Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 44

            41. మనిషిలో హుషారు లేకుండా చేసే వ్యాధి 'మిక్సిడీమా'
     
    ఒకానొకప్పుడు ఛంగుఛంగుమని ఎగిరే చంద్రికలో ఈ నాడు ఆ హుశారూ లేదు, ఓపికా లేదు. ఆమెకు 35సంవత్సరాలు. చంద్రిక మేఖంలో ఇదివరకటి ఆకర్షణాలేదు, అందమూ లేదు. ఏదైనా జబ్బుచేసి అలా అయిపోయిందాంటే అదీ లేదు. ఆమె పెదవులు బండలా తయారయ్యాయి. ముక్కు మొద్దుబారి పోయింది. తీయగా మాట్లాడే గొంతు బొంగురైపోయింది.

    చంద్రికలో అనుకోకుండా ఇంత మార్పు రావడానికి అమెల్లో థైరాయిడ్ హిర్మావున్ ఉత్పత్తి తక్కువయిపోవడమే. చాలా సందర్భాల్లో థైరాయిడ్ గ్రంధి శాశ్వితంగా పనిచేయదు. అలా ఎందుకు జరుగుతుందో కారణమూ తెలియదు. ఆ గ్రంధిలోని టిన్యూలు మాత్రం సహజత్వాన్ని కోల్పోతాయి. దాంతోఆ గ్రంధినుంచి వెలువడే థైరాయిడ్ హార్మోను చాలా తగ్గిపోతుంది. ఈ హిర్మోను లోపం ఏర్పడ్డప్పుడు వెంటనే గుర్తించలేని విధంగా మార్పులు ఏర్పడతాయి. అ సమయంలో ఆ వ్యక్తి స్పష్టంగా లేని విధంగా మార్పులు ఏర్పడతాయి. ఆ సమయంలో అ వ్యక్తి స్పష్టంగా తనలో ఎటువంటి రుగ్మతలు ఉన్నాయో చెప్పలేకపోతాడు. అలసటగా ఉన్నట్లు, దేనిపట్లా ఆసక్తి లేనట్లు, కొద్దిపాటి చలికూడా భరించలేక పోతున్నట్లు, కండరాలు బిగపట్టేస్తున్నట్లు, ఒళ్ళంతా నొప్పులు అనిపిస్తూన్నట్లు, చేతులు_ కాళ్ళు తిమ్మిరిగా ఉన్నట్లు చెబుతాడు. ఇవన్నీ థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఏర్పడ్డ లక్షణాలే.

    కొందరు తమకి సరిగా వినబడటంలేడనీ మరికొందరు స్రీలు బహిష్టు అయినపుడు రక్తప్రసారం అధికంగా ఉంటోదనీ, ఇంకొందరు తమకి రకరకాలైన బ్రమాలు_ భ్రాంతులు కలుగుతాయని డాక్టరు దగ్గరికి వెళతారు. పరీక్షచేసి చూసినపుడు వారిలో చాలా మందికి ఈ రుగ్మతలకి మూలం థైరాయిడ్ హిర్మోన్లు లోపమే అని తేలుతుంది.

    థైరాయిడ్ గ్రంధి లోపం పురుషులలో కంటె స్రీలలో ఎక్కువ. అందులోనూ 35_50 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో సహజం. స్రీలకి ముఖ్యంగా బహిష్టులు ఆగిపోయే సమయంలో "మిక్సీడీమా" వ్యాధి లక్షణాలు కనబడతాయి. "మిక్సీడీమా" వ్యాధి వచ్చినవారి ముఖంలో ఎటువంటి భావాలూ వ్యక్తంకావు. వారు నవ్వితే నవ్వినట్లుండదు. ఏడిస్తే, ఏడ్చినట్లు ఉండదు. అనందం, ఆశ్చర్యం వారి ముఖాల్లో అంతుపట్టాడు. వారి ఆదుర్దా, అందోళనలని గుర్తింఛలేము. కనురెప్పలు వస్తాయి. పెదాలు ముక్కు బందలుగా తాయారవుతాయి. చెక్కిళ్ళు కోమలత్వాన్ని కోల్పోయిపేలుపెక్కుతాయి. మేఖం దిబ్బరొట్టెలా అవుతుంది. తక్కిన శరీరం కూడా ఏమదినట్లు కనబడుతుంది. అంటేకాక ఒళ్ళంతా నీరుపట్టినట్లు కనబడుతుంది. కాని వేలుపేట్టి నొక్కితే గుంటపడదు. ఇలాంటి సందర్భాలలోకోమ్దరు అమాయకులు నాటుడాక్టర్ల దగ్గరికి పోయి ఉబు కామెర్లు వచ్చాయని నెలల తరబడి మందులు వాడుతూ ఉంటారు.

    మికిడీమా వచ్చిన వారిలో గొంతు బొంగురు పోతుంది. తలమీద, శరీరం మీద వేమ్త్రుకులు రాలిపోతాయి. వీరిలో చమట పట్టడం కూడా చాలా ఆరదు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. నది తక్కువుగా కొట్టుకుంటుంది. మాటలు మొద్దబ్బాయిని జ్ఞాప్తకితెస్తాయి. మాటలు స్పష్టంగా పలకక పోవడానికి కారణం స్వరపెటికలోని కండరాలు, నలికలోని కండరాలు ఉబినట్లు అవడమే. వీటిన్నింటితోపటు ఈ వ్యక్తుల్లో రక్తహీనత ఏర్పడుతుంది.

    థైరాయిడ్ గ్రంధి లోపంవల్ల వచ్చే "మిక్సిడీమా" వ్యాధిని చాలా మండి మొదట్లో నిర్లక్ష్యంచేసి ఊరుకుంటారు. ఏదో ఒక ప్రత్యేకమైనా బాధగురించి డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు అసలు కారాణాన్నివిప్పిచెప్పటం మామూలుగా జరిగే విషయం. బి.యం.ఆర్.పరీక్ష రేడియో ఐడిన్ పరీక్ష,సీరమ్ కోలాస్టరాల్ శాతాన్నిబట్టి  "మిక్సీడీమా " వ్యాధిని తేలికగా నిర్ధరింఛవచ్చు . థైరాయిడ్ హిర్మోను బిళ్ళలని రోజూ సక్రమంగా వేసుకోవడంతో రిగి కొద్ది నెలల్లో మామూలు ఆరోగ్యాన్ని పోందవచ్చు. 

                                  ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS