Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 43

 

    తన సీటుకి అభిముఖంగా కూర్చున్న రమణిచేత ఫార్మలిటిస్ పూర్తి చేయించాడు.


    పది నిమిషాల తర్వాత అంది - "మీరు ఈ ప్రాంతానికి చెందిన వారేగా! చిన్న సాయం చేయాలి"


    "చెప్పండి"


    "నాకు ఉండటానికి ఓ ఇల్లు చూడాలి. మార్గరెట్ అని మా ఇంగ్లీష్ లెక్చరర్ యింట్లో తాత్కాలికంగా మకాం పెట్టాను. కాబట్టి మీరీ మాత్రం సహాయం చేయక తప్పదు.'


    "తప్పకుండా"


    "సాయంకాలం రానా?"


    క్షణమాగి అన్నాడు-- "ఓ.కే! ఐదు గంటలకల్లా వస్తే ఈలోగా నేను కనుక్కుంటాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు కొందరు పరిచయస్తులున్నారు. కాబట్టి పెద్ద సమస్య కాదు.'


    "థాంక్యు మిస్టర్ రాఘవా! మీకు శ్రమ యిస్తున్నాను"


    "దానికేముంది? ఫరవాలేదు"


    రమణి వెళ్ళిపోయింది.


    ఇక్కడ రాఘవకు తెలియనిది భోజరాజు కూతురు భవ్య క్రెడిట్ కౌంటర్ దగ్గర నిలబడి ఉందని, వాళ్ళిద్దరిని గమనిస్తోందన్న విషయం.


    బ్యాంక్ పని మీద వచ్చిన భవ్య గమనించడమే కాదు, అస్పష్టంగా నైనా వాళ్ళ మాటల్ని వినేసింది.


    
                                                             *    *    *    *

 

    మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండగా సీటులో నుంచి లేచిన రాఘవ బ్యాంకులోకి సరాసరి వచ్చిన కిన్నేరను చూసి ఆశ్చర్యపోయాడతను.


    బ్యాంకుకు అభిముఖంగా కాంటేస్సా క్లాసిక్ , కలహంసలా కదిలి వచ్చిన కిన్నెర సహోద్యోగుల కళ్ళలో అభినందనో, అసూయో అర్ధం కాని బావాలు.


    రాత్రి తాపం, పొద్దుటి కోపం మరిచిపోయినట్టు అందరి మొహలకేసి చూశాడు.


    ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు కిన్నెర. ఉదయం నుంచి ఆమెకు మనశ్శాంతిగా లేదు. అప్పటికి రెండుసార్లు ఫోన్ చేయాలనుకుంటూ ఆగిపోయింది.


    ఈ రోజే కాదు! ప్రతిరోజూ తానే కారులో మద్యాహ్నం యింటికి తీసుకురావాలి. రాత్రి కోపాలు మరిచిపోయేటట్టు బుజ్జగిస్తూ అన్నం తినిపించాలి.


    "రండింటికి " అంది.


    "స్కూటర్ మీద వచ్చేవాడ్నిగా!"


    "రాలేరని కాదు నేను వచ్చింది"


    "ఆఫ్ కోర్స్! అయినా ఎండలో నీకెందుకు శ్రమ అని!"


    "కాంటేస్సా లో ఏ.సీ. కూడా వుంది"


    "అది నిజమే అనుకో......" ఇంకా ఓ చేవొడ్డి వింటున్న ముసలి కేషియర్ ఓరకంట గమనిస్తూ అన్నాడు -- "అయినా స్కూటర్ మీద రావడం నాకూ విసుగ్గానే వుంది. ఎందుకంటే చుస్తున్నగా- నా కాంప్లిక్షన్ పాడైపోతోంది."


    చాలా మాములుగా మాట్లాడేస్తున్నాడు. అంటే కోపం తగ్గిపోయిమ్దన్న మాట. కిన్నెర గుండెలపై బరువు తగ్గినట్లనిపించింది.


    "నిలబడ్డారేం?"


    "ఓ.కె.! మాధవరావు గారూ!" అసూయగా చూస్తున్న వృద్ద కేషియర్ తో అన్నాడు--"వెళ్లొస్తాను, చూశారుగా , ఓ పట్టాన విడిచిపెట్టదు"


    "మరంతే గదా రాఘవగారూ! ఎంతయినా కోటిశ్వరుడి అల్లుడాయే"


    కారులో కూర్చున్నాక అడిగింది- "ఆయనేవరు ! మీ బాసా?"


    "కాదు!"


    "మరి. ఆయనకు చెప్పి మరీ బయలుదేరుతున్నారేం?"


    "కనీసం నలుగురూ అసూయపడేట్టు చేయాలని."

    "కనీసం ఏమిటి?"


    "అదే నేనేదో సుఖపడిపోతున్నట్టు ఎదుటివాళ్ళనైనా మభ్యపెట్టాలని"


    కిన్నేరకు కళ్ళనీళ్ళ పర్యంతమైపోయింది.


    "అంటే మీరు నా మూలంగా సుఖపడటం లేదనేగా అర్ధం!"


    "పక్కకు జరుగు నేను కారు నడుపుతాను కనీసం " అన్నాడు. ,మళ్ళీ 'కనీసం' అన్న పదాన్ని వాడుతూ "మళ్ళీ ఈ వాక్యంలో కనీసం అని ఎందుకు వాడానూ అంటే, పెళ్ళాన్ని కాకపోయినా కారు స్టిరింగునైనా పట్టుకుని సంతృప్తిపడదామని"


    కారు జనసామర్ద్యం వున్న రోడ్డుపై వేగంగా నడుపుతున్నాడు రాఘవ.


    "ఆ స్పిడేమిటి?" అంది కిన్నెర అందోళనగా.


    "కనీసం రోడ్డు మీదైనా నా స్పీడ్ ప్రదర్శిద్దామని"


    "మళ్ళీ కనీసం అంటే ఊరుకోను" అంది దుఖోద్విగ్నంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS