Previous Page Next Page 
అష్టపది పేజి 44


    
    అవసరమైతే ఒక మనిషి దేని చాటునైనా దాక్కోవచ్చు.
    
    శీతల్ కి కావల్సింది అదే.
    
    ముందుగా వరండాలోకి వచ్చిన శీతల్ ఓ సారి అటూ ఇటూ చూసి-స్తంభాల చాటున నక్కుతూ గదులు దాటుకుంటూ నెమ్మదిగా ఇంటి వెనక వేపుకి వెళ్ళింది.
    
    శీతల్ ముందుగా అనుకున్న ప్రకారం అయితే రోజు రాత్రిళ్ళు కొంత కొంత చొప్పున ఇంటి వెనుక భాగం నుంచి ముందు దాకా సెర్చ్ చేయాలి ఏ అడ్డంకి లేకపోతే రెండు రోజుల్లోనే ఈ పని అయిపోతుంది. ఆ తర్వాత ముందు వేపు.
    
    శీతల్ అలా అనుకోటానికి కారణం వుంది. ఈ పథకానికి అర్ధం వుంది.    

 

    శీతల్ ఆ ఇంటికి వచ్చి పది రోజులు దాటింది. పగలంతా గదులన్నీ తిరిగి చూడటానికి అనుమానిస్తారని అలాంటి పనులు చేయక ఎంతలో వుండాలో అంతలోనే వుండి మామూలుగా మసులుతున్నది. కుందన్ వచ్చాడు. వరండాలోను, ఆఫీసు రూమ్ లోను, వాకిలి ముందు లాన్లోను, భోజనం అప్పుడు డైనింగ్ హాలులోను-అంతవరకే చూసింది.
    
    అందువల్లనే శీతల్ ముందుగా ఇంటి వెనుక భాగం చూడదల్చుకుంది. వీలయినప్పుడు ఈ బందిఖానా నుంచి రాకపోవటానికి కూడా మార్గం అన్వేషించాలికదా! వీధి వాకిలి నుంచి ఎట్టి పరిస్థితిలోను బైట పడడం కుదరదు. వాకిలి ముందు కుక్రీవాలా గూర్కా పగలు ఒకడు రాత్రిళ్ళు ఒకడు కాపలా వుంటాడు.
    
    శీతల్ ఆలోచిస్తూ పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తూ కిచెన్, స్టోర్ రూమ్ దాటి ఆ పక్క గదుల కేసి వెళ్ళింది. ఓ గదిలోంచి మాటలు వినిపించటంతో టక్కున అక్కడ ఆగి, ఓరగా వేసి వున్న కిటికీ తలుపుని చాటు చేసుకుని గది లోపలికి తొంగి చూసింది.
    
    ఆ ఇంటి తోటమాలి, వంట మనిషి మంచి రసకేళిలో వున్నారు. పగలు వాళ్ళిద్దరూ పడనట్లు పోట్లాటలాగా మాట్లాడుకుంటారు. ఎడముఖం, పెడముఖంగా మసులుకుంటారు. అలాంటి ఆ ఇద్దరూ ఇప్పుడు ఇలా!
    
    వాళ్ళిద్దరూ మరి గుసగుసలుగా కాక, అలా అని పెద్దగానూ కాక ఓ మనిషి చెవి వొగ్గివింటే వినపడేలా మాట్లాడుకుంటూ వుండడంవల్ల శీతల్ కిటికీ తలుపుకు చెవి ఒగ్గి వినగలిగింది.
    
    "పగలు నీతో పోట్లాడినట్టు ముఖం ముటముట లాడించటం నాకే నవ్వొస్తున్నది." వంట మనిషి అంది.
    
    "నీ ముఖం అలా ముటముటగా వున్నా నాకు మాత్రం భలే రంజుగా కానవస్తుంది." తోటమాలి అన్నాడు.
    
    "ఇప్పుడు కబుర్లు బాగానే చెపుతావు. రాత్రి ఏమన్నావ్?"
    
    "రాత్రి పూర్తయి పగలు గడిచిపోయి మళ్ళీ రాత్రి వచ్చింది. రాత్రి ఏమన్నానో గుర్తా పాడా! నీవే గుర్తు చేస్తే సరిపోలేదా?"    
    
    "ఎందుకు సరిపోదు. నిక్షేపంగా సరిపోతుంది. బాస్ గారి కోడలుపిల్ల సిమ్లా యాపిల్ లాగా వుందని అన్నావా లేదా?"  

 

    "అన్నాను."
    
    "బాస్ గారి కోడలుపిల్లా! ఆ పిల్ల ఎవరు?" శీతల్ వాళ్ళ మాటలు విని అలా అనుకుని ఉలిక్కిపడింది.    
    
    "నీ కళ్ళకి నేను పుల్ల నారింజ కాయలాగా వున్నానా? చిరుకోపంతో అడిగింది వంటమనిషి.
    
    "అలా అని నేనంటే నీవు చీపురుకట్ట తిరగేసినా అర్ధం వుంది. విషయం మాట్లాడుతూ చిన్న బాస్ కి శీతల్ తగదు. ఆ పిల్ల సిమ్లా యాపిల్ లాగా వుందని అన్నాను. పగలెలాగూ నా మీద చిర్రుబుర్రు లాడుతుంటావు. రాత్రుళ్ళు కూడా ఎందుకు చెప్పు! నా ముద్దుల రాణీ?"    

 

    "ఉత్తుత్తిగ అన్నాలే. ఇంతకీ ఆ పిల్ల చిన్న బాస్ ని ఇష్టపడుతుందంటావా?"    

 

    "ఇక్కడ ఇష్టపడడం, పడకపోవడం అన్నది వుండదు. మర్యాదగా అడిగి చూస్తారు. కాదంటే శీతలమ్మ తలకాయ వంచి మూడుముళ్ళు మెడకి బిగిస్తాడు చిన్న బాస్. కాపురం చేయాల్సింది ఆడది. పనిచేయాల్సింది మగవాడు. ఇప్పుడు నీవు, నేను వున్నాము-నీవు ఆడదానివి నన్ను రేప్ చేయలేవుకదా! అదే నా విషయం తీసుకో-నిన్ను నయానో భయానో, బ్రతిమిలాడో భయపెట్టో, బలాత్కారంగా లొంగదీసుకోగలను.    

 

    "చాల్లే! ఇలాంటి కబుర్లు చెప్పడంలో మా గొప్ప మగాడివి."    

 

    "నావి కబుర్లు కావు చిలకా! ఇప్పుడే మనబలాబలాలు చూసుకుందామా?"
    
    "నన్ను రెచ్చగొట్టే మాటలు తర్వాత చెవుదువు గాని, నీవు ఇటువేపు కాపలా కాయకుండా నా దగ్గరికొచ్చి తొంగుందామంటే...అంతవరకు బాగానే వుంది.  బాస్ కి తెలిస్తే?"    

 

    "బాస్ కి నా మీద పూర్తి విశ్వాసం వుంది బుల్ బుల్. నేను వారంనుంచి చూస్తున్నాకదా! ఆ పిల్లలకే పనిగా పడి నిద్రపోతున్నది. ఇంతకుముందు చూసివచ్చాను. పక్కమీద బబ్బుంది. బాస్ గది దగ్గరకు వెళ్ళాను. చిన్న బాసు, పెద్ద బాసు ఏదో మాట్లాడుకుంటున్నారు. నీవు బెంగపెట్టుకోకు. మూడ్ లేకపోతే ముచ్చటలాడు కోడంలో త్రిల్ వుండదు. అయినా, ఇప్పుడు ఈ మాటలు దేనికి హాయిగా..." తోటమాలి ఓ బూతుమాట ఆదేవి వంటావిడతో ముచ్చట్లలోకి దిగాడు.
    
    శీతల్ కి అప్పటికే కాస్త కాస్త విషయం అర్ధమైంది తనకి తెలియదు. ఇక్కడ అందరికీ తెలుసు తను లోకేశ్వరరావుకి కాబోయే కోడలుని....చుంచు ముఖం కుందన్ గారు కాబోయే పెళ్ళాం అనీను...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS