Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 44

   

    "ధన్వి కలిశాడా?"

 

    మృదువుగా నవ్వు వినిపించింది. "ఎలా గెస్ చేశారు?"

 

    "మీరు ఈ మధ్య ఎక్కువ రియాక్టవుతున్నది ధన్వి విషయంలోనేగా! ఏం- నిజం కాదా?"

 

    అర నిముషం విరామం తరువాత అంది మధూళీ......."యస్ ఈ రోజు ఉదయం స్టేషన్లో కలిశాం. ఓ గంట రెస్టారెంట్ లో కూర్చున్నాం."

 

    'అదృష్టవంతులు" అంది ధన్విని ఓరకంట చూస్తూ.

 

    "దేనికి?"

 

    "ఎవరి ప్రమేయాన్ని అంతగా హర్షించని ధన్వి మీతో అంతసేపు గడిపినందుకు."

 

    "ప్రతిసారి కొత్త పుస్తకంలా కనిపిస్తాడు."

 

    "కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఒకేలా అనిపిస్తాడు. బహుశా మీ అంత లోతుగా నేను చదవలేకపోతున్నానేమో......ఏని హౌ కంగ్రాట్స్"

 

    "దేనికి?" అడిగింది మధూళీ.

 

    "ధన్వికి దగ్గరవుతున్నందుకు."

 

    మధూళీ యింకా మాట్లాడేదేమో- రహస్యంగా అంది సామ్రాజ్యం.

 

    "ఇంట్లోకి వస్తున్నాడు ధన్వి, తరువాత డిస్కస్ చేసుకుందాం, ఓ.కె."

 

    సామ్రాజ్యం అంచనా తప్పు కాలేదు , మధూళీ ఫోన్ క్రెడిట్ చేసింది.

 

    "హలో!"

 

    అప్పుడు తూలుకుంటు ధన్వి వేపు నడిచింది సామ్రాజ్యం.

 

    "మధూళీతో టాపిక్ కట్ చేశావెం?"

 

    అదోలా నవ్వింది "అసూయగా అనిపించి."

 

    అర్ధం కానట్టు చూశాడు. అది కాదు. చర్చని మధ్యలో త్రుంచేసి వెళ్ళిపోవాలని అనిపించింది.

 

    "అసూయ దేనకని అడగవెం?"

 

    ధన్వి జవాబు చెప్పలేదు.

 

    "నువ్వు అడగవు ధన్వి. అలా మౌనంతో మనుషుల్ని సాధించాలనుకుంటావ్. అవసరం లేనిచోట అతిగా మాట్లాడి కోపం రప్పిస్తుంటావు. బహుశా అందుకే మధూళీ నిన్ను యిష్టపడుతుందేమో నాకు తెలీదు. కానీ నా ద్వారా మధూళీకి పరిచయమైనా నువ్వు నాకన్నా ఎక్కువగా మధూళీకి దగ్గరవడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈర్ష్యతో నలిగిపోతున్నాను.

 

    "నేను తరువాత వస్తాను" పైకి లేచాడు సోఫా లోంచి.

 

    "ఏం , భయంగా వుందా?"


    
    వెళ్ళనివ్వడం యిష్టంలేనట్లు అతడ్ని సోఫాలోకి నెట్టింది. ప్రతిఘటించని ధన్విని చూస్తుంటే గర్వంగా వుంది.....పకాల్న నవ్వింది కాంక్షగా కర్కశంగా.

 

    ఆమె నెమ్మదిగా అతడి సమీపానికి వచ్చింది. బరువు గుండెల ధనుష్టకారం అతడి మెదడు పొరల్లో నింపే ప్రయత్నం చేస్తూ.....ఆమె అంతటితో ఆగిపోలేదు.

 

    నిగ్రహాల సంకెళ్ళను చేధించి నైటిమాటున దాగివున్న అంగాంగసౌందర్యం కత్తుల బోనులోకి రమ్మని సవాల్ చేస్తున్నట్టు......పురుషత్వపు ధనస్సుతో సుఖాల లోయలలోకి తూగాలని సంధించి అలసిన మరుక్షణం పైకతాల కటి భాగంపై విశ్రమించమని ఆదేశిస్తున్నట్టు.....ఆమె పచ్చని యవ్వన సనాల్లో అడుగుపెట్టటానికి యింతకు మించి అవకాశం రాదన్నట్టు అనుభవాల హవేలీకిదే తన ఆహ్వానమన్నట్టు......నేలని దున్నే హలంలా కోర్కెల గళంలా కోలాహలంలా హాలాహలంలా అతడ్ని చుట్టి వేడి ఉశ్వాస విశ్వాసాల్లో అతడ్ని ఓడించాలను కుంటుంటే......

 

    "పందెంలో నేనింకా ఓడిపోలేదు సామ్రాజ్యం?" నిశ్చలంగా అన్నాడు ధన్వి.

 

    ఆమెకి వినిపించలేదు, కాదు వినిపించుకునే స్థితిలో లేదు.

 

    :నాకు నువ్వు కావాలి ధన్వి" అతడ్ని మీదకి లాక్కుంటూ "నేను నీతో అనుభవాన్ని పంచుకోవాలి" అంది ఉద్వేగంగా.

    "నేను సిద్దం."

 

    "సామ్రాజ్యం దూరం జరిగింది. ధన్వి ఏమంటున్నాడు?

 

    "నాతో అనుభవమే నీకు ముఖ్యమనుకుంటే నువ్వింత శ్రమ పడాలా సామ్రాజ్యం? అసలు నేవ్వేరివో తెలుసా? అది నిర్వేదమో నిర్లిప్తతో ఆమెకు అంతుబట్టటంలేదు.

 

    "అందరిలో వున్నా నేనెప్పుడూ ఒంటరివాడినే అనిపించినప్పుడు ఏమని మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటాను, ఎవరూ నన్ను అర్ధం చేసుకోరేం? అని భాధపడే వేళ ఏమని ఆత్మీయత కోసం తపించిపోతుంటానో, ఎవరితోనూ పంచుకోని ఆలోచనల్ని ఏ వ్యక్తీ ముందు చర్చించి వురడి పొందాలను కుంటానో అలాంటి నా సమస్యలన్నింటికి జవాబువైన నువ్వు నా నుండి శారీరకమైన సుఖం మాత్రమే కావాలనుకుంటే యింత రాద్దంతానికి సిద్దపడాలా? దశాబ్దాల తరబడి మనం నమ్మిన నైతిక విలువల్ని పది నిముషాల పాటు పక్కకి పెడితే అయిదు నిమిషాల రాపిడితో పూర్తి చేసుకోగలిగే అవకాశం కోసం నా దృష్టిలో నువ్వింత దిగజారిపోవాలా?"

 

    "నో....." అరిచింది సామ్రాజ్యం, అది అపరాదభావంతో కలిగిన ఆవేశమా, లేక నిన్నటిదాకా పరిచితుడైనా వ్యక్తి యిప్పుడో అపరిచితుడిలా మాట్లాడుతుంటే కలిగిన ఉక్రోషమో....కళ్ళ నుంచి నీళ్ళు రాలుతుంటే కసిగా అంది.

 

    "ఇది దిగాజారడమో, లేక ఎగబ్రాకడమో నాకు తెలీదు ధన్వి, కానీ నువ్వు నాకు కావాలి."

 

    "ఆ భావాన్ని యింతకు ముందు కూడా వ్యక్తం చేశావ్, కానీ ఇలా హద్దులు మరిచి ప్రవర్తించలేదే?"

 

    "అప్పుడు నేను తాగిలేను."

 

    "అంటే తాగడంతో చేసిన పొరపాటుగా అంగీకరిస్తూన్నావా?"

 

    "మాటల గారడితో నన్ను ఓడించాలని ప్రయత్నించకు."

 

    భావరహితంగా చూశాడు. "ఓడించలని నేను ప్రయత్నించడం లేదు సామ్రాజ్యం, నేను ఓడిపోయాక మాత్రమే జరగాల్సిన కార్యక్రమం కోసం తొందరపడి నీకు నువ్వుగా ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను. మన ఒడంబడిక నీ పందేన్ని మరిచి గడువు పూర్తి కాక ముందే ఎందుకు నన్ను కోరుకుంటున్నావు అని ఆలోచిస్తున్నాను. అసలు ఈ అనుభవం కోసమే ఆ రోజు పందెం పేరిట అవకాశం తిసుకున్నావేమో అని కూడా బాధపడుతున్నాను."

 

    ఇంకా దిగని మైకం పచ్చిగా దొరికిపోయానన్న ఆవేశం ఆమెను మరింత ఉన్మాదిగా మార్చేసింది. "ఎస్, అంతకు మించి ఛాన్సు దొరకదని తెలిసి నేనే అవకాశం తీసుకుంటేనేం......నాకు కావల్సింది నువ్వు, నీ ద్వారా నా గతాన్ని నేను మరిచిపోవడం.....ఈ నిజం ఒప్పుకోవటానికి నేను దిగ్గుపదను."

 

    "ఓ.కె. సామ్రాజ్యం....." చాలాసేపటి నిశ్శబ్దం తరువాత అన్నాడు ధన్వి.

 

    "ఇంత కాలము నీ మూలంగా వూరట పొందిన నేను నీ కోరికల్ని తీర్చడానికి అంగీకరిస్తూన్నాను. ఎప్పుడో మన గడువు తీరేకకాదు. ఇప్పుడే, కాకపోతే అందుకు నేను కాస్త మానసికంగా ప్రిపేర్ కావాలి. జస్ట్ రేపు రాత్రి దాకా టైం యివ్వు."

 

    విభ్రమంగా చూస్తున్న సామ్రాజ్యంతో అన్నాడు.

 

    "నిజం సామ్రాజ్యం. సరిగ్గా రేపు రాత్రి ఎనిమిది గంటలకి నేనే నీ దగ్గరికి వస్తాను. నువ్వు కావాలనుకున్నట్టుగా నీ కోరిక తీర్చి నీ గతాన్ని మరిపించే వూరటగా మారిపోతాను. సరేనా? వస్తాను.....బై"

 

    ఉద్యోగం వచ్చినట్టు చెప్పి అభినందించలనుకున్న ధన్వి, ఆ విషయం మర్చిపోయి ట్రాన్స్ లోలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే గదిలోకి అడుగు పెడుతూ కాస్త తులేడు. అది మానసిక సంఘర్షణ మూలంగా అందోళన పెడుతున్న అలసటో, లేక హటాత్తుగా గుండెని కుదిపేస్తున్న నొప్పి మూలంగా ఏర్పడ్డ ఆయసమో రెండు నిమిషాల పాటు వూపిరి అందనట్టు కలవరపడ్డాడు, ధన్వి కళ్ళు భైర్లు కమ్ముతుంటే.

 


                                       *    *    *    *       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS