గృహప్రవేశం జరిగిపోయింది. లోకాచారి హాపీగానే వున్నా ఉషారాణికి మాత్రం బాధ మొదలైంది.
అంత పెద్ద ఇంట్లో , కొత్త ఇంట్లో- సెకండ్ హ్యండ్ వస్తువుల్తో కట్టిన ఇల్లేకావచ్చు గాక- అందులో పసిపిల్ల కేరింతలు వినపడడంలేదనేది అమె తొలుస్తున్న సమస్య. అయనకి వారసుడిగా ఒక పిల్లాడ్ని కనివ్వలేకపోయాననే వేదన అమెను పట్టుకుంది. పిల్లలు కలగకపోవడం తన లోపమేనని అమె గట్టిగా నమ్మింది.
రోజులు గడుస్తున్నాయి.
అమెకి నెల నిలవడంలేదు.
అప్పటికి గుళ్లూ, గోపురాలూ తిరగడం ప్రారంభించింది. కనిపించిన చెట్టుకి, పుట్టకి మొక్కడం నేర్చుకుంది.
అయినా ఏ మాత్రం లాభం లేకుండా పోతోంది.
ఆ వేదనతోనే మనిషి కూడా సగం తగ్గింది.
ఈలోగానే అమె తల్లి బాత్రూమ్ లో పడడంతో చేయి విరిగింది. అమె కోలుకునేవరకు అక్కడే వుండాలని ఈ వార్త తెచ్చిన లోకాచారి అత్త చెప్పింది. మరి తను లేకుండా భర్తకు ఎవరు వండిపెడతారు.?
" అదేం ఫరవాలేదు. వీడికి పెళ్ళికాక మందు అడపా దడపా వచ్చి వంటచేసి పెట్టేదాన్ని. నాకు ఇది అలవాటే. నువ్వేళ్ళి నిశ్చితంగా వుండిరా" అంటూ అమెను సాగనంపింది. లోకాచారికూడా వెళ్ళి రమ్నన్నాడు.
పుట్టింటికి వెళ్ళిందన్నమాటేగాని సంతోషమేమీ లేదు. ఎంతసేపూ తను అయనకి ఓ బిడ్డను ఇవ్వలేకపోతు న్నాననే దిగులు అమెలో రోజు రోజుకీ పెరుగుతోంది.
ఓ రోజు రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్న ఉషారాణికి అసలు లోపం ఎక్కడుందో , తనకి ఎందుకు పిల్లలు పుట్టడం లేదో తెలిసి పోయింది.
మరో పదిరోజులకి తల్లికి బాగయిపోయింది.
వెంటనే ఉషారాణి భర్త ఇంటికి బయల్దేరింది.
ఆరాత్రి లోకాచారి మంచి ఉషారుమీదున్నాడు.
ఉషారాణి కుడా అంతే... దాదాపు ఇరవై రోజుల విరహం తరువాత కలుసుకోవడం, పొద్దుపోయిందో లేదో ఉషారాణి స్నానం చేసింది. ఇందుకోసమే వచ్చేటప్పుడు కాళహస్తిలో దిగి మైసూర్ శాండిల్ సబ్బుకొంది. మొత్తం చందనం వృక్షానికి తన మేను తీగల్లా అల్లుకుపోయినట్టు ఘుమఘుమలు బయలుదేరాయి.
పసుపు, ఎరుపులు కలిసిన దిష్టినీళ్ళరంగు కాటన్ చీర కట్టుకుంది. పైన సూళ్ళూరుపేట సంతలో కొన్న కంపెనీ బ్రా వేసుకుంది. దానిపైన మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది.
ఎనిమది గంటలకల్లా భోజనం ముగించాడు.
పిల్లల హుషారుజూసి లోకాచారి అత్త " నేనీరోజు శాంతమ్మ ఇంట్లో పడుకుంటా ఆ పిల్లకి తోడెవరూ లేరంట" అని వెళ్ళిపోయింది. లోకాచారి తొమ్మిదింటికల్లా బెడ్ రూంలో చేరిపోయాడు.
మంచి కాకమీదున్నాడు. భార్యకోసం చూస్తున్నాడు.
అమె లోపల అడుగుపెట్టింది. ఏదో సాధించబోతున్నానన్న అనందంతో అమె ముఖం వెలిగిపోతోంది.
అతను అమెను దగ్గిరికి తీసుకున్నాడు.
అమె అతనిలో కలిసిపోయింది.
విచిత్రంగా ఆరోజు అతను ఏ పొదుపూ పాటించలేదు. తన ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు.
ఏ పదకొండు గంటలకో అతను బాగా అలసిపోయి తృప్తిగా పక్కన పడుకున్నాడు. భర్త ఎంజాయ్ మెంటు చూసి అమె మురిసిపోయింది. తాను అనుకుంటున్నది చెప్పెయ్యాలన్న వత్తిడి ఎక్కువైంది.
"ఏమైంది- మీకో మంచివార్త చెప్పనా?" అని అడిగింది అతని భుజానికి తన భుజం అన్చుతూ.
"చెప్పు" అన్నాడు లోకాచారి.
"మనకింక పిల్లలు పుడతారండి. మీరు తండ్రి అవుతారు" సంతోషంగా చెప్పింది ఉషారాణి.
అతను పొంగేపోయాడు "నెల తప్పావా?"
"కాదండి. గ్యారెంటిగా ఈ నెలో, వచ్చేనెలో. త్వరలోనే మీరు తండ్రి అవుతారు" అందామె.
అతను కొంత నిరుత్సాహపడ్డాడు. " ఇప్పుడు కాలేదా- అయినా వెంటనే గర్భవతి అవుతానని ఎలా చెబుతున్నావ్?" అని అడిగాడు. అమె ఏ గణాంకాలతో అంత ఖచ్చితంగా చెబుతుందో తెలియడంలేదు.
"మీరు ఒకటి గమనించారా? మీకు ఏదైనా సెకండ్ హ్యాండే కలిసొస్తుంది. మనం కొత్తగా మీక్సీకొన్నామా? పనిచేయకుండా ఎవరో ఎత్తుకు పోయారు. మళ్ళీ కొన్న సెకండ్ హ్యండ్ మిక్సీ ఎంత బాగా పనిచేస్తోందో తెలుసుకదా. అందుకే..." అమె అడిగింది.
"అందుకే..." చెప్పమన్నట్లు రెట్టించాడు.
"నేనూ సెకండ్ హ్యాండ్ అయితే పిల్లలు ఖచ్చితంగా పుడతారని తెలిసిపోయింది. అందుకే మొన్న వూరికి వెళ్ళినప్పుడు మా బావతో అని తన అమాయకత్వాన్నంతా నవ్వులో దాచుకుంది. అతను షాక్ తిన్నట్టు చూస్తుండిపోయాడు. దీనికి కొస మెరుపు ఏమిటో తెసుసా! ఉషారాణి ఆనెలలోనే గర్భవతైంది.
ఆ తరువాత లోకాచారికి ఒక్క విషయం అర్ధమైంది. తన భార్య చెప్పినట్లు తనకు సెకండ్ హ్యాండ్ వస్తువులే కలిసొస్తాయని అయితే అర్దం కానిది ఒకటుంది.
అది ఉష తన వల్ల నెలతప్పిందా? అమె బావవల్ల నెల తప్పిందా? అన్నది. అయితే అలోచించడంలోనూ పొదుపు పాటిస్తాడు. కాబట్టి ఆ తర్వాత దాని గురించి బుర్రబద్దలుకోట్టుకోలేదు.
చింతామణి చెప్పడం అపింది. శశిరేఖ వస్తున్న నవ్వును బలవంతంగా అపుకుంటోంది. చింతామణి ఠక్కున గంగారత్నం గుర్తొచ్చింది. అమె వచ్చే టైమైంది. అందుకే వస్తానని చెప్పి హడావుడిగా అక్కడ్నుంచి బయల్దేరిందామె.
* * *
సూర్యుడ్ని మంటగా పెట్టి భూమి పెనంమీద మనుష్యుల్ని రోస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎండల్ని చూస్తుంటే.
మే నెల వచ్చింది.
మిషన్ ల కింద సేద్యమైనా ఆ నెలపోవాలి. ఆ ఎండలో ఏ చెట్టూ బతకదు., ఏ విత్తనమూ మొలకెత్తదు.
అందుకే కూలీల నుంచి రైతుల వరకు అందరూ ఖాళీగా వున్నారు. సాయంకాలమయితే అందరికి ఆట విడుపు. ఎక్కడికైనా వెళ్ళాలంటే సూర్యుడు రాకముందే గమ్యం చేరేటట్లు ప్లాన్ చేసుకోవాలి.
అందుకే ఆ అదివారం ఐదుగంటలకే ఆ ఊర్లోని కొన్ని కుటుంబాలు నిద్రలేచాయి. మరో అరగంటకి అందరూ రెడీ అయిపోవాలని అంతకు ముందు రోజు రాత్రే రామారావు అందిరికి చెప్పాడు
రామారావు ఆ ఊరి అల్లుడు. వెంకటగిరి రూట్ లో వుండే పల్లమాల అతని ఊరు. అక్కడ రైస్ మిల్లుంది. దానితో జీవనోపాది. ఈ ఊర్లోని శివరావు కూతురు సుమిత్రను పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు.
పెద్దవాడికి మూడోఏడు జరుగుతోంది. రెండో అమ్మాయికి రెండో ఏడు జరుగుతోంది.
