40. ప్రాణం తీసే బ్లడ్ కేన్సర్
బాలయ్యకి ఈ మధ్య ఏ మాత్రం పని చేసినా అలసట అనిపిస్తోంది. రోజు రోజుకీ నీరసంగా తయరవుతున్నాడు. ఒక వైద్యుడేవడోచూసి "నీకు రక్తం తక్కువుగా వుంది, రక్తం పట్టడానికి టానిక్కు వాడు" అంటూ సలహా ఇచ్చాడు. బాలయ్య అలాగే చేస్తూ ఉన్నా రోజు రోజుకి నేరశిమ్చిపోతున్నాడు. చివరకి ఇంకో డాక్టరు దగ్గరికి వెళ్ళి చూపిస్తే రక్త పరీక్ష చేసి"నీకు బ్లడ్ కేన్సర్ వచ్చింది. ఇది ప్రమాదకరమైన జబ్బు" అని చెబితే బాలయ్య బాధపడిపోయాడు. అయితే "బ్లడ్ కేన్సర్" అంటే అర్ధంగాక అయోమయంగా డాక్టరు మొఖంలోకి చూశాడు.
బ్లడ్ కేన్సర్ నే వైద్య భాషలో "లికీమియా" అని అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో తెల్లకణాలని టిన్యూలు అసాధారణంగా మార్పుచెంది అమితంగా తెల్ల కణాలని ఉత్పత్తిచేస్తాయి. అందువల్ల రక్తంలో ప్రతీ క్యూభిక్ మిల్లీ మీటరుకు 3వేల నుంచి 12వేల లోపు ఉండవలసిన తెల్లరక్తకణాలు యాభైవేలులేదా ఇంకా మించిపోతాయి. వీటికి తోడుపూర్తిగా పరిణతి చెందని తెల్లకణాలు అనేకం రక్తంలో చేరిపోతాయి. బ్లడ్ కేన్సర్ వచ్చిన వారికీ మృత్యువు చాలా దగ్గర పడుతుంది. వేరిలో రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో రక్తనాళాలు కూడా పగిలిపోతాయి. రకరకాల వైది క్రిములు శరీరంలో చేరి వ్యాధులని కలుగజేస్తాయి.
బ్లడ్ కేన్సర్ రావడానికి స్పష్టమైన కారణం చెప్పడం కష్టం. ఇందుకు అనేక కారణాలని చెప్పుకోవచ్చు. ఎక్స్ రేలకి, రెడిఎషణ్ కి అధికంగా గురైనా వారికీ బ్లడ్ కేన్సర్ రావడం ఎక్కువ. బ్లడ్ కేన్స్ ర్ అనేదానిలో అనేక రకాలున్నాయి వాటిల్లో ఎక్యూట్ మరియు క్రానిక్ మైలాయిడ్ లుకీమియాలు. ఎక్యూట్ మరియు క్రానిక్ లింఫాయిడ్ లుకీమియలు ముఖ్యమైనవి. ఇవిగాక సబ లు కీమిక్ లుకీమియా అనే దానియోలో రక్తంలో తెల్లకణాల సంఖ్య పెరగకపోయినా అసాధారణమైన తెల్లకణాలు కానవస్తాయి. అలా అసాధారణ తెల్లకణాలు కనబడం కూడా ప్రమాదమే.
కొందరిలో బ్లడ్ కేన్సర్ లక్షణాలు ఎంతో కాలం నుంచి కనబడకుండా ఉండితరువత అకస్మాత్తుగా వ్యాధి లక్షణాలు బయట పడతాయి. అలా అకస్మాత్తుగా వ్యాధి లక్షణాలుబడతాయి. అలా అకస్మాత్తుగా వ్యాధి లక్షణాలు బయటపడే వాటిల్లో ఎక్యూట్ లిఫాటిక్ లుకీమియా ముఖ్యమైనది. ఈ వ్యాధి చాయింన పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడినపుడు జ్వరం వస్తుంది. అతిగా నీరసం అనిపిస్తుంది. రక్తహీనత చాలా త్వరగా కూడా ఉండవచ్చు. చర్మం క్రింద రక్తనాళాలు చిట్లవచ్చు. గొంతునొప్పి అనిపించడం నోట్లో కురుపులు రావడం
కండరాలు కీళ్ళు సలవరం కలిగిస్తాయి. కొద్ది రాజులకి స్లీన్, లివర్ సైజు పెరుగుతాయి. రక్తపరీక్ష చేసి చూస్తె తెల్ల కణాల సంఖ్య విపరీతంగా కనబడుతుంది. అసాధారణ, ఆస్వాభావిక తెల్లకణాలు రక్తంలో 30నుంచి 90శాతం చోటు చేసుకుంటాయి. త్వరత్వరగా రాగి పరిస్థితి విషమిస్తుంది. చివరికి ప్రాణాపాయం కలుగుటుంది. ఇంతవరకు బ్లడ్ కేన్సర్ పూర్తిగా నివారించేందుకు మందులు లేవు.
క్రానిక్ మైలయిడ్ లుకీమియా వంటి బ్లడ్ కేన్సర్ లక్షణాలు రోగికి నిదానంగా ఏర్పడతాయి. వీరికి రక్తహీనత నిదానంగాఏర్పడుతుంది. నిదానంగానే బరువు తగ్గిపోతారు. కడుపులో స్ల్పీన్ బాగా పెరగడంతో పై కడుపులో ఎడమవైపు నొప్పి అనిపిస్తుంది. పొట్టకూడా ఎత్తుగా కనబడుతుంది. కొంతకాలం తరువాత ముక్కు నుండి రక్తం కారడం మోడలవవచ్చు. క్రానిక్ లింఫాటిక్ లుకీమియాలో, రక్తంలో తేల్లకణాల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మెడ దగ్గర, చంకల్లోను, గజ్జల్లోను లింఫ్ గలండు ఉబ్బుతాయి. ఆ గాండ్లుగట్టిగా అనిపిస్తాయి. దేనికది వేరు వేరుగా ఉంటాయి. కాని పెరిగిన లింఫ్ గ్లాండ్లు నొప్పిఅనిపించవు. క్రానిక్ లికీమియాలో తెల్లకణాల సంఖ్య రక్తంలోప్రటీ క్యూభిక్ మిల్లీ మీటరుకి అయిదు లక్షలు దాకా ఉంటాయి.
బ్లడ్ కేన్సర్ లక్షణాలు మామూలు రక్త హీనత లక్షణాలు లాగా ఉందబెట్టిచాలా ముందు లెక్కచేయరు వాటి దుష్పలితాలు కనబడగానే పరీక్ష జరిపి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుచేత అంతవరకు ఆగకుండా రక్తహీనత ఉండినీరసించి పోతూ ఉంటే, రక్తపరీక్ష ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
****
