Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 42

                            39. గూని రావాటానికి కారణాలు 
   
    రాధిక చూడటానికి చక్కగా చందనం బొమ్మలా కనబడుతుంది. కాని ఆమెది విచిత్రమైనా మనస్తత్వం. తాను అందరి అమ్మాయిల కంటె, అమ్మాయిలేమిటి, ఎందరో అబ్బాయిల కంటె_ పొడుగు ఉన్నాయని దిగులు పడుతూ వుంటుంది. అంట ఎత్తు ఉన్న అడపిల్లలు అందంగా కనిపించారని ఆమె ఉద్దేశం. అందుకే స్వాభావికామిన అ లక్షణాన్ని కప్పిపుచ్చుకొనేందుకుచీర కొంగును మెడచుట్టూ కప్పుకొంటుంది.  అంతేకాదు  నిలబడినప్పుడు. నడిచేటప్పుడు కావాలని "గూని" గా వంగిపోతుంది.   కూర్చున్నప్పుడు గూడలన్నీ మునగదీసుకుని ముడుచుకుని కూర్చుంటుంది. దానితో అందమైన బొమ్మలాంటి రాధిక, వయస్సు మళ్ళిన బామ్మలా గూనిగా కనబడుతుంది.

    రాధికలా కొందరు కావాలని గూనిగా తయారయితే, మరికొందరు పుట్టుకతోనే గూనిగా తయారయి అసహ్యంగా కనబడతారు. వయస్సు మళ్ళినవాళ్ళుశరీర దారుడ్యం తగ్గి వంగిపోయి నడవవచ్చు. కాని వయసులో ఉన్న అమ్మాయిలూ, అబ్బాయిలు కూడా తెలిసో తెలియకో ముందుకు వంగిపోయి లేని "గూని" ని తెచ్చి పెట్టుకుంటారు. ఇలాంటి గూని సరిదిద్దుకుంటే సరిపావువచ్చేమొగాని, మొదటినుంచీ కుర్చీలో, శావుఫాలో సరిగ్గా కూర్చోకపోతే, నిజంగానే మరొకరకమయిన గూని వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎదిగే వయస్సులో నిటారుగా కూర్చోనకపోయినట్లయితే వెన్ను దగ్గర కండరాలు సక్రమంగా, బలిష్టంగా తయారవక వెన్ను వంగి కృత్రిమ గూని వస్తుంది.

    కొందరిలో గూని బగా కనబడే విధంగా ఉంటే, మరికొందరిలో గూని కనబడకపోయినా ఆ లక్షణాలు కొద్దోగోప్ఫో ఉంటాయి. వెన్ను పూసా గుండ్రంగా వంగడంవల్లనే గూని వస్తుంది. అలా జరగడానికి రకరకాల కారణాలున్నాయి. పుట్టుకతోనే వెన్నుపూసల నిర్మాణంలో తేడా ఉండిగూని ఏర్పడవచ్చు. చిన్నపిల్లల్లో విటమిన్ "డి" లోపంవల్ల రికెట్స్ వ్యాధి వచ్చి వెన్నుపూసాఏడుగుదలలో తేడావచ్చి గూనిరావచ్చు. వెన్నుపూస కండరాలు, లిగమింట్లు సక్రమంగా ఎదగక వెన్నుపూసా లన్నింటినీ బలిష్టంగా బిగబెట్టి ఉంచక ఏదో ఒకచోట వంగిపోవచ్చు.

    వృధ్యాప్యంలో నడుము వంగిపోయి గూని రావడానికి వెన్నుపూసలు సహజత్వాన్ని కోల్పోయి కుదించుకుని పోవడమే కారణం. వీరిలో లాగారావడమే కాకుండా కొంత ఎత్తు కూడా తగ్గుతుంది. ఇది ఇలా వుండగా 50సంవత్సరాలు దాటినా వాళ్ళల్లో ముఖ్యంగా స్రీలల్లో కొన్ని వెన్నుపూసలు మెత్తబడిపోయిగూని వస్తుంది. దీనికి కారణం, ఆ వయస్సులో కొన్ని సెక్సు హిర్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడమే. దాంతోవెన్నుపూసలు డోల్లాగా అవుతాయి. దీనిని ముందే గమనించి మందులు వాడినట్లయితే ఆ వెన్నుపూసలు మళ్ళీ బలంగా తయారవుటాయి.

    ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వెన్నుపూసలకి దెబ్బ తగిలిశాశ్వితంగా గూనివచ్చే ప్రమాదం ఉండి. వెన్నుపూసల్లో ముఖ్యంగా ఛాతీవెనుక భాగంలో క్షయవ్యాధి వచ్చి ఒకటి_ రెండు వెన్నుపూసలు దెబ్బతింటే కూడా గూని వస్తుంది. అలాగే వెన్నుపూసల్లో కేన్సర్ వ్యాధి వచ్చినా, ఇతర వ్యాధులు వచ్చినా గూని కనబడకవచ్చు . సినిమాల్లో, నిత్య జీవితంలోనూ మాంత్రిక వేషధారులుగూని ఉన్నట్లుగా నడుస్తూంటారు, గూని ఉన్నవాళ్ళకు ఏదోరకమయిన శక్తి ఉంటుందని పలువురి అపోహా. మనలను భయానక వాతావరణంలో ముంచెత్తటానికి వరు అలా నడుస్తారు తప్ప వారికి ఎలాంటి శక్తులూ ఉండవు. వ్యాదుళవల్ల ప్రమాదాల వల్ల వచ్చే గూనికి వేరే చికిత్సా పద్దతులు ఉంటాయి. కాని కూర్చోవడంలో, నడవడంలో కావాలని తెచ్చి పెట్టుకునే గూనోనో ఎవరంటటికి వరు గమనించి ఇతరులు చెప్పగా తెలుసుకునో , వెంటనే సరిదిద్దుకుంటేపోతుంది. లేకపావుత్యే గూని వ్యక్తుల జాబితాలో వారూ చేరుతారు.                

                                                              ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS