అదీ తేల్చుకోలేకపోతోంది తను. అంతా అయోమయం!
కానీ ఒకటి మాత్రం తేల్చుకుంది.
ఒక్కసారి వెళ్ళి అహల్యని చూసి రావాలని!
తను ఆ నిశ్చయానికి వచ్చీరాగానే ఈ ఫైర్ యాక్సిడెంటు తనుచావబోయి బ్రతికి బయటపడడం తర్వాత వీళ్ళకి గాయాలు హాస్పిటల్సు----
వీటితో ప్రయాణం వెనకబడింది.
అప్పుడు స్వగతంలా అన్నాడు బ్రహ్మాజీరావు.
"అతనకి చావాలని లేదనీ, బతకాలని ఉందనీ ఎంతగానో చెప్పింది ప్రమీల. అయినా బతికించుకోలేకపోయాను తనని! ఎంత పనికిరాని వాణ్ని నేను!"
మాట్లాడకుండా వింటోంది సీత. బతకాలనితపించి పోయిన ప్రమీలని చనిపోయింది. చనిపోవడానికి సిద్దంగా ఉన్న తనుబతికి బయటపడింది.
ఎంతచిత్రం!
తను చావకుండా బయటపడిందంటే తను ఇంకా బతికి సాధించవలసింది ఏదో ఉందనేనా ఆర్ధం?
అవును! సాధించాలి! సాధించితీరాలని!
రాఘవులునీ, జాన్ నీ, ఉస్మాన్ నీ తను బతికి వీళ్ళని చంపుకుతినాలి!
ఎక్కడున్నాడు రాఘవులు?
ఎక్కడున్నాడు జాన్?
ఎక్కడున్నాడు ఉస్మాన్?
పట్టుదలతో సీత పెదిమలు బిగుసుకున్నాయి.
వ్వవ్వవ్వవ్వ
వీడియో కెమెరా తాలూకు లైటు వెలుతురులో నిస్సహాయంగా నిలబడి ఉంది పార్వతి. సరిగా నిలుచోలేకపోతోంది తను. పాదాలలో సిగరెట్ తో కాల్చిన బొమ్మలు యమబాధనికలగజేస్తున్నాయి. ఆ గదిలోనే ఇంకో కుర్రాడు ఉన్నాడు. పాతికేళ్ళు ఉంటాయి అతనికి. అతనికి వంటి మీద బట్టలు లేవు. పనీపాటా లేకుండా రోడ్లమీద తిరిగే జులాయివెధవలా ఉన్నాడు అతను.
ఒంటికంటి రాక్షసుడిలా ఆమెనే తదేకంగా చూస్తోంది వీడియో కెమెరా.
"బట్టలు విప్పు" అన్నట్లు మోటుగా సైగ చేశాడు కెమెరామెన్.
నిస్త్రాణగా అతనివైపు చూసి, మెదలకుండా నిలబడే ఉంది పార్వతి. నిశ్శబ్దంగానే బూతులు ఉచ్చరించి, కళ్ళెర్రజేసిబెదిరింపుగా చూశాడు కెమెరామన్.
పార్వతి శిలావిగ్రహంలా అలా నిలబడే ఉంది.
విసుగ్గా కెమెరా ఆఫ్ చేశాడు కెమెరామన్.
"ఇలాకాదు దీని పని! జాన్! ఇంకో సిగరెట్ అంటించు!"
వికటంగా నవ్వి ఇంకో సిగరెట్ అంటించాడు జాన్. నెమ్మదిగా దగ్గరికి వచ్చి. సిగరెట్ గట్టిగా దమ్ములాగి, ఎర్రగా వెలుగుతున్న కొసని పార్వతి తొడకి అంటించాడు.
బాధభరించలేక, కెవ్వున కేకవేసింది పార్వతి.
ఆమెపడుతున్న బాధనిచూస్తూ ఆ గదిలో ఉన్న అందరూ పిశాచాల్లా నవ్వారు.
ఆగ్రహంగా అంది పార్వతి "నన్ను చిత్రహింసలుపెట్టి చంపినా సరే! మీకు లొంగను నేను."
చప్పరించాడు జాన్.
"నిన్ను చంపితే మాకేమొత్తుందే ఎర్రిమొకమా! నిన్నుగాదు చంపేది! చెప్పినట్లు చెయ్యకపోతే నీ కూతుర్ని చంపుతాం!"
"నాకూతురా?" అంది పార్వతి నిర్ఘాంతపోతూ. "నా లక్కీని కూడా ఎత్తుకొచ్చేశారా?"
"నీతోబాటే ఎత్తుకొచ్చేశాం! ఏడుపు ఇనబడ్డం లేదూ?" అన్నాడు జాన్ తేలిగ్గా.
అతను అలానగానే, ఆరాటంగా చెవి ఒగ్గింది పార్వతి. నిజంగానే ఎవరో చిన్నపిల్ల ఏడుపు వినబడుతోంది---చాలా దూరంనుంచి భయంతో వణికిపోతున్న పార్వతికి అది తన కూతురు కాదని తెలియదు.
"మర్యాదగా మేం జెప్పినట్లు జేస్తావా? లేకపోతే నీ కూతుర్ని కుళ్ళబొడిచెయ్యమంటావా?"
అన్నాడు జాన్ నిర్దయగా.
"వద్దు! ప్లీజ్! వద్దు! మమ్మల్ని వదిలెయ్యండి" అంది పార్వతి దీనాతిదీనంగా చేతులు జోడిస్తూ.
"ఇది మాటల్తో ఇనే రకంగాదురా! జాన్! వెళ్ళి దీని కూతురి కాలు ఇరిచేయ్!" అన్నాడు కెమెరామన్.
"వద్దు, వద్దొద్దు. మీకు పుణ్యముంటుంది! నా కూతుర్నేం చెయ్యకండి!" అంది పార్వతి. హృదయవిదారకంగా ధ్వనిస్తోంది ఆమెగొంతు.
"మరి ఒప్పుకుంటావా? ఓ అరగంటసేపు నీ వళ్ళు నీదిగాదని కళ్ళు మూసుకో! ఆ తర్వాత ఇద్దర్నీ ఇంటికాడ దింపేత్తాం!"
మాట్లాడకుండా తల దించుకుంది పార్వతి.
చెప్పినట్లు చేస్తే మాత్రం వదిలేస్తారా వీళ్ళు? వదిలెయ్యరు. ఆ తర్వాత ఏం చేస్తారో తను ఊహించగలదు.
తన చెల్లెలు కామాక్షిని ఇలాగే ఎవరో కిడ్నాప్ చేశారు. తర్వాత మళ్ళీ తిరిగిరాలేదు కామాక్షి. ఏ పడుపు కొంపల్లోనో బతుకువెళ్ళదీస్తూ ఉండి ఉంటుంది తను. కామాక్షి గుర్తొచ్చినప్పుడల్లా గుండె చెరువైపోతుంది తనకి.
ఇప్పుడు తనని కూడా అలాగే....
చటుక్కున ఒక నిశ్చయానికొచ్చింది పార్వతి. తలఎత్తి జాన్ మొహంలోకి చూస్తూ స్థిరంగా అంది.
"నువ్వు చెప్పినట్లే.....చేస్తాను. కానీ ఒక షరతుమీద!"
"షరతా? ఏమిటో అది?" అన్నాడు జాన్ పరిహాసంగా.
"మీపని పూర్తయిపోగానే నన్ను చంపెయ్యాలి. మాపాపను భద్రంగా మా ఇంటిదగ్గర చేర్చాలి."
"వాయబ్బా! పెద్ద షరతే నే!" అన్నాడు జాన్ నవ్వుతూ సరే! చావంటే నీకంత మోజయితే నేనెందుక్కాదనాలీ! అట్లాగే కానీ!
కానీ అతనికి తెలుసు తను పార్వతిని ఏం చెయ్యబోతున్నాడో!
వీళ్ళు కాసెట్లు తీసి తనడబ్బులు తనకిచ్చేశాక తను దీన్ని తీసుకెళ్ళిమంచి బేరానికి అమ్మేస్తాడు. దీని కూతుర్ని కూడా ఎత్తుకొచ్చామని చిన్న అబద్దమాడగానే అదిరిపోయింది ఇది! పని సులభంగా జరిగిపోతుంది!
"బట్టలిప్పు!" అన్నాడు కెమెరామెన్.
ఆ తర్వాత వీడియో కెమెరా ఆమె ప్రతి కదలికనీ టేపుమీద రికార్డు చెయ్యడం మొదలెట్టింది. తర్వాత వేలమంది రసికులు పరవశించి పోవడానికి వీలుగా!
వ్వవ్వవ్వ
