"ఒహో... అలాగా సార్... అయితే వస్తాను సార్..." అంటూ వెనక్కి తిరగబోయాడు.
"అగవయ్యా బాబూ! నేను పిలవకపోతే వాడు వూరికే వచ్చి నేను పిలిచానని చెప్తాడా అలా అడుగుతావ్. ఆ ప్యూన్ మైనా నీకు బామ్మర్డా నీతో పుట్టుట్టినే చెప్పి హాస్యలాడ్డానికి?" మోహం చిట్లిస్తూ అన్నాడు సర్వోత్తమరావు.
"అబ్బే... కాద్సార్!" అన్నాడు అతను తడబడుతూ.
"నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా?" అడిగాడుయ్ ఆయన.
రాంపండు అమాయకంగా మోహం పెట్టి తల అడ్డంగా వూపాడు తెలీదన్నట్టు.
"వెరీగుడ్... నీదంతా చాలా అమాయకపు వ్యవహారమయ్యావ్."
అతను గుటకలు మింగాడు.
"ఈ ఫైలు చూశావా? దీన్ని స్టడీ చేసి నీ కామెంట్స్ రాయి... నిన్న నీ దగ్గర ఏ ఫైలూ పెండింగ్ లేకుండా చేసేశానని అన్నావు. ఆ వ్యవహారం గుర్తుందా...? కానీ కర్నూలు కాంట్రాక్టుకి సంభందించిన ఫైలు నీ దగ్గరే వుంది. అది యింకా న దగ్గరకు రాలేదు."
రాంపండు నాలుక్కోరుకున్నాడు.
"అవున్సార్... నిజమే సార్. అది టేబుల్ క్రింది సొరుగులో పెట్టి మర్చిపోయాను సార్. ఇప్పుడే దాన్ని చూసిపంపిస్తాను సార్..." అంటూ వెనక్కి తిరిగి హమ్మయ్య యిమ్డుకా పిలిచాడు అనుకున్నాడు.
"ఇదిగో పండూ..."గట్టిగా పిలిచాడు సర్వోత్తమరావు.
రాంపండు వెనక్కి తిరిగాడు.
"నీ వ్యవహారం నాకేం నచ్చలేదు.నువ్విక వెళ్ళొచ్చు అని నేననకుండానే వెళ్ళిపోతావేం?"
"సారీ సార్! సరే వెళ్ళొచ్చు అనండి.... నేనెళ్ళిపోతాను!"
"నేననను... ఎందుకంటే నీ వ్యవహారం తెల్సుకోవాలి? నిన్న కడుపునోప్పుని చెప్పి గంట పర్మిషన్ తీసుకున్నావా లేదా?"
రాంపండు గుటకలు మింగాడు.
"తెసుకున్నా సార్!"
"మరి కడుపునొప్పిని అన్నవాడిని ఎక్కడికి వెళ్లావు... అదీ హవ్వ హవ్వ... ఎవర్తో వెళ్లావు?"
"డాక్టర్ దగ్గరకి వెళ్లాను సార్.... అదీ నేనొక్కడినే వెళ్లాను సార్!"
"అబద్దం! నువ్వు యమ అల్లరి దొంగా మొగుడు సినిమాకి వెళ్ళావ్" అరుస్తూ అన్నాడు సర్వోత్తమరావు.
"యమ అల్లరి దొంగా మొగుడు కాద్సార్_ యమ అల్లరి రౌడి మొగుడు " మెల్లగా చెప్పాడు రాంపండు.
"అదే... అదే.. అదే! నాతో కడుపునోప్పుని చెప్పి ఎవరో వ్యవహారాన్ని వెంటేసుకుని సినిమాకేళతవా?"
"నేనెక్కడ వెళ్ళాను సార్?" అయోమయంగా ముఖం పెట్టి అన్నాడు రాంపండు.
"ఏందయ్యా... నేనేమైనా నీకు వెర్రి వ్యవహారంలా కనిపిస్తున్నానా? ఇప్పుడే కదా యమ అల్లరి రౌడి మొగుడుకి వెళ్ళానని చెప్పలేదు సార్... మీరు సినిమా పేరు తప్పు చెప్తే కరెక్ట్ చేశానన్నమాట...! వల పోస్టర్ల మీదా, హొర్దింగుల మీదా,పుస్తకాల్లోనూ చూస్తుంటాను కదా..."
రాంపండు సర్వోత్తమరావుకి సమాధానం చెబుతూనే చురుగ్గా ఆలోచించసాగాడు. సర్వోత్తమరావు తనని వైష్ణవితోపాటు సినిమా హలో చూశాదన్న విషయం అతనికి అర్దమైపోయింది.
"అబద్దం! నేను నిన్ను యమ అల్లరి దొంగమొగుడు..."
"దొంగమొగుడు కాద్సార్_ రేడీమొగుడు" అన్నాడతను.
"ఏదో ఒక మొగుడు. ఈ మొగుడు టైటిల్స్ తో పెద్ద కం ప్యూజన్ వ్యవహారం అయిపోతుంది.... అదే...ఆ యమ అల్లరి రౌడి మొగుడు సినిమానువ్వు చూస్తుండగా నేను కళ్ళారా చూశాను..."
"నాతోబాటు ఎవరున్నారు సార్?"
"ఓ బాబ్డ్ హర్ వున్నామే వుంది!"
"చూశారా... చూశారా? మా ఆవిడని మీరు చూశారు కదా... ఆవిడకి బాబ్డ్ హర్ లేదు కదా?.... కాబట్టి మీరు చూసింది నన్ను కాదన్నమాట" సంబరంగా అన్నాడతను.
"ఇది మరీ బాగుందయ్యోవ్. ఆవిడకి బాబ్డ్ హర్ వుంటే నువ్వు నువ్వు కాకుండా పోతవా? అయినా నువ్వు మే ఆవిడతో సినిమా కొచ్చావని నేనన్నావా? ఎవరామె?" రెట్టించి అడిగాడు సర్వోత్తమరావు.
"ఎవరు సార్?"
"అదే... నీతో నిన్న సినిమాకి వచ్చినామే."
"నేను సినిమాకి వెళ్ళలేదు సార్!"
"నేను నిన్ను చూశానయ్యా అంటుంటే. నేను కూడా ఒకటి జరిగి వుండొచ్చు సార్! వాడేవాడో అచ్చుగుద్దినట్టు నా పోలికలతోనే వుండి వుండ వచ్చు సార్" అన్నాడతను.
"నేన్నమ్మను.... మారీ అంత కవలపిల్లల్లా ఎలా వుంటారు?"
"నిజం సార్!ఈ ప్రపంచంలో ఒకే పోలిక గలవాళ్ళు ఏడుమంది వుంటారట సార్. అయితే ఈ ఊళ్ళోనే నాలా వుండేవాళ్ళం యిద్దరం వున్నమన్నమాట! మిగతా అయిదుగురు ఎక్కడున్నారో?" ఆలోచనగా మోహం పెట్టి అన్నాడు రాంపండు.
"స్టాంప్ నాన్సెన్స్ వ్యవహారం! నాకే కధలు చెప్తున్నావే!" అన్నాడు సర్వోత్తమరావు కొరకొరా చూస్తూ.
"లేద్సార్... ఇప్పుడే వారం క్రితం జరిగిన ఓ సంగటన గుర్తుకు వచ్చింది సార్."
"ఏంటది?"
"సరిగ్గా వరం క్రితం ఒకడు రోడ్డు మీద నన్ను అటకాయించి నా బాకీ ఎప్పుడు తీరుస్తావు? అని అడిగాడు సార్. నేనేంటీ నీ బాకీ తీర్చడం ఏంటీ అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు... ఈ నేలాఖారులోగా నా బాకీతీర్చకపోతే నీ సంగతి చూస్తా అని వార్నింగ్ యిచ్చి పోయాడు సార్... అప్పుడు నేను వాడెవడో పిచ్చి వాడేమో అనుకున్న. ఇప్పుడు మీరు చెపుతున్నది వింటుంటే నా పావులేకలు ఉన్నవాడు మరొకడు వున్నాడని తెలుస్తూంది... బాబోయ్ వాడివల్ల నేనింకా ఎన్ని కష్టాలు పడాలో ఎంటో?" బాధగా అన్నాడు రాంపండు.
