అంతే! డేవిడ్ అంత దూరం ఎగిరిపడ్డాడు" చాల ఉత్సాహంగా కోసేయ్య సాగాడు చిట్టబ్బాయి.
"ఆ తర్వాత?" అతృతగ అడిగింది చిన్నమ్మాయి.
"ఆ తర్వాత నాకు ఐస్క్రిమ్ కావాలి" అన్నాడు పండు.
"ఆ తర్వాత అని నిన్ను కాదు నేను అడిగింది. అంకుల్ ని అడిగాను" అంది చిన్నమ్మాయి.
"ఒహొ! అంకుల్ నా? చేగోడీలు తర్వాత ఏం కావాలని నన్ను అడిగావేమో అని.."దీర్ఘాలు తీస్తూ అన్నాడు పండు.
చిట్టబ్బాయ్ కి ఇరిటేషన్ పుట్టి నొసలు మీద అరచేత్తో ఫట్ మని కొట్టుకున్నాడు.
"అదేం అలా కొట్టుకున్నారు... మా తమ్ముడేమ్తెనా విసిగిస్తున్నాడా?" అడిగింది చిన్నమ్మాయి.
చిట్టబ్బాయి కంగారు పడిపోయాడు. పండుమిద తమ విసుక్కున్నాడా?" అడిగింది చిన్నమ్మాయి.
చిట్టబ్బాయి కంగారు పడిపోయాడు. పండుమిద తమ విసుక్కున్నడంటే ఆమెకి తన మీద అయిష్టం ఏర్పడవచ్చు.
"అబ్బెబ్బే... అదేం లేదండి.... పండంటే మీకు ఎంతిష్టమో నాకూ అంతే ఇష్టం... నా నొసలు మీద దోమవాలి కుడ్తుంటే అలా చేత్తో కొట్టుకున్నా నన్నమాట!... హిహి....." అని ఇబ్బందిగా నవ్వి ఆ తరవాత పండు బుగ్గలు చిదిమి "చిచ్చి...." అన్నాడు చిట్టబ్బాయ్.
"మర్తెతే దిని తర్వాత ఐస్క్రిమ్ కొనిపెట్టాలి... అలాగేనా?" అన్నాడు పండు.
"ఓ.... అలాగే..."ప్తెకి ఎంతో హుషారుగా అని లోలోపల తిట్టుకున్నాడు చిట్టబ్బాయి.
"సరేగాని... మీ కథ చెప్పడం లేదు..." అంది చిన్నమ్మాయి.
"చెప్తుంటే మధ్యలో వేరే టాపిక్ వచ్చేస్తుంది... ఆ ... ఎందాకా చెప్పానూ? నేను కొడ్తే డేవిడ్ గాడు అంత దూరం ఎగిరిపడ్డాడని కాదూ? అప్పాద్ఫు జాన్ గాడు పిడికిళ్ళు బిగిస్తూ..."
చేతులు తిప్పేస్తూ తాను ఆ రౌడిలని చిత్తుచిత్తుగా ఎలా కొట్టింది చెప్తున్నాడు చిట్టబ్బాయి.
"అవునుగాని ఇందాకట్నుండి వాళ్ళిద్దరితో మిరే ప్తేటింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు... మరి మీ ఫ్రండు కన్నారావు ఏం చేస్తున్నట్టూ?..." అడిగింది చిన్నమ్మాయి.
"ఆ..వాడిబోంద! వాడో పిరికిసన్నాసి!! భయంతో గడగడా వణికిపోతూ ఓ పక్క నిల్చున్నాడు. అయినా వాళ్ళకి నేనోక్కడ్ని సరిపోతాలే"
"పోరాబాట్న వాళ్ళవల్ల మికేమ్తెనా ప్రమాదం సంభవించి ఉంటేనో?" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది చిన్నమ్మాయి.
"ఆ! మీ పండు ప్రాణాలు కాపాడ్డం ముఖ్యంగాని ఏ ప్రమాదం వస్తేనేం లెండి" ఎంతో తేలిగ్గా తిస్కుంటున్నట్టు అన్నాడు చిట్టబ్బాయి.
"అన్నట్టు మా పండుని రక్షించడానికి బయలుదేరేమని చెప్తున్నారు కదా? మా పండు ప్రమాదంలో ఉన్నాడని మికెలా తెల్సు?"
"రెస్టారెంట్ లో డేవిడ్, జాన్ మా పక్క టేబులు దగ్గర కూర్చున్నారండి. వాళ్లు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు మాకు వినిపించాయి. వాళ్ళ మాటల్ని బట్టి మాకు తెల్సింది వాళ్లు ఎవరో పిల్లాడిని కిడ్నాప్ చేశారని, ఎలాగ్తెనా సరే...ప్రాణాలకు తెగించి ఆ పిల్లాడిని రక్షించాలని నిర్ణయించుకుని వాళ్ళ కారు డిక్కీలో దాక్కుని వాళ్ళ యింటిదాకా వెళ్ళాం. ఆ తరువాత వాళ్ళతో ఎలా పోరాడింది మీకు తెల్సిందే. ఇంతా కష్టపడి యింట్లోకి వెళ్ళి వెతికితే మీ పండు కనిపించలేదు. అప్పటికె మీ వాడు కిటికిలోంచి దూకేసి బయటపడి రోడ్లమ్మట ఏడుస్తూ తిరుగుతున్నాడు. మేము ఒక ఆటో ఎంగేజ్ చేస్కుని అంత రాత్రీపూట విధి విధి గాలించి మివాడ్ని పట్టుకుని వాడిద్వారా మీ అడ్రసు తెలుసుకుని ఇంటికి తిసుకోచ్చాం."
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయి వంక కృతజ్ఞతపూర్వకంగా చూసింది.
"మీరు మాకోసం చాలా శ్రమపడ్డారండి" అంది.
"ఆ! దేనిదేముందండి... మీ కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తా" అని అనాలని అనుకున్నాడుగాని అలా అనడానికి ద్తేర్యం చాలక ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాడు చిట్టబ్బాయి.
"ఆ రౌడీలు మిమిడ పడబడ్తేనో?" కొన్ని క్షణాల మౌనం తరువాత అడిగింది చిన్నమ్మాయి.
ఆమె అలా అడిగేసరికి నిజమే కదా? అని అనుకున్న చిట్టబ్బయికి భయం వేసింది కాని తన మనసులోని భయం మొహంమీద కనబకుండా జాగ్రత్తపడ్డాడు.
"ఆ వాళ్ళ బొంద! వాళ్ళని చేతులూ కాళ్ళూ కట్టిపారేసి పండుని మీ ఇంట్లో అప్పజెప్పిన తరువాత మీ నాన్నగారు మేమూ కలిసి పోలిసుల్ని ఆ ఇంటికి తిసుకేళ్ళం... పిలిసులు డేవిడ్, జాన్ లని అరెస్టు చేసి తీసుకెళ్ళారు. వాళ్లు కటకటాలు లేక్కబెడ్తూ కూర్చుంటారు... నన్నేం చేస్తారు?" అన్నాడు లేని దేర్యం తెచ్చుకుంటూ.
"చేగోడీలు అయిపోయాయి. నాకు ఐస్ర్కిమ్ కావాలి!!" అన్నాడు పండు చిట్టబ్బాయి తోడమీదకొడ్తూ.
చిట్టబ్బాయి శబ్దం కాకుండా పళ్ళు నూరాడు.
* * *
కన్నారావు పగలబడి నవ్వాడు.
చిట్టబ్బాయి కన్నారావు వంక చికాకుగా చూశాడు.
"అయితే నువ్వు పార్కుకి వెళ్ళింది పండుగాడికి అవి ఇవి కొని పెట్టడానికా" నవ్వు ఆపుకోడానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు కన్నారావు.
"అంటే ని ఉద్దేశ్యం నేను చిన్నమాయితో మాట్లడలేదనా?" కోపంగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.
"మాట్లాడే ఉంటావ్ లే.. మీ పండుగాడు చాలా బాగుంటాడండి... మీ పండు మహా చిలిపి సుమండీ... మీ పండు చాలా తెలివ్తెనవాడు సుమా' అంటూ మొత్తం పండు గురించి మాట్లాడి ఉంటావ్!"
కన్నారావు అలా ఉడికిస్తుంటే చిట్టబ్బయికి వెర్రెక్కి పోయింది.
ని మొహం నాకేం తెలివితేటలు లేవా? అలా ఎందుకు మాట్లాడుతాను?" కసురుకుంటూ అన్నాడు.
"మరి ఎలా మాట్లాడావ్?" కవ్విస్తూ అడిగాడు.
"పార్కులో వాతావరణం బాగుంది కదండి... చల్లగా హాయిగా అన్నాను"
"ఇంకా" నవ్వాపుకుంటూ అడిగాడు.
"పచ్చిక పచ్చగా, ఆకాశం నీలంగా..చాలా బాగుంది కదండి" అన్నాను.
"కొంగలు తెల్లగా, కాకులు నల్లగా ఉన్నాయి కదండి ఎంచక్కా అని అన్లేదా?" వేళాకోళంగా అడిగాడు కన్నారావు.
చిట్టబ్బాయి కన్నారావు అతని ఆటపట్టిస్తున్నాడని గ్రహించాడు. అందుకే బుంగమూతి పెట్టి అలిగాడు.
"పోవోయ్... నికింక నేనేమి చెప్పను. అయినా ప్రేయసి ప్రియుల మధ్యన జరిగిన మాటలు వాళ్లు వేరేవాళ్ళకి చెప్తారా?" అన్నాడు. అతని మొహం ఎర్రగా కందింది.
అది వినగానే కన్నారావు పొట్ట పట్టుకుని పగలబడి నవ్వాడు. అంతగా నవ్వడం వాళ్ళ కన్నారావు మొహం కూడా కందింది.
"ఏవిటి..మీరు ప్రేయసి ప్రియులా? చాలా పెద్దజిక్ వేస్తున్నవే!! నాతో అంటే అన్నావ్ గాని చిన్నమ్మాయితో అనకు, చాచిపెట్టి గూబపగిలేలా కొడ్తుంది"
కన్నారావు అలా అనగానే చిట్టబ్బాయికి పౌరుషం వచ్చింది.
"ఏం ఎందుకు కొడ్తుంది?...చిన్నమ్మాయికి నేనంటే యిష్టం!" అన్నాడు.
"అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నిది వన్ వె ట్రాఫిక్!"
"కానేకాదు. చిన్నమ్మాయికి నేనంటే కచ్చితంగా యిష్టం వుంది.... లేకపోతే నాతో పార్కుకి వస్తుందా?"
"చిన్నమ్మాయికి పండంటే చాలా యిష్టం. నువ్వేదో వాడి ప్రాణాలు కాపాడావని అనుకుని నిమిడి కృతజ్ఞత భావంతో కాదనలేక పార్కుకి వచ్చింది" ఉడికిస్తూ అన్నాడు కన్నారావు.
అతను అలా ఆర్గ్యు చేసినకొద్ది చిట్టాబ్బాయ్ కి ఉక్రోషంగా ఉంది.
"ని మొహం! కేవలం పండుని రక్షించిన కృతజ్ఞతే అయితే థాంక్స్ చెప్తుంది.
ఇంటికి పిలిచి టి యిస్తుంది. అప్పడప్పడు ఇంటికి వస్తూండండి అని స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తుంది. అంతేగాని నావెంట పార్కులకి ఎందుకొస్తుంది? చిన్నమ్మాయి కచ్చితంగా నన్ను ల్తేక్ చేస్తుంది" మొహం కందగడ్డలా చేస్కుంటూ అన్నాడు చిట్టబ్బాయ్.
