Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 43

    తా: సింహముఖ హస్తము యొక్క చూపుడు చిటికెన వ్రేళ్ళను, నడిఘివ్రేళ్ళకును, ఉంగరపు వ్రేళ్ళకును మీదుగాచేర్చి పట్టినయెడల అజాముఖ హస్తమగును.
   
   శ్లో!!    ఆజాదికానాం వక్త్రేషు నిర్విషాణా ముభేషుచ !
    గజకుంభే మల్లయుద్ధే అజావక్త్రో నియుజ్యతే !!

    తా: మేక మొదలైన జంతువుల మోరయందును, కొమ్ములులేని జంతువుల ముఖములందును. ఏనుగు కుంభస్థలముసందును. జెట్టి పోట్లాట యందును. ఈ హస్తము చెల్లును.

                                            -: అర్ధముకుళ హస్త లక్షణము :-

   శ్లో!!    లాజ్గూలాఖ్యకరేసమ్యక్కనిష్టావక్రితాయది !
    ప్రోక్త్కోర్థ ముకుళాఖ్యసౌభరతాగమవేదిభి !!

    తా: లాంగూల హస్తపు చిటికెనవ్రేలు  బాగుగా పంపబడినయెడ అర్ధముకుళ హస్త మగును.

   శ్లో!!    లికుచేశీలవేచ్కఫ్యుచితేపి కుచ్కేపిచ !
    లోభే ముకుళపద్మేచ కరణే వినియుజ్యతే !!

    తా: గజనిమ్మపండు, మంచిస్వభావము, ఉచితము, కుచము, లోభము, తామరమొగ్గ, ఉపకరణము, వీనియందు ఈ హస్తము వినియోగించును.

                              -: రేచిత హస్త లక్షణము :-

   శ్లో!!    అలపద్మకరౌయత్ర శ్లిష్టౌపార్శ్వప్రసారితౌ !
    తత్తత్ప్రయోగకుశలైః రేచిత్కొయం నిరూప్యతే !!

    తా: అలపద్మ హస్తములను చేర్చి, పార్శ్వమందు  చాచిపట్టినయెడ రేచితహస్త మగును.

   శ్లో!!    చారీఘే పార్శ్వణజానే నారికేళే ప్రలాపిది !
    సర్వనాట్యేషు వేళాయాం యుజ్యతే రేచితఃకరః !!

    తా: చార్మినాట్యమునందును, పార్శ్వనాట్యమునందును, టెంకాయ యందును, ప్రలాపమునందును ఎల్లనాట్య సమయములయందును ఈ హస్తము చెల్లును.

                                                 -: కుశలహస్త లక్షణము :-

   శ్లో!!    అన్యోవ్యాభీ ముభావర్థచంద్రౌ కుశలసంజ్ఞకః
    భూచారే నయనే పూర్ణవస్తు నిర్దేశభావనే !
    జలావగా పద్మేఛ యుజ్యతే కుశలఃకరః

    తా: అర్ధచంద్ర హస్తములను  ఎదురెదురుగా పట్టినయుడ  కుశలహస్త మగును. ఇది భూసంచారము, నేత్రము, పూర్ణవస్తువుల నిర్దేశించుట, నీటిలో మునుగుట, తామరపువ్వు వీనియందు చెల్లును.

                          -: పక్షవంచిత హస్తలక్షణము :-

   శ్లో!!    కటిదేశగతావేతౌ పక్షవంచితకోభవేత్ !
    పక్షీణాంపక్షభావేతు రశనాయాం నితమ్బకే !
    పషవఞ్చితహస్త్కోయం యుజ్యత్కేత్రపురాతవైః

    తా: ఈ కుశల   హస్తమునందలి   అర్థచంద్ర హస్తములను  కటి ప్రదేశమున నుంచినయెడ పక్షవంచిశ హస్తమగును. ఇది పక్షుల రెక్కలు మొలనూలు, కటిశ్చాద్చాగము వీనియందు వినియోగపడును.   

                                         -: తిలకహస్త లక్షణము :-

   శ్లో!!     త్రిపతాకాభీధౌహస్తౌ లలాటే హృదయేస్థితౌ !
    తిలకాభిదహస్త్కోయం కీర్తితోభావవేదిభిః !
    దేవపుష్పాంజరౌగస్ధవస్త్యాది తిలకేషుచ !
    తిలకాభిదహస్తోయం కీర్తితోభావవేదిభిః !!

    తా: త్రిపతాక హస్తములను నొసటను రొమ్ముదందు నుంచినయెడ తిలకహస్తమగును. ఇది దేవపుష్పాంజలి, వాసనగల వస్తువు మొదలైనది తిలక భేదములు వీనియందు వినియోగించుచున్నది.

                                      -: ఉత్తానపంచిత హస్త లక్షణము :-

   శ్లో!!    త్రిపతాక వంశదేశగతా వుత్తాలవంచితః !
    విష్ణోరభినయే స్తమ్బభావనాయాంబుధోదితః !
    ఉత్తానవంచితాభిఖ్య, స్సర్వనాట్యేషుకీర్తితః !!

    తా: త్రిపతాక     హస్తములను, భుజమూలములకు సమీపమున జేర్చి పట్టినయెడ ఉత్తానవంచిత హస్తమౌను, ఇది మహావిష్ణువును  అభినయించుట, స్తంభములను చూపుట వీనియందు చెల్లును.

                           -: వర్ధమాన హస్త లక్షణము :-

   శ్లో!!    ఊధ్వభాగోన్ముభౌహస్తౌ శిఖరౌ నర్ధమానకః !
    సర్వదేతివచోభావేదత్త మిత్యర్ధక్కేపిచ !
    కింకిమిత్యుక్తిసమయేక దాచిదితిభాషణే !
    వర్ధమానకరః ప్రోక్తః భరతాగమవేదిభిః !!

    తా: శిఖరహస్తము మీదికెత్తి పట్టినయెడల, వర్ధమానహస్తమగును. ఇది యెల్లప్పుడని చెప్పుట, ఇయ్యబడేనది యనుట, ఏమి ఏమియేనెడి సమయము. ఒకానొకప్పుడనుట వీనియందు వినియోగించును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS