూజలో ఉన్నాను. పైగా మడి, అవన్నీ ముట్టుకోకూడదు" పూజ గదినుండే అరిచింది భువన.
"ఏమిటి మళ్ళీ మడితో పూజా?" ఏంటమ్మా! నీకు పూర్తిగా మతిపోతోంది రానురాను."
"అనండమ్మా. అనండి అందరూ నన్ను అనే వాళ్ళే. ఏం బ్రతుకే నాది. కనీసం వచ్చే జన్మలోనయినా....'
ఆమె మాట పూర్తీ కాకుండానే సమీర "వచ్చే జన్మలో ఎలా వుంటావో గానీ ఈ జన్మలో మాత్రం నీ పాద పూజల పిచ్చితో అందర్నీ చంపుతున్నావు. అయినా నికిదెం జబ్బే అమ్మా! చిన్నవాళ్ళం మేం తప్పులు చేస్తే చెప్పాల్సింది పోయి నువ్విలా అర్ధం లేకుండా....."
"అనవే అను. కన్నకూతురివై ఉండి ఇన్ని మాటలంటావా? వచ్చే జన్మలో నైనా మంచి సంతానం కలగాలని సంతాన వ్రతం మొదలెట్టకపొతే చూడు" కళ్ళువత్తుకుంటూ అంది భువన.
"చాల్లే అపు నీ సెంటిమెంటల్ డైలాగ్స్. మెంటలేక్కిపోతోంది ఈ ఇంట్లో నాకు. ఒక్కొక్కళ్ళు ఒకో టైప్. చీ...చీ...." అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయింది.
భువన లెంపలేసుకుని "క్షమించు స్వామి! ఈ ఇంట్లో ఎవరూ నాకు కోపరేట్ చేయరు. సింగిల్ భక్తురాలిని. ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోకు" అంది.
బేసిన్ జాగ్రత్తగా తీసి దేవుని పటాల ఎదురుగా పెట్టింది. బాటిల్స్ మొత్తం అందులో వొంపింది. ఆ తర్వాత లేచి బేసిన్ పట్టుకుని హాల్లోకి నడిచింది.
త్రిలోకం పేపర్ చదువుకుంటున్నాడు. అతను పేపర్ మొత్తం హెడ్డింగ్ దగ్గర్నుంచి చివరి పేజి పబ్లిషింగ్ ఎడ్రస్ వరకూ మొత్తం చదివేవరకూ వదలడు. అది పైగా పేపర్ చదివేటప్పుడు త్రిలోకం ఈ లోకంలో ఉండడు. అంత ఎమోషనల్ గా, సిన్సియర్ గా చదివేస్తాడు.
అటువంటి తరుణంలో......
బేసిన్ కిందపెట్టి అతని పాదాల్ని ఒక్కసారిగా లాగి బేసిన్ లో ముంచింది.
ఉలిక్కిపడి పేపర్ వదిలేశాడు కెవ్వుమంటూ.
"ఈ ఒక్కరోజు తిట్టకండి. ఏకాదశి పైగా శనివారం. దయచేసి నన్నేమి అనొద్దు" అంది అతని పాదాలు మునిగిన ఛాంపియన్ ని నెత్తిమీద జల్లుకుంటూ.
త్రిలోకం నివ్వెరపోయి చూస్తుండిపోయాడు. తనకి నోట మాట రాలేదు. కెవ్వున అరచి పిచ్చి చూపులు చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు.
* * *
శ్రీచంద్ర రోడ్డు ప్రక్కగా నడుస్తున్నాడు. సత్తిపండు అతనికి కాసింత దూరంలో నడుస్తున్నాడు.
రోడ్డుకు అటుపక్క ఓ పాత డొక్కు జీపు ఉంది. చాలా కాలంగా అక్కడ పడి వున్న జీపు అది. టైర్లలో గాలిలేదు. రన్నింగ్ కండిషన్ లో కూడా లేదు.
యమధర్మరాజు ఓ జీపు వంక చూసి 'యమయమాః" అనుకున్నాడు మనసులో.
మరుక్షణంలో ఆ టైర్లలో గాలి ఆటోమేటిగ్గా ఫిల్లయి పోయింది. గేర్ చేంజ్ అయింది. జీపు స్తార్టయింది. చిన్న శబ్దం కూడా లేకుండానే. జీపు ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఆ తర్వాత వేగంగా శ్రీచంద్ర వైపు దూసుకుపోయింది.
సత్తిపండు ఆశ్చర్యంగా చూస్తుండగానే జీపు శ్రీచంద్రను డీ కొంది.
సత్తిపండు పెద్దగా కేకేశాడు.
శ్రీచంద్ర రోడ్డుమీద పడిపోయాడు.
"ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా వచ్చి సాయం చేయండి" రక్తపు మడుగులో వున్న శ్రీచంద్ర పక్కనే కూర్చుని ప్రాధేయపడుతున్నాడు సత్తిపండు.
* * *
