Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 43

    "నువ్వు చెప్పేది నిజమేనా?" ఆలోచనగా మోహం పెట్టి అన్నాడు సర్వోత్తమరావు.

    అతను అలా అంటుండగా బ్రహ్మాజీ ఏదో ఫైలు పుచ్చుకుని లోపలకి వచ్చాడు.

    "ఏంటి సార్ నిజమేనా అని అంటున్నారు?" అడిగాడు బ్రహ్మాజీ.

    "రావోయ్ రా... సరిగ్గా సమయానికి వచ్చావు"అంటూ బ్రహ్మాజీకి జరిగిదంతా చెప్పాడు సర్వోత్తమరావు.

    ఏవోయ్... ఇదెక్కడైనా పాజిబులిటీ ఉండే వ్యవహారంమేనా అని?" అని అడిగాడు చివర్లో.

    "సార్... మీరు రాంపండుతో చూసిన అమ్మాయికి బాబ్డ్ హెర్ వుందా?" అడిగాడు బ్రహ్మజీ.

    రాంపండు గుండెల్లో రాయిపడింది. సరిగ్గా సమయానికి శనిలా దాపురించాడు. ఇప్పుడు వీడెం వాగుతాడో ఏమో?! అనుకున్నాడు.

    "అవును ఏం? నువ్వు కూడా ఆ అమ్మాయిని చూశావా?" టేబుల్ మీదికి బాగా వంగి అడిగాడు సర్వోత్తమరావు.

    "అవున్సార్.... ట్యాంక్ బండ్ మీద ఆ అమ్మాయి రాంపండు కోసం వస్తే చూశాను సార్" అన్నాడు బ్రహ్మాజీ.

    సర్వోత్తమరావు రాంపండు వంక క్రూరంగా చూశాడు.

    "ఒట్టిదే సార్... అతను చెప్పింది అబద్దం సార్... అతను చూసింది నన్ను కాద్సార్..." కంగారుగా అన్నాడు  రాంపండు.

    "అవుద్సార్... నేను చూసింది రాంపండుని అని అనుకున్నాను గానీ అతను రాంపండు కాదు సార్" అన్నాడు బ్రహ్మాజీ.

    "నేను చెప్పలేదా సార్... సినిమాల్లో డబల్ రోల్ వుండదూ అలా ఎవడో అచ్చం నాలాగా తగలబడ్డాడు సార్. నిన్న మీరు చూసిన సినిమాలో కూడా అంటే కాద్సార్. హీరోది డబుల్ రోల్ హిహిహి!" నవ్వాడు రాంపండు.

    ఆ సమయంలో హీరాది డబుల్ రోల్ వ్యవహారం అని నేకేలా తెల్సూ? అయితే నిన్న నేను చూసింది నువ్వేనా?" అనుమానంగా రాంపండు వంక చూస్తూ అడిగాడు.

    "అబ్బే...ఆ సినిమా నేను వరం క్రితమే చూశాను సార్..."

    "మరి ఇందాక పోస్టర్లమీదా, హొర్డింగుల మీదా చూశానన్నావు?" కళ్ళేగురవేశాడు సర్వోత్తమరావు.

    "పోస్టర్సా?....హహహ... అవి అంతకంటే ముందే చూశాను సార్!"

    "కానీ ఆ సినిమాలో హీరో ఒక్కడే కదా? వాడె ఇద్దర్లా నటిస్తూ వ్యవహారం నడిపిస్తుంటాడు! కొంపదీసి నువ్వు కూడా అలా...?"

    "అవును కదూ?... మర్చేపోయా!" అని నెత్తిన ఠక్కున మొట్టుకున్నాడు.

    "ఆ సినిమాలో హీరో ఒక్కడే ఇద్దర్లా చేస్తాడుగానీ నా విషయ మరో ఇద్దరున్నారు. సార్!"

    'ఎంటోనయ్యా.... నీ వ్యవహారంలో నా బుర్ర మొత్తం మొద్దు బారిపోయింది... అంత అచ్చుగుద్దినట్టు మనిషిని పోలిన మనిషుంటాడా ఎక్కడైనా?"

    "ఉండరు సార్...కానీ ప్రస్తుతం మనం నమ్మక తప్పదు సార్" అన్నాడు బ్రహ్మాజీ.

    "సర్లే... మీ రెళ్ళండి!" అన్నాడు సర్వోత్తమరావు.

    బ్రహ్మాజీ తన చేతిలోని  ఫైలు అయన టేబుల్ మీద పెట్టాడు.ఇద్దరూ క్యాబిన్ లోంచి బయటకి వచ్చేశారు.

    సర్వోత్తమరావు రెండు నిమిషాలపాటు అలా ఆలోచిస్తూ వుండిపోయాడు.

    చివరకి ఒక నిర్ణయానికి కొచ్చి సీట్లోంచి లేచాడు సర్వోత్తమరావు.
 
    "నన్నో తింగరి వ్యవహారం క్రింద లేక్కేస్తున్నారు! ఈ సంగతి తేల్చుకోవాల్సిందే!" అనుకుంటూ క్యాబిన్ లోంచి బయటకి వచ్చాడు.

    రాంపండూ, బ్రహ్మజీ ఒఅకల్ల చెవులు కొరుక్కుంటున్నా వాళ్ళు కాస్తా ఆయన్ని ఒకళ్ళు కొరుక్కుంటున్నా వాళ్ళు కాస్తా ఆయన్ని చూడగానే ఫైళ్ళలో తలలు దూర్చి సీరియస్ గా మోహాలు పెట్టారు.

    సర్వోత్తమరావు బయటకి చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
   
                                             *    *    *    *

    "మీరా? ఆయన్ని? వేరే ఆడదానితో సినిమాహాల్లో చూశారా?!" కళ్ళు ఇంతింత చేసి అద్స్చార్యంగా చూస్తూ అడిగింది సర్వోత్తమరావుని.

    "అవునమ్మా! నువ్వు చెప్తే నమ్మవుగానీ నా దగ్గర ఏం చెప్పాడతనుకున్నావ్. కడుపులో వ్యవహారమ ఏం బాగోలేదూ... నొప్పి అని చెప్పి ఆఫేసు నుండి వెళ్ళిపోయి ఓ బాబ్డ్ హెర్ అమ్మాయితో వ్యవహారం నడిపించాడు. నేను నా కళ్ళారా చూశాను!" అన్నాడు సర్వోత్తమరావు.

    రాజీ మెల్లగా నవ్వింది.

    ఆయనకి మతిపోయింది.

    బనీ మొగుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అంటే అంత కులాసాగా ఏ భార్య అయినా నవ్వుతుందా?
    కొంపదీసి విషయం తెలుయగానే ఈ మేకి గానీ మతిచెలించిందా? అనుకున్నాడు.

    "ఇంపాజిబుల్ సార్! మీరు అంతటి నమ్మకం వుండటం మంచిదేనమ్మా. కానీ నేను నా కళ్ళారా చూశాను. అదీ బాగా దగ్గరగా, నా కళ్ళు నన్ను మోసగించే వ్యవహారం అంటూ ఏమీ లేదు."

    "అయ్యుండొచ్చుగానీ... నిన్న సాయత్రం నుండీ ఈ వేళ ఉదయం ఆఫీసుకు వెళ్ళేదాకా అయన నాతోనే వున్నారు" అంది రాజీ.

    సర్వోత్తమరావు ఉలిక్కిపడ్డాడు.

    "అయితే రాంపండు చెప్పింది నిఇజమేనన్నమాట! ఎవరో అచ్చుగుద్దినట్టు తన పోలికలతో వున్నావాడు వుంది వుంటాడని చెప్పాడు. ఇటువంటి వ్యవహారాలన్నీ సినిమాల్లో చూస్తాంగానీ బయటెక్కడ చూస్తామమ్మా?" అంటూ గలగలా నవ్వేశాడు అయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS