-: కేశబంధ హస్త లక్షణము :-
శ్లో!! ఏతావేవనిమ్బాది కేశపర్యంతచాలితౌ !
యదిశ్యాత్కేశ బంధాఖ్య కరస్సమ్యజ్నిరూప్యతే !!
తా: ముందుచెప్పిన పతాక హస్తములే పిరుదులు మొదలు తల వెంట్రుకలదాకా చలింపనేయుచు పట్టబడినయెడ కేశబంధహస్త మగును.
శ్లో!! వృక్షద్వయ్కేధికేమేరోరర్థేబహువిభావనే !
ఉత్తిష్టేతివచోధావే యుజ్యతే కేశబంధకః !!
తా: రెండు వృక్షములు, అధికము, మేరుపర్వతము, చాలా అనుట, లెమ్ముఅనుట వీనియందు చెల్లును.
-: లతాహస్త లక్షణము :-
శ్లో!! అలపద్మావగ్రభాగ ప్రశ్రితౌ చవితౌయది !
లతాహస్త స్సవిజ్ఞేయః. ప్రోక్తోనాట్య విశారదైః !!
తా: రెండు అలపద్మ హస్తములు ఎదురెదురుగా చల్లెంచుటట్లు పడ్డబడిన లతాహస్త మగును.
శ్లో!! భ్రమరాభిధనాట్యేచవాయోశ్చవితకోరకే !
లతాయాం, పుష్సితాయాంచ, స్తబకాచలన్కేపిచ !
లేలాకందుకభావేచ లతాహస్తోనియుజ్యతే !!
తా: భ్రమరనాట్యము గాలిచే గదలెడి మొన్న, బూనీగే పూగుత్తుల కదలిక, చెండు వీనియందు ఈ హస్తము వినియోగింపపడును.
-: ద్విరద హస్త లక్షణము :-
శ్లో!! పతాకనామ్నా హస్తేన స్కంధదేశే నివేశ్యచ !
పద్మకోళమధోవక్త్రం దక్షిణేహస్తకేయది !!
సమౌదృతౌఛేద్ద్విరదహస్త్కోయం పరికీర్తితః !!
తా: ఎడమచేత పతాకహస్తమును, కుడిచేత పద్మకోశహస్తమును, అధోముఖముగను సమముగా పట్టిన ద్విరద హస్తమగును.
శ్లో!! గజస్యాశుండాభినఝే గజవక్త్ర ప్రదర్శనే !
యుజ్యతే కరిహస్త్కోసౌ, నరహస్తానుసారతః !!
తా: ఏనుగు తొండమునందును, విఘ్నేశ్వరుని చూపుటయందును, ఈ హస్తము చెల్లును.
-: నీద్ధృతహస్త లక్షణము :-
శ్లో!! ఊరసోగ్రే హంసపక్షావన్యోన్యాభిముఖీకృతౌ !
భవేదు ద్దృతహస్త్కోయం వినియోగ్కోస్య కధ్యతే !!
తా: రొమ్ము కెదురుగా హంసపక్ష హస్తములను ఎదురెదురుగాచేరి పట్టినయెడ ఉద్దృతహస్త మగును.
శ్లో!! ఆపర్తేత్వ వ్యధాత్యర్ఖే భావనాయాం స్వరూపకే !
స్థిరోభవేతి వచనేడోలాయాం స్థూలక్కేపిచ !
గృహ్కేప్యుద్దృతహస్త్కోయం ప్రకృతార్థే నియుజ్యతే !!
తా: నీటిసుడి, అధికము, తలపు, స్వరూపము, స్థిరుడవు అగుమనుట. ఉయ్యాల, పెద్దది, ఇల్లు, ప్రకృతార్ధము వీనియందు చెల్లును.
-: సంయమ హస్తలక్షణము :-
శ్లో!! తర్జనీ మధ్యమౌ హస్తవేనమ్రీ కృతౌయధి !
ఇతిరౌ ప్రసృతౌస్కోయం కరస్సంయమ నామకః !!
తా: చూపుడువ్రేలిని, నడిఘివ్రేలిని అరచేతి తట్టువంచి తక్కిన వ్రేళ్ళను చాచిపట్టినయెడ సంయమహస్తమగును.
శ్లో!! ప్రాణాయామే మహాయోగే యుజ్యతేచ్కార్య భావనే.
తా: ప్రాణాయామము, యోగాభ్యాసము, పూజ్యలు అనుట, వీనియందు ఈ హస్తము చెల్లును.
-: ముద్రాహస్త లక్షణము :-
శ్లో!! కరయోర్మధ్యమాజ్గుష్టే యోగాన్ముద్రాకరో భవేత్ !!
తా: రెండుచేతుల నడిమివ్రేళ్ళను, బొటనవ్రేళ్ళను చేర్చిపట్టినయెడ మువ్రాహస్త మగును.
శ్లో!! అణౌతృణే గోముఖేచత్రోపుట నిదర్శనే !
ముద్రాహస్తోయుజ్యత్కేసౌ భరతాగమకోవిదైః !!
తా: అణువు గడ్డిపోచ. ఆవుఘోర, పక్షిముక్కు, వీనిని చూపుట యందు ఈ హస్తము చెల్లును.
-: ఆజాముఖ హస్త లక్షణము :-
శ్లో!! సింహాననాభీధకరేతర్జనీచ కనిష్టికా !
మధ్యమానామికాపృష్టే, యోగాద్భూయాదజాముఖః !!
