Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 44

    "అంతే కదండీ మరి!" అంది రాజీ కూడా నవ్వుతూ.

    "నేనింక వస్తానమ్మా!" అంటూ సోఫాలోంచి లేచాడు సర్వోత్తమరావు.

    "కాస్త కాఫీ తీస్కోని వెళ్ళండి" అంది రాజీ తను కూడా లేస్తూ.

    "వద్దమ్మా! ఆఫీసులో సీటు వదలి వచ్చా... బోలెడంత పని వుంది. ఇంకోసారి భోజనం చెయ్యడానికే వస్తాలే" అని గుమ్మందాకా గబగబా వెళ్ళి "జాగ్రత్తమ్మా! వాడెవడో అచ్చం రాంపండులానే వున్నాడు. రేపొద్దున బజార్లో వాడు కనిపిస్తే మన పండే అనుకుని వెనకాలే వెళ్ళిపోగలవ్. అసలే మోసగారి వెధవలుంటారు!" అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు.

    రాజీ తలుపేసి వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడింది.

    "నేను ఎంత అడిగినా ఎక్కడికీ తీసుకెళ్ళనివాడు దాన్ని అప్పుడే సినిమాలకీ షికార్లకీ తిప్పుతున్నడన్నమాట! ఊహూ..." అనుకుంది.

   
                                              *    *    *    *
   
    సర్వోత్తమరావు తన క్యాబిన్ లోకి వెళ్తూ రాంపండు వంక చూసి నవ్వాడు.

    అయన తనవైపు చూసి ఎందుకిలా నవ్వాడో అర్ధంకాని రాంపండు ప్రతిగా నవ్వాడు.

    క్యాబిన్ లో ఫోన్ మోగింది. ప్యూన్ పరిగెత్తుకుని క్యాబిన్ లోకి వెళ్ళి క్షణంలో బయటకి వేగంగా రాంపండు దగ్గరకి వచ్చి "మిమ్మల్ని అయ్యాగారు పిలుస్తున్నారు" అని చెప్పాడు.

    అతను లోపలకి వెళ్ళాడు.  
            
               
        "రావోయ్ రా! నేనిప్పుడు బయటకెళ్ళి రావడం నువ్వు చూసే వుంటావు కదూ? నేనిక్కడి కెళ్ళానో నేకిఉ తెలుసా?" రాంపండుని అడిగాడు సర్వోత్తమరావు.

    "తెలీదండి" సమాధానం చెప్పాడు అతను. మళ్ళీ ఏం బాంబు పెలుస్తాడోనని భయపడుతూ_
    "నేను మీ యింటికెళ్ళి వచ్చా అసలు నీ వ్యవహారం కనుక్కుందామని."

    రాంపండు కాళ్ళూ చేతులూ చల్ల బడ్డాయ్. కాస్త దుఃఖం కూడా వచ్చింది. అయిపోయింది... అంతా అయిపోయింది.

    "సార్! నన్ను క్షమించండి సార్!" అన్నాడు.

    "బాగానే వుంది. నేవ్వెం చేశావనీ? నిన్నసాయత్రం నుండీ ఈ వేళ ఆఫీసుకి వచ్చేదాకా నువ్వు యింట్లోనే వున్నానని మీ ఆవిడా చెప్పిందిలే. అనవసరంగా నిన్ను అనుమానిమ్చాను. నువ్వు మంచోడివేనయ్యా."

    "థాంక్యూ సార్!"

    "అది సరే గానీ నువ్వేం తప్పు చెయ్యక పోయినా అలా భాద పడిపోతున్నావేం!" అయోమయంగా చూస్తూ అడిగాడు సర్వోత్తమరావు.

    "అంటే అనవసరంగా మిమ్మల్ని మా యింటిదాకా వెళ్ళేలా చేసి మీకు చాలా శ్రమ యిచ్చాను కద్సార్!"

    "నువ్వేం చేశావోయ్! నేనే అనవసరంగా నిన్ననుమానించి అంత దూరం వెళ్ళాను.ఏదేమైనా జాగ్రత్తగా వుండు... నీ పోలీకల్లో వున్నవాడు ఏయేఅకృత్య వ్యవహారాలూ చేసి ఆ మొత్తం వ్యవహారం నీ మీదికి వచ్చేలా చేస్తాడో ఎంటో ..." అని చెప్పి రాంపండుని పంపించి వేశాడు.

   
                                           *    *    *    *

    సాయత్రం__ ఆఫీసులోంచి బయటికోచ్చారు రాంపండూ, బ్రహ్మజీలు.

    "ఇప్పుడు నిజం చెప్పు నాయానా! ఎవరా బాబ్డ్ హెర్ గర్ల్ రోజు ట్యాంక్ బండ్ మీద ఆమె నీకోసం అడిగినప్పుడే నా అనుమానం వచ్చింది.నిన్ను యిబ్బంది పెట్టడం ఎందుకులే అని ఆ విషయం గురించి నిన్ను అడగలేదు. అయితే మీరిద్దరూ నిన్న సినిమాకి కూడా వెళ్ళారన్నమాట! నీ పావులీకల్లో ఇంకోడున్నాడని మన చెవిలో పువ్వు పెట్టినట్టు. చెప్పు ఆమె ఎవరు? ఏదైనా ఎఫేయిరా?"  అంటూ రాంపండుని నిలదీసి అడిగాడు బ్రహ్మాజీ.

    రాంపండు నిట్టూర్చాడు.

    "ఇక నీ దగ్గర దాచి ప్రయోజనం లేదు. అంతా చెప్పీస్తా! పద అలా పార్కులో కూర్చుని మాట్లాడుకుందాం!"

    "బాబోయ్! ఇలా పార్కులకీ, ట్యాంక్ బండ్లకీ, సినిమాలకీ రమ్మంటే నేను రాను. అదిగో... ఆ హోటల్లో కూర్చుందాం పద!" అన్నాడు బ్రహ్మాజీ.

    "సరే పద!"

    ఇద్దరూ ఇరానీ హొటల్ వైపు అడుగులు వేశారు.
   
                                            *    *    *    *

    రాత్రి...!

    టీవీ చూస్తుండగా ఫోన్ రింగయ్యింది  వైష్ణవి పోనేత్తి "హలో" అంది.

    తర్వాత రాంపండు వైపుకి తిరిగి మీకే అంది రిసీవర్ ని ప్రక్కన పెడుతూ.

    "నాకా? నాకు ఇక్కడికి ఎవరు ఫోన్ చేసింది" అంది వైష్ణవి.

    రాంపండు లేచేళ్ళిరిసీవరు అందుకని "హాలో" అన్నాడు.

    "హాలో... నేనే! నన్ను గుర్తు పట్టావా?" అవతలి నుండి రాజీ గొంతు.

    "మొగుడ్ని అమ్మేసే ఆడదాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు?" అన్నాడు రాంపండు మోహం చిట్లించి.

    "ఏంటీ ఈ వేళ ఇంట్లోనే వున్నావు?" వ్యంగ్యంగా అడిగింది రాజీ.

    "అంటే నీ ఉద్దేశ్యం?"

    "ఏ సినిమా పోగ్రామో షికారు ప్రోగ్రామో వేస్కోలేదా?"

    "అదంతా నీ కానవసరం..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS