"నిన్న మీరిద్దరూ సినిమాకెళ్ళారని నాకు తెలుసు."
"నేకు ఆ విషయం తెలుసనీ నాకూ త్రేలుసు."
"మీ బస నుండి నిన్ను నేను రక్షించాను."
"అదేం కాదు... నీ పరువు కాపాడుకోడం కోసం నువ్వు అబద్దం చెప్పావు."
"ఒహొ కాదు...నీ పరువు కాపాడుకోవడం లేదో బాగానే కబుర్లు నేర్చుకున్నావే? నన్ను సినిమాకి తీస్కేళ్ళామంటే ఒంట్లో బాగోలేదని ఒకసారి, అఫీసులో పనెక్కువుంది అలసిపోయానని ఓసారి, అఫీసులో మీటి గుందిలేనని ఓసారి, యింటికోస్తుంటే దార్లో చిన్నప్పటి ప్రెండ్ తగిలాడని ఓసారి ఇలా బోలెడు కారాణాలు చెప్తావే... దాన్ని మాత్రం సినిమాలకి, షికార్లకీ బాగానే తిప్పితున్నావన్నమాట!"
"అదంతా నీకనవసరం... ప్రస్తుతం నేను నీకేం కాను కదా... నేను ఎవరితో తిరిగితే నీకేం... నేను ఏం చేస్తే నీకేం?"
"వెరీగుడ్! ఓ చక్కని నిజాన్ని చెప్పావు. అలాంటప్పుడు నేను కూడా నీకేం కనుకదా?"
"అంతే కదా మరి!"
"అలాగైతే రేపు సాయత్రం ఆఫీసు కాగానే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ కి రా... అక్కడికొచ్చి ఏం జరుగుతుందో చూడు నీ కే తెలుస్తుంది."
రాంపండు ఏదో అడిగేలోపలే రాజీ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. రాంపండు గుండెలు గుబగుబలాడాయి.
స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర ఏం చేస్తుందబ్బా?!
* * * *
ఆ రాత్రి కూడా రాంపండుకి శివరాత్రే అయ్యింది.
రాజీ స్వప్నలోక్ కాంప్లెక్స్ కొచ్చి చూడమంది.
ఎందుకు? ఎందుకు?? ఎందుకు???
రాజీ అక్కడ ఏం చేస్తుంది?
ఆ కాంప్లెక్స్ పై అంతస్తు కెక్కి ఎక్కడ చుట్టూ మూగిన జనానికి తనని చూపించి ఆమె ఆత్మహత్యకి కారణం తనే చెప్పి పైనుండి ధనేల్ మని దూకేస్తుందా?
రాంపండు గుండెలు దడదడలాడాయి.
నో... అలా చెయ్యడు. అలా ఎందుకు చేస్తుంది? తనేమీ ఆమెని వద్దని వచ్చెయ్యలేదే! అలా చేసి వుంటే ఆమె బాధబడి వుండేది. ఆమే తను వద్దనుకుని అమ్మేసింది. తను యింటికి వెళ్ళినా రావొద్దని అంది! మరి అటువంటప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? చేసుకోదు.
మరింకేం చేస్తుంది?
రాంపండు బుర్రకి అసలేమీ తట్టడం లేదు. రాజీ అతన్ని మంచి సస్పెన్స్ పెట్టి బుర్ర పాడుచేసి నిద్రపట్టకుండా చేసింది.
ఆ ఆలోచనలతోబాటే అతనికి బ్రహ్మాజీ అన్న మాటలు కూడా గుర్తుకువచ్చాయి.
"నువ్వోపని చెయ్... ఆ వైష్ణవితో కాస్త అతిగా ప్రవర్తించు! అతిగా అంటే నేను నీకు విడిగా చెప్పనక్కర్లేదుగా? అదే... దగ్గరకు తీసుకోవడం... చుమ్మా చుమ్మా దేదే అనడం అలాగన్నమాట! అప్పుడు ఏం పిచ్చి వేషాలేస్తున్నావా? ఇలాగైతే నా యింట్లో వుండోద్దు_గెటౌట్ అని అంటుంది. అప్పుడు నువ్వు నీ రాజీ దగ్గరకి వెళ్ళిపోవచ్చు!" అని సలహా యిచ్చాడు.
"ఒకవేళ ఆమే అలా అనలేదనుకో...నేనలా ప్రవర్తించడం ఆమే యిష్టపడిందనుకో... అప్పుడు?" వెర్రిముఖం వేసుకుని అడిగాడు రాంపండు.
"అప్పుడు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పండైపోతావు" అంటూ పకపకా నవ్వాడు.
"ఇది హాస్యా లాడే సమయం కాదు" చిరాగ్గా చూస్తూ అన్నాడు రాంపండు.
"అవునా ... అలాగైతే సీరియస్ గా అలోచించాల్సిందే" అన్నాడు బ్రహ్మాజీ సీరియస్ గా ముఖం పెడుతూ.
బ్రహ్మాజీ చెప్పినట్టు చేస్తే సమస్య ఏ విధంగానూ సాల్వ్ కాదు.
వైష్ణవి గెటవుట్ అన్నా తను రాజీ దగ్గరకి వెళ్ళలేడు కదా? ఊర్కే చూసిపోదామని వెళితేనే ఇకముందు యింటికి రావొద్దని అంది. అలాంటిది వైష్ణవిని వదిలించుకుని పర్మినెంట్ గా యింటికెళితే ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకునేదే అయితే అసలు తనని ఎందుకమ్మేస్తుంది? మరి ఏం చెయ్యాలి?? ఏం చెయ్యాలి???
ఆ సంగతి అలా పెట్టి రేపు తనని స్వప్నలోక్ కాంప్లెక్స్ కి ఎందుకు రమ్మంది?
అతనికి అంతా అగమ్యగోచరంగా అనిపించింది.
అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుతుండగా నిద్రపోయాడు.
మర్నాడు ఆఫీసులో మనశ్శాంతి లేకుండా సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపాడు.
సర్వోత్తమరావు అయిదు కాకుండానే ఆఫీసులోంచి బయటకి వెళ్ళిపోయాడు.
ఓ పావుగంటాగి రాంపండు కూడా ఆఫీసు లోంచి బయటకొచ్చేశాడు.
* * * *
రాంపండు స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపించాడు. అతని గుండె దాదాదదలాడసాగింది.
టెన్షన్ తో అతని మెదడులోని నరాలు బిగుసుకున్నాయి.
ఆ కాంప్లెక్స్ ముందు నిలుచుని చుట్టప్రక్కల కలియచూశాడు.అతనికిఅక్కదేక్కడా రాజీ కనిపించలేదు.
రాత్రి తనకు వచ్చిన ఆలోచన రాంపండుకి గురుకు వచ్చింది... కొంపదీసి ఆత్మ హత్యా ప్రయత్నంకాదుకదా?
తలెత్తి బిల్డింగ్ పైకి చూశాడు.
ఉహూ....బిల్డింగ్ మధ్యలోఎవరూ లేరు. ఆ చివరకీ, ఈ చివరకీ కూడా తన చూపులు తిప్పాడు. ఎక్కడా రాజీ లేదు.


